Breaking News

Daily Archives: June 24, 2016

బిపిఎంల పేరాశ…

  ఆసరా పింఛన్‌ దారులకు శాపం ఫీల్డ్‌ అసిస్టెంట్లు, బిపిఎంల కుమ్ముక్కు నష్టపోతున్న లబ్దిదారులు మోర్తాడ్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం నిరుపేద, వృద్దులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, చేనేత, గీత కార్మికులకు, వికలాంగులను ఆదుకునేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పథకం బిపిఎం, ఫీల్డ్‌ అసిస్టెంట్ల నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోయి ప్రభుత్వం అభాసుపాలవుతోంది. మండలంలోని తొర్తి గ్రామంలో అవుసుల రాములు, అహ్మద్‌ హుస్సేన్‌, మరో ఇద్దరు వృద్దులకు ఆసరా పింఛన్‌ పథకం మంజూరైనప్పటికి అదే గ్రామానికి చెందిన ...

Read More »

శనివారం మోర్తాడ్‌లో ఉచిత క్యాన్సర్‌ వైద్య శిబిరం

  మోర్తాడ్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ గ్రామ పంచాయతీలో శనివారం సర్పంచ్‌ దడివెనవీన్‌ స్వచ్చందంగా ఉచిత క్యాన్సర్‌ శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. శిబిరానికి మండలంలోని క్యాన్సర్‌ రోగులు వచ్చి పరీక్షలు జరిపించుకోవాలన్నారు. క్యాన్సర్‌ వ్యాధి గ్రస్తులకు కరీంనగర్‌ జిల్లాకు చెందిన సుశ్రుత ఆసుపత్రి వైద్యులు చికిత్స చేస్తారని, వ్యాధి నిర్దారణ అయిన వారికి కరీంనగర్‌, హైదరాబాద్‌ ప్రాంతాలకు రోగులను రిఫర్‌చేసి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయిస్తామన్నారు.

Read More »

వందేభారత్‌ ట్రస్టు ఆద్వర్యంలో దుస్తుల పంపిణీ

  కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం వందేభారత్‌ ట్రస్టు ఆద్వర్యంలో గల్ప్‌ బాధితుల పిల్లలకు, అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. బాంబే క్లాథ్‌ హౌజ్‌ యజమానులు రాజ్‌కుమార్‌, విటి. లాల్‌ల సహకారంతో 18 మంది పిల్లలకు ఒక్కొక్క విద్యార్థికి రెండు జతల స్కూలు యూనిఫాంలు పంపినీ చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు ట్రస్టు ఆద్వర్యంలో 18 మంది పిల్లలకు వివిధ ప్రయివేటు పాఠశాలల యాజమాన్యంతో మాట్లాడి ఉచిత ప్రవేశాలు ఇప్పించి, ఉచిత విద్యను అందిస్తున్నట్టు ...

Read More »

జిల్లాలో హరితహారం పథకాన్ని విజయవంతం చేయాలి

  మోర్తాడ్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఎక్కడా చేపట్టని విధంగా హరితహారం పథకాన్ని చేపట్టి విజయవంతం చేయాలని మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, మండల ప్రత్యేకాధికారి శంకరయ్య, ఎంపిడివో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ వెంకట్రావులు అన్నారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం, తెలంగాణ హరితహారంపై అవగాహన కార్యక్రమం ఎంపిపి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్పిటిసి, ఎంపిపిలు మండల కార్యదర్శులు, విఆర్వోలు, నోడల్‌ అధికారులు, పీల్డ్‌ అసిస్టెంట్‌లు, వివోలు ...

Read More »

సిఎం దిష్టిబొమ్మ దగ్దం

  మోర్తాడ్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం పెంచిన విద్యుత్‌, బస్సు చార్జీలకు నిరసనగా సిపిఐ (ఎంఎల్‌), రైతుకూలీ సంఘం ఆద్వర్యంలో శుక్రవారం మోర్తాడ్‌ జాతీయ రహదారిపై సిఎం కెసిఆర్‌ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యమంలో మన నీరు, మన విద్యుత్తు, మన వనరులు, మనకే అంటూ చెప్పడమే గాకుండా ఎన్నికల్లో విద్యుత్‌, బస్సు చార్జీలు పెంచమని చెప్పి మరోసారి ప్రజలను మోసం చేశారన్నారు. పెంచిన చార్జీలను ఉపసంహరించుకోకపోతే ఏఐకెఎంఎస్‌ ఆద్వర్యంలో ఉద్యమాలు జరుపుతామని ...

Read More »

నందిపేట తహసీల్దార్‌ బదిలీ

  నందిపేట, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల తహసీల్దార్‌గా గత రెండు సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న బావయ్య శుక్రవారం నందిపేట నుంచి భీమ్‌గల్‌ మండలానికి బదిలీ అయ్యారు. ఆయన రెండు సంవత్సరాల్లో మండల అభివృద్దికి అహర్నిశలు కృసి చేశారు. జిల్లా స్తాయి, రాష్ట్ర స్తాయి అవార్డులు పొందారు. అధికార, ప్రతిపక్షాలు అని కాకుండా అందరికి న్యాయం చేశారు. ఆయన స్థానంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో విదులు నిర్వహిస్తున్న ఉమాకాంత్‌ నందిపేట తహసీల్దార్‌గా రానున్నారు.

Read More »

రంజాన్‌ కిట్‌ పంపిణీ

  నందిపేట, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం డొంకేశ్వర్‌ గ్రామ ఉపసర్పంచ్‌ మహ్మద్‌ బషీర్‌తన సొంత ఖర్చుతో రంజాన్‌ మాసం సందర్భంగా పేద ముస్లింలకు బియ్యం, గోధుమ పిండి, నూనె తదితర వంటసామగ్రిని సెట్‌ను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధనిక ముస్లింలతో పాటు పేద ముస్లింలు కూడా పండగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్ధేశంతో పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ధనిక ముస్లింలు తమ సంపాదనలోంచి 2.5 శాతం రూపాయలను జఖాత్‌ రూపంలో తీసి పేదలకు ...

Read More »

ఇసుక క్వారీల ద్వారా రూ. 40 కోట్లు ఆదాయం

    – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2015 జూన్‌ నుంచి టిఎస్‌ఎండిసి ఆద్వర్యంలో చేపట్టిన ఇసుక క్వారీల నిర్వహణ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు రూ. 40 కోట్ల ఆదాయాన్ని స్థూలంగా ఆర్జించినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. అందులో రూ. 22 కోట్లు ఆదాయం నికరంగా పొందినట్టు తెలిపారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఇసుక సేకరణపై జిల్లా కలెక్టర్లతో శుక్రవారం ...

Read More »

మా బిడ్డ చావుకు అనుమతివ్వండి

తంబళ్లపల్లె కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సర్జరీకి 30 లక్షల ఖర్చు ములకలచెరువు/తంబళ్లపల్ల: ‘‘మా బిడ్డను బతికించుకోలేం. కనీసం చంపుకోవడానికైనా అనుమతివ్వండి’’ అంటూ ఓ చిన్నారి తల్లిదండ్రులు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె కోర్టును ఆశ్రయించారు. మెర్సీ కిల్లింగ్‌కు ఆదేశాలు ఇచ్చే అధికారం తనకు లేదని, జిల్లా కోర్టు లేదా హైకోర్టును సంప్రదించాలని న్యాయమూర్తి వాసుదేవ్‌ వారికి సూచించారు. వివరాలివి.. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం ఆర్‌ఎస్‌ కొత్తపల్లెకు చెందిన జెల్లా రమణప్ప, సరస్వతి దంపతుల కుమార్తె జ్ఞానసాయి (8 నెలల ...

Read More »

కువైట్ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో విదేశీ పెట్టుబడులకు అవకాశం

కువైట్: కువైట్ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి విదేశీయులకు అవకాశం కల్పిస్తూ కువైట్ జాతీయ అసెంబ్లీ చట్టం చేసింది. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ అభివృద్ధి పనులు చేపట్టడానికి విదేశీయులకు ఉన్న అడ్డంకి తొలగినట్లయింది. ఈ చట్టం ప్రకారం చమురు బావులు, మిలటరీ రంగాలు మినహా అన్ని రంగాల్లో విదేశీయలు పెట్టుబడులు పెట్టడానికి, దీనికోసం మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రభుత్వంతో చర్చలు జరపడానికి అవకాశం ఉంది. ఈ చట్టంపై కువైట్‌లో గత ముప్పై ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ప్రస్తుత నిర్ణయంతో ఆ ప్రతిష్టంభనకు ...

Read More »

మద్యం ప్రియులకు శుభవార్త.. లిక్కర్‌పై రూల్స్‌ను సడలించిన దుబాయ్

దుబాయ్: నిజంగా ఇది మద్యం ప్రియులకు శుభవార్తే. మద్యంపై ఇప్పటి వరకు ఉన్న నిబంధలను ప్రభుత్వం సడలించింది. రంజాన్ నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయంతో మద్యం ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజా నిర్ణయంతో దుబాయ్ పాలకులు పర్యాటకం, ఆల్కహాల్‌ నుంచి ట్యాక్స్ ద్వారా వస్తున్న ఆదాయంపై చూపిస్తున్న మక్కువను అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దుబాయ్‌లో ఇక అన్ని వేళలా మద్యం అందుబాటులో ఉంటుంది. గతంలో ఓ చుక్క వేసుకోవాలంటే సూర్యుడు అస్తమించే వరకు ఆగాల్సి వచ్చేది. కానీ ప్రభుత్వం ఇప్పుడు ...

Read More »

ఎన్‌ఎస్జీ పోరాటం!

తాష్కెంట్‌లో స్విచ్ వేస్తే సియోల్‌లో బల్బు వెలగాలి. అనుకున్నట్టు గానే, ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌లో భారత ప్రధాని కాలు మోపారు. ఆయన అక్కడకు వెళ్ళింది ‘షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్’ (ఎస్సీవో) సమావేశంలో పాల్గొనడానికి. పాకిస్థాన్‌‌‌తో పాటు భారతదేశానికి కూడా ఈ గ్రూపులో పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించే పని ఇందులో ముందుకు కదులుతుంది. కానీ, ఇంతకంటే ప్రధానమైనది చైనా అధ్యక్షుడితో భేటీ. నూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌ (ఎన్ఎస్జీ)లో భారత సభ్య త్వాన్ని వ్యతిరేకిస్తూ, వారం రోజులుగా గొంతుబాగా పెంచిన చైనాను బుజ్జగించే ప్రయత్నమిది. ఎన్ఎస్జీ సభ్యత్వానికి ...

Read More »

అవి దయ్యాలేమీ కాదు..

విమాన కంపెనీలపై అశోక్‌ గజపతి రాజు వ్యాఖ్య న్యూఢిల్లీ: విమానయాన కంపెనీలు దేవతలు కాకపోవచ్చు గానీ దయ్యాలు మాత్రం కావని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు అన్నారు. ఏకపక్షంగా విమాన కంపెనీలు టికెట్ల ధరలను పెంచుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టికెట్‌ ధరల్లో పెరుగుదలను నివారించేందుకు సులభతరమైన పరిష్కారం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. టికెట్‌ ధరలపై నియంత్రణ విధించడం అనేది ఈ సమస్యకు పరిష్కారం కాబోదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అత్యవసర ...

Read More »

బిపాసా గంటన్నర యోగాకు కోటిన్నరా?

బెంగళూరు: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన శిబిరంలో గంటన్నర పాటు పాల్గొన్నందుకు బాలీవుడ్‌ తార బిపాసాబసుకు కోటిన్నర చెల్లించారు. అంతేకాకుండా రానుపోను ఖర్చులతో పాటు ఒకరోజు బెంగళూరులో ఆమె బస కోసం అదనంగా మరింత సొమ్ము ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. బిపాసా గంటన్నరపాటు కార్యక్రమంలో పాల్గొన్నందుకు సర్కారు ఇలా రూ.కోటిన్నర చెల్లించడంపై ప్రజాసంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో సిద్దరామయ్య ప్రభుత్వం మరో చిక్కులో పడినట్లు అయింది. శతాబ్దాల కాలంగా భారతీయ సంస్కృతికి అద్దంపట్టే యోగాకు అర్థం లేకుండా ...

Read More »

టీమిండియా కోచ్ గా కుంబ్లే.. చక్రం తిప్పిన కోహ్లి..!

ఎంతో సస్పెన్స్ కూడిన తరువాత టీమిండియా కోచ్ ఎవరూ అనే విషయం తెలిసిపోయింది. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేను టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ కోచ్ పదవికి దాదాపు 57 ధరఖాస్తులు రాగా.. వాటిలో మాజీ డైరెక్టర్ రవిశాస్త్రితో పాటు అనిల్ కుంబ్లే, సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాద్ లు దరఖాస్తులు పెట్టారు. అంతేకాదు విదేశాలనుండి కోచ్ పదవికి ధరఖాస్తులు వచ్చాయి. అయితే వారందరిని వెనక్కి నెట్టి కుంబ్లే కోచ్ పదవికి ఎంపికయ్యారు. అయితే వచ్చిన ...

Read More »

‘కాల్ గర్ల్’గా మారిన తెలుగు హీరోయిన్!

నచ్చావులే’ సినిమాతో తెలుగువారిని పలుకరించిన హీరోయిన్ మాధవీలత. ఆ తర్వాత అడపాదడప సినిమాలు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు షార్ట్ ఫిలింస్ పై దృష్టి పెట్టింది. త్వరలో రానున్న ‘ఆన్ మోనాస్ బర్త్ డే’ షార్ట్ ఫిలింలో ఆమె ‘కాల్ గర్ల్’ పాత్ర పోషించనుంది. నరేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం టీజర్ ను తాజాగా యూట్యూబ్ లో విడుదల చేశారు. అపార్ట్ మెంట్ పార్కింగ్ ప్రదేశంలో నడుచుకుంటూ వస్తున్న మాధవీలతను ఇందులో చూపించారు. మరో సీన్ లో కారులో చిన్నారితో ...

Read More »

ఈ విషయంలో పురుషులు అర నిమిషం కూడా ఆగలేరట!

లండన్: ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ స్మార్ట్‌ఫోన్ లేనిదే రోజు పూర్తవడం లేదు! మెళకువగా ఉన్నంత సేపు చేతి వేళ్లు స్మార్ట్‌ఫోన్‌పై కదలాల్సిందే! అయితే స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతలా భాగమైపోయిందంటే.. సగటున 44 సెకన్ల పాటు కూడా దీనికి దూరంగా ఉండలేకపోతున్నారట. అందులోనూ స్త్రీలతో పోల్చితే పురుషుల విషయంలో ఇది మరీ తక్కువగా ఉంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకుండా మగవారు అరనిమిషం కూడా ఆగలేకపోతున్నారట. పురుషులు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా 21 సెకన్లు కూడా ఉండలేకపోతున్నారని జర్మనీలోని వ్యూయర్జ్‌బర్గ్‌, ...

Read More »

Actor Anushka Sharma Slams Trolls For Abuse Over Virat Kohli

MUMBAI:  HIGHLIGHTS “Difficult coming to terms with the online abuse,” says Anushka Sharma The actor has often been targeted on twitter over cricketer’s performance Virat Kohli had pleaded with Internet users to stop attacking Anushka Bollywood actor Anushka Sharma has hit out at “misogynistic” online trolls after she received abusive social media messages over her reported on-off relationship with Test ...

Read More »

In a first, Mideast hub Dubai eases liquor rules for Ramzan

HIGHLIGHTS Dubai has allowed day-time alcohol sales during Ramzan The tourism dept did appeal on tourists to respect Ramzan rules. Being drunk in public is a criminal offense in Dubai. DUBAI: Dubai, the Mideast’s desert party town, has just gotten even wetter. The city-state is breaking new ground with its decision to loosen rules prohibiting day-time alcohol sales during the ...

Read More »

పాము కాటుతో ఆదర్శ పాఠశాల విద్యార్థిని మృతి

నాగిరెడ్డిపేట : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని స్నేహ గురువారం పాము కాటుతో మరణించింది. బుధవారం రాత్రి ఇంట్లో తన సోదరి, సోదరుడుతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో పాము కాటు వేసింది. అయితే పాము కరిచిన విషయం స్నేహకు తెలియలేదు. పామును చంపివేశారు. చిన్న పాము కదా కాటు వేయలేదన్న భ్రమలో అందరూ కలిసి భోజనం చేసి నిద్రపోయారు. గురువారం ఉదయం అందరూ నిద్రలేచినప్పటికీ స్నేహ లేవకపోవడంతో సోదరుడు నిద్రలో నుంచి లేపాడు. నిద్ర నుంచి లేవగానే ...

Read More »