Breaking News

కోర్టుల మూత – న్యాయమూర్తుల మూకుమ్మడి సెలవు

 

కామారెడ్డి, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలో భాగంగా బుధవారం కోర్టుల సముదాయానికి తాళం వేశారు. కోర్టు ఎదుట బైఠాయించి సిబ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. న్యాయమూర్తులు సైతం మూకుమ్మడిగా సెలవుపై వెళ్లడంతో కోర్టు పనులు పూర్తిగా స్తంభించాయి. ఈనెల 6వ తేదీ నుంచి న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలు ఉదృతమయ్యాయి. కోర్టులకు తాళాలు పడడంతో కక్షిదారులు, రిమాండ్‌ ఖైదీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంద్రా న్యాయాధికారులను తెలంగాణకు కేటాయిస్తూ తీసుకన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సస్పెండ్‌ చేసిన జడ్జిలను తిరిగి విదుల్లోకి తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. నిజాంసాగర్‌ చౌరస్తాలో దగ్దం చేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు క్యాతం సిద్దిరాములు, నారాయణ, శంకర్‌రెడ్డి, జగన్నాథం, నర్సింహారెడ్డి. నరేందర్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, నరేంద్రభూపాల్‌, లక్ష్మణ్‌రావు, సురేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article