Breaking News

నల్లవాగు మత్తడిలోకి తగ్గని వరద

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్సింగ్‌రావుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోగల నల్లవాగు మత్తడిలోకి నీటి ఉధృతి భారీగా కొనసాగుతుంది. నల్లవాగు ఎగువ భాగంలోగల మెదక్‌ జిల్లాలోని కల్లేర్‌, కంతి మండలాల్లో భారీ వర్షాలకు నీటి ఉదృతి కొనసాగుతుంది. నాలుగు రోజులుగా వర్షాలు కురియడంతో నీటి ప్రవాహం అధికంగా రావడంతో మత్తడి పైనుంచి నీరు పొంగి పొర్లుతుంది. మత్తడి పూర్తిస్థాయిలో నీరు నిండి అదనంగా వస్తున్న నీరు మత్తడిపైనుంచి పొంగి పొర్లి గోదావరిలోకి వెళుతున్నాయి. కుడి, ఎడమ కాలువ ఆయకట్టుకు నీరు పంట పొలాలకు వెళుతున్నాయి. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మత్తడి ఎగువ భాగంలోగల వెల్గనూరు, మంగుళూరు గ్రామాల మద్యలో మత్తడి వంతెన నిర్మాణం పనులు నిలిచిపోయాయి. నీటి ప్రవాహం పెరగడంతో పనులకు ఆటంకం కలిగింది. నీటి ఉదృతి తగ్గగానే పనులు కొనసాగిస్తామని గ్రామస్తులు తెలిపారు.

Check Also

రూ. 3 లక్షల విలువ చేసే గుట్కా, జర్దా స్వాధీనం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు ...

Comment on the article