Daily Archives: June 22, 2016

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలోని బాలికల ఉన్నత పాఠశాలలో డిజిటల్‌ తరగతులను బుధవారం గ్రామ సర్పంచ్‌ రామాగౌడ్‌ ప్రారంభించారు. ఆర్‌ఎంఎస్‌ఎ కింద విడుదలైన నిధులతో డిజిటల్‌ తరగతుల కొరకు ప్రొజెక్టర్‌ కొనుగోలు చేసినట్టు తెలిపారు. వీటి ద్వారా విద్యార్థులకు కంప్యూటర్‌ బోదన నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపవిద్యాశాఖాధికారి బలరాం, ఉపసర్పంచ్‌ రమేశ్‌, ఎంపిటిసి లక్ష్మిరాజాగౌడ్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హన్మాండ్లు, వేదవతి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

251 కొత్త రెసిడెన్సియల్‌ పాఠశాలలకు రూ. 5 వేల కోట్లు

  – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజాంసాగర్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2016-17 విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రారంభించిన 251 రెసిడెన్షియల్‌ పాఠశాలలకు 5 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం నిజాంసాగర్‌ మండలం అచ్చంపేటలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన సమీకృత బాలుర వసతి గృహ సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం నుంచి 71 మైనార్టీ, 100 షెడ్యూలు కులాలకు, ...

Read More »

కొనసాగుతున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం

  నందిపేట, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 13వ విడత ఉచిత గాలికుంటు నివారణ కార్యక్రమంలో భాగంగా బుధవారం వెల్మల్‌, బజార్‌ కొత్తూరు గ్రామాల్లో వ్యాధి నివారణ టీకాలు వేసినట్టు పశువైద్యాధికారి లక్కారం ప్రభాకర్‌ తెలిపారు. ఇందులో భాగంగా వెల్మల్‌ తెరాస నాయకులు కోటజాన్‌, కంచెట్టి, సంతోష్‌ పాల్గొన్నారు. వెల్మల్‌ గ్రామంలో గ్రామ పెద్దలు అందించిన తోడ్పాటు అభినందనీయమని పేర్కొన్నారు. ఇదేవిధంగా ప్రతి గ్రామంలో అందరూ నిలబడి పశుసంవర్ధకశాఖ సిబ్బందికి సహకరించాలన్నారు. ప్రజలు తమ తమ ఆవులు, ఎద్దులు జంగిటిలోనికి ...

Read More »

సిఎం రిలీఫ్‌పండ్‌ చెక్కుల పంపినీ

  కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌ బుధవారం సిఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను బాధిత కుటుంబీకులకు అందజేశారు. రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన లక్ష్మి బండిమీద నుంచి పడి తలకు గాయాలు కాగా ఆమెకు రూ. 30 వేల 500 చెక్కు అందజేశారు. అదే గ్రామానికి చెందిన ఎర్రం ఆనంద్‌ డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందగా ఆయనకు రూ. 12,500 చెక్కు అందజేశారు. కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, గ్రామ సర్పంచ్‌ భూపతి, ...

Read More »

అటవీశాఖ అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన

  – డిఎఫ్‌వో కార్యాలయం ఎదుట ధర్నా కామరెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట మండల పరిధిలోని మోతె గ్రామంలో అటవీశాఖాధికారులు రైతులపై చేస్తున్న దౌర్జన్యాన్ని నిరసిస్తూ బుధవారం కామారెడ్డిలో కమ్యూనిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. డిఎప్‌వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అక్కడి నుంచి ఆర్డీవో కార్యాలయం చేరుకొని కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. డిఎఫ్‌వో, ఆర్డీవోలకు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మోతె ...

Read More »

సీమాంధ్ర జడ్జిల దిష్టిబొమ్మ దగ్దం

  కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో బుధవారం కామారెడ్డిలో ఆంద్రా జడ్జిల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. సీమాంధ్ర న్యాయమూర్తుల కేటాయింపు ప్రాథమిక జాబితాను వ్యతిరేకిస్తూ చేపడుతున్న న్యాయవాదుల ఆందోళనలో భాగంగా సీమాంధ్ర జడ్జిల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం నిజాంసాగర్‌ చౌరస్తాకు చేరుకొని దగ్దం చేశారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు క్యాతం సిద్దిరాములు మాట్లాడుతూ ఆంధ్రా న్యాయమూర్తులు తమ ఆప్షన్లను విరమించుకునేవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయాలని ...

Read More »

ప్రజల పండుగలు ప్రభుత్వ పండుగలుగా…

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పండుగలను ప్రభుత్వ పండుగలుగా ప్రభుత్వ యంత్రాంగం ఆద్వర్యంలో నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడలోని తహసీల్‌ కార్యాలయం ఆవరణలో ఇమామ్‌లకు, మౌజన్‌లకు గౌరవ వేతనం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 632 మందికి వెయ్యి ...

Read More »

పద్మ అవార్డుల కోసం దరఖాస్తులకు ఆహ్వానం

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పలు రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి జీవిత కాల సాఫల్యం కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ అవార్డులకు ఈనెల 30 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో కలెక్టరేట్‌ కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు. 2017 జనవరి 26న రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వం అందజేసే పద్మ విభూషణ్‌, పద్మ ...

Read More »

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ

  నందిపేట, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత పదిహేను రోజుల క్రితం నందిపేట మండల కేంద్రంలో వానమూలంగా గోడకూలి అక్కడికక్కడే మృతి చెందిన జోర్‌పూర్‌ గ్రామానికి చెందిన రమాదేవి, ప్రవీణ్‌ కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్సీ ఆకుల లలిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం కొరకు ప్రయత్నం చేస్తామన్నారు. ఆమె వెంట కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పెంట ఇంద్రుడు, లోక ...

Read More »

చికిత్స పొందుతూ మహిళ మృతి

  నందిపేట, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన యాతాలర భూలక్ష్మి అనే మహిళ ఈనెల 11న ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా నిజామాబాద్‌ ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ బుధవారం మృతి చెందినట్టు తెలిపారు. బూలక్ష్మి కూతురు లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు ప్రొబిషినరీ ఎస్‌ఐ వినయ్‌కుమార్‌ తెలిపారు.

Read More »

ముగిసిన సాదా బైనామాల గడువు

  నందిపేట, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలో ప్రజలు సాదా బైనామాల రిజిస్ట్రేషన్‌ కోసం ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైతులకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. గతంలో భూములు కొనుగోలుచేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకోని వారికి ఇది చక్కని అవకాశంగా ఉపయోగపడింది. అయితే ఈనెల 15వ తేదీ వరకు చివరి తేదీ ఉన్నప్పటికి ప్రభుత్వం 22వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా ...

Read More »

భార్య కనిపించడం లేదని ఫిర్యాదు

  నందిపేట, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం డొంకేశ్వర్‌ గ్రామానికి చెందిన హన్మంతు భార్య సుశీల (33), కుమారుడు శేఖర్‌ (13) ఈనెల 14వ తేదీ నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే…. ఈనెల 14వ తేదీన తెల్లవారుజామున సుశీల, కుమారుడు శేఖర్‌తో కలిసి చెప్పకుండా వెళ్లిపోయిందని, తమ బంధుమిత్రుల ఇళ్లల్లో వాకబు చేసినా ఆచూకి లభించలేదని హన్మంతు పేర్కొన్నాడు. కాగా బుధవారం నందిపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. ఈమేరకు ...

Read More »

అడవిపందిని ఢీకొని ఇద్దరికి గాయాలు

  బీర్కూర్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మిర్జాపూర్‌ గ్రామానికి చెందిన ఖాసీం, అప్సరీ బేగం తల్లికొడుకులు రంజాన్‌ పండగ నిమిత్తం మిర్జాపూర్‌ నుంచి బాన్సువాడకు బట్టలు కొనుక్కోవడానికి వెళ్లగా మార్గమద్యంలో అడవిపంది అడ్డుగా వచ్చి ఢీకొందని స్థానికులు తెలిపారు. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్సులో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  

Read More »

చికిత్స పొందుతూ మహిళ మృతి

  బీర్కూర్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మిర్జాపూర్‌ గ్రామానికి చెందిన మావురం లక్ష్మి (25) అనే మహిళ నిజామాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ కథనం ప్రకారం… మద్నూర్‌ మండలం మోగె గ్రామానికి చెందిన మావురం లక్ష్మిని మిర్జాపూర్‌ గ్రామానికి చెందిన మావురం మహేశ్‌తో గత రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిపారు. గత 40 రోజుల క్రితం వంట చేస్తుండగా అనుకోకుండా నిప్పంటుకొని గాయాల పాలైంది. కాగా పోలీసులు ...

Read More »

గాలికుంటు నివారణ మాత్రల పంపిణీ

  బీర్కూర్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజన్‌వ్యాధుల సందర్భంగా ప్రస్తుత వర్షాకాలంలో పశువులకు సోకే గాలికుంటు వ్యాధికి సంబంధించి నివారణ మాత్రలను పశు సంవర్ధకశాఖ ఎ.డి ఎల్లన్న బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమం బీర్కూర్‌ మండలం నెమ్లి గ్రామంలో నిర్వహించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పశుగ్రాసం కొరత ఉన్నందన పశువులకు సంబంధించిన దాణ సబ్సిడీలో అందజేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read More »

గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం అందించాలి

  బీర్కూర్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం అందించాలని బీర్కూర్‌ ఎంపిపి మల్లెల మీణ హన్మంతు అన్నారు. మండలంలోని నసురుల్లాబాద్‌ అంగన్‌వాడి కేంద్రాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. మొదటగా అంగన్‌వాడి కేంద్రంలోగల రిజిష్టర్లను పరిశీలించారు. ఆహారపదార్థాల నిలువ విషయాన్ని అంగన్‌వాడి కార్యకర్తను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పదార్థాలకు గర్భిణీలకు, బాలింతలకు అందించాలని, రోజువారి గుడ్లు వారికి సమకూర్చాలని ఆమె సూచించారు. నసురుల్లాబాద్‌ అంగన్‌వాడి సెంటర్‌ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ ...

Read More »

బాలల హక్కులు

ప్రతి భారతీయ పౌరుడికి విద్య ఒక హక్కు. రాజ్యాంగం ప్రకారం విద్య మౌలిక స్థాయిలో ఉచితంగా లభించాలి. ప్రాథమిక విద్య అందరికీ నిర్బంధం. ఉన్నత విద్య అందరికీ తమ ప్రతిభ మీద ఆధారపడి అందుబాటులో ఉండాలి. మనిషి తన తెలివి తేటల్ని పూర్తిగా అభివృద్ధి చేసుకోడానికి వీలుగా విద్యాభ్యాసం కొనసాగిస్తు వుండాలి. అప్పుడే ఆ మనిషికి మౌలికమైన స్వేచ్ఛ లభిస్తుంది. మానవ హక్కులను  కాపాడుకోవచ్చు. తమ పిల్లలకు ఎటువంటి ప్రాథమిక విద్యను సమకూర్చాలనేది తలిదండ్రులే నిర్ణయించుకునే హక్కు వారికే ప్రథమంగా వుంది. అందరికీ విద్య ...

Read More »

కొత్త ఫార్ములా… ఇప్పుడు లవ్…. తర్వాత రేప్… ప్రేమ వెనుక కామం…

అందమైన అమ్మాయి. ఆమెను ఎలాగైనా బుట్టలో వేయడమే లక్ష్యం. నాలుగైదు నెలలు లవ్వాయణం. అదను చూసి అత్యాచారం. ఇదీ ఇప్పుడు యువతులను నమ్మించి గొంతు కోస్తున్న కొందరు యువకుల దారి. ఇలాంటివి ఇటీవలి కాలంలో ఎక్కువయిపోయినట్లు గణాంకాలు చెపుతున్నాయి. ముందు ఆమె ప్రేమ కోసం పరితపిస్తారు. పిచ్చివాడిలా తిరుగుతారు. ఆఖరికి అతడు తనకోసం ప్రాణాలర్పిస్తాడన్న స్థాయికి తీసుకెళ్లడంతో సదరు యువతి అతడికి మనసును అర్పించేస్తుంది. ఆ తర్వాత కథ మొదలవుతుంది. కొన్నాళ్లపాటు వేచి చూసే ధోరణి. పార్టీలు, పబ్బులు, సినిమాలకు తిరిగినా ఎప్పుడూ ఎక్కడా ...

Read More »

తెలంగాణలో భారీ జెండా… మూడు రోజులకోసారి లక్షన్నర… ఎన్ని జెండాలు తేవాలి మహాప్రభో…?

దేశంలోనే అత్యంత ఎత్తైన జాతీయ జెండాను హుస్సేన్ సాగర్ సమీపంలో సంజీవయ్య పార్కు వద్ద ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 291 అడుగుల ఎత్తున ఉన్న ఈ జాతీయ జెండాను చూసి ప్రజలు అబ్బురపడ్డారు. ఈ పతాకాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఈ జాతీయ జెండా అధికారుల కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. దీని నిర్వహణ తడిసిమోపెడవుతోంది. హుస్సేన్ సాగర్ పై నుంచి వీస్తున్న గాలులకు జెండా రెపరెపలాడుతూ చిరిగిపోతోంది. ఆవిష్కరించిన ...

Read More »

భాగవతంలో చెప్పిన ఈ 15 ఇప్పుడు జరుగుతున్నాయి!

ముంబై : ఇప్పుడు ఏం జరిగినా ‘‘సనాతన ధర్మం ముందే చెప్పింది’’ అనవచ్చునేమో! అష్టాదశ (18) పురాణాల్లో ఒకటైన శ్రీమద్భాగవతం చెప్పిన 15 అంశాలు ఇప్పుడు నిజమవుతున్నాయనిపిస్తోంది. కలియుగం ఎలా ఉంటుందో ఈ పురాణం ఎలా వివరించిందో చూడండి! శ్లోకం : 12.2.1 మతం, నిజాయితీ, పరిశుభ్రత, సహనం, దయ, జీవించే కాలం, శారీరక బలం, జ్ఞాపక శక్తి కలియుగంలో రోజు రోజుకూ క్షీణిస్తాయి. శక్తిమంతమైన కలి ప్రభావమే దీనికి కారణం. శ్లోకం : 12.2.2 వ్యక్తి గుణగణాలను, ప్రవర్తనను అదృష్టాన్ని నిర్ణయించేది అతనికిగల ...

Read More »