Breaking News

Daily Archives: June 18, 2016

ప్రయివేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏబివిపి నగర కార్యదర్శి బాల్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేయడమే గాకుండా పుస్తకాలు, దుస్తులు, బ్యాగులు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారన్నారు. విద్య వ్యాపారం చేస్తూ వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు దీనిపై ఎందుకు స్పందించడం లేదని ...

Read More »

బిఎస్‌పిని బలోపేతం చేయాలి

  కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహుజన సమాజ్‌పార్టీని బలోపేతం చేయాలని ఆపార్టీ రాష్ట్రనాయకుడు బాలయ్య అన్నారు. కామారెడ్డిలో శనివారం బిఎస్‌పి అసెంబ్లీ నియోజకవర్గ స్తాయి కమిటీ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై బాలయ్య మాట్లాడారు. బహుజనుల కోసం పార్టీ నాయకులు పనిచేయాలన్నారు. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని సూచించారు. పార్టీని సంస్తాగతంగా బలోపేతం చేయాలని అన్నారు. ఇందుకు ప్రజల్లో మమేకమై పనిచేయాలని సూచించారు. నాయకులకు ప్రజల్లో గుర్తింపువచ్చినపుడే తద్వారా పార్టీ బలపడుతుందని చెప్పారు. సమావేశంలో బైస ...

Read More »

పంటబీమాలో అవకతవకలు నివారించాలి

  నందిపేట, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న పంట బీమా డబ్బులు నిజమైన లబ్దిదారులకు అందడం లేదని మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి అన్నారు. అనర్హులు పొందడం వల్ల అర్హులకు నష్టం వాటిల్లుతుంది కాబట్టి సర్వే జరిపి దాని ప్రకారం నిజమైన అర్హులకు చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ...

Read More »

మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య

  కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ టెట్‌ రాత పరీక్షలో అనుత్తీర్ణత కావడంతో ఓ విద్యార్తిని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం భిక్కనూరు మండలం తలమడ్ల రైల్వేస్టేషన్‌ వద్ద చోటుచేసుకుంది. కామారెడ్డి మండలం అడ్లూర్‌ గ్రామానికి చెందిన సుష్మిత (21) టెట్‌ రాత పరీక్ష రాసింది. ఇందుకు సంబంధించిన ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. శుక్రవారం టెట్‌ ఫలితాలు చూసేందుకు కామారెడ్డికి వచ్చిన సుష్మిత తిరిగి ఇంటికి వెళ్లలేదు. 75 మార్కులకు క్వాలిఫై కావాల్సి ఉండగా ...

Read More »

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ స్పీకర్‌

  నందిపేట, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో గత శనివారం రోజున భారీ గాలివాన కారణంగా గోడకూలి నలుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరోఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జోర్‌పూర్‌ గ్రామానికి చెందిన అక్కా, తమ్మడు రమాదేవి, ప్రవీణ్‌, వెల్మల్‌ గ్రామానికి చెందిన సుదర్శన్‌, గొట్టుముక్కల గ్రామస్తురాలు మృతి చెందారు. కాగా శనివారం మృతుల కుటుంబాలను మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ...

Read More »

ఫసల్‌బీమా సద్వినియోగం చేసుకోవాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఫసల్‌బీమా పథకాన్ని రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సహకార బ్యాంకు సిఇవో లింబాద్రి సూచించారు. అచ్చంపేట సహకార సంఘాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సిఇవో మాట్లాడుతూ పంటరుణాలకు సంబంధం లేకుండా ఫసల్‌బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలోని ఆయా సహకార సంఘాల ద్వారా రూ. 388 కోట్ల స్వల్ప కాలిక రుణాలు ఇచ్చామన్నారు. రుణాలు తీసుకున్న రైతుకు జూన్‌ నెలాఖరులోగా రినివల్‌ చేస్తే జీవో ...

Read More »

మిషన్‌ కాకతీయలో నాణ్యత పాటించాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెరువుల పునరుద్దరణ కోసం ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని క్వాలిటి కంట్రోల్‌ ఇఇ మధుసూదన్‌ అన్నారు. పంట కాలువలు, తూములు, అలుగులు నాణ్యతతో కాకతీయ కాలం నాటి చెరువులకు పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటామన్నారు. మండలంలోని నర్వా పాత చెరువు, సింగీతం రిజర్వాయర్‌, మిషన్‌ కాకతీయ పనులను ఆయన శనివారం పరిశీలించారు. పనుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇఇ వెంట సత్యనారాయణ, నీటిపారుదల ...

Read More »

రంజాన్‌లో గుబాళిస్తున్న భక్తిభావం

  నందిపేట, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముస్లింల పవిత్రమాసమైన రంజాన్‌ ప్రారంభమై పదిరోజులు గడుస్తుంది. పదిరోజులుగా ముస్లింలు ప్రతి ఇంటా ఆధ్యాత్మిక చింతన నెలకొంది. ఐదు పూటల నమాజ్‌ చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవడంతో పాటు భక్తిభావం వెల్లివిరుస్తుంది. నేటి ఆధునిక ప్రపంచంలో 24 గంటల సమయం సంపాదనకే సరిపోతున్న కాలంలో మనల్ని పుట్టించిన దేవున్ని మరిచిపోతున్నారు. రంజాన్‌ మాసంలో ఉపవాసాలుండి ప్రతి ఇంటా నమాజ్‌ చేయడం వల్ల భక్తిభావం వెల్లివిరుస్తుంది. నమాజ్‌ సమయం కంటే 15 నిమిషాల ...

Read More »

అభివృద్దిని అడ్డుకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారు

  మహిళల సాధికారతే తెరాస ధ్యేయం – మంత్రి హరీష్‌రావు మోర్తాడ్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు అందించి తీరుతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండలం, బట్టాపూర్‌, మోర్తాడ్‌ మండలంలోని గుమ్మిర్యాల్‌, కమ్మర్‌పల్లి మండలంలో, భీమ్‌గల్‌ మండలంలో గోదాములు, ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ భవనాల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ...

Read More »

అనుమతిలేని ప్రయివేటుపాఠశాలల్లో చేర్పించవద్దు

  మోర్తాడ్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ అనుమతి లేని ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించవద్దని ఎంఇవో రాజేశ్వర్‌ తెలిపారు. శనివారం మండల విద్యావనరుల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలోని సుంకెట్‌ గ్రామంలో ప్రభుత్వ అనుమతిలేకుండా ఓ ప్రయివేటు పాఠశాల కొనసాగుతుందని, అక్కడ విద్యార్థులను చేర్పించి వారి భవిష్యత్తును అంధకారం చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. సమావేశంలో సిఆర్‌పిలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

మిషన్‌ భగీరథకు రూ. 128 కోట్లు మంజూరు

  నిజామాబాద్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథలోభాగంగా మొదటి దశలో 210 గ్రామాలకు ఇంటింటికి తాగునీరు అందించే అంతర్గత పైపులైన్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 128 కోట్లను మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా తెలిపారు. ఈనెల 22 నుంచి ఇంటింటికి తాగునీరు సరఫరా చేసే పైపులైన్ల పనులను ప్రారంభించాలని అధికారులకు స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్‌ చాంబరులో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, మిషన్‌ భగీరథ నిర్మాణం సంస్థల ప్రతినిదులతో నిర్వహించిన సమావేశంలో ...

Read More »

ఇసుక క్వారీలో నిబంధనలు తప్పకుండా పాటించాలి

  నిజామాబాద్‌ రూరల్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శనివారం తన చాంబరులో జిల్లా ఇసుక కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 9 పట్టా ఇసుక క్వారీల్లో నిబంధనలకు అనుగుణంగా ఇసుక తీసుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఎంత స్థాయిలో ఇసుకతీసుకోవాలో నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని, భూగర్భజలాల నీటిమట్టం ...

Read More »

బాసర ఠాణాలో మొక్కలు నాటిన జిల్లా ఎస్‌పి

  బాసర, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా ఎస్‌పి విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ బాసర పోలీసు స్టేషన్‌లో మొక్కలు నాటి నీరు పోశారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. అంతకుముందు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. జిల్లా ఎస్‌పి వెంట ముధోల్‌ సిఐ రఘుపతి, ఎస్‌ఐ ...

Read More »

బొప్పాయి-లెమన్ కాంబినేషన్ జ్యూస్ లో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

బొప్పాయి ఫ్రూట్ అంటే మీకు ఇష్టమేనా? అందులోనూ జ్యూసీ, స్వీట్ పప్పాయ అంటే ఇంకా ఇష్టమా? బొప్పాయి అంటే మీకు ఇష్టమున్నా లేకున్నా ఇందులో ఉండే అమేజింగ్ బెనిఫిట్స్ తెలుసుకుంటే మాత్రం తినకుండా ఉండలేరు . స్వీట్ టేస్ట్ తో పాటు, అమేజింగ్ బెనిఫిట్స్ ను తెలుసుకున్నారంటే దీన్ని రెగ్యులర్ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకుంటారు. మన వంట గదిలో ఉండే పదార్థాలెన్నో మనకు తెలియకుండానే మనకు బహు విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంటారు. నిజంగా కొన్ని పోపుదినుసులు మన శరీరంలో చేరగానే ఎఫెక్టివ్ గా ...

Read More »

రూ.21.5 లక్షలు…బ్రాడీపేటలో ఓ ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు ఇది!

గుంటూరు: విద్యుత్ బిల్లులు చూస్తే వినియోగ దారులకు గుండె ఆగిపోయినంత పనవుతుంది. నిన్నటికి నిన్న భట్టిప్రోలులో పూరింటికి రూ. 80వేలు బిల్లు వస్తే తాజాగా బ్రాడీపేటలో ఓ ఇంటికి ఏకంగా 21 లక్షల 53 వేల బిల్లు వచ్చింది. మీటర్‌ రీడింగ్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బిల్లులు మోత పుట్టిస్తుంటే దీన్ని నుంచి తప్పించుకునేందుకు అధికా రుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వస్తోందని బాధితులు మండిపడు తున్నారు. వివరాల్లోకి వెళితే… బ్రాడీపేట 4వ లైనులో వస్త్ర దుకాణం నిర్వహించే కే.హేమంత బ్రాడీపేట 6/15వ లైనులోని ...

Read More »

ఇదేమి న్యాయం?

గుల్బర్గ్‌ సొసైటీ నరమేథం కేసులో నిందితులకు అహ్మదాబాద్‌ ప్రత్యేక కోర్టు ఖరారు చేసిన శిక్షలు బాధితులకు అన్యాయంగా అనిపించడం సమంజసం. పద్నాలుగేళ్ళ క్రితం జరిగిన ఈ ఊచకోతలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ సహా 69 మంది దారుణ మారణకాండకు బలయ్యారు. పదిహేను రోజుల క్రితం న్యాయస్థానం తీర్పు ప్రకటిస్తూ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నిందితులుగా పేర్కొన్న 66 మందిలో 24 మందిని మాత్రమే దోషులుగా నిర్థారించి, బీజేపీ నాయకుడు బిపిన పటేల్‌ సహా 36 మందిని నిర్దోషులుగా వదిలిపెట్టేసినప్పుడే బాధితులు ...

Read More »

ప్రధాని హెయిర్‌ కటింగ్‌కు లక్ష రూపాయాలు!

న్యూయార్క్‌: హెయిర్‌ కటింగ్‌కు లక్ష రూపాయలు, భోజనానికి 1.25 లక్షలు, బట్టల ఇస్త్రీ చేయించుకోవడానికి రూ.14 వేలు, ఇతర గృహోపకరణాల కోసం రూ. 13 లక్షలు.. ఈ ఖర్చంతా ఎవరో బిలియనీర్‌ అయిన బిజినెస్‌ మ్యాగ్నెట్‌ది అనుకుంటే పొరబాటే. ఈ ఖర్చంతా ప్రజాధనానికి కాపలా కాయాల్సిన ఓ దేశాధినేతది. ప్రజాధనాన్ని తమ విలసాల కోసం అధినేతలు ఎలా ఖర్చుపెడుతున్నారో తెలియజేసే దృష్టాంతం ఇది. ఐక్యరాజ్య సమితి సమావేశాల కోసం ఆరు రోజుల పాటు న్యూయార్క్‌లో బస చేసిన ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ, ఆయన ...

Read More »

కోదండరామ్ – కేసీఆర్‌ల మధ్య లడాయి ఈనాటిది కాదు… సోనియాకిచ్చిన మాటతో బీజం పడింది!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీ జేఏసీ ఛైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరామ్ అత్యంత కీలక భూమిక పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆయన ఎందుకూ పనికిరాకుండా పోయారనే నిర్మొహమాటంగా చెప్పొచ్చు. ఒకపుడు… ఆయన ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టిన తెరాస అధినేత కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాక కోదండరామ్‌కు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడంలేదు. ఇది ప్రొఫెసర్‌ను తీవ్రంగా బాధించింది. ఆయన అవమానంగా భావించారు కూడా. అదేసమయంలో ఆయన అదును కోసం వేచిచూస్తూ వచ్చారు. అనుకున్నట్టుగానే తెరాస ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్ళు ...

Read More »

వయాగ్రాను ఎందుకు కనుగొన్నారో తెలుసా?

వయాగ్రాకు, గుండెకు ఎంతో దగ్గర సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. వయాగ్రా మాత్ర వేసుకున్న వెంటనే గుండె రక్తనాళాల్లో రక్తప్రవాహం పెరిగిపోతుందనే విషయం తెలిసిందే. ఇరవైయేళ్ల కిత్రం ‘ఆంజినా’ అనే గుండె జబ్బును నయం చేయడానికే వయాగ్రా మాత్రను కనుగొన్నారు. అయితే ఈ మాత్ర వల్ల శృంగార అవయవాలు కూడా ఉద్దీపన చెందుతాయని గ్రహించి దీనిని ఎక్కువగా శృంగార చికిత్స కోసం వాడడం మొదలెట్టారట. ఎరక్టైల్‌ డిస్‌ఫంక్షన్‌ (అంగస్తంభన లోపం) అనే వ్యాధి గల వారిలో పురుషాంగానికి తగినంత రక్త సరఫరా జరగదు. అందువల్ల ...

Read More »

నెయ్యి కిలో రూ. 10, పంచదార కిలో రూ. 2!

నెయ్యి.. కిలో రూ. 10 (ఇప్పుడు కిలో 400) పంచదార.. కిలో రూ. 2 (ఇప్పుడు రూ.60) పెసరపప్పు కిలో రూ. 1.70 (ఇప్పుడు రూ. 145) అదంతా 1971 నాటి మాట. ఎవరో ఒక పెద్దాయన అప్పట్లో రాసుకున్న సరుకుల చీటీ ఇటీవల బయటపడింది. వాళ్ల వారసులు ఎవరో దాన్ని చూసి ముచ్చటపడి ఫొటోతీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది అలా అలా షేర్ అవుతూ పలు వాట్సప్ గ్రూపుల్లోకి చేరింది. ఫేస్‌బుక్‌లో కూడా బాగా ట్రెండ్ అవుతోంది. అప్పటికి, ఇప్పటికి ధరలలో ...

Read More »