Breaking News

Daily Archives: August 1, 2016

ఖర్చు లేకుండా కంచెల ఏర్పాటు

  నందిపేట, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి అన్ని వర్గాల వారు కులమతాలకు అతీతంగా సమాజం మొత్తం ముందుకు వచ్చి మొక్కలు నాటడమే గాకుండా వాటిని సంరక్షించే బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు. నందిపేట బైపాస్‌ రోడ్డులోగల జమాతె ఇస్లామి హింద్‌ కార్యాలయం పక్కన రోడ్డుకిరువైపులా మొక్కలు నాటిన యువకులు మేకలు, పశువులు మొక్కల్ని పాడుచేస్తున్నాయని, వాటిని సంరక్షించాలనే ఉద్దేశంతో వినూత్న ఆలోచనలతో ఖర్చులేకుండా కంచెలు ఏర్పాటు చేశారు. మూడు కర్రలు పాతి దానిచుట్టు ...

Read More »

ఇళ్ళ స్థలాల భూములను కాపాడండి

మోర్తాడ్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దోన్‌పాల్‌ గ్రామంలో 1994లో అప్పటి ప్రభుత్వం గ్రామ శివారులోని సాయిబాబా ఆలయం వద్ద సర్వేనెంబరు 222లో 4 ఎకరాల భూమిలో 97 మంది లబ్దిదారులకు ప్రభుత్వం స్థలాలు అందజేసిందని సోమవారం లబ్దిదారులు వాపోయారు. ప్రభుత్వం అందించిన ఇళ్ళ స్థలాల భూమిలో అదే గ్రామానికి చెందిన కొందరు సాగుచేస్తున్న విసయాన్ని తెలుసుకొని సోమవారం వచ్చి స్థలం వద్ద బైఠాయించి లబ్దిదారులు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్‌, సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తమకు ...

Read More »

రెండో రోజు అంత్య పుష్కరాలకు భక్తుల తాకిడి

మోర్తాడ్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తడపాకల్‌, దోంచంద, గుమ్మిర్యాల్‌ గ్రామ శివారులోగల గోదావరిలో సోమవారం అంత్యపుష్కరాలకు భక్తుల తాకిడి నెలకొంది. భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి వేదపండితులతో పూజలు, పిండప్రదానం నిర్వహించి, ఆలయాల్లో దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అంత్యపుష్కరాలకు భక్తులు విచ్చేస్తున్న సందర్భంగా ఆయా గ్రామాభివృద్ది కమిటీలు, విఆర్వోలు, గ్రామ సేవకులు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

Read More »

మైనార్టీ నాయకుని కుటుంబానికి కాంగ్రెస్‌ అండగా నిలుస్తుంది

  మోర్తాడ్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అహ్మద్‌ హుసేన్‌ గుండెపోటుతో మృతి చెందడంతో సోమవారం ప్రభుత్వ మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మైనార్టీ నాయకుని కుటుంబానికి కాంగ్రెస్‌ అన్ని విధాలుగా అండగా నిలిచి ఆదుకుంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మానాల మోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్‌, ఎంపిటిసి గడ్డం లింగారెడ్డి, మురలి, పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. తెరాస ...

Read More »

మోర్తాడ్‌లో భారీ వర్షం

– నీట మునిగిన పంట పొలాలు – పొంగి పొర్లుతున్న వాగులు – రాకపోకలకు అంతరాయం, కోతకు గురైన వంతెనలు మోర్తాడ్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఆదివారం రాత్రి భారీ వర్షం కురియడంతో మండలంలోని పంట పొలాలు పొంగి పొర్లుతూ నీట మునిగాయి. మోర్తాడ్‌లోని మొండివాగు, గాండ్లపేట్‌ పెదవాగు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని ఒడ్యాట్‌, దోన్‌పాల్‌ గ్రామాల రహదారి మధ్యగల నూతన వంతెన వర్షం ప్రవాహనికి కోతకు గురై కొట్టుకుపోయింది. ఏర్గట్ల, ...

Read More »

ప్రజల భాగస్వామ్యంతోనే హరితహారం విజయవంతం

ఆర్మూర్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈత, ఖర్జూర మొక్కల పెంపకంతో గౌడకులస్తుల చేతివృత్తి పనిలో భాగంగా గీతవృత్తి ఉపాధి పెరగడంతో పాటు స్వచ్చమైన కల్లును ప్రజలకు అందించే అవకాశం గౌడకులస్తులకు దక్కుతుందని అడిషనల్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శాంతకుమారి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణాతో కలిసి డిచ్‌పల్లి మండలానికి చెందిన యానంపల్లి, ఆర్మూర్‌ మండలానికి చెందిన ఫతేపూర్‌, చేపూర్‌ గ్రామాల్లోని చెరువు కట్టలపై నాటిన ఈత, ఖర్జుర చెట్లను పరిశీలించిన తదుపరి ఈత, ఖర్జుర మొక్కలను ...

Read More »

ప్రజావాణిలో సమస్యల పరిష్కారం

బీర్కూర్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం వల్ల ప్రజలు, మండల వాసులు తమ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలకు జిల్లా కేంద్రం దూరమవుతుందన్న ఉద్దేశంతో తహసీల్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, సమస్యలతో బాధ పడుతున్న ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదుచేస్తే సంబంధిత అధికారి ద్వారా సమస్యల పరిష్కారం చేపడతామని అన్నారు. ఈ అవకాశాన్ని ...

Read More »

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

  బీర్కూర్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ బీర్కూర్‌ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు కంటి వైద్య నిపుణులు సంపత్‌ తెలిపారు. మండల కేంద్రంలో ప్రతి మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, కంటి సంబంధిత వ్యాధులు గలవారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తామన్నారు. మోతి బిందు గలవారికి బోధన్‌, నిజామాబాద్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ...

Read More »

మామిడి మొక్కల పంపిణీ

బీర్కూర్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో సర్పంచ్‌ పర్సు గంగాధర్‌ ఆధ్వర్యంలో సోమవారం మామిడి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు గ్రామంలో విధిగా మొక్కలు నాటాలన్నారు. మామిడి మొక్కల్ని ఇంటి పరిసర ప్రాంతాల్లో, పంట పొలాల్లో నాటాలని సూచించారు. మొక్కల నాటి సంరక్షణ బాద్యత చేపడితే భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు తలెత్తవని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

విస్తరిస్తున్న సీజనల్‌ వ్యాధులు

బాన్సువాడ, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను రోగాల బారిన పడేస్తున్నాయి. సీజనల్‌ వ్యాదులు క్రమేపి విజృంభిస్తున్నాయి. బోధన్‌ డివిజన్‌లో జ్వరాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు జ్వరాలకు కారణమవుతున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గుతో ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు. ఈయేడు అతిసారం, డయేరియా వంటి వ్యాధుల ప్రభావం లేకున్నప్పటికి జ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. గ్రామీణ ...

Read More »

గ్రామాల్లో వనభోజనాలు

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్సింగ్‌రావుపల్లి, వెల్గనూరు గ్రామాల్లో స్థానికులు వనభోజనాలు చేశారు. వెల్గనూరు గ్రామ శివారులోగల నల్లవాగు మత్తడి ప్రాంతంలో గల మైసమ్మ ఆలయం వద్ద ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వరుణుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురియాలని పూజలు చేశారు.

Read More »

కల్యాణి ప్రాజెక్టు నిండేనా

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలంలో దాదాపు 15 వేల ఎకరాలకు సాగునీటితోపాటు ఎల్లారెడ్డి మండల ప్రజలకు తాగునీటిని కళ్యాణి ప్రాజెక్టు అందిస్తుంది. పోచారం ప్రాజెక్టు నిండిపోయిన తర్వాత అదనపు నీటితో నిజామాబాద్‌ జిల్లాలోని దాదాపు ఒకలక్ష 90 వేల ఎకరాలకు సాగునీటితోపాటు నిజాంసాగర్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌కు సైతం నీటిని అందించే అందమైన పోచారం ప్రాజెక్టు జూలై 31న వచ్చిన ఇంకా ప్రాజెక్టులో డెడ్‌స్టోరేజీ నీరు కదలడం లేదు. గత వారంరోజులుగా అడపా దడపా ...

Read More »

తెగిన కుంట కట్ట

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ అటవీ ప్రాంతంలో సుల్తాన్‌ నగర్‌ గ్రామ శివారులో భారీ వర్షం కురియడంతో కుంట కట్ట తెగిపోవడంతో భారీగా వరదనీరు పోతుంది. మండల శివారులోని దొంగజాల కుంట కట్ట తెగిపోవడంతో శనివారం అర్ధరాత్రి నుంచి నీరు తెల్లవారుజాము వరకు ప్రవహిస్తుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఇసుక సంచులు, బండరాళ్లను వేసి నీటిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. కొద్దిపాటి కుంట ద్వారా నీరు ఆగడం జరిగింది.

Read More »

హరితహారం మొక్కలకు కంచెలు

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హరితహారం పథకం కింద నాటిన మొక్కల్ని సంరక్షించేందుకు అధికారులు మొక్కలకు ముళ్ల కంచెలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో నిమగ్నులయ్యారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో 6 లక్షల 94 వేల మొక్కలు నాటడం జరిగిందని ఎంపిడివో రాములు నాయక్‌ తెలిపారు. వీటిలోంచి లక్ష మొక్కలకు శ్మశాన వాటికలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ రోడ్లు, వసతి గృహాలు తదితర ప్రాంతాల్లో ముళ్లకంచెలు ఏర్పాటుచేసేందుకు సంబంధిత ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఆదేశించారు. ఇప్పటివరకు ...

Read More »

మొక్కలు నాటేందుకు కృషి

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెలంగాణ హరితహారం పథకం కింద మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టారని తెరాస మండల అధ్యక్షుడు గైని విఠల్‌, వైస్‌ ఎంపిపి గోగుల పండరి అన్నారు. మండలంలోని వెల్గనూరు గ్రామ అటవీ ప్రాంతంలో హరితహారం పథకం కింద నాటిన మొక్కలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని అమలుచేసి గ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలు నాటేందుకు కృషి చేశారన్నారు. గత ...

Read More »

పొంగి పొర్లుతున్న నల్లవాగు మత్తడి

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గతవారం రోజులుగా అడపా దడపా కురుస్తున్న వర్షాలకు నర్సింగ్‌రావుపల్లి గ్రామ పంచాయతీ శివారులోగల నల్లవాగు మత్తడి నీటితో నిండి పొంగి పొర్లుతుంది. ఈ దృశ్యం చూపరులను సైతం ఎంతో ఆకర్ఫింపచేస్తుంది. ఎగువ భాగంలోగల మెదక్‌ జిల్లా కల్లేరు, కంతి మండలాల్లో భారీగా వర్సాలు కురియడంతో నల్లవాగు మత్తడికి ఇన్‌ఫ్లో పెరిగింది. మత్తడి నిండి పోవడంతో వస్తున్న 700 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వెళుతుంది. నల్లవాగు మత్తడికి కుడి, ఎడమ కాలువలున్నాయి. కుడి ...

Read More »

గత పాలకుల అసంపూర్తి పనులు పూర్తి చేస్తున్నాం

నిజామాబాద్‌ ఎంపీ కవిత నిజామాబాద్‌ అర్బన్‌: గతంలో ఆంధ్ర పాలకులు తెలంగాణాలో పనులు ప్రారంభించి వదిలేసిన అనేక ప్రాజెక్టులను తెరాస అధికారంలోకి రాగానే వాటిని పూర్తిచేసే దిశగా ముందుకెళ్తున్నామని ఎంపీ కవిత చెప్పారు. ఆదివారం జిల్లా కేంద్రంలో అసంపూర్తిగా వదిలేసిన భూగర్భ మురుగు కాలువ పనులను తిరి చేపట్టేందుకు ఎంపీ కవిత, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, మేయర్‌ సుజాత పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆంధ్ర పాలకులు తెలంగాణాలో అనేక ప్రాజెక్టులను, పనులను అసంపూర్తిగా వదిలేశారని ఆరోపించారు. ...

Read More »

పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించాలి

ఉమ్మెడ(నందిపేట్‌): గోదావరి అంత్య పుష్కరాల్లో భాగంగా ప్రజలు నదిలో పుణ్య స్నానాలు ఆచరించాలని దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ సోమయ్య కోరారు. నందిపేట్‌ మండలంలోని ఉమ్మెడ గోదావరిలో ఆదివారం ఆయన పుష్కర స్నానాలను ఆచరించి నది తీరాన ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి పుష్కరఘాట్‌ వద్ద తమ శాఖ అధికారులను ఇన్‌ఛార్జీలుగా నియమించామని వెల్లడించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల ప్రజలు ఉమ్మెడ పుష్కరఘాట్‌ వద్దకు వచ్చి స్నానాలు ఆచరించి, ఉమా మహేశ్వర ఆలయంలో ...

Read More »

ప్రతి మొక్కను రక్షించేలా…!

ముళ్ల కంచెల ఏర్పాటు ఉపాధి హామీ ద్వారా నిధులు నిజామాబాద్‌ సిటీ: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను బతికేంచేందుకు అధికార యంత్రాగం కదులుతోంది. ప్రతి మొక్క చుట్టూ ముళ్ల కంచెను ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధి హామీ ద్వారానే కూలీలతో కంచె ఏర్పాటు పనిని మొదలు పెట్టింది. నాటిన ప్రతి మొక్కను బతికించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాలనాధికారిణి యోగితా రాణా మొక్కను రక్షించే చర్యలు ప్రారంభించారు. జిల్లాలో హరితహారం జులై 8వ తేదీ ...

Read More »