Breaking News

Daily Archives: June 16, 2016

మూతబడిన పాఠశాల ప్రారంభమైంది

  బీర్కూర్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బొమ్మన్‌దేవుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కట్టకింద తాండాలో ఎంఇవో గోపాల్‌రావు, ఎంపిటిసి కిషన్‌ నాయక్‌ మూతబడ్డ పాఠశాలను తిరిగి ప్రారంభించారు. కట్టకింది తాండా పాఠశాలలో విద్యార్థులు లేరని పాఠశాల మూసివేయించారని, గ్రామంలోని 15 మంది బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించి పాఠశాల పున: ప్రారంబించామని వారు పేర్కొన్నారు. విద్యావనరుల అధికారి గోపాల్‌రావు వివరించారు. మండలంలో బడి బయట పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ...

Read More »

పేకాట రాయుళ్ల అరెస్టు

  బీర్కూర్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మిర్జాపూర్‌ గ్రామ శివారులో గురువారం పేకాట ఆడుతున్న 8 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి తెలిపారు. పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడిచేసి జూదరులను అదుపులోకి తీసుకొని 5200 నగదును స్వాధీనం చేసుకున్నట్టు అన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. మండలంలో ఎవరైనా పేకాట ఆడితే 100 నెంబరుకు డయల్‌చేసి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

Read More »

ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తప్పనిసరి

  బీర్కూర్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఎంపిడివో భరత్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మిర్జాపూర్‌, దుర్కి గ్రామాల్లో గురువారం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు గ్రామ పరిశుభ్రతకు సహకరించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న 12 వేల రూపాయలతో ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ ...

Read More »

ప్రయివేటు పాఠశాలలో ఫీజులు నియంత్రించాలి

  కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని ఏబివిపి ఆధ్వర్యంలో గురువారం కామరెడ్డి ఎంఇవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలల్లో విచ్చల విడిగా ఫీజులు పెంచుతూ వసూలు చేస్తున్నారన్నారు. కనీస వసతులు సైతం కల్పించడం లేదని తెలిపారు. సంబంధిత అధికారులు పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏబివిపి నాయకులు భరత్‌, బాల్‌రాజ్‌, రాజు, గోపి, లక్ష్మణ్‌, మాధవ్‌, ...

Read More »

ఆపద్బందు చెక్కు పంపిణీ

  కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ గురువారం పలువురికి ఆపద్బందు చెక్కులను పంపిణీ చేశారు. పాపయ్య, సిద్దిగారి రెడ్డి రాణి, అల్లం సుశీల, రాజమణి, భారతి, విజయ, దూదెకుల అర్షియ బేగంలకు ఆపద్బందు చెక్కులను పంపిణీ చేశారు. యాదగిరి కుమారుడు సాయికుమార్‌ ఉప్పలవాయి వసతి గృహంలో మృతి చెందగా ఆయన కుటుంబానికి మూడెకరాల ప్రభుత్వ భూమిని అందజేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇంటిని కూడా మంజూరు చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.

Read More »

బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ ఇన్‌చార్జిగా విజయ్‌కుమార్‌

  కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బిసి సంక్షేమ సంఘం కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జిగా విజయ్‌కుమార్‌ను నియమిస్తూ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఉత్తర్వులు జారీచేశారు. నియామక పత్రాన్ని విజయ్‌కుమార్‌కు అందజేశారు. బిసిల సంక్షేమానికి పాటుపడాలని, వారిసంక్షేమం కోసం కృషి చేయలన్నారు.

Read More »

జిల్లా వాసికి ఉత్తమ రక్తదాత అవార్డు

  కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కళాశాలకు చెందిన అడ్మినిస్ట్రేటివ్‌ ప్రిన్సిపాల్‌ సాయిబాబాకు ఉత్తమ రక్తదాత అవార్డు లభించింది. రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్‌ నర్సింహన్‌ రాజ్‌భవన్‌లో సాయిబాబాకు అవార్డు ప్రదానం చేశారు. ఇప్పటివరకు సాయిబాబా 54 సార్లు రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు. అవార్డు లభించడం పట్ల సాందీపని యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను కళాశాల ఆధ్వర్యంలో సన్మానించారు.

Read More »

ఆప్షన్‌లకు నిరసనగా న్యాయవాదుల వంటావార్పు

  కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంధ్రాప్రాంత న్యాయమూర్తుల ఆప్షన్‌లను నిరసిస్తూ గురువారం కామారెడ్డిలో న్యాయవాదులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కోర్టు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రాప్రాంత న్యాయమూర్తుల ఆప్షన్‌లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కోర్టు గేటుకు తాళం వేసి న్యాయమూర్తులను, కోర్టు సిబ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గత పదిరోజులుగా నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా వంటావార్పు చేపట్టినట్టు న్యాయవాదులు తెలిపారు. న్యాయవాదుల నిరసనకు కామారెడ్డి డాక్టర్స్‌ జేఏసి తమ సంఘీభావం తెలిపింది. కార్యక్రమంలో ...

Read More »

వివాహిత ఆత్మహత్య

  కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ గురువారం ఆత్మహత్య చేసుకుంది. భాగ్యలక్ష్మి (27) ఆమె భర్త శ్రీనివాస్‌తో కొంత కాలంగా గొడవలు సాగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన భాగ్యలక్ష్మి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వీరికి రెండున్నర సంవత్సరాల కుమారుడు ఉఉన్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పట్టణ సిఐ శ్రీనివాస్‌రావు తెలిపారు.

Read More »

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు వచ్చేలా కృషి చేయాలి

  మోర్తాడ్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని ఆయా గ్రామాల్లో గల అసైన్‌మెంట్‌ భూములను సందర్శించి, పరిశీలించి నివేదికలను గ్రామ రెవెన్యూ అధికారులు రూపొందించాలని మోర్తాడ్‌ తహసీల్దార్‌ వెంకట్రావు ఆదేశించారు. గురువారం మోర్తాడ్‌ తహసీల్‌ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులు, విఆర్‌ఏలతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు, రుణాలు అందించేలా గ్రామ విఆర్‌ఏలు, రెవెన్యూ అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల విఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

నేటినుంచి రేషన్‌ డీలర్ల నిరాహార దీక్షలు

  మోర్తాడ్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం పిలుపుమేరకు శుక్రవారం నుంచి జిల్లా కేంద్రంలో రేషన్‌ డీలర్లు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నట్టు మోర్తాడ్‌ మండల రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షులు విజయ్‌ అన్నారు. గురువారం మోర్తాడ్‌లో రేషన్‌డీలర్ల రిలే దీక్షల గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్‌ డీలర్లు ఆహారభద్రత పథకాన్ని గ్రామాల్లో పకడ్బందీగా అమలు చేస్తూ నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందిస్తు ప్రజలకు, ప్రభుత్వానికి రేషన్‌ డీలర్లు సేవలందిస్తున్నారన్నారు. ...

Read More »

ఎత్తిపోతల కమిటీ ఛైర్మన్‌గా నోముల సత్యంరెడ్డి

  మోర్తాడ్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గుమ్మిర్యాల్‌ గ్రామ ఎత్తిపోతల కమిటీ ఛైర్మన్‌గా అదే గ్రామానికి చెందిన తెరాస నాయకుడు నోముల సత్యంరెడ్డిని ఎత్తిపోతల పథకం ఛైర్మన్‌గా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నియమించారని మండల తెరాస అధ్యక్షుడు కల్లడ ఎలియా గురువారం తెలిపారు. నోముల ముత్యంరెడ్డి పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఆయన ఈ పదవిని అందించారని, గ్రామస్తుల తరపున ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా నోముల సత్యంరెడ్డి మాట్లాడుతూ బాల్కొండ ఎమ్మెల్యే ...

Read More »

జిల్లా స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరచాలి

  మోర్తాడ్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరిచి గ్రామానికి, మండలానికి పేరుప్రతిష్టలు తీసుకురావాలని దొన్కల్‌ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ పడాల సత్తమ్మ, హనుమాగౌడ్‌లు అన్నారు. గురువారం మండలంలోని దొన్కల్‌ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యాబోధన జరుగుతుందని విద్యార్థులకు అవసరమయ్యే అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని, ఉచిత భోజనం, పాఠ్యపుస్తకాలు అందిస్తుందని వివరించారు. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో ...

Read More »

నేడు గుమ్మిర్యాల్‌కు మంత్రి, ఎంపి, ఎమ్మెల్యే రాక

  మోర్తాడ్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గుమ్మిర్యాల్‌ గ్రామంలో శుక్రవారం అభివృద్ది పనుల ప్రారంభోత్సవానికి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, జిల్లా ఎంపి కవిత, మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విచ్చేస్తున్నారని మండల తెరాస అధ్యక్షుడు కల్లడ ఏలియా గురువారం తెలిపారు. గుమ్మిర్యాల్‌ గ్రామస్తుల కోరిక మేరకు రైతులకు సాగునీరు, గ్రామస్తులకు తాగునీరు అందించేందుకు గోదావరి నదినుంచి గ్రామానికి ఎత్తిపోతల పథకం పనుల శంకుస్థాపనకు అమాత్యులు విచ్చేస్తున్నారని అన్నారు. మండలంలోని ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు ...

Read More »

మెట్ట రైతుల్లో ఆందోళన

  బాన్సువాడ, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం ప్రవేశించి పదిరోజులు దాటుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వర్షాధారంగా పంటలు సాగుచేసే మెట్ట రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ఖరీఫ్‌లో సోయా సాగును ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే రాయితీపై విత్తనాలను అందించింది. ఈ క్రమంలో రైతులు ఎంతో ఆశతో సోయా సాగుకు మొగ్గుచూపారు. వర్షాకాలం ప్రారంభంలో మురిపించిన వర్షాలతో రైతులు ఉత్సాహంతో దుక్కులు దున్ని చాలావరకు విత్తనాలు వేసుకున్నారు. మరికొందరు విత్తుకునేందుకు సిద్దమవుతున్నారు. ...

Read More »

దుబాయ్‌లో వినియోగదారుల సంతోష సూత్రం ఆవిష్కరణ

దుబాయ్: దుబాయ్ ప్రభుత్వం వినియోగదారుల సంతోష సూత్రాన్ని ఆవిష్కరించింది. సంతోషం, సానుకూలత జాతీయ పథకం లక్ష్యాలను అధిగమించేందుకు సంతోష మంత్రిత్వ శాఖ అధికారులకు ఈ సూత్రం బాగా ఉపయోగపడుతుందని ఆ శాఖ మంత్రి అల్ రౌమి అన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల లక్ష్యాలను అధిగమించేందుకు ఆయా శాఖల్లోని అధికారులకు కూడా ఈ సూత్రం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ‘వినియోగదారులకు సంతోషపరిచే కార్యక్రమాలను రూపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ సూత్రం అద్దం పడుతుంది. వినియోగదారుల సేవల అభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన సమగ్ర విధానాల్లో ఈ సూత్రం ...

Read More »

ఆ 33 మంది ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా?

సింగపూర్: భూమి మీద పెట్టుబడి పెడితే భవిష్యత్తుకు ఢోకా ఉండదని చాలామంది భావిస్తారు. వీరూ అలాగే అనుకున్నారు. భవిష్యత్తులో బోల్డంత అభివృద్ధి జరుగుతుందని, పెట్టుబడికి వందరెట్టు వస్తుందని చెప్పడంతో ఓ సంస్థ నుంచి పెద్దమొత్తంలో ప్లాట్లు కొనుగోలు చేశారు. కానీ సంవత్సరాలు గడుస్తున్నా అక్కడ అభివృద్ది కానరాకపోవడంతో ఇప్పుడు లబోదిబో మంటున్నారు. ఈ ప్లాట్లు మాకొద్దు మొర్రో మీరే తిరిగి తీసుకోండి అంటే కోర్టులో తేల్చుకోవాలని సదరు సంస్థ బెదిరిస్తుండడంతో ఏం చేయాలో తోచక పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత సంతతికి చెందిన 33 ...

Read More »

దీక్ష విర‌మించిన ముద్ర‌గ‌డ‌… ఏం చెప్పి ఒప్పించారో!

రాజ‌మండ్రి : ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఎట్ట‌కేల‌కు త‌న నిర‌శ‌న దీక్ష విరమించారు. రాజ‌మండ్రి ప్ర‌భుత్వాసుప‌త్రిలో ఉన్న ముద్రగడ త‌న దీక్ష విర‌మ‌ణ‌కు షరతులతో కూడిన అంగీకారానికి వ‌చ్చినట్లు సమాచారం. ఆ ష‌ర‌తులు ఏమిట‌నేది మరికొద్ది సేపట్లో వివరాలు వెల్లడించనున్నారు. ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రక్త పరీక్షలకు బుధవారం సాయంత్రం 5 గంటలకు అంగీకరించారు. అయితే ముద్రగడ దీక్ష కొనసాగుతోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. జేఏసి చర్చలు కొనసాగుతున్నాయని, డిమాండ్స్ పైన జేఏసి ...

Read More »

బ్యాంకుల విలీనం

భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్నది పక్కనబెట్టి, దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో కొత్త అధ్యాయానికి ఎన్‌డీఏ ప్రభుత్వం తెరతీసింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఐదు అనుబంధ బ్యాంకులనూ, కొసరుగా భారతీయ మహిళ బ్యాంకును విలీనం చేసేందుకు మోదీ ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. ఈ నిర్ణయం వల్ల ఎస్‌బీఐ 37లక్షల కోట్ల రూపాయల ఆస్తులతో భారీ బ్యాంకుగా ఆవిర్భవించేందుకు అవకాశం ఏర్పడింది. అనుబంధ బ్యాంకులను మాతృసంస్థ ఎస్‌బీఐతో విలీనం చేయాలన్న ప్రతిపాదన పాతదే. యూపీఏ హయాంలోనైనా, ఎన్‌డీఏ హయాంలోనైనా ఈ ...

Read More »

సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

► మా సర్కారును కూలదోసేందుకు కుట్ర ► టీడీపీ, తెలంగాణ కాంగ్రెస్ కలిసి కుట్రపన్నాయి ► రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తేవాలనుకున్నాయి ► మజ్లిస్ అధినేత ఒవైసీ మాకు అండగా నిలిచారు ► రెండు జర్మనీలు ఏకమైనట్లు తెలుగు రాష్ట్రాలు ఏకమవుతాయని బాబు అన్నారు ► రాష్ట్రం ఏర్పాటు కోసం నిలబడి పోరాడింది, రాజీనామాలు చేసింది మావాళ్లే ► ముఖ్య నాయకుల చేరిక సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి ► టీఆర్ఎస్‌లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, వినోద్, ఎమ్మెల్యేలు ► మావాళ్లు ...

Read More »