Breaking News

Daily Archives: June 17, 2016

అవార్డు గ్రహీతకు సన్మానం

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 54 సార్లు రక్తదానం చేసి రాష్ట్ర గవర్నర్‌ నర్సింహన్‌ చేతుల మీదుగా అవార్డు పొందిన సాయిబాబాను శుక్రవారం కామారెడ్డిలో ఘనంగా సన్మానించారు. ఇండియన్‌ యూత్‌ క్లబ్‌ ప్రతినిధులు సాయిబాబాను సన్మానించారు. కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉండి రక్తదానం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు చింతల శ్రీనివాస్‌, కన్నయ్య, శ్రీనివాస్‌, హనుమాండ్లు, కిషన్‌, నర్సింగ్‌, భిక్షపతి, మెడికల్‌ రాజు, తదితరులున్నారు.

Read More »

గుర్తింపులేని పాఠశాలలను మూసి వేయాలి

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా గుర్తింపులేకుండా నడుస్తున్న పాఠశాలలను వెంటనే మూసివేయాలని ఏఐటిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి జబ్బర్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలను మూసివేయాలని, ఇదివరకే అనేకసార్లు అధికారులకు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో గుర్తింపులేని పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని చెప్పారు. ధనార్జనే ధ్యేయంగా పాఠశాలలను నడిపిస్తున్నారని ఆరోపించారు. వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆ ...

Read More »

ప్రయివేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలి

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డివిజన్‌ పరిధిలోని ప్రయివేటు పాఠశాలల్లో అధిక పీజుల వసూళ్లను అడ్డుకోవాలని టిజివిపి ఎన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంఇవోకు వినతి పత్రం సమర్పించారు. ప్రయివేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయడమే గాకుండా పాఠ్య పుస్తకాలు, ఇతరత్రాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థులకు సంబంధించిన వస్తువులను విక్రయిస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫీజుల నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని, మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలను రద్దుచేయాలని ...

Read More »

రాజీవ్‌నగర్‌ కాలనీలో బడిబాట

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డు రాజీవ్‌నగర్‌ కాలనీ అంగన్‌వాడి కేంద్రంలో శుక్రవారం బడిబాట, అంగన్‌వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. అంగన్‌వాడిలో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడంతోపాటు పై చదువులకు వెళ్లేందుకు తీర్చిదిద్దుతారన్నారు. పిల్లలను అంగన్‌వాడి కేంద్రాలకు పంపించాలని కోరారు. అంగన్‌వాడి స్థాయి నుంచి ప్రైమరీ స్కూలుకు వెళ్ళే పిల్లలను బడి బాట ద్వారా ప్రైమరీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు రమేశ్‌గౌడ్‌కు అప్పగించారు. కార్యక్రమంలో సిడిపివో సంధ్యారాణి, సూపర్‌వైజర్‌ మాధురి, కౌన్సిలర్‌ యాదమ్మ, తదితరులున్నారు.

Read More »

హసన్‌పల్లిలో ఆదార్‌ కేంద్రం ప్రారంభం

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌పల్లిలో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఆధార్‌ నమోదు కేంద్రం ప్రారంభించారు. గ్రామంలోని ప్రజల ఆధార్‌ కార్డుల్లో పొరపాట్లు ఉంటే ఈ కేంద్రం ద్వారా సరిచేసుకునేందుకు అవకాశముందని ఆపరేటర్‌ వెంకట రమణ అన్నారు. సింగీతం, గాలిపూర్‌, మక్దుమ్‌పూర్‌, బూర్గుల్‌, మహ్మద్‌నగర్‌, గున్కుల్‌, నర్వా గ్రామాల్లో ఇప్పటివరకు 350 మంది ఆధార్‌ కార్డులను నమోదుచేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగంచేసుకోవాలన్నారు.

Read More »

కామారెడ్డికి రూ.4 కోట్లతో నూతన మార్కెట్‌ కమిటీ భవనం

  కాబోయే జిల్లాకు సర్వ హంగులు రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీష్‌రావు కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డికి రూ. 4 కోట్లతో నూతన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ భవనాన్ని మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన కామారెడ్డి పెద్ద చెరువును మినీ ట్యాంకన బండ్‌గా మార్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిషన్‌ కాకతీయ పనులను కూడా ప్రారంభించి మట్టిని ఎత్తారు. మంత్రి స్వయంగా ట్రాక్టర్‌ నడిపించారు. ...

Read More »

హెల్మెట్‌తో ప్రయాణమే సురక్షితం

  బీర్కూర్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెల్మెట్‌ ధరించి ప్రయాణించడం వల్లే ప్రాణాలు సురక్షితంగా ఉంటుందని, హెల్మెట్‌ ప్రయాణమే శ్రేయస్కరమని బీర్కూర్‌ ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం బీర్కూర్‌ గ్రామంలోని హనుమాన్‌ ఆలయంలో వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాదాల బారినుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. మనం వాహనం నడిపేటపుడు కుటుంబసభ్యులను గుర్తుంచుకోవాలని, ఓపిక లేకపోతే, అతి ప్రమాదాల వల్ల, నిర్లక్ష్యం వల్ల ప్రాణాలకే నష్టం వాటిల్లే ప్రమాదముందని స్పష్టం చేశారు. అదేవిధంగా వాహనదారులు ...

Read More »

అడవుల సంరక్షణకు కృషి చేయాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే సూచించారు. వన సంరక్షణ సమితి అధ్యక్షునిగా ఎన్నికైన మండలంలోని హసన్‌పల్లి గ్రామానికి చెందిన చిన్నరాములును శుక్రవారం బిచ్కుందలో జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే సన్మానించారు. వన సంరక్షణ సమితి ఛైర్మన్‌గా ఎన్నిక కావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అడవులను రక్షించాల్సిన బాధ్యతను భుజాలపై వేసుకొని అడవులను నరికివేయకుండా సంరక్షించాలని అన్నారు. కార్యక్రమంలో హసన్‌పల్లి గ్రామ సర్పంచ్‌ ...

Read More »

ప్రతి ఒక్కరు మొక్కలు నాటేందుకు కృసి చేయాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హరితహారం కింద ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఉపాధి హామీ ఎపివో సుదర్శన్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లకు సూచించారు. శుక్రవారం స్థానిక ఎంపిడివో కార్యాలయంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎపివో మాట్లాడుతూ తెలంగాణ హరితహారం పథకం కింద మొక్కలు నాటేందుకు ఇప్పటినుంచే గుంతల తవ్వకాలు చేయించాలని అన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున రైతులకు కావాల్సిన కాలువ పనులను ఎంపికచేసి ఉపాధి హామీ కూలీలతో పనులు చేపట్టాలని అన్నారు. సమావేశంలో ...

Read More »