Breaking News

Daily Archives: August 2, 2016

ఆర్మూర్‌ నియోజకవర్గ జాగృతి మహిళా కన్వీనర్‌గా వాణి

ఆర్మూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ తెలంగాణ జాగృతి మహిళా కన్వీనర్‌గా పోహర్‌ వాణి నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీలక్ష్మి మహిళా సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జాగృతి ఆర్మూర్‌ నియోజకవర్గ కన్వీనర్‌ నూకల విజయ్‌ కుమార్‌, బాల్కొండ నియోజకవర్గ మహిళా కన్వీనర్‌ రమాదేవి, ఆర్మూర్‌ మండల కన్వీనర్‌ రాచర్ల దశరథ్‌, చౌకెలింగం, సంఘం సభ్యులు చైకి నీరజ, పద్మ, గీత, విజయ, జ్యోతి, పోసాని, శ్యామల, సమత, మమత, ...

Read More »

గుర్తు తెలియని వ్యక్తి మృతి

ఆర్మూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ ముత్యాల పోచమ్మ ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం స్థానికులు గమనించారు. సుమారు 70 సంవత్సరాల వృద్దుడు మృతి చెంది కనిపించడంతో పెర్కిట్‌ విఆర్వో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఐదేళ్ల నుంచి పెర్కిట్‌ గ్రామంలో భిక్షాటన చేస్తు ఉండేవాడని స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. మృతునికి సంబంధించిన వివరాలు తెలిసినవారు ఆర్మూర్‌ సిఐ 9440795411, లేదా ఎస్‌ఐ 94407 95434 కు సమాచారం అందించాలని ...

Read More »

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఒకరోజు జైలుశిక్ష

ఆర్మూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మామిడిపల్లి చౌరస్తాలో ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్బంగా షేక్‌ మోహినుద్దీన్‌ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతున్న విషయాన్ని గమనించి మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. కాగా సెకండ్‌ క్లాస్‌ జుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ దత్తయ్య ఒకరోజు జైలుశిక్ష విదిస్తు తీర్పునిచ్చినట్టు ఎస్‌హెచ్‌వో సీతారాం తెలిపారు.

Read More »

నిందితునికి రెండ్రోజుల జైలుశిక్ష

ఆర్మూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆటోతో విద్యార్థిని ఢీకొన్న కేసులో నిందితునికి రెండ్రోజుల జైలుశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువడింది. వివరాల్లోకి వెళితే ….మార్చి 21 న ఆర్మూర్‌ మామిడిపల్లి కమాన్‌ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడి పల్లి గ్రామానికి చెందిన పింజ అరుణ్‌ కొడుకు సంతోష్‌ పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా జక్రాన్‌పల్లికి చెందిన రాంచందర్‌ అనే వ్యక్తి ఆటోతో ఢీకొనడంతో కేసు నమోదు చేశారు. కేసు విచారణ అనంతరం మంగళవారం నిందితుడు రాంచందర్‌కు రెండ్రోజుల ...

Read More »

విద్యార్థులకు దుస్తుల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని టివిపి ఓరియంటల్‌ పాఠశాల విద్యార్థులకు మంగళవారం వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. వాసవీ క్లబ్‌ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు మహేశ్‌ గుప్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓరియంటల్‌ పాఠశాల క్రమశిక్షణ, మంచి విద్యకు మారుపేరని, తాము సైతం ఈ పాఠశాల నుంచే విద్యార్థులుగా ఎదిగామన్నారు. క్లబ్‌ కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులకు డిజిటల్‌ ...

Read More »

కామారెడ్డి బల్దియాలో సిబ్బందిని నియమించాలి

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపాలిటీలో అధికారులు, సిబ్బంది కొరత కారణంగా పాలన కుంటుపడుతోందని, పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని కామారెడ్డి మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, మునిసిపల్‌ శాఖ మంత్రికి వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కరీంనగర్‌లో జరిగిన మునిసిపల్‌ ఛైర్మన్లు, వైస్‌ఛైర్మన్ల సమావేశానికి హాజరయ్యామన్నారు. ఈ సందర్బంగా మునిసిపల్‌ శాఖ మంత్రికి కామారెడ్డి బల్దియా సమస్యలను చర్చించామన్నారు. బల్దియా ఇన్‌చార్జి కమీషనర్‌ పాలనలో నెట్టుకొస్తున్నట్టు తెలిపారు. పూర్తిస్థాయి ...

Read More »

తల్లిపాలతో బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లిపాలతో బిడ్డకు సంపూర్ణ పోషకాలతో పాటు ఆరోగ్యం లభిస్తుందని అంగన్‌వాడి కామారెడ్డి ప్రాజెక్టు సిడిపివో అన్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడలో అంగన్‌వాడిల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల ఆవశ్యకతను పేర్కొంటూ తల్లి, బిడ్డలతో కలిసి ప్లకార్డులు చేబూని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే గంట లోపు ముర్రు పాలు తాగిస్తే బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని స్పష్టం చేశారు. 0-6 ...

Read More »

ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందాం

  – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సందర్భంగా తెరాస పార్టీ ప్రజలకు ఇచ్చిన హమీలను, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను నెరవేరుస్తుందని, ఆ దిశగా అడుగులేస్తోందని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాకుండా ప్రజలకు తాగునీరు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు ...

Read More »

నల్లవాగు మత్తడిలోకి తగ్గని వరద

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్సింగ్‌రావుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోగల నల్లవాగు మత్తడిలోకి నీటి ఉధృతి భారీగా కొనసాగుతుంది. నల్లవాగు ఎగువ భాగంలోగల మెదక్‌ జిల్లాలోని కల్లేర్‌, కంతి మండలాల్లో భారీ వర్షాలకు నీటి ఉదృతి కొనసాగుతుంది. నాలుగు రోజులుగా వర్షాలు కురియడంతో నీటి ప్రవాహం అధికంగా రావడంతో మత్తడి పైనుంచి నీరు పొంగి పొర్లుతుంది. మత్తడి పూర్తిస్థాయిలో నీరు నిండి అదనంగా వస్తున్న నీరు మత్తడిపైనుంచి పొంగి పొర్లి గోదావరిలోకి వెళుతున్నాయి. కుడి, ఎడమ ...

Read More »

మిషన్‌ భగీరథకు జిల్లాకు రూ. 2650 కోట్లు

– జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆర్మూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కొనసాగుతున్న మిషన్‌ భగీరథ పనులకై రూ. 2650 కోట్లు ఖర్చు అవుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి ఆర్మూర్‌ మండలం కొమన్‌పల్లి గ్రామంలో పైపులైన్ల కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఏ కార్యక్రమమైన విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. మూడు రోజుల్లో ...

Read More »

ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్‌ ఎంబిఏ కోర్సు ప్రవేశాల కోసం కౌన్సిలింగ్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంబిఎ కోర్సుకు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 8న సోమవారం ప్రవేశాల కోసం కౌన్సిలింగ్‌ నిర్వహించడం జరుగుతుందని డీన్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ఆచార్య సత్యనారాయణ చారి ఒక ప్రకటనలో తెలిపారు. ఓయు సెట్‌- 2016 ఎంట్రెన్స్‌ పరీక్ష ఎంబిఎ కోర్సులో ఉత్తీర్ణులై ర్యాంకు పొందిన అభ్యర్థులు కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని పేర్కొన్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌లో జరుగుతుందని, ఇందుకు సంబంధించిన ...

Read More »

రివ్యూ: పెళ్లి చూపులు

తారాగణం: విజయ్‌ దేవరకొండ.. రీతూ వర్మ.. నందు.. అభయ్‌ కురువిల్లా.. ప్రియదర్శన్‌ తదితరులు సంగీతం: వివేక్‌ సాగర్‌ ఛాయాగ్రహణం: నగేష్‌ బెగెల్లా కూర్పు: రవితేజ నిర్మాతలు: రాజ్‌ కందుకూరి, యష్‌ రంగినేని సమర్పణ: డి.సురేష్‌బాబు రచన-దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌ సంస్థ: ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ విడుదల: 29-07-2016 ఈ మధ్య పెద్ద, చిన్నా అనే తేడా లేదు. సినిమాలన్నీ హంగు, ఆర్భాటాలపైనే దృష్టి పెట్టాయి. ప్రేక్షకులకు ఏం కావాలి? మనం ఏం ఇస్తున్నాం? అనే విషయాల్ని పూర్తిగా పక్కన పెట్టేశాయి. దానికి ...

Read More »

పవన్ కల్యాణా..? ఆయనెవరు..?

పవన్ కల్యాణా.. ఆయనెవరు? అని ప్రశ్నించాడు ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేత ఒకరు. ఆ పార్టీకి దక్షిణాది వ్యవహారాల ఇన్ ఛార్జ్ అయిన సోమ్ నాథ్ భారతి ఇవాళ తిరుపతి వచ్చారు. శ్రీవారి దర్శనం చేసుకున్నాక మీడియాతో మాట్లాడారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లోనూ తమ బలం ప్రదర్శిస్తామని ఆయనన్నారు. భావసారూప్యం గల పార్టీలతో పొత్తుల అంశం చర్చకు వచ్చినపుడు పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకుంటారా అని విలేఖరులు అడిగారు. అపుడు ఆయనిచ్చిన సమాధానం విని వారంతా అవాక్కయ్యారు. ...

Read More »

ఇన్‌స్టంట్ పిజా

కావల్సినవి:   పిజా బేస్‌ కోసం: మైదా – రెండుకప్పులు, డ్రై ఈస్ట్‌ – రెండు చెంచాలు, చక్కెర – చెంచా, నూనె – ఒకటిన్నర టేబుల్‌స్పూను, పాలు – పావుకప్పు, ఉప్పు- కొద్దిగా.   టాపింగ్‌ కోసం: క్యాప్సికం – రెండు, పుట్టగొడుగుల ముక్కలు – ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ – ఒకటి, ఆలివ్‌లు – పన్నెండు, చీజ్‌ తరుగు – రెండు కప్పులు, పిజా సాస్‌ – పావుకప్పు (బజార్లో దొరుకుతుంది), డ్రైడ్‌ ఆరెగానో – చెంచా, మిరియాలపొడి – అరచెంచా, ...

Read More »

మంత్రి కేటీఆర్‌‌కు చేదు అనుభవం

      కరీంనగర్: జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌‌కు చేదు అనుభవం ఎదురైంది. కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి మున్సిపల్ కార్పోరేషన్ మేయర్లు, కమీషనర్‌‌ల సమావేశం జరిగింది. సమావేశానంతరం మంత్రి కేటీఆర్‌‌‌ హైదరాబాద్ బయలుదేరారు. కాగా అప్పటికే ఎంసెట్‌‌-2 రద్దును నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. అటుగా వచ్చిన కేటీఆర్‌‌ కాన్వాయ్‌‌కు అడ్డుపడ్డారు. రోడ్డుకు అడ్డంగా నిలబడి మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టి పలువురిని అరెస్ట్ చేశారు.

Read More »

‘అందుకే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు’

న్యూ ఢిల్లీ: ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో టీడీపీ నేత స్పష్టం చేశారు. “సీఎం చంద్రబాబు ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆయన్ను తొక్కాలనే ప్రయత్నంలోనే ఇదంతా జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. బాబు సెంట్రల్‌కు వచ్చి ఎదుగుతాడనే భయంతో కేంద్రం ఈ పని చేస్తోందని ఆయన చెప్పారు. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని” టీడీపీ నేత స్పష్టం చేశారు.   ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. హోదా వస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. “ఆ రోజు రాష్ట్రాన్ని ...

Read More »

విశాఖలో భారీ మెడికల్‌ ప్రాజెక్టు

ఆగస్టు 19న శంకుస్థాపనకు సన్నాహాలు ఎఎంటిజెడ్‌పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  విశాఖ సిగలో మరో కలికితురాయి చేరనున్నది. ఆసియా ఖండంలోనే తొలి అత్యంత అధునాతన వైద్య పరికరాల తయారీ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ మెడికల్‌ టెక్నాలజీ జోన (ఎఎంటిజెడ్‌) పేరుతో ఏర్పాటవుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఆగస్టు 19వ తేదిన శంకుస్థాపన జరపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చజెండా ఊపారు. ఇదే సందర్భంలో అంతర్జాతీయంగా పేరొందిన వైద్య సాంకేతిక పరికరాల తయారీదారులతో విశాఖలో శిఖరాగ్ర సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. మూడు ప్రధానమైన ...

Read More »

రహానే సెంచరీ..భారత్ 500/9 డిక్లేర్డ్

కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. రహానే సెంచరీ( 237 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు)తో చెలరేగడంతో భారత్ మ్యాచ్‌ను శాసించే స్థాయికి చేరింది. 9 వికెట్లు కోల్పోయిన భారత్ 500 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది.  304 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. మూడు రోజు వరుణుడు అడ్డుపడటంతో ఆటకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆటను ముగిస్తున్నట్లు అంపెర్లు ప్రకటించారు. ఓవర్‌నైట్ స్కోరు 358/5తో ఇన్నింగ్స్ కొనసాగించిన రహానే, సాహా (47)తో కలిసి ఆరో ...

Read More »

ఆమెకు కేన్సర్.. శునకాన్ని చివరి సారిగా చూడాలనుకుంది.. ఓనర్ని చూసిన శునకం ఏం చేసింది?

ప్రాణాలు పోతున్నాయని తెలియరాగానే తమ ఆశలు నెరవేర్చాలని కోరుతారు. ఈ క్రమంలో కొందరు పేషెంట్స్ తమ అభిమాన నటుల్ని చూసేందుకు ఇష్టపడతారు. అయితే ఈ మహిళ మాత్రం తాను అల్లారుముద్దుగా పెంచుకున్న శునకాన్ని చూడాలనుకుంది. ఆమె కోరిక మేరకు ఆ శునకాన్ని చూపించిన వైద్యులు.. పెంపుడు కుక్కతో ఆమె కోసం ఎలా తపించిందో చూసి కంటతడి పెట్టారు. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌కు చెందిన రీబాన్ చిలీ(49) టెర్మినల్ కేన్సర్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. ఆమె పరిస్థితి రోజురోజుకూ విషమించడంతో క్రమంగా మరణానికి చేరువైంది. చనిపోయే ...

Read More »

ఎంసెట్-3పై నేడు నిర్ణయం

♦ సీఎంతో చర్చించాక ప్రకటిస్తాం: డిప్యూటీ సీఎం కడియం ♦ లీకేజీపై దర్యాప్తులో ఎన్నో విషయాలు బయటకొస్తున్నాయి ♦ అనేక సంవత్సరాలుగా లీకేజీ దందా కొనసాగుతోంది హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి మంగళవారం ఎంసెట్-3 షెడ్యూల్ విడుదలపై నిర్ణయం ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. కోర్టు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. ఎంసెట్-2 లీకేజీపై సీఐడీ అధికారుల విచారణలో ఎన్నో విషయాలు బయటికి వస్తున్నాయని, ప్రొఫెషనల్స్‌తో కూడిన టీం అనేక సంవత్సరాలుగా లీకేజీ దందా సాగిస్తున్నట్టు గుర్తించామని ...

Read More »