Breaking News

Daily Archives: June 25, 2016

నీటిసరఫరా కేంద్రం గదికి శంకుస్థాపన

  కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపాలిటీకి నీటిని సరఫరాచేసే కామారెడ్డి బుర్రమత్తడి వద్ద శనివారం పంపు ఆపరేటర్‌ గది నిర్మాణానికి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ శంకుస్థాపన చేశారు. పంపు వద్ద సామగ్రి, కార్మికులు, ఇతరత్రా సౌకర్యాలపై గది నిర్మిస్తున్నట్టు తెలిపారు. గది లేకపోవడం వల్ల గత 20 రోజుల క్రితం నారాయణ అనే కార్మికునికి పాముకాటు వల్ల ప్రాణాపాయ స్తితి నుంచి బయటపడ్డారన్నారు. దీంతో కౌన్సిల్‌ ఆమోదం పొంది వెంటనే గది నిర్మాణం ప్రారంభించినట్టు తెలిపారు. ...

Read More »

పెంచిన చార్జీలు తగ్గించాలి

  కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఇటీవల పెంచిన విద్యుత్‌, ఆర్టీసి బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డిలో శనివారం కాంగ్రెస్‌ నాయకులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తప్పుడు ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రజల ఆశలను వమ్ము చేసిందన్నారు. గాలిలో మేడలు కడుతూ మాయమాటలు చెపుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు కరువుతో అల్లాడుతుంటే విద్యుత్‌, బస్సు చార్జీలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే పెంచిన చార్జీలను ...

Read More »

ఘనంగా అమ్మభగవాన్‌ కళ్యాణం

  కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మభగవాన్‌ ఆలయ చతుర్థశ వార్షికోత్సవంలో భాగంగా శనివారం అమ్మ భగవాన్‌ల కళ్యాణాన్ని కామారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆలయంలో సుప్రభాత సేవ, శతభిష నక్షత్ర ఐశ్వర్య ప్రాప్తిపూజ, అమ్మభగవాన్‌ల దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం వేళ పురవీధుల్లో అమ్మ భగవాన్‌ల చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌, దత్తాత్రి, బాలు, విజయ్‌, కృష్ణారెడ్డి, స్వప్న, సౌజన్య, స్వరూప, గీత తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలోఉప విద్యాధికారి కార్యాలయం ఎదుట ధర్నా

  కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉప విద్యాధికారి కార్యాలయం ఎదుట ధర్నా శనివారం ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో తాగడానికి మంచినీరు, మరుగుదొడ్లు, ఆటస్థలాలు, క్రీడా సామగ్రి సైతం లేవన్నారు. పాఠశాలలు ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా పూర్తిస్తాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు పంపినీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనాలను కూల్చివేసి కొత్తవి నిర్మించాలని డిమాండ్‌ ...

Read More »

మార్కెట్‌ కమిటీ అభివృద్ది కోసం కృషి

  కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మార్కెట్‌ కమిటీ అభివృద్ది కోసం కృషి చేస్తానని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రాజమణి అన్నారు. శనివారం కామారెడ్డి మార్కెట్‌ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం ఛైర్మన్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌, మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీష్‌రావులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందేందుకు తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి ...

Read More »

మైనర్‌ బాలికను మోసగించిన యువకుని అరెస్టు

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెళ్లి పేరుతో ఓ మైనర్‌ బాలికను మోసగించిన నిందితుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు కామారెడ్డి రూరల్‌ సిఐ కోటేశ్వర్‌రావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులముందు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి మండలం టేక్రియాల్‌కు చెందిన దినేష్‌ (23), ఓ మైనర్‌ బాలికను పెళ్లిచేసుకుంటానని మోసం చేసి మానసికంగా, శారీరకంగా వేధించాడన్నారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరిపామన్నారు. నిందితుడు దినేశ్‌ శనివారం కామారెడ్డి రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో పట్టుకొని అరెస్టుచేసి రిమాండ్‌కు ...

Read More »

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

  మోర్తాడ్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెంచిన విద్యుత్‌, బస్సు చార్జీలకు నిరసనగా మండల కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో శనివారం కాంగ్రెస్‌ నాయకులు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం తహసీల్దార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శివకుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాదన ఉద్యమంలో, ఎన్నికల్లో మన తెలంగాణ, మన ప్రజలు, మన నీరు, మన విద్యుత్తు, మన వనరులు, ...

Read More »

ఉచిత సేవలందించడం అభినందనీయం

  మోర్తాడ్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ సర్పంచ్‌ దడివె నవీన్‌ గ్రామస్తుల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ గ్రామస్తులకు సేవలందించడం అభినందనీయం సుశ్రుత క్యాన్సర్‌ ఆసుపత్రి వైద్యులు అన్నారు. శనివారం మోర్తాడ్‌ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్థానిక సర్పంచ్‌ దడివె నవీన్‌ స్వచ్చందంగా ఉచిత క్యాన్సర్‌ నిర్దారణ శిబిరాన్ని ఏర్పాటు చేయించారు. శిబిరంలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. 90 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు ...

Read More »

26న మోర్తాడ్‌కు ఎమ్మెల్యే రాక

  మోర్తాడ్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఆదివారం రంజాన్‌ పండగను పురస్కరించుకొని ముస్లింలకు దుస్తులు పంపినీ చేసేందుకు మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విచ్చేస్తున్నారని మండల తెరాస అధ్యక్షుడు కల్లడ చిన్నయ్య శనివారం తెలిపారు. మండలంలోని ముస్లింలు, మండల ప్రజాప్రతినిదులు, నాయకులు అధిక సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని ఆయన కోరారు.

Read More »

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

  రెంజల్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు మొక్కలు నాటి పర్యావరణానికి పాటుపడాలని రెంజల్‌ ఎంపిడివో చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో హరితహారంలో భాగంగా మొక్కలునాటి గ్రామాల్లో మహిళా సంఘాల ప్రతినిదులతో గ్రామంలోని వీధుల గుండా ర్యాలీలు నిర్వహించారు. పచ్చని మెట్లు, ప్రగతికి మెట్టు అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరు తమ ఇల్లముందు చెట్లు నాటుకుంటే భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడతాయని, ప్రకృతి ...

Read More »

పశువులకు వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి

  రెంజల్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశువులకు జూన్‌ మాసం నుంచి ఆగష్టు వరకు గాలికుంటు వ్యాది సోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని, నివారణ టీకాలు అందజేయాలని జెడిఎ ఎల్లన్న అన్నారు. రెంజల్‌ మండలంలోని కల్యాపూర్‌ గ్రామంలో గాలికుంటు వ్యాధి టీకాలను డాక్టర్‌ సందీప్‌రెడ్డి ఆద్వర్యంలో పశువులకు అందజేశారు. అనంతరం జెడిఎ మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం పశువులకు అందించే దాణాపై 50 శాతం సబ్సిడీ అందిస్తుందని, అలాగే సునందిని యోజన పథకం ఇలా మరెన్నో కార్యక్రమాలు చేపడుతుందని ...

Read More »

రివ్యూ: జెంటిల్‌మన్‌

చిత్రం: జెంటిల్‌మన్‌ తారాగణం: నాని.. సురభి.. నివేదా థామస్‌.. అవసరాల శ్రీనివాస్‌.. వెన్నెల కిషోర్‌.. సత్యం రాజేష్‌.. ఆనంద్‌.. తనికెళ్ల భరణి.. రోహిణి.. ప్రగతి.. రమాప్రభ తదితరులు ఛాయాగ్రహణం: పి.జి.విందా కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌ సంగీతం: మణిశర్మ కళ: ఎస్‌.రవీందర్‌ కథ: డేవిడ్‌ నాధన్‌ నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్‌ మాటలు.. కథనం.. దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి. నిర్మాణ సంస్థ: శ్రీదేవి మూవీస్‌ విడుదల తేదీ: 17-06-2016 ఎంచుకొనే ప్రతి కథ విభిన్నంగా ఉండాలని తపించే కథానాయకుడు నాని. ‘భలే భలే మగాడివోయ్‌’.. ‘కృష్ణగాడి వీర ...

Read More »

వామ్మో ఎన్‌ఆర్‌ఐ సంబంధం..

కట్నం వేధింపులపై బెంబేలు  మూడు రోజుల్లో నాలుగు కేసులు.. సిద్దిపేట : ఎన్‌ఆర్‌ఐ సంబంధాలంటేనే అమ్మాయిల తల్లిదండ్రులు భయపడుతున్నారు. అక్కడ వారికి ఆదాయం ఎంతున్నా అబ్బాయిల వైఖరి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. సిద్దిపేటలో మూడురోజుల్లో నలుగురు ఎన్నారైలు అదనపు కట్నంకోసం వేధిస్తున్నారన్న కేసులు నమోదవ్వడం సంచలనం కలిగిస్తోంది. ఎన్‌ఆర్‌ఐ సంబంధాలైతే భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తినపుడు కౌన్సెలింగ్‌ తదితర సర్దుబాటు చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోవడం సమస్యగా మారుతుంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తినా, అదనపు కట్నంకోసం అత్తింటివారు వేధించినా ...

Read More »

మోదీ గారి ‘సంజయ్‌ గాంధీ’

నాతో సహా పలువురు వ్యాఖ్యాతలు నరేంద్రమోదీని ఇందిరాగాంధీతో పోల్చారు. మోదీ నిశ్చయంగా ఇందిర అనంతరం అత్యంత అధికారపూర్వక ప్రధానమంత్రి. పూర్తికాలం పదవిలో ఉన్న మరో ఇద్దరు ప్రధానమంత్రులు వాజపేయి, నరసింహారావు కంటే కూడా మోదీ అత్యంత సాధికార ప్రధాని అనడంలో సందేహం లేదు.                         ఇందిర మాదిరిగానే మోదీ కూడా ఒంటరి వ్యక్తి. బహుశా ఆయన ఏకైక ఆంతరంగికుడు, ఒక విధంగా తనతో సమానుడుగా పరిగణించే ఏకైక వ్యక్తి అమిత్ షా. మోదీ గుజరాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షాకు మొత్తం పన్నెండు మంత్రిత్వ శాఖల బాధ్యతలు ...

Read More »

ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోగలం

ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటన   బీజింగ్‌/న్యూఢిల్లీ : బ్రెగ్జిట్‌ వల్ల ఏర్పడే స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రభావాలను ఎదుర్కొనేందుకు భారత సిద్ధంగా ఉన్నదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. విదేశీ మారకం నిల్వలు పుష్కలంగా ఉండడంతో పాటు ఆర్థిక వ్యవస్థ మూలా లు కూడా పటిష్ఠంగా ఉండడం వల్ల ఇలాంటి షాక్‌లను తట్టుకోగల శక్తి దేశానికి లభించిందన్నారు. ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌ (ఎఐఐబి) సమావేశాల్లో పాల్గొనేందుకు చైనాలో ఉన్న జైట్లీ బ్రెగ్జిట్‌ పరిణామాలపై ఒక ప్రకటన చేస్తూ ఈ తీర్పు ప్రభావాన్ని ముందుగానే ...

Read More »

మంత్రి లుంగీ విప్పేసి సినిమా చూపించాడు

మీరట్: మంత్రి పదవిలో ఉన్నతహోదాలో ఉన్నాననే విషయం మరిచిపోయాడు. ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే చిల్లరవేషాలు వేశాడు. మంత్రిగారు ఏకంగా లుంగీ విప్పేసి అసభ్యకరరీతిలో స‍్టెప్పులేశాడు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నేత, ఆ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి మహమ్మద్ ఫారుఖ్ హసన్ చేసిన నిర్వాకమిది. ఈ తతంగాన్ని ఎవరు వీడియో తీశారో తెలియదు కాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంత్రి ఒళ్లు మరచిపోయి డాన్స్ చేసినప్పటి ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ అయ్యింది. ఇంట్లోనో లేక గెస్ట్ హౌజ్లోనో తెలియదు ...

Read More »

గేటు లోపలకు వచ్చిన నాగుపాము.. తోక పట్టుకుని గిరగిరా తిప్పేసిన కుక్క.. ఆ తర్వాత ఏమైంది?

శునకాలకు విశ్వాసం ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. యజమానుల పట్ల వాటికున్న విశ్వాసానికి సాటిలేదు. దొంగలు, ఆచూకీ తెలియని వ్యక్తుల్ని ఇంటిపక్కకు కూడా శునకాలు చేర్చవు. కానీ దొంగలకు బదులు ఓ పాము ఇంట్లోకి చొరబడాలని చూస్తే శునకాలు అడ్డుకున్న ఘటన తమిళనాడు, ధర్మపురిలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే… ధర్మపురి జిల్లాలోని వెల్లలాపట్టి అనే గ్రామంలోని ఓ ఇంటికి సమీపంలో నాగుపాము వచ్చింది. గేటులో ప్రవేశించింది. అంతే కుక్కలు ఆ పామును అడ్డుకున్నాయి. పామును చూసి అరవడం ప్రారంభించిన కుక్కలతో పాము కూడా ...

Read More »

మన కులం కానోడ్ని ప్రేమిస్తావా.. నిన్ను బతకనీయమే… కన్నబిడ్డ మెడకు చున్నీ బిగించి చంపేశారు..!

దేశంలో పరువు హత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఓ పరువు హత్య జరిగింది. తమ కుమార్తె మరో కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందన్న అక్కసుతో కన్నతల్లిదండ్రులో తమ బిడ్డను హత్య చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన చౌహాన్ లక్ష్మణ్ కుమార్తె అఖిల (17) అనే యువతి ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు నేరడిగొండ తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మహేందర్‌తో పరిచయం ఉంది. ...

Read More »

ఆ సైన్యంలో రేప్‌లు ఆచారమట!

సిడ్నీ: ఆస్ట్రేలియా సైన్యంలో ఓ దురాచారం కాదు, ఘోరాచారం అమల్లో ఉంది. ఆ సైన్యంలో కొత్త చేరిన వారిని ఆడ, మగ తేడా లేకుండా సీనియర్లు రేప్ చేస్తారు. పలు విధాలుగా లైంగికంగా వేధిస్తారు. పైగా ఇది తరతరాలుగా వస్తున్న ఆచారమని, అది తమ హక్కని, తమ గ్రూపులో చేరాలంటే ఇలాంటివన్ని తప్పవని వాదిస్తారు. 1960వ దశకం నుంచి 2000 సంవత్సరం వరకు వందలాది మంది న్యూ రిక్రూట్స్ ఇలాంటి బాధలు పడుతూ వచ్చారు. సైన్యంలో కొనసాగుతూ వచ్చిన ఈ జాడ్యాన్ని రూపుమాపేందుకు ఎట్టకేలకు ...

Read More »

నీలి మేఘమా..జాలి చూపుమా..!

ఆర్మూర్ ;వరుస కరువులతో సతమతమవుతున్న రైతన్నకు వాన రంది పట్టుకుంది. మేఘాలు కమ్ముకుంటూ ఆ వెంటనే తేలిపోతుండడంతో కలత చెందుతున్నారు అన్నదాతలు. ఖరీఫ్ కోసం దుక్కులు దున్ని, విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకొని ప్రతి నిత్యం ఆకాశానికేసి ఎదురు చూస్తున్నారు. గ్రామాల్లో వర్షం కోసం పూజలు చేస్తున్నారు. ఆలయాలను జలదిగ్బంధనం చేస్తూ వర్షం కురవాలని ప్రార్థిస్తున్నారు. కప్పకావడి ఆటలతో వాన కోసం పరితపిస్తున్నారు. ఈ ఏడు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఓ వైపు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నా కర్షకుల్లో కలవరం వీడడం లేదు. ...

Read More »