Breaking News

Daily Archives: June 26, 2016

గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి

  మోర్తాడ్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో మహేందర్‌ అనే కానిస్టేబుల్‌ ఆదివారం మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మహేందర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మహేందర్‌ అంత్యక్రియలు ఆర్మూర్‌ మండలం ఇస్సాపల్లిలో జరగనున్నట్టు పేర్కొన్నారు.

Read More »

విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి

  కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసినట్టు సంఘం జిల్లా అధ్యక్షుడు రామోహ్మనచారి తెలిపారు. ఆదివారం కామారెడ్డిలో సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు విశ్వబ్రాహ్మణులంతా కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరముందన్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో సమున్నతి సాధించేందుకు పోరాడాలన్నారు. విశ్వబ్రాహ్మణులకు చట్టసభల్లో స్తానిక సంస్థల్లో 9 శాతం ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. విశ్వబ్రాహ్మణుల కోసం ...

Read More »

బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేసిన మహనీయుడు ఛత్రపతి సాహుమహరాజ్‌

  మోర్తాడ్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోనే దళిత, బడుగు, బలహీన వర్గాలకు విద్యను అందించి, హక్కులు, రిజర్వేషన్లు అమలు చేసిన మహనీయుడు ఛత్రపతి సాహుమహరాజ్‌ అని మోర్తాడ్‌ మండల రైతు సంఘం నాయకులు కొనియాడారు. ఆదివారం మోర్తాడ్‌లో ఛత్రపతి సాహుమహరాజ్‌ 143వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. దేశంలోనే బడుగు, బలహీన వర్గాలవారికి విద్యను అందించి చైతన్యం చేసి, పీడిత ప్రజలను విముక్తి పొందించిన ఘనత ఆయనదేనన్నారు. కార్యక్రమంలో దళిత ...

Read More »

పేదల సంక్షేమ, అభివృద్దే ధ్యేయంగా తెరాస కృషి

  మోర్తాడ్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం నిరుపేదల సంక్షేమ అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తుందని మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మోర్తాడ్‌లోని స్త్రీశక్తి భవనంలో ముస్లింలకు ప్రభుత్వం అందజేసిన దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పంపిణీ చేశారు. మోర్తాడ్‌ ఎంపిపి కల్లడి చిన్నయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, ఓసి అనే భేదాలులేకుండా అన్ని వర్గాల్లోని నిరుపేద ...

Read More »

వర్షపు నీటితో నిండిన గుంతలు

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌పల్లి గ్రామానికి వెళ్లే బిటి రోడ్డు గుంతలు పడడంతో శనివారం రాత్రి కురిసిన వర్షానికి గుంతల్లో నీరు వచ్చి చేరింది. దీంతో గ్రామానికి వెళ్లే వాహనదారులు గుంతల పక్కనుంచి జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళాల్సి వస్తుంది. కొత్త వ్యక్తులు గుంతలు చూసుకోకుండా గాయాలపాలవుతున్నారు. దీంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారంరోజులుగా కురుస్తున్న జల్లులకు గుంతలు నీటిమయం అవుతున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి ప్రజలు ...

Read More »

ఎంఆర్‌ఎఫ్‌ టైర్స్‌ షోరూం ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సిసి రోడ్డు జాతీయ రహదారిపై ఆదివారం ఎంఆర్‌ఎఫ్‌ టైర్స్‌ బ్రాంచ్‌ బొహరా వీల్స్‌ను హైదరాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ వెంకటరాజారాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎంఆర్‌ఎఫ్‌ అతిపెద్ద టైర్ల తయారీదారులన్నారు. కామారెడ్డిలో ఉన్న ఎంఆర్‌ఎఫ్‌ బ్రాంచ్‌ను ఆధునీకరించి పున: ప్రారంభించినట్టు తెలిపారు. షోరూంలో వీల్‌ అలైన్‌మెంట్‌, వీల్‌ బ్యాలెన్సింగ్‌, ఆటోమెటిక్‌ టైర్‌ ఫిటింగ్‌, టైర్ల రిపేరు, నైట్రోజన్‌ ఫిల్లింగ్‌ సదుపాయాలు అందిస్తున్నట్టు తెలిపారు. తర్పీదు పొందిన ...

Read More »

మాదిగల మహాపాదయాత్రను విజయవంతం చేయాలి

  కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాదిగల మహాపాదయాత్రను విజయవంతం చేయాలని టిఎంఆర్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షురాలు సత్తవ్వ, పట్టణ అద్యక్షురాలు భారతమ్మ కోరారు. ఆదివారం మహాపాదయాత్రకు సంబంధించిన గోడప్రతులను కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి, తెరాస పార్టీలు మాదిగలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ గజ్వేల్‌ నుంచి హైదరాబాద్‌ బిజేపి రాష్ట్ర కార్యాలయం వరకు 119 కి.మీ. ల మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్‌ విధానం వల్ల 58 కులాలకు ...

Read More »

హరితహారాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

  మోర్తాడ్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న హరితహారం పథకాన్ని మండల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, ఎంపిపిలు, మహిళా వివోలు, మండల అధికారులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ప్రతి ఒక్కరు లక్ష్యం మేరకు అమలుచేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మోర్తాడ్‌ ఎంపిపి కార్యాలయం ముందు హరితహారం పథకంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కలునాటి నీరు పోసి పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి, వైస్‌ ఎంపిపిలు, ఎపిఎం, ఇతర అదికారులు తదితరులు ...

Read More »

మల్లూరులో ఆధార్‌ నమోదు కేంద్రం

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మల్లూరు గ్రామంలో ఆధార్‌ నమోదు కేంద్రం ప్రారంభమైంది. గ్రామంలో ఇప్పటివరకు ఆధార్‌ నమోదు చేసుకోని వారు వచ్చి నమోదు చేయించుకున్నారు. ప్రజల సౌకర్యార్థం ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఆధార్‌ నమోదు చేస్తున్నట్టు సూపర్‌వైజర్‌ విజయలక్ష్మి తెలిపారు. గ్రామంలో 30 మందికి ఆధార్‌ నమోదుచేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడి కార్యకర్తలు సాయవ్వ, లింగమణి, సావిత్రి, సుజాత, వెన్నెల తదితరులున్నారు.

Read More »

బొగ్గుగుడిసె కూడలి వద్ద వాహనాల తనికీ

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బొగ్గుగుడిసె కూడలి వద్ద నిజాంసాగర్‌ ఎస్‌ఐ అనిల్‌రెడ్డి ఆదివారం వాహనాలు తనిఖీ చేశారు. వాహన దృవపత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్సులు, ఇన్సురెన్సులు లేని వాహన చోదకులకు రూ. 100 చొప్పున జరిమానా విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహన చోదకులు దృవపత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.

Read More »

24మంది భార్యలు.. 200మంది పిల్లలు!

బీజింగ్ః బతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉండి, జీవితకాలాన్ని వీలైనంత పెంచుకునేందుకు ప్రతివారూ ప్రయత్నిస్తూనే ఉంటారు. వారు చేసిన ప్రయత్నాలు , వారి సాధన ఒక్కోసారి తగిన ఫలితాలను కూడ ఇస్తుంటుంది. కానీ అరవై ఏళ్ళ ఆయుర్దాయం ఉండటమే కష్టంగా మారిన తరుణంలో ఓ వ్యక్తి వందేళ్ళు బతికితే ఎంతో గొప్పగా ఫీలవుతాం. నిజంగా గ్రేట్ అని సంబర పడిపోతాం. కానీ చైనాకు చెందిన ఓ వ్యక్తి 256 సంవత్సరాలు బతికాడంటే నమ్ముతారా? ఎప్పుడూ ఎవ్వరూ జీవించనంతకాలం ఆయన బతికినట్లు ఇటీవల ఓ పత్రికా కథనం ద్వారా ...

Read More »

మరోసారి దేవుడి పాత్రలో..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే గోపాల గోపాల సినిమాలో మోడ్రన్ కృష్ణుడిగా ఆకట్టుకున్న పవన్. ఈ సారి త్రివిక్రమ్ సినిమాలో దేవుడి పాత్రలో నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అ..ఆ.. సినిమాతో సూపర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్, ప్రస్తుతం పవన్తో చేయబోయే సినిమా కోసం స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టాడు. ఈ సినిమాకు ‘దేవుడే దిగివచ్చినా’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. కథా కథనాలు ఎంటో చెప్పకపోయినా టైటిల్ను బట్టి ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపిస్తాడని భావిస్తున్నారు. ...

Read More »

విందులు సరే, రిజర్వేషన్లేవీ?

రిజర్వేషన్ అనేది ఒక రాజ్యాంగ బద్దమైన వెసులుబాటు. ఇది సమాజంలోని అణగారిన వర్గాల వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వాలు తీసుకునే ఒక ముఖ్యమైన ప్రక్రియ. రిజర్వేషన్ అంటే సమాజంలో అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి రంగాల్లో, మిగతా వర్గాల సరసన సమాన అవకాశాలను కల్పిస్తూ సమ్మిళిత అభివృద్ధిలో భాగం కల్పించటం ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించటం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి చెబుతూ, దీన్ని 2014 సార్వత్రక ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన ...

Read More »

అమెరికాలో ఉండబోనంటున్న టెక్సాస్!

టెక్సాస్: ‘బ్రెగ్జిట్‌’ ప్రకంపనలు ‘అగ్రరాజ్యం’ అమెరికానూ తాకాయి. ‘అమెరికా నుంచి మాకు స్వాతంత్య్రం కావాలి’ అంటూ టెక్సాస్‌లో ఇప్పటికే ఉన్న డిమాండ్‌ ఉద్యమ రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. డేనియల్‌ మిల్లర్‌ అధ్యక్షతన టెక్సాస్‌ నేషనలిస్ట్‌ మూమెంట్‌(టీఎన్‌ఎం) నడుస్తోంది. ‘టెక్సాస్‌కు స్వాతంత్య్రం’ అంశం ఈ ఏడాది మెల్లగా మొదలై.. ‘బ్రెగ్జిట్‌’ తర్వాత ఊపందుకుంది. టీఎన్‌ఎం ఫేస్‌బుక్‌ పేజీకి 2లక్షల మంది ఫాలోయర్లున్నారు. టెక్సాస్‌ ‘పతాకం’… దానిపై ‘టెక్సిట్‌’(బ్రిటన్‌ ఎగ్జిట్‌లాగా… టెక్సాస్‌ ఎగ్జిట్‌) అనే అక్షరాలతో ఈ ఫేస్‌బుక్‌ పేజీని రూపొందించారు. ఎస్‌ క్యాలిఫోర్నియా, న్యూహాంప్‌షైర్‌ ...

Read More »

భారత్ పై భారమెంత!

కరెన్సీ, కమోడిటీలు, కార్పొరేట్‌, క్యాపిటల్‌ మార్కెట్లు.. బ్రెగ్జిట్‌ ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుంది ? ఏయే రంగాలు బ్రెగ్జిట్‌ కారణంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది? బ్రెగ్జిట్‌.. యూరోపియన్‌ యూనియన్‌ అంతానికి ఆరంభమైతే భవిష్యత్ పర్యవసానాలు ఎలా ఉంటాయి ? ఇవన్నీ ఇన్వెస్టర్లను వేధిస్తున్న ప్రశ్నలు. వ్యాపారం, ఇన్వెస్ట్‌మెంట్లలో పెరిగిన రిస్క్‌, భయపెడుతున్న అంతర్జాతీయ ఆర్థిక రంగ భవిష్యత్తు, అంతర్జాతీయ కరెన్సీల తిరోగమనం సృష్టిస్తున్న కల్లోలం, కమోడిటీల ధరల్లో పతనం.. ఈ నేపథ్యం నుంచి భారత ఆర్థిక రంగంపైనా, కరెన్సీ, కమోడిటీ, ఈక్విటీ మార్కెట్లు, దలాల్‌ ...

Read More »

ఇలా చేస్తే శరీరం నుంచి చెడు వాసన వస్తుందట!

ఈ రోజుల్లో చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ టైమ్‌ వరకు నిద్రపోయి, లంచ్‌టైమ్‌లో పని చేస్తూ, డిన్నర్‌ సమయానికి అలసిపోయి భోజనాలను మిస్‌ చేస్తూ ఉంటారు. మరోవైపు బరువు తగ్గే ప్రక్రియలో భాగంగా క్రాష్‌ డైట్లు పాటిస్తూ ఉంటారు. ఆహారం తగినంతగా తీసుకోకపోతే శరీరం నుంచి ఒకరకమైన దుర్వాసన వస్తుందట. తగినంతగా ఆహారం తీసుకోకపోతే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు తగ్గిపోతాయి. ఫలితంగా శక్తి సన్నగిల్లుతుంది. అప్పుడు కాలేయం గ్లూకోజ్‌కు ప్రత్యామ్నాయంగా రక్తంలోకి కీటోన్స్‌ను విడుదల చేస్తుందట. ఈ కీటోన్స్‌ ఎసిటోన్‌ (నెయిల్‌ పాలిష్‌ స్మెల్‌) వాసనను ...

Read More »

పెళ్లాం ఊరెళ్తే ప్రియురాలితో ….

బొమ్మనహళ్లి :  భార్య పుట్టింటికి వెళ్లగా ప్రియురాలితో తన ఇంట్లోనే  కాపురం పెట్టాడు ఓ ప్రభుద్ధుడు. ఊరి నుంచి వచ్చిన భార్య   ఆ ఇద్దరిని గదిలో బంధించి పోలీసులకు పట్టించింది. ఈ ఘటణ శుక్రవారం మడివాళ పోలిసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంచెందిన రెడ్డప్ప, నాగమణి దంపతులు జీవనోపాధి కోసం బెంగళూరుకు చేరుకొని హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లోని 7వ సెక్టర్‌లో నివాసం ఉంటున్నారు. నాగమణి కూలి పనులకు వెళుతుండగా రెడ్డప్ప ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా రెడ్డప్ప మరో ...

Read More »

బాలికను మోసగించిన యువకుడి అరెస్టు

కామారెడ్డిరూరల్ : కామారెడ్డి మండలంలోని టేక్రియాల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన బా లికను ప్రేమ పేరుతో మోసగించాడని బాలిక తల్లిదండ్రుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి రూరల్ సీఐ కోటేశ్వర్‌రావు తెలిపారు. శనివారం స్థానిక సీఐ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టేక్రియాల్ గ్రామానికి చెందిన బాలిక అదే గ్రామానికి చెందిన ఒడ్డె దినేశ్ అనే యువకుడు రెండేళ్లగా ప్రేమిస్తున్నానని నమ్మించి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక ...

Read More »

చెత్తకుప్పలో మృత శిశువు

మాచారెడ్డి : మానవత్వం మంటగలుస్తున్నది. పెళ్లి కాకముందే తప్పటడుగు వేసి, తీరా గర్భం దాల్చిన వారు శిశువులను పురిట్లోనే చంపేస్తున్న సంఘటన ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటననే మాచారెడ్డి మండలం మంథనిదేవునిపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామంలోని 8వ వార్డు లో నివాసపు గుడిసె వెనుకాల మృతశిశువును చెత్తకుప్పలో పడివేసి ఉండడంతో గ్రామస్తులు గమనించి స్థానిక సర్పంచి దుర్గయ్య, ఉపసర్పంచి రామలింగంకు సమాచారం అందించారు. వారు పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతశిశువును పోస్ట్‌మార్టం నిమిత్తం ...

Read More »

దేశమంతా వ్యాపించిన నైరుతి

-వాయవ్యం మినహా అంతటా వర్షాలు -అయినా వర్షపాతంలో 18 శాతం లోటు -మధ్య భారతంలో సాధారణం కంటే 37 శాతం తక్కువ -తొమ్మిది రాష్ర్టాలకు త్వరలో వర్షసూచన న్యూఢిల్లీ:ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. వాయవ్య ప్రాంతాన్ని తొలకరి పలుకరించలేదు. దేశమంతా రుతుపవనాలు విస్తరించినా సగటున 18 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల్లో వాయవ్య ప్రాంతానికి వర్షాలు విస్తరిస్తాయని కేంద్ర వాతావరణశాఖ విభాగం (ఐఎండీ) పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 30 శాతం వర్షాలు తక్కువగా కురిశాయి. దేశవ్యాప్తంగా ...

Read More »