Breaking News

Daily Archives: June 21, 2016

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  రెంజల్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా గ్రామంలో సర్పంచ్‌ బండారు పోశెట్టి సిసి రోడ్డు పనులను మంగళవారం ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ ఇజిఎస్‌ నిధులు 10 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టరును ఆదేశించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు సాయిలు, అక్తర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

తాడ్‌బిలోలిలో యోగా దినోత్సవం

  రెంజల్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి ఆద్వర్యంలో మంగళవారం విద్యార్థులతోయోగా ప్రదర్శన నిర్వహించారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు యోగా ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో దోహదపడుతుందని, శరీరంలోని అన్ని అవయవాలు ఉత్తేజాన్ని పొందుతాయని, ప్రశాంతత లభిస్తుందని, యోగా ద్వారా మతిమరుపు దూరం చేయవచ్చని అన్నారు. అలాగే గతంలో తాడ్‌బిలోలి పాఠశాల నుంచి మండల, జిల్లాస్తాయి ...

Read More »

జాగృతి ఆధ్వర్యంలో జయశంకర్‌ వర్ధంతి

  రెంజల్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ 5వ వర్ధంతిని మంగళవారం సాటాపూర్‌ తెలంగాణ చౌరస్తాలో రెంజల్‌ మండల జాగృతి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి పురుడుపోసిన నాయకుడు జయశంకర్‌ సార్‌ అని జాగృతి నాయకులు ఎకార్‌ పాషా కొనియాడారు. తెలంగాణ జాతిని జాగృతం చేసేందుకు జయశంకర్‌ సార్‌ అహర్నిశలు కృషి చేశారని, ఆయన బాటలోనే ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ...

Read More »

తెలంగాణ రైతాంగ సమితి మహాసభ గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర మహాసభల గోడప్రతులను మంగళవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. పదేళ్ల ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ రైతాంగ సమితి ప్రథమ మహాసభలను హైదరాబాద్‌లోని బిసి సాధికార భవన్‌లో ఈనెల 25,26 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనికి ప్రముఖులు హాజరు కానున్నట్టు పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు, వ్యవసాయం, రైతుల స్వావలంబన తదితర విషయాలపై మహాసభలో చర్చిస్తామన్నారు. దీనికి అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో నర్సింహారెడ్డి, సాయన్న, ...

Read More »

మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌కు సన్మానం

  కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన గట్టగౌని రాజమణి, గోపిగౌడ్‌ దంపతులను మంగళవారం సన్మానించారు. చిన్నమల్లారెడ్డి గౌడ సంఘం ఆధ్వర్యంలో వీరికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నిక కావడం పట్ల అభినందనలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో బాల్‌రాజ్‌గౌడ్‌, గ్రామ సర్పంచ్‌ రామాగౌడ్‌, నాయకులు రాజాగౌడ్‌, నారాగౌడ్‌, కృష్ణాగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

చేతులకు సంకెళ్ళతో న్యాయవాదుల నిరసన

  కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీమాంధ్ర న్యాయమూర్తులను తెలంగాణ ప్రాంతానికి కేటాయించడాన్ని నిరసిస్తూ కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ప్రతినిదులు మంగళవారం చేతులకు సంకెల్లు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ న్యాయవ్యవస్థకు వేసిన సమైక్య సంకెళ్లను తొలగించాలని నినాదాలు చేశారు. ఈ ప్రాంత న్యాయమూర్తుల అవకాశాలను కొల్లగొడుతూ తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన ఆంద్రా జడ్జిలు వెంటనే తమ వైఖరి మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు సవరించిన ప్రొవిజనల్‌ లిస్టును రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బార్‌ ...

Read More »

ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడాలి

  – మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతుందని, అది మంచిది కాదని మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘం సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన వృద్దుల పట్ల వేదింపులు అవగాహన, నివారణ దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గిపోవడం వల్ల ఒంటరి కుటుంబాలే విస్తరిస్తున్నాయన్నారు. ఉమ్మడిగా ...

Read More »

ఘనంగా ప్రొపెసర్‌ జయశంకర్‌ వర్ధంతి

  కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ చేసిన సేవలను కొనియాడారు. వరంగల్‌జిల్లా జనగామలో జయశంకర్‌ విగ్రహాన్ని కూల్చివేసిన దుండగులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాదనే ధ్యేయంగా జయశంకర్‌ జీవిత కాలం పనిచేశారన్నారు. తెలంగాణ కోసం చివరి శ్వాస వరకు పోరాడిన యోధుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో ...

Read More »

వికాసపర్వను విజయవంతం చేయండి

  బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌ కామరెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డిలో ఈనెల 23న నిర్వహించనున్న వికాసపర్వ బహిరంగ సభ విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని జి.ఎస్‌.ఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. వికాసపర్వ ...

Read More »

ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం

  కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ యోగా సమితిలు, పాఠశాలలు, కళాశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా ప్రదర్శన చేశారు. పట్టణంలోని పతంజలి యోగా సమితి, భారత్‌ స్వాభిమాన్‌ ఆద్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి మనిషి జీవితంలో యోగా ఒక భాగం కావాలన్నారు. యోగా ప్రతినిత్యం ఆచరిస్తే పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ...

Read More »

ఘనంగా యోగా దినోత్సవం

  బీర్కూర్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా యోగా కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని నెమ్లి గ్రామంలోగల ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. యోగావల్ల ఆరోగ్యం చేకూరుతుందని, మానసికంగా ప్రశాంతత లభిస్తుందని ప్రధానోపాద్యాయులు వెంకటరమణ పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

విద్యుత్‌ ఘాతంతో గేదె మృతి

  బీర్కూర్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దామరంచ గ్రామంలో విద్యుత్‌ తీగలు తగులుకొని షాక్‌ తగిలి గేదె మృతి చెందినట్టు గ్రామ పంచాయతీ అధికారి తెలిపారు. పూర్తి వివరాల ప్రకారం గ్రామానికి చెందిన హన్మాండ్లు గేదె పశుగ్రాసం కొరకు గ్రామ శివారులో తిరుగుతుండగా విద్యుత్‌ తీగలు తగిలి మృతి చెందినట్టు అన్నారు. గేదె విలువ సుమారు 40 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

Read More »

విద్యుత్‌ ఘాతంతో వ్యక్తి మృతి

  బీర్కూర్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొలానికి నీరు పారించడానికి వెళ్లిన రైతు విద్యుత్‌ ఘాతంతో మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలోని బీర్కూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజ్‌భరత్‌ రెడ్డి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బీర్కూర్‌ గ్రామానికి చెందిన కొట్టం సాయిలు (32) ఉదయం పొలానికి నీరు పారించడానికి విద్యుత్‌ తీగలను సరిచేస్తుండగా అనుకోకుండా విద్యుత్‌ సరఫరా జరగడంతో ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు ...

Read More »

విద్యార్థులకు ఉచిత నోటుపుస్తకాల పంపిణీ

  కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలంలోని భవానిపేట గ్రామంలోగల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నోటుపుస్తకాలను అందజేశారు. మందవెంకటరెడ్డి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సుమారు 300 మందివిద్యార్థులకు 1500 నోటుపుస్తకాలు ఉచితంగా అందజేసినట్టు పేర్కొన్నారు. వెంకట్‌రెడ్డి మనువడు విక్రంరెడ్డి చేతుల మీదుగా నోటుపుస్తకాలు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు, న్యాయవాది వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

22 నుంచి డిగ్రీ అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు

  డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అండర్‌ గ్రాడ్యుయేట్‌ అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 22 నుంచి ప్రారంభమవుతాయని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి ఆదేశించారు. మంగళవారం తెవివిలో డిగ్రీ పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లతో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ పరీక్షలను పక్కా ప్రణాళికతో, సమయపాలన పాటించి, ఎలాంటి అలసత్వానికి తావులేకుండా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ...

Read More »

ఇసుక అక్రమ రవాణా

  బాన్సువాడ, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంజీర ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణా అడ్డూ అదుపులేకుండా కొనసాగుతోంది. ఇసుకఅక్రమ రవాణాపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తున్నట్టు చెబుతున్నప్పటికి అక్రమ రవాణాదారులు అడ్డదారుల్లో యథేచ్చగా రవాణా కొనసాగిస్తున్నారు. మంజీర తీర ప్రాంతం నుంచి బీర్కూర్‌, బిచ్కుంద, మద్నూర్‌, కోటగిరి, బోధన్‌ ప్రాంతం నుంచి నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకతరలిపోతోంది. బాన్సువాడ ప్రాంతంలో పట్టపగలే ఇసుక రవాణా కొనసాగడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. సోమవారం అధికారులు వాహనాల తనికీలు ...

Read More »

పెర్కిట్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

  పెర్కిట్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పెర్కిట్‌లోని ఎంఆర్‌ గార్డెన్స్‌లో మంగళవారం యోగాచార్యులు రాజేందర్‌ ఆధ్వర్యంలో యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యోగా యొక్క లాభాలను ప్రజలకు వివరించారు. ప్రతిరోజు కనీసం ఒక గంటపాటు యోగాభ్యాసం చేయడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత లభిస్తుందన్నారు. అంతేగాకుండా యోగా వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్‌ అశోక్‌, ఆర్టీఎ అధికారి యశ్వంత్‌కుమార్‌, తెరాస నాయకులు గంగారెడ్డి ...

Read More »

రుణాలు అందించడంలో బ్యాంకర్లు ఉదారంగా ఆలోచించాలి

  – సంయుక్త కలెక్టర్‌ నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ యువతకు, రైతులకు రుణాలు అందించడానికి బ్యాంకు అధికారులు ఉదారంగా ఆలోచించి వారు ఆర్థికంగా ఎదగడానికి సహకరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి బ్యాంకు అధికారులను కోరారు. మంగళవారం స్తానిక ప్రగతిభవన్‌లో బ్యాంకర్ల డిసిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు, నిరుద్యోగ యువతకు మెరుగైన సేవలు అందించాలని, వారికి పెద్ద ఎత్తున రుణాలు అందించినప్పుడే అటు బ్యాంకులు, ఇటు లబ్దిదారులు ఆర్థికంగా ...

Read More »

తెలంగాణ జాతిపితకు ఘన నివాళి

  డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సమాజానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ జ్ఞానజ్యోతి లాంటివారని, తన ఆశ, శ్వాస అయిన తెలంగాణ సాధనకు చివరి నిమిషం వరకు శ్రమించిన పోరాట యోధుడని తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. ఈ మేరకు తెలంగాణ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ 5వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ తెలంగాణ యావత్తు సమాజం ఆయనకు రుణపడి ఉంటుందన్నారు. యెండల ప్రదీప్‌ మాట్లాడుతూ తెలంగాణ సమాజంలోని యువకులు, ...

Read More »

ఆధునిక జీవనశైలికి యోగా తప్పనిసరి

  – సంయుక్త కలెక్టర్‌ నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి వేగవంతమైన జీవన ప్రమాణాలకు యోగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆచరించవలసిన అవసరముందని సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌ రెడ్డి తెలిపారు. 2వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌ మైదానంలో మంగళవారం నెహ్రూ యువకేంద్ర, ఐఆర్‌సిఎస్‌. ఆయుష్‌ శాఖ, క్షేత్ర ప్రచారశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. నగర మేయర్‌ ఆకుల సుజాతతోపాటు జ్యోతి ప్రజ్వలన అనంతరం జిల్లా యోగ సంఘం ...

Read More »