Breaking News

Daily Archives: June 30, 2016

రంజాన్‌ మతసామరస్యానికి ప్రతీక

  నందిపేట, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముస్లింలు పవిత్రంగా భావించి ఉపవాసాలు పాటించే రంజాన్‌ మాసం మతసామరస్యానికి ప్రతీక అని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్‌ అన్నారు. నందిపేటలో గురువారం టిడిపి పార్టీ తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొని మాట్లాడారు. చిన్నప్పటి నుంచి ముస్లిం స్నేహితులు, పెద్దలతో పరిచయాలు ఉండడం వల్ల ముస్లింమతం గురించి తెలుసుకున్నామని, ఇస్లాం శాంతిని బోధిస్తుందని, రంజాన్‌ మాసం ప్రజల మధ్య సోదరభావం పెంపొందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి ...

Read More »

తెవివి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు

  డిచ్‌పల్లి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ సభల్లో పాల్గొనడానికి అమెరికా పర్యటనకు వెళ్లినందున ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు నియామకమైనట్టు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ఆచార్య లింబాద్రి దాదాపు పదిరోజులపాటు అమెరికాలో పర్యటించనున్నందున ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. ఆచార్య జయప్రకాశ్‌రావు ప్రస్తుతం అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా తాను విసి పార్థసారధి మార్గనిర్దేశంలో బాధ్యతలు నిర్వహిస్తానన్నారు. ...

Read More »

కామారెడ్డి ఎటివో పదవీవిరమణ

  కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎటివో మస్తానయ్య గురువారం పదవీ విరమణ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో అభినందన, సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మస్తానయ్యను ఘనంగా సన్మానించారు. వక్తలు మాట్లాడుతూ మస్తానయ్య వృత్తి ధర్మాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించారని కొనియాడారు. అనంతరం ఇన్‌చార్జి ఎటివోగా నియమితులైన ఖయ్యుంను సన్మానించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు నిట్టు విఠల్‌రావు, భద్రయ్య, వెంకటి, సాయాగౌడ్‌, మురళి, యాదగిరి, శ్యాంరావు, గంగారెడ్డి, శైలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read More »

సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో దర్నా

  కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధిక ఫీజుల వసూళ్లను అడ్డుకోవాలని డిమాండ్‌చేస్తూ కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో గురువారం సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో దర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కామారెడ్డిలోని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిగా పీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఏ ఒక్క ప్రయివేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఫీజుల ...

Read More »

ఆంధ్రా సిఎం చంద్రబాబు దిష్టిబొమ్మకు ఉరి

  కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రత్యేక హైకోర్టు విషయంలో అడ్డుతగులుతున్న ఎపి సిఎం చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం చంద్రబాబు దిష్టిబొమ్మను ఉరితీసి ఆందోళన చేపట్టారు. జిల్లా 9వ అదనపు కోర్టు ప్రధాన గేటుకు బాబు బొమ్మను ఉరితీశారు. ఈ సందర్భంగా ఆంద్రా జడ్జిలు గోబ్యాక్‌, చంద్రబాబు డౌన్‌ఢౌన్‌, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బోస్లేకు హఠావో, తెలంగాణకు బచావో అంటూ నినాదాలు చేశారు. కోర్టు భవనాలకు తాళం వేయడంతో పాలన ...

Read More »

పోచమ్మ బోనాలకు ఏర్పాట్లు పూర్తి

  కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17వ వార్డులో పోచమ్మ బోనాల పండగ సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. పనులను మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, ఎ.ఇ. గంగాధర్‌లు పరిశీలించారు. శుక్రవారం మాలకుల సంఘం ఆద్వర్యంలో బోనాల పండగ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పోచమ్మ ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించి పరిసరాలు శుభ్రం చేశారు. ఆలయానికి రంగులు అద్దారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రాజలింగం, బాల్‌రాజు, రాజు, రమేశ్‌, శివరాజ్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

శివాలయంలో నేటినుంచి నిత్యాన్నదానం

  బాసర, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర గోదావరి నది నుంచి అమ్మవారి ఆలయం వైపు వెళ్లే మార్గంలో గత రెండేళ్ళ క్రితం శివాలయం ఏర్పాటైంది. నందిపేట కేదారేశ్వర ఆశ్రమం స్వామి శ్రీ మంగిరాములు మహారాజ్‌ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భక్తి శ్రద్దలతో శివాలయాన్ని నిర్మించారు. కాగా శుక్రవారం నుంచి నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. అన్నదానం దాతలు ముందుకు రావాలని, వారిపేరుతో అన్నదానం చేయబడుతుందని స్పష్టం చేశారు. అన్నదాన ప్రక్రియ భక్తుల విరాళాలతో, దాతల ప్రోత్సాహంతో ...

Read More »

వామ్మో… నందిపేట రోడ్డు….

  నందిపేట, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారి సరిగా లేకపోవడంతో ప్రజలు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతల మయంగా ఉన్న రోడ్డుపై వర్షం కురియడంతో గుంతల్లో నీరు నిలిచి వచ్చిపోయే ప్రయాణీకులకు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మండల కేంద్రానికి తైబజార్‌, అంగడి బజార్‌, షాపింగ్‌ కాంప్లెక్సుల ద్వారా మంచి ఆదాయం ఉంది. ఆదాయానికి అనుగుణంగా అభివృద్ది పనులు చేపట్టాల్సినఅధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు అంటున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయమవుతున్నాయి. ...

Read More »

గళగళా గోదారి కదిలిపోతుంది…

  బాసర, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్‌ జిల్లా బాసర గోదావరి నది జలకళను సంతరించుకుంది. గోదావరి పైభాగం మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో రెండేళ్ళుగా ఎడారిని తలపించిన గోదావరమ్మ నీటితో కళకళలాడుతోంది. బాసరకు వచ్చే ప్రజలు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అంతేగాకుండా రాబోయేరోజుల్లో మహారాష్ట్ర బాబ్లీ గేట్లు తెరిస్తే మరిన్ని నీరు వచ్చే అవకాశముంది. ఏదేమైనా ...

Read More »

విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి

  – సిఐటియు నందిపేట, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని మండల విద్యాశాఖ సిబ్బందికి సిఐటియు మండల అధ్యక్షుడు గంగాధర్‌ వినతి పత్రం సమర్పించారు. మండలంలో ప్రైవేటు విద్యాసంస్థలు, పాఠశాలలు విద్యాహక్కు చట్టానికి విరుద్దంగా వ్యాపార ధోరణిలో పాఠశాలలు నిర్వహిస్తున్నారన్నారు. పాఠశాలల్లో టై, బెల్టు, నోటుపుస్తకాలు, పాఠ్యపుస్తకాల పేరుతో భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారని, కానీ పాఠశాలల్లో మౌలిక వసతులు మాత్రం కల్పించడం లేదని ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలల్లో సరియైన శిక్షణ పొందిన ...

Read More »

మురిపించిన వాన – ఊపందుకున్న పనులు

  నందిపేట, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారం రోజుల నుంచి నందిపేట మండలంపై వర్షం ముసురుకుంది. సోమవారం రాత్రి భారీ వర్షం పడడమే కాకుండా మంగళవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు, బుధవారం భారీ వర్షం కురవడంతో ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మండలంలో వారంరోజుల నుంచి పంటల సాగు ఊపందుకుంది. అల్పపీడనం వల్ల పడుతున్న వర్షాల వల్ల రైతులు పంటల సాగుకు ముందుకు వస్తున్నారు. వరి సాగుపట్ల ఆసక్తి కనబరుస్తూ నారు ...

Read More »

అచ్చంపేట గ్రామ సంఘం కార్యవర్గం ఎన్నిక

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట క్యాంపు గ్రామ సమాఖ్య సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఐకెపి సిసి విఘ్నేశ్వర్‌గౌడ్‌ తెలిపారు. అచ్చంపేట గ్రామంలో గ్రామసమాఖ్య సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. అధ్యక్షురాలిగా బాలమణి, ఉపాధ్యక్షురాలిగా పిట్ల దుర్గవ్వ, కోశాధికారిగా గీతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సిసి మాట్లాడుతూ నూతన కార్యవర్గం స్వయం సహకార సంఘం సభ్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ...

Read More »

ప్రతి ఇంట్లో ఐదు మొక్కలు నాటాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సుంకిపల్లి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను స్థానిక ఎంపిడివో రాములు నాయక్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ గ్రామంలోని 225 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు మంజూరయ్యాయన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్ల పనులు ప్రారంభించేలా కృషి చేయాలన్నారు. ప్రతి ఇంట్లో ఐదు మొక్కలునాటే బాద్యత ప్రజలందరిదన్నారు. ఈ కార్యక్రమంలో గున్కుల్‌ సింగిల్‌ విండో ఛైర్మన్‌ సయ్యద్‌ మోయినుద్దీన్‌, సర్పంచ్‌ పప్పుల లచ్చవ్వ, ఎంపిటిసి సభ్యురాలు వసంత, ...

Read More »

పేద ముస్లింలకు దుస్తుల పంపిణీ

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద ముస్లింలకు రంజాన్‌ మాసం పురస్కరించుకొని సిఎం కెసిఆర్‌ ప్రభుత్వం తరఫున దుస్తులు పంపిణీ చేస్తున్నారని గున్కుల్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ సయ్యద్‌ మోయినుద్దీన్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో తహసీల్దార్‌ హైమద్‌ అబ్దుల్‌ గనిఖాన్‌, ఎంపిడివో రాములు నాయక్‌, వైస్‌ ఎంపిపి గోవుల పండరి, మండల కో ఆప్షన్‌ సభ్యులు హైమద్‌ హుస్సేన్‌, తెరాస మండల అధ్యక్షుడు గైని విఠల్‌, సర్పంచ్‌ బేగరి రాజు, మైనార్టీ ...

Read More »

జిల్లాలో 15.1 మిల్లీమీటర్ల వర్షం

నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వ రకు 15.1 మిలిమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి ఎనిమిది గంటల తర్వాత ప్రారంభమైన వర్షం మోస్తారుగా కురిసింది. అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో భారీగా కురిసింది. జిల్లాలో జుక్కల్‌లో అత్యధికంగా 53.0 మిల్లీమీటర్ల వర్షం పడింది. జిల్లాలో నమోదైన వర్షపా త వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డిలో 21.4, లిం గంపేట్‌లో 18.4, వర్నిలో 35.4, డిచ్‌పల్లిలో 38.4, బోధన్‌లో 47.0, బిచ్కుందలో 17.6, పిట్లంలో 8.4, కోటగిరిలో 17.4, మోర్తాడ్‌లో ...

Read More »

అధర్మ కాంటాల హవా..!

బోధన్ : రెండు రాష్ర్టాల సరిహద్దులోని సాలూర చెక్‌పోస్టులో వేబ్రిడ్జి పనిచేయకపోవడంతో సరుకుల రవాణాలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. లారీలు, ఇతర వాహనాల్లో ఓవర్‌లోడ్‌ను అరికట్టాలన్నా, వేబిల్లులో పేర్కొన్న సరుకుల పరిమాణంపై అనుమానాలు వచ్చినా ధర్మకాంటాలో తూకం వేయించాలి. తూకం వేయనిదే ఓవర్‌లోడ్, సరుకుల పరిమాణాలను అంచనా వేయడం కష్టం. రవాణా, వాణిజ్యపన్నుల శాఖల చెక్‌పోస్ట్‌ల్లో సరుకుల బరువుల నిర్ధారణకు ప్రాధాన్యత ఉంటుంది. బోధన్ మండలం సాలూర గ్రామం సమీపంలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌లో సరుకుల బరువులను తూయటానికి ధర్మకాంటాను ఏర్పాటు చేశారు. 1986లో ఈ ...

Read More »

26 ఏళ్లకే వర్జినిటీ కోల్పోయాను!

బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో కరణ్ జోహర్ ఒకరు. ధర్మ ప్రోడక్షన్ అధినేతగా సినిమాలు కూడా నిర్మిస్తున్న ఆయన తాజాగా ఓ ఆంగ్ల చానెల్‌ వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో పలు వ్యక్తిగత విషయాలు వెల్లడించారు. తాను 26 ఏళ్లకే వర్జినిటీ  కోల్పోయానని, ఇక ఎంతమాత్రం శృంగారం కోసం వెంపర్లాడటం లేదని పేర్కొన్నారు. తాను కోల్పోయిన దానిని అంగీకరించే స్థితిలో ప్రస్తుతం ఉన్నానని చెప్పారు. ‘నేను శృంగారం కోసం ఎంతమాత్రం వెంపర్లాడటం లేదు. ఆ విషయంలో ఎవరైనా నన్ను వెంటాడదలుచుకుంటే వెంటాడవచ్చు. కానీ నేను అందుకు సిద్ధంగా ...

Read More »

శుభవార్త.. విజయవాడ టు కువైట్.. డైరెక్టు ఫ్లైట్.!

కువైట్: కువైట్‌లోని తెలుగు ప్రజలకు శుభవార్త. విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి కువైట్‌కు డైరెక్టు ఫ్లైట్‌లు నడిపేందుకు కువైట్‌కు చెందిన ఇతిహాడ్ ఎయిర్ వేస్ సంస్థ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుల మధ్య అంగీకారం కుదిరినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి సంబంధింత శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి కృష్ణా పుష్కరాలలోపే ఈ సర్వీసులను ప్రారంభించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఇటీవల చైనా వెళ్లిన సందర్భంగా అక్కడ ఇతిహాడ్ ఎయిర్ ‌వేస్ సంస్థతో జరిపిన చర్చల్లో ఇరువర్గాలు ...

Read More »

ఏకంగా స్మార్ట్ ఫోన్‌నే పెళ్ళాడాడు

లాస్ ఏంజెల్స్: స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైంది. నిత్య జీవితంలో మమేకమైంది. అది పక్కన లేకపోతే ఆందోళన చెందేవారు ఎంతో మంది. దాన్ని కొనేందుకు శరీర భాగాలు అమ్ముకునేవారు కొందరైతే, ఆత్మహత్యకు పాల్పడే వారు మరి కొందరు. అలాంటి స్మార్ట్ ఫోన్‌ను ఓ వ్యక్తి తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. మన మాటల్లో చెప్పాలంటే ఏకంగా దాన్ని పెళ్లి చేసుకున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ పెళ్లితంతు అమెరికాలో గ్రాండ్‌గా జరిగింది. ఆ పెళ్ళి కొడుకు పేరు ఆరోన్. ...

Read More »

తపాలా బిళ్లపై ఫొటోకు 12 లక్షలు!

న్యూఢిల్లీ: ‘మై స్టాంప్‌’.. రూ. 300 ఇస్తే.. తపాలా బిళ్లపై మన ఫొటోను ముద్రించి ఇచ్చేందుకు తపాలా శాఖ గతంలోనే ప్రారంభించిన పథకం ఇది. అయితే, ఇదివరకు మై స్టాంపు షీటుపై స్టాంపు పక్కగానే మన ఫొటో ముద్రిస్తుండగా, ఇప్పుడు నేరుగా స్టాంపుపైనే మన ఫొటోను చూసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు బుధవారం పోస్టల్‌ శాఖ వెల్లడించింది. ఈ కొత్త స్టాంపులు కావాలంటే.. రూ. 12 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది! ఈ పద్ధతిలో 5 వేల షీట్లలో 60 వేల స్టాంపులపై మన ఫొటోను ముద్రిస్తార ...

Read More »