Breaking News

Daily Archives: June 20, 2016

శ్రీగురుదత్త ఆలయంలో సత్యనారాయణ వ్రతాలు

  కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలోని దత్తానగర్‌ కాలనీ, శ్రీ గురుదత్త ఆలయంలో సోమవారం సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకొని వ్రతం నిర్వహించినట్టు ఆలయకమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

Read More »

డప్పుల మోతతో న్యాయవాదుల నిరసన

  కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీమాంధ్ర న్యాయమూర్తులను తెలంగాణకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కామారెడ్డిలో సోమవారం న్యాయవాదులు డప్పుల మోతతో నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులు గంటలు, డప్పులు మోగిస్తూ సీమాంధ్ర జడ్జిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయమూర్తుల ఆప్షన్‌లకు వ్యతిరేకంగా ఈనెల 6వ తేదీ నుంచి ఆందోళనలు చేస్తున్నా ఇంతవరకు దీనిపై స్పందన లేకపోవడం గర్హణీయమన్నారు. వెంటనే ఆప్షన్‌లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు క్యాతం సిద్దిరాములు, నారాయణ, ...

Read More »

పాఠశాలకు పూర్వవిద్యార్థుల సహాయం

  కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పివిపి ఓరియంటల్‌ పాఠశాల పూర్వ విద్యార్థులు పాఠశాలకు రూ. 3 లక్షల విలువైన పనులకు గాను ఆర్థిక సహాయం అందజేశారు. పాఠశాలకు చెందిన 1978-79 బ్యాచ్‌వారు 7వ తరగతి పూర్వ విద్యార్థులు గతంలో సమావేశమై పాఠశాల అవసరాలను గుర్తించి మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు రూ. 3 లక్షల వ్యయంతో మరుగుదొడ్లు నిర్మించి సోమవారం వాటిని పాఠశాల యాజమాన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ భద్రయ్య, ...

Read More »

విద్యార్థులకు అక్షరాభ్యాసం

  కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఒడ్డెర కాలనీ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఎంఇవో రవిందర్‌, ఎంవి ఎంవిఎస్‌ ఫౌండర్‌ బాల్‌రాజ్‌లు కార్యక్రమం నిర్వహించారు. చిన్నారి విద్యార్థుల చేత అక్షరాబ్యాసం చేయించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ పద్మ, ఉపాధ్యాయులు భాస్కర్‌, విజయచందన, స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

అట్టహాసంగా యోగా డే

  కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డిపట్టణంలోని లిటిల్‌ స్కాలర్స్‌ పాఠశాలలో సోమవారం యోగాడే అట్టహాసంగా జరిపారు. విద్యార్థులు యోగా డే ఆకారంలో కూర్చొని ప్రదర్శన ఇచ్చారు. యోగాకు సంబంధించిన వివిధ ఆసనాలను ప్రదర్శించి అలరించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

భక్తిశ్రద్దలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు

  కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వాసవినగర్‌ గీతా భవనంలో పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్నారు. కృష్ణానంద స్వామి గీతా తత్పరత జ్ఞాన సత్సంగంతోపాటు సత్యనారాయణ స్వామి కథను వినిపించారు. కార్యక్రమంలో జి.బాలయ్య, కృష్ణమూర్తి, అంజయ్య, లక్ష్మిపతి, శంకరయ్య, గంగారాజం, తదితరులు పాల్గొన్నారు.

Read More »

21 నుంచి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

  నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 21వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు జిల్లాలోని పశువులకు, ఆవులు, లేగలు, దూడలు, గేదెలకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ ఎల్లన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రైతులు తమ తమ పశువులకు టీకాలు వేయించి జయప్రదం చేయాలని సూచించారు. తద్వారా తమ పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని, ముందు జాగ్రత్తగా తప్పకుండా టీకాలు ...

Read More »

22న హరితహారంపై ఎంపిపిలు, జడ్పిటిసిలతో సమావేశం

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 22న ఉదయం 9.30 గంటల నుంచి జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపిపిలు, జడ్పిటిసిలతో హరితహారంపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఒక ప్రకటనలో తెలిపారు. మండల చేంజ్‌ ఏజెంట్లు, డిఎం అండ్‌హెచ్‌వో, ఐసిడిఎస్‌ పిడి, డ్వామా పిడి, డిఇవో, డిప్యూటి డిఇఓలు, మునిసిపల్‌ కమీషనర్లు, డిఎఫ్‌ఓలు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమీషనర్‌, ...

Read More »

వరుణుడి కోసం గంగాదేవికి పూజలు

  మోర్తాడ్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌ గంగపుత్ర సంఘం ఆద్వర్యంలో సోమవారం గంగపుత్ర సంఘం సభ్యులు, మహిళలు వర్షాలు సమృద్ధిగా కురియాలంటూ గంగాదేవికి జలాభిషేకం, ప్రత్యేకపూజా కార్యక్రమాలు, అన్నదానం నిర్వహించారు. గంగపుత్ర సంఘ భవనం నుంచి వలలు, గొడుగులతో అలంకరించి, మహిళలు మంగళహారతులు, డప్పుల చప్పుళ్ళ నడుమ, బోనాలు నెత్తినెత్తుకొని గ్రామ వీధుల్లో ఊరేగించి ముసలమ్మ చెరువు శివారులోగల గంగామాత దేవి ఆలయంలో జలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా విచ్చేసిన భక్తులకు అన్నదానం చేశారు. ...

Read More »

చిత్తశుద్దిలేని విద్యాశాఖాధికారులు

  – అనుమతి లేకుండా కొనసాగుతున్న ప్రయివేటు పాఠశాలలను రద్దుచేయాలి మోర్తాడ్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా, మండల విద్యాశాఖాధికారులకు విధుల పట్ల చిత్తశుద్ది లేదనటానికి నిదర్శనంగా మోర్తాడ్‌ మండలంలోని సుంకెట్‌ గ్రామంలో ఒక ప్రయివేటు పాఠశాల ప్రభుత్వ అనుమతి లేకుండా కొనసాగుతుంది. తెరాస ప్రభుత్వం నిరుపేదలకు ఆంగ్ల విద్యబోదన ప్రభుత్వ పాఠశాలల్లోనే అందించేందుకు మొదటి దశలో ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తుంది. పాఠశాలలు ప్రారంభమై వారంరోజులు గడిచాయి. ఈ క్రమంలో సుంకెట్‌లో ప్రయివేటు ...

Read More »

21న ప్రపంచ యోగా దినోత్సవం

  నిజామాబాద్‌ రూరల్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం 6.55 గంటలకు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ మైదానంలో యోగ సాధన శిబిరం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవేళ వర్షం కురిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకుగాను ఆర్మూర్‌రోడ్డులోని శ్రీరామగార్డెన్స్‌ ఫంక్షన్‌హాల్‌, వినాయక్‌నగర్‌లోని బస్వాగార్డెన్స్‌లో యోగా సాదన చేయడం జరుగుతుందని కలెక్టర్‌ అన్నారు.

Read More »

గ్రామ దేవతలకు జలాభిషేకాలు

  మోర్తాడ్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌ గ్రామంలో ఇజిఎస్‌ ఉపాది హామీ కూలీలు గ్రామ దేవతలకు జలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మోర్తాడ్‌ ఉపాధి కూలీలు స్థానిక సర్పంచ్‌ దడివెనవీన్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నర్సయ్యలు వేకువజామున గంగాజలాలు తీసుకొచ్చి గ్రామంలోని శివాలయం, శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం, రామాలయం, ఆంజనేయస్వామి ఆలయంలో దేవతలకు జలాభిషేకాలు నిర్వహించారు. గంగా జలాలను నెత్తిన ఎత్తుకొని గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి ...

Read More »

అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారు?

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు పెద్దలు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా… ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా ...

Read More »

ఆర్‌బిఐ రేసులో అరుంధతీ భట్టాచార్య !

ముంబై : రఘురామ్‌ రాజన్‌ స్థానంలో ఆర్‌బిఐ తదుపరి గవర్నర్‌గా ఎవరు పగ్గాలు చేపడతారనే విషయంపై ఊహాగానాలకు తెరపడింది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 12 మంది పేర్లతో ఒక జాబితా తయారు చేసినట్టు సమాచారం. ఇందులో ఎస్‌బిఐ చీఫ్‌ అరుంధతీ భట్టాచార్య, ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌ ఉర్జిత పటేల్‌, మాజీ డిప్యూటీ గవర్నర్‌ రాకేశ్‌ మోహన్‌, సెబి చైర్మన్‌ యుకె సిన్హా, ఐసిఐసిఐ బ్యాంక్‌ మాజీ చీఫ్‌ కెవి కామత, ప్రపంచ బ్యాంక్‌ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్‌ బసు, కాగ్‌ మాజీ చీఫ్‌ వినోద్‌ ...

Read More »

బర్నింగ్‌ ఇష్యూ’ బారిన తెలుగు కథ

మనవి కాని సామాజిక ఐడెంటిటీలను సహానుభూతితో దగ్గరగా పరిశీలించి కొంతమేరకు అర్థం చేసుకోగలం. కానీ ఎంత లోతుకెళ్లినా జన్మతః ఆ ఐడెంటిటీని మోస్తున్నవాడిలాగా దాన్ని పూర్తిగా ఆవాహన చేసుకోగలమా? పీడితపక్షం వహించటం ఎప్పుడూ ఆదర్శమే. కానీ ‘పాపం పీడితులూ’ అన్న మన ఉదాత్తమైన సానుభూతే వాళ్లకు మంచి చేయదుగా. ‘‘సింహాల తరఫున చరిత్రకారులు వచ్చేవరకూ వేట చరిత్ర ఎప్పుడూ వేటగాడినే కీర్తిస్తుంది’’ అన్న చినువా అచెబె మాటొకటుంది. అయితే మన తెలుగు సాహిత్యంలో అటు సింహాలూ ఇటు వేటగాళ్ల చరిత్రల్ని కూడా హైనాలే రాస్తున్నాయి. ...

Read More »

పాకిస్తాన్‌లో పాదరక్షలపై ‘ఓం’

కరాచీ: హిందువులు పవిత్రంగా భావించే ‘ఓం’ గుర్తును పాకిస్తాన్‌లో పాదరక్షలపై ముద్రించి విక్రయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది చాలా దురదృష్టకరమని, ఇలా చేయడం అపవిత్రమని అక్కడి మైనారిటీలైన హిందువులు ఆగ్రహం వ్యక్తంచేశారు. టాండో ఆదం ఖాన్ పట్టణంలో వీటిని విక్రయిస్తున్నారని, దీనిపై సింధ్ ప్రభుత్వం వద్ద నిరసన తెలిపామని పాకిస్తాన్ హిందూ సమాఖ్య అధినేత రమేశ్ కుమార్ చెప్పారు. వీటిని దుకాణాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమంలోనూ ఈ పాదరక్షల చిత్రాలు ...

Read More »

పోలీసులకే చుక్కలు చూపిస్తున్న యాహియా

ఎల్లారెడ్డి : ఆశ కాస్త అత్యాశగా మారి ఒక వైపు దొంగ పింఛన్ పొందుతూనే మరో పింఛన్ కోసం పన్నాగం పన్నిన యాహియా పోలీసులకు అవస్థలు పెడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కామారెడ్డి ఎస్‌టీవో పరిధిలో ఆరేళ్లుగా లేని ఉద్యోగాన్ని సృష్టించి పింఛన్ పొందుతున్న ఎల్లారెడ్డికి చెందిన యాహియా మరో సారి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల పాఠశాలలో నైట్ వాచ్‌మెన్ ఉద్యోగాన్ని సృష్టించుకొని అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న యాహియా వద్ద మొత్తం ఆరు సర్వీసు పుస్తకాలు ఉన్నట్లు కామారెడ్డిలోని అతని ...

Read More »

ఇంటర్నల్ పైపులైన్లకు రూ.128 కోట్లు మంజూరు

వినాయక్‌నగర్ : మిషన్ భగీరథ పథకంలో భాగంగా మొ దటి దశలో 210 గ్రామాలకు ఇంటింటికీ తాగునీరు అందించే ఇంటర్నల్ పైపులైన్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.128 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ యోగితారాణా తెలిపారు. ఈ నెల 22 నుంచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, మిషన్ భగీరథ పనుల నిర్మాణ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మండలాల వారీగా బా ల్కొండ మండలంలో 29, ఆర్మూర్‌లో 21, జక్రాన్‌పల్లిలో 29, సదాశివనగర్‌లో 34, ...

Read More »

తిరుగులేని శక్తిగా తెలంగాణ రాష్ట్రం

నవీపేట : తెలంగాణ రాష్ట్రం దేశంలో తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకుంటోందని రంగారెడ్డి జిల్లాలోని కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ తెలిపారు. ఆదివారం నవీపేటలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి మైనంపల్లి హన్మంత్‌రావుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 14 ఏళ్ల ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ దేశంలోనే గుర్తింపు తీసుకువచ్చే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను ప్రవేశపెట్టి అందరి మన్ననలు పొందుతున్నారని ...

Read More »

జిల్లాలో 35.5 మిల్లీమీటర్ల వర్షపాతం

నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉ దయం వరకు 35.5 మిలీమీటర్ల వర్షపాతం న మోదైంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వ ర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చే స్తున్నారు. జిల్లా కేంద్రంలో రాత్రి 8 గంటల తర్వా త ప్రారంభమైన వర్షం మోస్తారుగా కురిసింది. అ ర్ధరాత్రి పలు ప్రాంతాల్లో భారీగా పడింది. సిరికొండలో అత్యధికంగా 70.6 మిల్లీ మీటర్లు, పిట్లంలో అత్యల్పంగా 9.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో12.6, లింగంపేట్‌లో 28.6, వర్నిలో ...

Read More »