Breaking News

Daily Archives: June 27, 2016

మోకాళ్ళపై కూర్చొని విద్యార్థి నాయకుల నిరసన

  కామారెడ్డి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు పాఠశాలల్లో విద్యావ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్‌చేస్తూ సోమవారం కామారెడ్డిలో డిప్యూటి డిఇవో కార్యాలయం ముందు బిసి విద్యార్థి సంఘం నాయకులు మోకాళ్ళపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు తోకపేర్లు పెట్టుకొని విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి పాఠశాలల్లో చేర్చుకుంటున్నారన్నారు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపించారు. ప్రయివేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు టిసిలుఇవ్వకుండా పాఠశాలల్లో ...

Read More »

వికలాంగుల డిమాండ్లు పరిష్కరించాలి

  కామారెడ్డి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వికలాంగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌, కామారెడ్డి ఆర్డీవోలకు వినతి పత్రం సమర్పించినట్టు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సతీష్‌, జాతీయ మహిళా అధ్యక్షురాలు సుజాత సూర్యవంశిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ పథకంలో వికలంగులకు వర్తింపజేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ చేసినట్టు వికలాంగులకు కూడా మూడెకరాలు పంపిణీ చేయాలని కోరారు. అర్హులైన వికలాంగులకు వెంటనే పింఛన్లు ...

Read More »

హైకోర్టు సిజె దిష్టిబొమ్మ దగ్దం

  కామారెడ్డి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయమూర్తుల యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డిలో సోమవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హైకోర్టు సిజె దిష్టిబొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైకోర్టులో ఆంధ్రా జడ్జిల ఆప్షన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణలో న్యాయమూర్తులు, న్యాయవాదులు చేస్తున్న నిరసనలకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను బాధ్యులను చేస్తూ సస్పెండ్‌ చేయడం సమంజసం కాదన్నారు. 120 మంది జడ్జిలు మూకుమ్మడి రాజీనామాలు చేసి ...

Read More »

తెలంగాణ పిల్లలందరు ప్రభుత్వ పిల్లలే

  – మంత్రి పోచారం నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల కోసం నూతనంగా నెలకొల్పుతున్న బాలికల మైనార్టీ గురుకుల పాఠశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌ మండలం మోపాల్‌ గ్రామంలో సోమవారం ప్రారంభించారు. అనంతరంజరిగిన సభలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్‌ జిల్లాలో 3 బాలికల, 3 బాలుర గురుకుల పాఠశాలలు నెలకొల్పిందన్నారు. విద్యాపరంగా వెనకబడిన మైనార్టీల అభ్యున్నతి కొరకు కెసిఆర్‌ ప్రభుత్వం దృడనిశ్చయంతో కృసి చేస్తుందన్నారు. ...

Read More »

వద్దన్నదే ముద్దు…..

  బాన్సువాడ, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పత్తిసాగుకు ప్రత్యామ్నాయంగా సోయా సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందిస్తున్నా రైతులు పత్తివైపే మొగ్గుచూపుతున్నారు. బోధన్‌ డివిజన్‌లో వర్షాధారంగా పంటలు సాగుచేసే మెట్ట ప్రాంత రైతులు ఖరీఫ్‌లో ప్రధానంగా పత్తి సాగుచేస్తున్నారు. డివిజన్‌లోని జుక్కల్‌, బిచ్కుంద, మద్నూర్‌, రెంజల్‌ ప్రాంత రైతులు పత్తి సాగుచేస్తున్నారు. కొన్నేళ్లుగా పత్తిపంట ఆశించిన దిగుబడి రాక రైతులకు నష్టాలు మిగుల్చుతుంది. సాగుఖర్చులు పెరిగి రైతులకు నష్టం వస్తోంది. దీంతో ఈ యేడు ప్రభుత్వం ...

Read More »

రైతులకు రుణాల విషయంలో అన్ని బ్యాంకులు ఒకే విధానాన్ని అవలంబించాలి

  – మంత్రి పోచారం నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం అన్ని బ్యాంకులు రైతుల విషయంలో ఒకేవిధమైన పద్దతిని అవలంబించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బ్యాంకు అధికారులను కోరారు. సోమవారం స్తానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు అధికారులకు రాష్ట్ర స్తాయిలో కుదుర్చుకున్న ...

Read More »

ఇండియన్ బిలీనియర్స్ కంటే ఎక్కువ ధనం ఉన్న ఆలయాలు

హిందూ మతంకు ఆరాధ్య ప్రదేశాలు దేవాలయాలు. అందుకే మన దేశంలో అనేక ఆధ్యాత్మిక దేవాలయాలను వెలసాయి. ప్రతి సందు మరియు మూలల్లో, లేదా చెట్టు క్రింద, ఊరిభయట..ఊరిలోపలో అనేక ప్రదేశాల్లో చిన్న లేదా పెద్ద ఆలయాలను చూస్తూనే ఉంటారు. కానీ, భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధి చెందిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవి మత సంబంధిత దేవాలయాలు మాత్రమే కాదు అతి బాగా పాలపుర్ చెందిన రిచెస్ట్ దేవాలయాలు. మన భారత దేశంలో ఉండే ఈ ప్రసిద్ధి చెందిన దేవాలయానలు పెద్ద పెద్ద ధనికులు, సెలబ్రెటీలను, ...

Read More »

ఇండియన్ డాక్టర్స్ ఫోరం ఆధ్వర్యంలో కువైట్‌లో ‘గబ్కా’

కువైట్: ఇండియన్ డాక్టర్స్ ఫోరం(ఐడీఎఫ్) ఆధ్వర్యంలో కువైట్‌లోని రీజెన్సీ హోటల్‌లో ‘గబ్కా 2016’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కువైట్‌లో భారత రాయబారి సునీల్ జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్‌తోపాటు ఇతర దేశాల ప్రముఖులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐడీఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ అభయ్ పట్వారీ మాట్లాడుతూ గబ్కా అనేది పవిత్ర రంజాన్ నెలలో తరావీ ప్రార్థనల తర్వాత జరుపుకునే స్థానిక సంప్రదాయ కార్యక్రమని తెలిపారు. కుటుంబాలు, స్నేహితుల మధ్య బంధాన్ని మరింత పెంచేందుకు గబ్కా ...

Read More »

బెడ్‌రూంలో పడుకున్న యువతి తెల్లారేసరికి…

నాలుగు అడుగుల పాము నడిరోడ్డుపై కనిపిస్తేనే భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది 5 మీటర్ల పైతాన్ బెడ్‌రూమ్‌లో కనిపిస్తే… ఉదయం నిద్రలేవగానే బెడ్ కాఫీలాగా హాయ్ చెబితే… అమ్మో ఇంకేమైనా ఉందా ? అని భయపడుతున్నారా ? క్వీన్స్‌లాండ్‌లో ఇదే జరిగింది. ఇంట్లో బెడ్‌రూమ్‌లో నిద్రిస్తున్న యువతికి ఉదయాన్నే నిద్రలేచి చూడగానే గోడపై 16 అడుగుల పైతాన్ కనిపించింది. ఆ యువతి భయంతో బయటకు పరుగులు తీసింది. కాసేపటికి తేరుకుని ఆ పామును వీడియో తీసి నెట్‌లో పెట్టింది. యూట్యూబ్‌లో ఇప్పుడీ వీడియో హల్‌చల్ ...

Read More »

పాటేడ్తాంది

కనిపెంచి నడకలు నేర్పి హొయలు కూర్చి బతుకుబాట మీద తన పాదాలకు పరుగు నేర్పినోడు లేడని పాటేడ్తాంది కూలి చాలని బతుకులకు బతుకుపాఠాన్ని నేర్పి పాలేరుల బతుకుల పల్లెరుల్ని ఎరుకపర్చి సబ్బండ వర్ణాల సోపతిని నేర్పి అడవి నిశ్శబ్దంలో… శబ్ద విస్ఫోటనంగా తనను మలచినవాడు లేడని పాటేడ్తాంది కుమ్మరి సారెకు పదాలను అల్లి గిరగిరా తిప్పినోడు సాలెల మగ్గానికి కండె ఊసల తాలమైనోడు మాదిగ డప్పుకు ఢమరుకం కంటే ధీటైన నాదాన్ని ఇచ్చినోడు సాకిరేవు బండకు సల్లకుండకు సలాములతో గౌరవ పరిచినోడు ఎలమంద గొంతులోంచి ...

Read More »

ఒక్కరితో వందకుపైగా పోర్న్ చిత్రాలు తీస్తూ

టోక్యో: ముందుగా నిర్ణయించిన వాటికంటే ఎక్కువ పోర్న్ చిత్రాల్లో నటింపజేస్తూ మహిళలను తీవ్రంగా వేధిస్తున్నారని వచ్చిన ఆరోపణలకు జపాన్ పోర్న్ ఇండస్ట్రీ స్పందించింది. మున్ముందు అలాంటి పరిస్థితి లేకుండా చూస్తామని క్షమాపణలు చెప్పింది. ఈ విషయం ముందుగా తమ దృష్టికి రాకపోవడం దురదృష్టం అని పేర్కొంది. జపాన్ పోర్న్ ఇండస్ట్రీకి ది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రమోషన్ అసోసియేషన్(ఐపీపీఏ) ప్రతినిధిగా వ్యవహరిస్తుంటుంది. ఇటీవల తమను వందకు పైగా పోర్న్ చిత్రాల్లో నటింపజేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని కొందరు పోర్న్‌ స్టార్స్‌ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ...

Read More »

కన్నకూతురు తల్లిని ఏం చేసిందో మీరే చూడండి!

కనిపెంచిందన్న కనికరం లేదు. నవమాసాలు మోసిందన్న విషయా మతికే రాలేదు. ఏదో తప్పు చేసినట్టుగా 85 ఏళ్ల వృద్ధురాలిపై కూతురు చేసిన పైశాచిక దాడి ఇది. కన్న తల్లిదండ్రులను కళ్లలో పెట్టుకుని చూసుకోకపోయినా పర్వాలేదు కానీ ఇలా పంచనే ఉంచుకుంటూ వంచనకు గురిచేయొద్దని చూసిన వారు కోరుతున్నారు. పేగు బంధం అర్థాన్నే మార్చేసిన ఈ కూతురి

Read More »

Woman kisses Karnataka CM Siddaramaiah in public

BENGALURU: Karnataka Chief Minister Siddaramaiah received a peck on the cheek at a public function in Bengaluru on Sunday Girija Srinivas, a taluk panchayat member from Tarikere in Chikmagalur district, planted a kiss on Siddaramaiah’s cheek after she was felicitated at a programme organised by Kuruba community to which the CM belongs to. Later, she told reporters: “He (Siddaramaiah) is ...

Read More »

సాగు పద్ధతులు అద్భుతం

ఆర్మూర్ రూరల్ : అంకాపూర్ రైతులు పంటల సాగులో పా టించే పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని కరీంనగర్ జిల్లా రైతులు కొనియాడారు. మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని ఆదివారం కరీంనగర్ జిల్లా మాడిమాడ్ల రైతుల బృందం సందర్శించింది. సందర్శన రైతులు మొదట గురడిరెడ్డి రైతు సంఘంలో ఆ సంఘం కార్యదర్శి కేకే. భాజన్నతో సమావేశమై పంటల సాగు పద్ధతులను తెలుసుకున్నారు. అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకాపూర్ రైతులు వ్యవసాయాన్ని మొక్కుబడిగా కాకుండాక్రమశిక్షణతో చేస్తున్నారన్నారు. పంట పొలాల్లో, గట్ల ...

Read More »

తేనెటీగల దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలు

నిజాంసాగర్: కామారెడ్డిలోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని, హసన్‌పల్లి గ్రామానికి చెందిన మరొకరిపై ఆదివారం నిజాంసాగర్ మండలం హెడ్‌సులూస్ వద్ద తేనె టీగలు దాడి చేశాయి. బాధితులు ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే… అశోక్‌నగర్ కాలనీకి చెందిన చాకలి లక్ష్మీనారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి మండలంలోని హెడ్‌సులూస్ వద్ద పండగ చేసుకుందామని ఆదివారం మద్యాహ్నం వచ్చారు. పరిసర ప్రాంతాల్లో ఒక చెట్టు కింద వంటలు చేసుకుంటున్న సమయంలో పొగ పైకి లేచింది. అదే చెట్టుపై ...

Read More »

జూలై నుంచి గ్రామస్థాయి సమావేశాలు

ఆర్మూర్ టౌన్ : భారత కమ్యూనిస్టు పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా జూలై నుంచి గ్రామ స్థాయిలో సీపీఐ సమావేశాలు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ అన్నారు. ఆర్మూర్‌లో నిర్వహించిన సీపీఐ రెండు రోజుల జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ముగింపు సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ… నల్లధనం తెచ్చి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు బ్యాంకులో వేస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ మాట మరిచిపోయారని విమర్శించారు. దేశాభివృద్ధిని విస్మరించి విదేశీ ...

Read More »

ఇఫ్తార్ విందు..

నిజామాబాద్ అర్బన్ : హిందూ ముస్లిములు గంగా జమున నదుల సంగమంలా కలిసి మెలిసి జీవిస్తున్నారని, వారి ఐక్యతకు రంజాన్ మాసం నిదర్శనంగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం అధికారికంగా ఇఫ్తార్ విందును నగరంలోని లిమ్రాగార్డెన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లిములు ఈ మాసంలో పవిత్రంగా ఉండి అందరి కోసం ప్రార్థనలు చేస్తార న్నారు. సమాజం బాగుంటే అందరూ బాగుంటారని నమ్మె మ న దేశంలో అందరి ఐక్యతకు ...

Read More »

ఊరటనిచ్చిన వాన

-ఐదు జిల్లాల్లో భారీ వర్షం.. అత్యధికంగా ఖమ్మం జిల్లా అశ్వాపురంలో 17 సెంటీమీట అల్పపీడన ద్రోణి ప్రభావంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షం అన్నదాతలకు ఊరటనిచ్చింది. ఖమ్మం, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో వర్షం కురువగా, అత్యధికంగా ఖమ్మం అశ్వాపురం మండలంలో దాదాపు 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లగా, చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరడంతో అలుగుపోశాయి. భారీ వర్షాలతో రైతులు ఖరీఫ్ సాగులో ...

Read More »

ఉసురుతీసిన మ్యాన్‌హోల్

-సాయం చేయడానికి వెళ్లి ఓ యువకుడి మృత్యువాత -కాంట్రాక్టర్‌పై కేసు నమోదు హఫీజ్‌పేట్: తెరుచుకున్న మ్యాన్‌హోల్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి ఓ యువకుడు మృతి చెందాడు. జార్ఖండ్‌కు చెందిన మోతీయాదవ్ (24) బతుకుదెరువు నిమిత్తం 5 నెలల క్రితం నగరానికి వలస వచ్చి అయ్యప్పసొసైటీలో నివాసముంటున్నాడు. మాదాపూర్‌లోని రాక్ ఎన్ గ్రిల్ హోటల్‌లో టీ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి ఇంటికి వెళ్తుండగా వర్షం ప్రారంభంకావడంతో మెగాహిల్స్ వద్ద ఉన్న ...

Read More »

త్వరలో వాటర్ ఏటీఎంలు

హైదరాబాద్ : వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజలకు తాగడానికి స్వచ్ఛమైన నీరు దొరకాలంటే గగనమే. గుక్కెడు నీటి కోసం రూ.20 వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక నుంచి అలాంటి తిప్పలు లేకుండా చేసేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏటీఎం తరహాలో నీటి కేంద్రాలు ఏర్పాటు చేసి రూపాయికి లీటర్ మినరల్ వాటర్ అందించేందుకు జలమండలి కసరత్తు చేస్తోంది. ఈ కేంద్రాల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను కూడా ఎంపిక చేసినట్లు తెలిసింది. ప్రధానంగా రద్దీగా ఉండే దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాలతో ...

Read More »