Breaking News

Daily Archives: June 19, 2016

ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను కామారెడ్డి పట్టణ కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు. దేశానికి కాబోయే భావి ప్రధాని అని రాహుల్‌గాంధీని కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యున్నతికోసం, కార్యకర్తల సమస్యల పరిస్కారానికి ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకుడు నయీమ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి అశోక్‌రెడ్డి, నాయకులు పండ్ల రాజు, కన్నయ్య, షేరు, విష్ణు, నర్సింగ్‌రావు, కాశీరాం, ...

Read More »

విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

  కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఆదివారం విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరిపారు. జడ్పిహెచ్‌ఎస్‌ బాలుర ఉన్నత పాఠశాల 1987-88 బ్యాచ్‌ 10వ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం స్తానిక రేణుక గార్డెన్స్‌లో నిర్వహించారు. 2008- 09 బ్యాచ్‌కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్తులు ఆత్మీయ సమ్మేళనం వేరువేరుగా జరుపుకున్నారు. పూర్వ విద్యార్థులు, ఉపాద్యాయులు కుటుంబ సమేతంగా కలిసి గత స్మృతులు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సాహంగా సామూహిక నృత్యాలుచేసి ఆనందాన్ని పంచుకున్నారు. చక్కటి ...

Read More »

మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షునికి సన్మానం

  కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన శెనిశెట్టి గౌరీశంకర్‌ను ఆదివారం సన్మానించారు. 10వ వార్డు ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యంలో సన్మానం చేశారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షునిగా సేవలందిస్తూ మార్కెట్‌ కమిటీ వైస్‌ఛైర్మన్‌గా గౌరీశంకర్‌ ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు దిగంబర్‌, చంద్రశేఖర్‌, శ్రీకాంత్‌, శంకరయ్య, ఆంజనేయులు, రవి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

21న కామారెడ్డిలో సామూహిక యోగా శిబిరం

  కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డిలో ఈనెల 21న సామూహిక యోగా శిబిరం నిర్వహించనున్నట్టు జిల్లా యోగా అసోసియేషన్‌ ఛైర్మన్‌ గడ్డం రాంరెడ్డి తెలిపారు. పట్టణంలోని పార్శి రాములు కళ్యాణమండపంలో 21న ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు యోగా శిబిరం నిర్వహిస్తామన్నారు. పట్టణ ప్రజలు యోగా శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యోగా ప్రతినిధులు ప్రసాద్‌గౌడ్‌, ఈశ్వర్‌, సిద్ధాగౌడ్‌, రఘు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల గడుపు పెంచాలి

  కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిగ్రీలో ప్రవేశం కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ గడువు పెంచాలని ఏబివిపి నగర కార్యదర్శి బాల్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిగ్రీ ప్రవేశం కోసం ఏర్పాటుచేసిన ఆన్‌లైన్‌ పద్దతిని విద్యార్థులు అర్థం చేసుకునేలోపు గడువుతేదీ ముగిసిపోయిందన్నారు. ఇంకా డిగ్రీ ప్రవేశాలు కోసం ఆన్‌లైన్‌ చేయని విద్యార్థులు చాలా మంది ఉన్నారని చెప్పారు. ఆన్‌లైన్‌లో ప్రవేశాలు పొందని విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ...

Read More »

ఇళ్లకు చేరుకుంటున్న వలసదారులు

  బాన్సువాడ, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరువు నేపథ్యంలో ఉపాధి వెతుక్కుంటూ పట్టణ ప్రాంతాలకు వలసపోయిన గ్రామీణులు ఇప్పుడిప్పుడే తమ తమ సొంతిళ్ళకు చేరుకుంటున్నారు. ఖరీప్‌ సీజన్‌తో పాటు విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో పట్టణ ప్రాంతాల నుంచి తిరుగు పయనమవుతున్నారు. రెండేళ్ళుగా కరువు పరిస్థితులు నెలకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో ఐదారునెలల క్రితం బోదన్‌ డివిజన్‌ నుంచి హైదరాబాద్‌, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు వలస ...

Read More »

వాసవీ సేవాసమితి ఆద్వర్యంలో పితృదినోత్సవ వేడుకలు

  కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలో ఆదివారం శ్రీవాసవి సేవా సమితి ఆధ్వర్యంలో పితృదినోత్సవ సంబరాలు నిర్వహించారు. 70 సంవత్సరాలు పైబడిన నాన్నలకు సన్మానం చేసి పితృదినోత్సవ వేడుకలు జరిపారు. బాల్యంలో అన్నింటా ముందుండి తమను సన్మార్గంలో నడిపించిన తల్లిదండ్రులను మరువకుండా ప్రతిఏడాది వారిని సన్మానించి ఆశీస్సులు పొందుతున్నామన్నారు. ఈయేడు సైతం పండ్లు, పూలమాలలతో సన్మానించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా 35 మందిని సన్మానించినట్టు తెలిపారు. కార్యక్రమంలో వాసవి సేవా సమితి అధ్యక్షుడు శంకర్‌గుప్త, కార్యక్రమ ...

Read More »

ఉష్ణోగ్రత ప్రభావము బంతి పై ఉంటుందా?

చలికాలము లో రబ్బరుబంతిని నేలకు కొట్టినపుడు అది వేసవికాలము లో ఎగిరిన విధము గా పైకి ఎగరదు . దీనికి కారణము బంతిలోపలి గాలి మీద ఉష్ణోగ్రత ప్రభావము ఉండటమే . గాలి చల్లబడినందున ఆ గాలి ఎక్కువ రాపిడిని ఇస్తుంది . అదేవిధము గా చలి ప్రభావము రబ్బరు మీద ఉంటుంది. రబ్బరు అంతగా సాగదు . ఈ కారణాలవల్ల బంతి నేలకేసి కొట్టినప్పుడు అక్కడే ‘ ధబ్ ‘ మని ఆగినట్టనిపిస్తుంది కాని గాలిలోకి తిరిగి అంతగా ఎగరదు . వేసవికాలము ...

Read More »

ఆగురి ఒక కన్ను తోనే ఎందుకు చూస్తారు ? ,

ప్ర: బాణము ఎక్కుపెట్టినప్పుడు ఒక కన్ను మూసి ఒక కన్ను తోనే చూస్తారు ఎండుకు ? … జ: ఒక దృశ్యము ఎంతదూరము లో ఉంది , ఎంత ఎత్తు , లావు ఉంది తెలియాలంటే తప్పకుండా రెండు కళ్ళుతో దూడాల్సిందే . కాని గురి ఎక్కు పెట్టినప్పుడు మాత్రము లక్ష్యము ఎంతదూరము లో ఉన్నది తెలిస్తే చాలు . కాబట్టి ఒక కన్ను సరిపోతుంది . రెండు కళ్ళు తో చూస్తే రెండో కన్ను చూసే దృస్టికోణము అడ్డంకి అవుతుంది . అందుకే ...

Read More »