Breaking News

జాతీయ విపత్తులు ధైర్యంగా ఎదుర్కోవాలి

 

బాల్కొండ, జూలై 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ విపత్తు నిర్మూలన సంస్థ ఆద్వర్యంలో సోమవారం విద్యార్థులకు విపత్తులను ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించారు. బాల్కొండ మండలం పోచంపాడ్‌ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులకు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భూకంపాలు, వరదలు, రోడ్డు ప్రమాదాలు, తుఫాను తదితర సందర్భాలలో వచ్చే విపత్తులను ఎలా ఎదుర్కోవాలో యంత్రాల ద్వారా మొత్తం 20 అంశాలపై విద్యార్థులకు కళ్ళకు కట్టినట్టు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ పర్వత్‌లాల్‌, డిప్యూటి తహసీల్దార్‌ విజయ్‌, డి.జె. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సుధాకర్‌, ఏఎస్‌ఐ రమణా కుట్టి, సి.టి నారాయణ్‌, ఆర్‌ఐ కార్తీక్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ నందకుమార్‌, విఆర్వో రవి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *