Breaking News

Daily Archives: June 29, 2016

కోర్టుల మూత – న్యాయమూర్తుల మూకుమ్మడి సెలవు

  కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలో భాగంగా బుధవారం కోర్టుల సముదాయానికి తాళం వేశారు. కోర్టు ఎదుట బైఠాయించి సిబ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. న్యాయమూర్తులు సైతం మూకుమ్మడిగా సెలవుపై వెళ్లడంతో కోర్టు పనులు పూర్తిగా స్తంభించాయి. ఈనెల 6వ తేదీ నుంచి న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలు ఉదృతమయ్యాయి. కోర్టులకు తాళాలు పడడంతో కక్షిదారులు, రిమాండ్‌ ఖైదీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంద్రా న్యాయాధికారులను తెలంగాణకు కేటాయిస్తూ తీసుకన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

సిపిఎం ఆధ్వర్యంలో రంజాన్‌ దుస్తుల పంపిణీ

  కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలోని 24వ వార్డులో ప్రభుత్వం అందజేసిన రంజాన్‌ దుస్తులను వార్డు కౌన్సిలర్‌ రేణుక చంద్రశేఖర్‌ ముస్లింలకు అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ప్రకటించడాన్ని పార్టీ స్వాగతిస్తుందన్నారు. ముస్లింలకు సామాజిక న్యాయం జరిగేలా రిజర్వేషన్లు తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో విఆర్వో బాలయ్య, డివిజన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌, నాయకులు లక్ష్మణ్‌, అజీమ్‌, సాజిద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ర్యాలీ

  కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాదుల చేస్తున్న ఆందోళనకు పిడిఎస్‌యు విద్యార్థి సంఘం తమ సంఘీబావం తెలిపింది. బుధవారం విద్యార్తి సంఘ నాయకులు, విద్యార్థులు న్యాయవాదులతో కలిసి ఆందోళనలో పాలుపంచుకున్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రన్యాయశాఖ మంత్రి సదానందగౌడ దిస్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. నిజాంసాగర్‌ చౌరస్తాకు చేరుకొని అక్కడ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈవిషయంలో స్పందించి హైకోర్టును విబజించాలన్నారు. ఆంధ్రా న్యాయమూర్తుల ఐచ్చికాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అపరిష్కృతంగా ఉన్న పాఠశాల, విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని బుధవారం తపస్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్‌ విధానం రద్దుచేసి ఉపాధ్యాయులందరికి పాత పెన్షన్‌ విధానం వర్తింపజేయాలన్నారు. 10వ పిఆర్‌సి బకాయిలను వెంటనే నగదు రూపంలో చెల్లించాలని కోరారు. పండిట్‌, పిఇటి పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలని పేర్కొన్నారు. అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులను జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. ...

Read More »

పోడుభూముల జోలికి వస్తే ప్రతిఘటిస్తాం

  కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివాసీ గిరిజనులు, దళిత వర్గాలు సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి వస్తే ప్రతిఘటిస్తామని ఆర్‌ఎస్‌పి డివిజన్‌ కార్యదర్శి నర్సింలు అన్నారు. బుధవారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఏళ్ల తరబడిగా గిరిజనులు, దళితులు పోడుభూములు సాగుచేసుకుంటున్నారన్నారు. గాంధారి, మాచారెడ్డి, లింగంపేట్‌ మందలాల్లో వాటిని అటవీభూములుగా, ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ అధికారులు దాడులకు దిగడం గర్హణీయమన్నారు. రాష్ట్రంలో దొరల పాలన సాగుతుందని విమర్శించారు. దాడులు మానుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన తప్పదని ...

Read More »

మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌కు సన్మానం

  కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌లను బుధవారం పాతరాజంపేట తెరాస గ్రామ కమిటీ ఆద్వర్యంలో సన్మానించారు. ఛైర్మన్‌ రాజమణి, వైస్‌ఛైర్మన్‌ గౌరీ శంకర్‌లను కామారెడ్డి ఆర్‌అండ్‌బి అతిథి గృహం వద్ద సన్మానించారు. రైతుల పక్షాన నిలిచి వారి అభివృద్దికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్‌, సర్పంచ్‌ షేక్‌ అహ్మద్‌, ఉపసర్పంచ్‌ నరేశ్‌, నాయకులు బాల్‌కిషన్‌, నర్సారెడ్డి, కృష్ణమూర్తి, వెంకటి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

వ్యక్తిత్వ వికాస శిక్షణ సర్టిపికెట్ల ప్రదానం

  కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యక్తిత్వ వికాస శిబిరంలో శిక్షణ పొందినవారికి బుధవారం ప్రముఖ మెజిషీయన్‌, వ్యక్తిత్వ వికాస నిపుణులు పఠాభిరాం సర్టిఫికెట్లు అందజేశారు. కామారెడ్డి పట్టణ వాసవీ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు మహేశ్‌గుప్త, ప్రవీణ్‌కుమార్‌లు శిబిరంలో శిక్షణ పొందారు. వీరికి పఠాభిరాం సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిదులు గంప నాగేశ్వర్‌రావు, గంప విజయ్‌కుమార్‌, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

చిత్తడిగా మారిన రోడ్లు – ఇబ్బందుల్లో ప్రయాణీకులు

  బాన్సువాడ, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చినుకులకే రోడ్లు చిత్తడిగా మారి ప్రయాణీకులకు నరకం చూపిస్తున్నాయి. బాన్సువాడ ప్రాంతంలో గ్రామీణ ప్రాంత రహదారులు ప్రమాదకరంగా మారాయి. రహదారుల బాగుకు ప్రభుత్వం రూ. కోట్ల నిధులు మంజూరు చేయడంతో పునర్నిర్మాన పనులు చేపట్టారు. వేసవి కాలం చివరాంతంలో రహదారుల పనులు చేపట్టడం ప్రజలకు శాపంగా మారింది. ఇదివరకు రోడ్లు గుంతలుగా ఉన్నప్పటికి కొంతవరకు ప్రయాణానికి అనుకూలంగా ఉండేది. ప్రస్తుతం పనులు చేపట్టి పూర్తి చేయకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా బాన్సువాడ, ...

Read More »

పాఠశాలలో నోటు పుస్తకాల పంపిణీ

  బీర్కూర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సంగం గ్రామంలోగల సేవాసంఘ్‌ యువజన సంఘం ఆద్వర్యంలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుధవారం నోటుపుస్తకాలు పంపిణీ చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరం దృస్ట్యా పాఠశాలలోని పేద విద్యార్థులకు సుమారు 50 మందికి నోటు పుస్తకాలు, పలకలు, పెన్సిళ్ళు, చిత్రపటాలను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ఆర్థిక స్థితి బాగాలేదని, పాఠశాల మానేసే సంఘటనలు చాలా జరుగుతున్నాయని, ఆర్తికంగా విద్యార్థులను ప్రోత్సహించి చదువుల్లో ఉన్నత స్థాయికి చేరేలా ప్రేరేపించేందుకు సేవా ...

Read More »

మైనార్టీలకు దుస్తుల పంపిణీ

  బీర్కూర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పండగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు దుస్తులు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఎంపిపి మల్లెల మీణ హన్మంతు ఆధ్వర్యంలో మైనార్టీలకు దుస్తులు పంపిణీ చేపట్టారు. మండలం మొత్తంమీద 200 కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేసినట్టు ఆమె అన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరక శ్రీనివాస్‌, తహసీల్దార్‌ కృష్ణనాయక్‌, మల్లెల హన్మంతు, సర్పంచ్‌ నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read More »

సస్పెన్షన్‌కు గురైన న్యాయమూర్తుల చిత్రపటాలకు పాలాభిషేకం

  డిచ్‌పల్లి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కోరుతూ, తెలంగాణ న్యాయస్థానాల్లో ఆంధ్ర ప్రాంత జడ్జిల నియామకానికి వ్యతిరేకంగా గళమెత్తి సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ న్యాయమూర్తుల ఫోటోలకు బుధవారం తెలంగాణ యూనివర్సిటీలో క్షీరాభిషేం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బిసి జేఏసి ఛైర్మన్‌ యెండల ప్రదీప్‌ ఆధ్వర్యంలో తెయు పరిపాలనా భవనం ముందు కార్యక్రమం నిర్వహించారు. న్యాయ వ్యవస్థలో తెలంగాణ వారికి అన్యాయం జరగకుండా చూడాలని, ఆంధ్రాప్రాంతం వారి ఆప్షన్‌లు రద్దు చేయాలని, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ...

Read More »

ప్రశాంతంగా మండల సర్వసభ్యసమావేశం

  మోర్తాడ్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి కల్లడ చిన్నయ్య అధ్యక్షతన బుధవారం మండల సాధారణ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా జరిగింది. సమావేశంలో సభ్యుల కోరిక మేరకు ఏర్గట్ల గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని, ఏర్గట్లలోగల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్యులను, సిబ్బందిని నియమించి ప్రజలకు, రోగులకు సేవలందించేలా చర్యలు చేపట్టాలని, అద్దె బోర్ల బిల్లులను విడుదల చేసి అందించాలని పలు తీర్మానాలు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కోఆప్షన్‌ సభ్యులు, ఎంపిపి, మండల అధికారులు ...

Read More »

హైకోర్టును వెంటనే విభజించాలి

  బీర్కూర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఆంధ్రాప్రాంతం నుంచి విడిపోయి సుమారు మూడు సంవత్సరాలుగా గడుస్తున్నా రాష్ట్ర హైకోర్టును విభజించకపోవడం కేంద్ర ప్రభుత్వ అసమర్థత అని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరక శ్రీనివాస్‌ అన్నారు. బిజెపి పార్టీ ఆంధ్రా పాలకులతో కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రంలోని కోర్టుల్లో ఆంధ్రావారిని నియమిస్తున్నారని ఆయన విమర్శించారు. న్యాయం కొరకు పోరాడిన న్యాయవాదులను సస్పెండ్‌ చేయడం తగదని, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఉమ్మడి హైకోర్టును విభజించి కోర్టులో నియామకాలు చేపట్టాలని ...

Read More »

సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన

  మోర్తాడ్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లోగల సాదాబైనామాలో రైతులు దరఖాస్తులు చేసుకున్న వాటిని పరిశీలిస్తున్నామని తహసీల్దార్‌ వెంకట్రావు బుధవారం తెలిపారు. తెరాస ప్రభుత్వం కల్పించిన సాదా బైనామాలో తెల్లకాగితంపై కొనుగోలు చేసిన భూములను రిజిస్ట్రేషన్‌తోపాటు ఉచితంగా పట్టాపాసుపుస్తకాలు అందిస్తున్న నేపథ్యంలో ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌, ఉన్నతాధికారులు వివరాలను అందిస్తున్నామన్నారు. బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సాదా బైనామా వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ...

Read More »

రైతులందరికి ఫసల్‌బీమా వర్తింపజేయాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పంటల బీమా పథకాన్ని పంటలు సాగుచేసే ప్రతి రైతుకు వర్తింపజేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా సంబంధిత అధికారులకు, బ్యాంకర్లకు సూచించారు. బుధవారం డిఆర్‌డిఎ కార్యాలయంలో బ్యాంకు అధికారులు, వ్యవసాయ, ఇతర సంబంధిత అధికారులతో ఈ పథకం, యుసిఐఎస్‌ పథకంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పంటల బీమా పథకం ...

Read More »

ప్రయాణీకులకు పండ్లు పంపిణీ

  మోర్తాడ్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ మాసం దృష్టిలో పెట్టుకొని బుధవారం మోర్తాడ్‌ బస్టాండ్‌లో ప్రయాణీకులకు ఆర్టీసి కంట్రోలర్‌ ఎం.డి. యూనుస్‌ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని తనవంతు స్వచ్చందంగా ఖర్జూర పండ్లు, బిస్కెట్లు, తాగునీరు ప్రయాణీకులకు, విద్యార్థులకు, బస్సు డ్రైవర్లకు, కండక్టర్లకు కంట్రోలర్‌ అందజేశారు. కార్యక్రమంలో ప్రయాణీకులు పాల్గొన్నారు.

Read More »

బాలకృష్ణకు తప్పిన ప్రమాదం

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ  వాహనం బోల్తా కొట్టింది. ఆయన ప్రయణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బెంగళూరు వెళ్తుండగా దారి మధ్యలో లారీని ఓవర్ టేక్ చేయబోయి డివైడర్ ను ఢీకొట్టింది. కర్ణాటకలోని బాగేపల్లి దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. యాక్సిడెంట్ నుంచి బాలకృష్ణ క్షేమంగా బయటపడ్డారు. తర్వాత మరో వాహనంలో బెంగళూరు వెళ్లిపోయారు.

Read More »

విద్య – నేటి విద్యా విధానం

మన భారత దేశం మన భారత దేశం అనేక రకాల భాషలు, మతాలూ, కులాలు, జాతులు, వర్ణాలు, వర్గాలు, సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు మరియు అనేక రకాల పద్దతులు కలిగిన ఏకైక దేశం మనది. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వ విద్యాలయాన్ని స్థాపించింది మన భారత దేశమే. అందుకు మనమందరం గర్వపడాలి. కాని నేటి మన దేశంలో విద్య ఏవిధంగా నడుస్తుందో మన అందరికి తెలుసు పిల్లలకు పూర్తిగా అన్యాయం పెద్ద విద్యార్థుల సంగతి పక్కకు పెడితే పిల్లలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. సరిగా 5 ...

Read More »