Breaking News

చెట్లు లేకుంటే మనిషి మనుగడ ప్రశ్నార్థకం

 

బాల్కొండ, జూలై 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండలో యువజన సంఘాల ఆద్వర్యంలో గురువారం హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి చేతుల మీదుగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెట్లే ప్రాణాధారమని, చెట్లు ఉంటేనే మనిషి మనుగడ అని లేకుంటే ప్రశ్నార్థకమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ లావణ్య, విద్యాసాగర్‌, గంగాధర్‌, కో ఆప్షన్‌ సభ్యుడు షహీద్‌, అంబటి నవీన్‌, కిట్టు, అశోక్‌, ఎజాజ్‌, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *