Breaking News

నేటితో ఎగ్జిబిషన్ ముగింపు

నిజామాబాద్ స్పోర్ట్స్ : నగరంలోని కంఠేశ్వర్‌లో గల పాలిటె క్నిక్ మైదానంలో 45 రోజులుగా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పారిశ్రామిక వ్యవసాయ ప్రదర్శన బుధవారంతో ముగియ నుంది. మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి బిగాల కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దశాబ్దాలుగా ఎగ్జిబిషన్ సొసైటీ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలన్నారు. సొసైటీ సభ్యులంతా క లిసి జిల్లా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఇలాంటి ప్రదర్శన లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

వివిధ పోటీల్లో వారికి, ప్రతి రోజు ఉచిత వైద్య పరీక్షలు అందజేసిన మీసాల ఫౌండేషన్‌కు, పోలీసులకు, కార్పొరేషన్ సి బ్బందికి, ఎగ్జిబిషన్‌లో ఉన్న ఉత్తమ స్టాల్‌కు ప్రోత్సాహాక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి బంటు రాజేశ్వర్, ఉపాధ్యక్షులు రాంచందర్ రెడ్డి, నర్సింహులు, వినోద్, సం గమేశ్వర్ రావు, లక్కంరెడ్డి, దిగంబర్, ఆనంద్‌రావు, భక్తవత్స లం, శంకర్ పాల్గొన్నారు.

Check Also

5 నుంచి పిజి పరీక్షలు

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో పీజీ కోర్సులకు ...

Comment on the article