Breaking News

Daily Archives: June 23, 2016

తిరుమలలోని కట్టడాలను తెలంగాణ తిరుమలలో నిర్మిస్తాం

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం బీర్కూర్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తిరుమల ఆలయంలోగల కట్టడాల విధంగా బీర్కూర్‌ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆలయాన్ని గురువారం మంత్రి సందర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ తిరుమల ఆలయంలో పద్మవతి గెస్టుహౌజ్‌, పూజారి వసతి గృహం, ఆంజనేయస్వామి విగ్రహం, అలిపిరి తరహాలో సింహద్వారం, వినాయక మందిరం తదితర అభివృద్ది ...

Read More »

తాగునీటి సమస్య పరిష్కరిస్తాం

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు బంజేపల్లి గ్రామ సర్పంచ్‌ బేగరి రాజు అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని సుల్తాన్‌నగర్‌గ్రామంలో సర్పంచ్‌, మండల కో ఆప్షన్‌ సభ్యులు మహ్మద్‌ హైమద్‌ హుస్సేన్‌ కలిసి వ్యవసాయ బోరుబావిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంజీరవాగు ఓపెన్‌వాల్‌ ద్వారా పైప్‌లైన్‌తో వాటర్‌ ట్యాంకులో నింపి సరఫరా చేసేవారు. మంజీర వాగు నీరు పూర్తిగా అడుగంటడంతో ...

Read More »

నిజాంసాగర్‌ ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణీలకు కాన్పులు

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు గర్భిణీలు ప్రసవం పొందారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ స్పందన గర్భిణీలకు కాన్పు అయ్యేందుకు కృషి చేసి సులభంగా కాన్పులు చేశారు. మండలంలోని సుల్తాన్‌నగర్‌ గ్రామానికి చెందిన హరిత, సాయవ్వ గర్భిణీలు పురిటి నొప్పులతో స్థానిక ఆసుపత్రికి వచ్చారు. వీరికి వైద్యాధికారి సకాలంలో సేవలందించి సాధారణ ప్రసవం అయ్యేలా కృషి చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు కాన్పులు చేశామని ఆమె పేర్కొన్నారు. ...

Read More »

ఇంటర్‌ ఫలితాల్లో సాందీపని విద్యార్థుల ప్రతిభ

  కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ సప్లమెంటరీ ఫలితాల్లో కామారెడ్డి సాందీపని విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్టు కళాశాల సిఇవో హరిస్మరణ్‌రెడ్డి తెలిపారు. ఎంపిసి లో సనా తబస్సమ్‌-465 మార్కులు, సబ మెహరాజ్‌ -464 మార్కులు, సౌజన్య-463, శ్రీనివాస్‌ – 463, సుమయ్య-462, మణిదీప-462, బైపిసిలో దీపికారెడ్డి-434, ఎంఇసిలో సిమ్రాన్‌ నాజ్‌-484 మార్కులు సాదించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.

Read More »

నిజాంసాగర్‌ ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణీలకు కాన్పులు

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు గర్భిణీలు ప్రసవం పొందారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ స్పందన గర్భిణీలకు కాన్పు అయ్యేందుకు కృషి చేసి సులభంగా కాన్పులు చేశారు. మండలంలోని సుల్తాన్‌నగర్‌ గ్రామానికి చెందిన హరిత, సాయవ్వ గర్భిణీలు పురిటి నొప్పులతో స్థానిక ఆసుపత్రికి వచ్చారు. వీరికి వైద్యాధికారి సకాలంలో సేవలందించి సాధారణ ప్రసవం అయ్యేలా కృషి చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు కాన్పులు చేశామని ఆమె పేర్కొన్నారు. ...

Read More »

సెంట్రింగ్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం

  కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యూ కామారెడ్డి సెంట్రింగ్‌ అసోసియేషన్‌ కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. జాకీ సెంట్రింగ్‌ గతంలో కామారెడ్డిలో అందుబాటులోలేదని, ప్రస్తుతం దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అసోసియేషన్‌ ప్రతినిదులు తెలిపారు. నూతన అధ్యక్షుడిగా తేలు శ్రీనివాస్‌, గౌరవాధ్యక్షునిగా గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పయ్యావుల శ్రీనివాస్‌, కోశాధికారిగా హర్షవర్ధన్‌లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన సభ్యులను సన్మానించారు.

Read More »

ఆస్కార్‌ చిట్స్‌ బ్రాంచ్‌ ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో గురువారం ఆస్కార్‌ చిట్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ రెండవ బ్రాంచిని గురువారం కంపెనీ ఛైర్మన్‌ కె.శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డిలో ఇదివరకే మొదటి బ్రాంచ్‌ ప్రారంభించామని, వ్యాపారం వృద్ది చెందిన నేపథ్యంలో మరోబ్రాంచిని ప్రారంభించినట్టు తెలిపారు. వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు నూతన బ్రాంచిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రీజనల్‌ మేనేజర్‌ జల్ల స్వామి మాట్లాడుతూ త్వరలో సంగారెడ్డి, జహీరాబాద్‌లో బ్రాంచిలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ...

Read More »

ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలి

  కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని గురువారం ఏఐటిఎస్‌యు ఆద్వర్యంలో ఉప విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందని పరిస్థితి నెలకొందన్నారు. కనీసం మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యా ప్రయివేటీకరణవైపే మొగ్గుచూపుతుందని విమర్శించారు. ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం ...

Read More »

కార్మికుల హక్కులు కాలరాస్తే సహించం…

  – సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాసే కుట్రలు పన్నుతున్నాయని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ అన్నారు. కామారెడ్డిలో గురువారం నిర్వహించిన సిఐటియు డివిజన్‌ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులపై ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కార్మిక సంఘాలు సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అసంఘటిత, సంఘటిత కార్మిక వర్గాన్ని ఉపాధికి, భద్రతకు ...

Read More »

ఉపవిద్యాధికారి కార్యాలయం వద్ద టిజివిపి ధర్నా

  కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు కార్పొరేట్‌ పాఠశాలలో అధిక ఫీజులు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం డిప్యూటి డిఇవో కార్యాలయం ఎదుట టిజివిపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఉపవిద్యాధికారి ఖాళీ కుర్చీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు నవీన్‌ మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలల్లో ఫీజులు తగ్గించాలని, అనుమతిలేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీలో ప్రకటించిన విధంగా కెజి నుంచి ...

Read More »

ఇంగ్లీష్‌ మీడియం పుస్తకాల పంపిణీ

  బీర్కూర్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిఆర్‌టియు ఆధ్వర్యంలో గురువారం చించాల్లి ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులకు పిఆర్‌టియు అధ్యక్షుడు విఠల్‌ యాదవ్‌ స్నేహితుడు గౌతంరెడ్డి సహకారంతో 10 వేల రూపాయలతో ఆంగ్ల మాధ్యమ పుస్తకాలను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఎంఇవో గోపాల్‌రావు మాట్లాడుతూ పిఆర్‌టియు వేసవి సెలవుల్లో నిర్వహించిన మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా మంచి స్పందన లభించిందన్నారు. తద్వారా 14 పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమం ప్రారంభించబడిందని అభినందించారు. కార్యక్రమంలో ...

Read More »

సోలార్‌ ప్లాంట్‌తో తీరనున్న కరెంటు కష్టాలు

  నందిపేట, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ప్రజల కరెంటు కష్టాలు ఇక తీరనున్నాయి. నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలంలోని వన్నెల్‌ (ఎం) గ్రామంలో ఉజ్వల తేజస్‌ ఉరజ ప్రయివేటు లిమిటెడ్‌ ఆద్వర్యంలో 20 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌తో సోలార్‌ విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేయడానికి సిద్దమవుతుంది. 85 ఎకరాల బూమిలో 100 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న మెగా ప్రాజెక్టు యొక్క 90 శాతం పనులు పూర్తిచేసుకొని ఈనెల 30 వరకు విద్యుత్‌ సరఫరా చేయాలనే ...

Read More »

రంజాన్‌ స్పెషల్‌ హరీస్‌

  నందిపేట, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముస్లింలకు రంజాన్‌ మాసం పవిత్రమైనది. రంజాన్‌ నెలలో ముస్లింలు స్త్రీ, పురుష తారతమ్యం లేకుండా అందరు విధిగా రోజా (ఉపవాసం) పాటించాలని పవిత్ర ఖురాన్‌లో అల్లాహ్‌ ఆదేశిస్తున్నారు. రంజాన్‌ నెల ప్రారంభమైన ఈనెల 7వ తేదీ నుంచి ముస్లిం ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉపవాసం ఉన్నవారు ఇఫ్తార్‌ (ఉపవాస ముగింపు) సమయానికి అలసి, నీరసించి పోయి ఉంటారు. కాబట్టి నీరసాన్ని దూరం చేయడానికి హరీస్‌ను సేవిస్తారు. ముస్లింలే కాకుండా హిందువులు ...

Read More »

సర్కారు బడిలోనే చదివించాలని తీర్మానం

కామారెడ్డి : ప్రభుత్వ పా ఠశాలల్లోనే విద్యార్థులను చదివించాలని మం డలంలోని ఇల్చిపూర్ గ్రా మస్తులు తీర్మానం చేశా రు. గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పాఠశాలలో సమావేశ మై తీర్మానం చేశారు. వి ద్యార్థులను ప్రైవేటు స్కూళ్లకు పంపొద్దని, ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. ఐదేళ్లు నిండిన ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. గ్రామస్తులందరూ ఈ విషయంలో చేసిన తీర్మానం ప్రకారం మెలగాలని కోరారు. అనంతరం ఎంఈవో, ఎంపీడీవోకు ...

Read More »

వణికిస్తున్న మొసలి చేప!

కోల్‌కతా: మూతి చూస్తే మొసలి.. జాతి మాత్రం చేప. అందుకే దానిని మొసలి చేప అని పిలుస్తారు. ఇంగ్లిషులో అలిగేటర్ గార్ అంటారు. తూర్పు కోల్‌కతాలోని బెలియాఘాటాలో సుభాష్ సరోవర్‌లో ఇటీవల ఓ మూడున్నర అడుగులు పొడవు గల ఆ చేప కనిపించడం పర్యావరణ వేత్తలకు ఆందోళన కలిగిస్తున్నది. శిబూ మోండల్ అనే జాలరికి అది చిక్కింది.మోండల్ తన గాలానికి చిక్కిన మొసలి చేపను చూసి అవాక్కయ్యాడు. నీటినుంచి బయటకు లాగగానే అది అతని మీదకు లంఘించింది. అతడు అంతకుముందే పట్టుకున్న ఓ చేపను ...

Read More »

సెల్ఫీ మోజు ప్రాణాలు తీసింది

ఫొటో దిగుతూ గంగానదిలో జారి పడిన స్నేహితుడిని కాపాడబోయి ఆరుగురు దుర్మరణం కాన్పూర్: సెల్ఫీ దిగాలన్న ఓ యువకుడి మోజు ఆరుగురు ప్రాణాలను తీసింది. ఫొటో దిగే క్రమంలో గంగానదిలో వీరింతా మునిగిపోయారు. ఒకరినొకరు కాపాడుకొనే ప్రయత్నంలో ఆరుగురు యువకులు మరణించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఆరుగురిని కాన్పూర్ జిల్లాలోని జుహీ, మరొకరు కలోనెల్‌గంజ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. భారీ వర్షాల తర్వాత నదిలో స్నానానికి వెళ్లగా ఈ విషాదం చోటుచేసుకొన్నదని జిల్లా ఎస్సెస్పీ శలభ్ మాథుర్ పేర్కొన్నారు. స్నానం చేస్తూ సెల్ఫీ ...

Read More »

గగన వీధిలో ఇస్రో జయహో..

శ్రీహరికోట (ఏపీ): చంద్రయాన్, మంగళ్‌యాన్, స్వదేశీ జీపీఎస్ లాంటి అద్భుత ప్రయోగాలతో ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇప్పటికే భారత్ ఘనకీర్తిని సాధించింది. తాజాగా ఒకే రాకెట్‌తో 20 శాటిలైట్ల ప్రయోగాన్ని విజయవంతం చేసి మరో ఘనతను సొంతం చేసుకొన్నది. ఇందుకోసం అత్యంత విశ్వసనీయమైన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్-సీ34ను (పీఎస్‌ఎల్వీ-34) నమ్ముకొన్నది. బుధవారం ఉదయం 9.26 గంటల ప్రాంతంలో నెల్లూరుకు సమీపాన ఉన్న భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో)లోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ34 ప్రయోగం విజయవంతమైంది. ...

Read More »

మానవత్వం మంటగలిసింది!

ఒక కాకికి ఏదైనా అయితేనే, అనేక కాకులు చుట్టూ మూగి కావు కావుమని అరుస్తాయి. అయితే, నడిరోడ్డు మీద వందలమంది జనం మధ్య ఓ వ్యక్తిని కొందరు చుట్టూ చేరి చితకబాదుతుంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఒక యువకుడికి కత్తిపోటుతో నెత్తురోడుతూ ఆ యువకుడు బాధతో నేలపైపడి విలవిల్లాడుతుంటే వేడుక జరుగుతున్నట్లుగా.. వారి వారి సెల్‌ఫోన్లలో ఆ దృశ్యాలను బంధించేందుకు పోటీ పడటం విచిత్రం. మానవత్వం మంటగలిసిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా..? కర్ణాటకలోని హసన్ పట్టణంలో మంగళవారం ఓ యువకుడు బస్టాండ్‌లో నిలుచున్న ...

Read More »

ప్రముఖ నటుడు జేవీ రమణమూర్తి కన్నుమూత

-గుండెజబ్బుతో చికిత్స పొందుతూ తుదిశ్వాస బంజారాహిల్స్: ప్రముఖ రంగస్థల, సినీనటుడు జేవీ రమణమూర్తి (84) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమణమూర్తి బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రముఖ నటుడు, శంకరాభరణం ఫేమ్ జేవీ సోమయాజులు తమ్ముడైన జేవీ రమణమూర్తి పూర్తిపేరు జొన్నలగడ్డ వెంకటరమణ మూర్తి. 1933 మే 20న ఆయన జన్మించారు. చిన్నతనం నుంచి నాటకాలపై ఆసక్తి పెంచుకున్న రమణమూర్తి రంగస్థలంపై అనేకపాత్రలను పోషించారు. ...

Read More »

క్యాటగిరీలుగా ఇంజినీరింగ్ కాలేజీలు

-జేఎన్టీయూ, ఉన్నత విద్యామండలి అధికారులకు డిప్యూటీ సీఎం కడియం ఆదేశం -ఆన్‌లైన్‌లో యాజమాన్య కోటాసీట్ల భర్తీపై త్వరలో నిర్ణయం? హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలను మూడు క్యాటగిరీలుగా విభజించాలని జేఎన్టీయూహెచ్ అధికారులను డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి ఆదేశించారు. నాణ్యమైన విద్యావిధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆయా కళాశాలల గుర్తింపు కోసం నిర్వహించిన తనిఖీల నివేదికల్లో తేడాలకు అనుగుణగా వాటిని విభజించాలని అధికారులను ఆదేశించామని బుధవారం మీడియాతో అన్నారు. దీనిపై గురువారం నుంచి అధికారులు కసరత్తు చేస్తారన్నారు. అంతకుముందు ఆయన రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి ...

Read More »