Breaking News

మైనార్టీ నాయకుని కుటుంబానికి కాంగ్రెస్‌ అండగా నిలుస్తుంది

 

మోర్తాడ్‌, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అహ్మద్‌ హుసేన్‌ గుండెపోటుతో మృతి చెందడంతో సోమవారం ప్రభుత్వ మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మైనార్టీ నాయకుని కుటుంబానికి కాంగ్రెస్‌ అన్ని విధాలుగా అండగా నిలిచి ఆదుకుంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మానాల మోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్‌, ఎంపిటిసి గడ్డం లింగారెడ్డి, మురలి, పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

తెరాస నాయకుల పరామర్శ :

సోమవారం తెరాస రాష్ట్ర నాయకులు సునీల్‌కుమార్‌రెడ్డి అహ్మద్‌ హుసేన్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థిక కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సహాయం అందజేసి తనవంతు సహకారం అందజేస్తామని అన్నారు. ఆయన వెంట ఎలాల శ్రీనివాస్‌, ప్రకాశ్‌, నవీద్‌, లింబాద్రి, పాలెం సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article