Breaking News

Daily Archives: August 3, 2016

జిఎస్‌టి బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది.’ ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా యావత్ సభ మద్దతు తెలిపింది. జిఎస్‌టికి మద్దతు తెలిపిన సందర్భంలో సభలో 197 మంది సభ్యులు సభలో ఉన్నారు. జిఎస్‌టి చట్టం రూపు సంతరించుకొని అమలులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఒకటే పన్ను అమలులోకి రానుంది. జిఎస్‌టి బిల్లును స్వాగతిస్తున్నాం : కెటిఆర్‌ జిఎస్‌టి బిల్లును తాము స్వాగతిస్తున్నామని తెలంగాణ మంత్రి కెటిఆర్‌ అన్నారు.

Read More »

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ నల్లగొండలో జరుగనుంది. ఆగస్టు 5, 6 తేదీలలో జరగబోయే ఈ ప్రతినిధుల సభకు రాష్ట్రం నుండి దేశం నుండి 2 వేల మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ సమావేశాల్లో జాగృతి పదేళ్ల ప్రస్థానం యొక్క సింహావలోకనం తో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆగస్టు 5 వ తేదీన నల్లగొండలో తెలంగాణ జాగృతి స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్ ను అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారు. అనంతరం రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో గత ...

Read More »

అసమర్థ మంత్రులు రాజీనామా చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంసెట్‌-2 నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మయ్యలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని తెలంగాణ నవనిర్మాణ్‌ విద్యార్థిసేన డివిజన్‌ అద్యక్షుడు వినయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం కామారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఎంసెట్‌-3 నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీకేజీకి కారణమైన మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మణ్‌లపై చర్యలు తీసుకోవాలన్నారు. వారిపై సిబి సిఐడి విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ...

Read More »

భిక్షాటన చేపట్టిన రెండవ ఏఎన్‌ఎంలు

మోర్తాడ్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ ప్రభుత్వ కార్యాలయాల్లో, దుకాణ సముదాయాల వద్ద మండల 2వ ఏఎన్‌ఎంలు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 17 రోజులుగా రెండవ దఫా సమ్మె చేస్తున్నప్పటికి ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా సమ్మె చేస్తున్న 2వ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించి జీవో అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

  మోర్తాడ్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఇంటింటికి, ప్రభుత్వ కార్యాలయాల ముందు ప్రతి ఉద్యోగి మొక్కలునాటి సంరక్షించాలని మోర్తాడ్‌ ప్రభుత్వ వైద్యులు మోహన్‌బాబు, రవికుమార్‌, లక్ష్మి, సునంద అన్నారు. బుధవారం మోర్తాడ్‌ ప్రభుత్వ ఆసుపత్రి ముందు హరితహారంలో బాగంగా ప్రభుత్వ వైద్యులు, సూపర్‌వైజర్లు, నర్సులు, ఏఎన్‌ఎంలు మొక్కలునాటి నీరుపోశారు.  

Read More »

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

మోర్తాడ్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ఫీల్డ్‌ అసిస్టెంట్లు మోర్తాడ్‌ ఎంపిడివో కార్యాలయం ముందు బుధవారం సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి, ఎంపి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సిఎం కెసిఆర్‌ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల వేతనాలు పెంచినందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని, అంతేగాకుండా వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి నర్సయ్య, టెక్నిషియన్లు సాగర్‌, నవీన్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఛైర్మన్‌ను అభినందించిన ఖమ్మం జిల్లా సొసైటీ ఛైర్మన్లు

– రైతుల, సభ్యుల సహకారంతోనే అభివృద్దిచేశా మోర్తాడ్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడు జిల్లాల సరిహద్దు మారుమూల గ్రామమైన తాళ్ల రాంపూర్‌ సొసైటీని, రైతులను అన్ని విధాలుగా అతి చిన్నవయసులోనే అభివృద్ది పరిచి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపిన ఘనత తాళ్లరాంపూర్‌ సొసైటీ ఛైర్మన్‌ డిసిసిబి డైరెక్టర్‌ సోమ చిన్నగంగారెడ్డిదేనని ఖమ్మం జిల్లా డిసిసిబి అధ్యక్షుడు మూహ విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే, మాజీ డిసిసిబి అధ్యక్షుడు కొండబాల కోటేశ్వర్‌రావు, ఖమ్మం జిల్లా సిఇవో నాగ చిన్నారావు, డిఆర్వో ఎస్‌బిబి వెంకటేశ్వర్‌రావు, ...

Read More »

సింగీతం ప్రాజెక్టులోకి స్వల్పంగా నీరు

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సింగీతం ప్రాజెక్టు జలాశయంలోకి కురుస్తున్న వర్షాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఎగువ భాగంలోగల పెద్దగుట్ట, గౌరారం, కోనాపూర్‌, గండివేట్‌ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు జలాశయంలో సుమారు 900 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. భారీ వర్షాలు కురిస్తే ఒకేసారిగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోతుందని రైతులు అంటున్నారు.

Read More »

కాకతీయ కెనాల్‌ ద్వారా నీటి విడుదలతో భూములకు సాగునీరు

– ఆర్థిక మంత్రి ఈటెల మోర్తాడ్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరాంసాగర్‌ కాకతీయ కెనాల్‌ ద్వారా నీటిని విడుదల చేయడంతో 6 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింద కాకతీయ కెనాల్‌ ద్వారా 2200 క్యూసెక్కులు, దాంతోపాటు వరద కాలువ ద్వారా మరో 2200 ...

Read More »

బంగారు తెలంగాణలో రోడ్డు ఇదేనా…

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకొని దాదాపు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా బంగారు తెలంగాణ సాధించుకుందామని నేతలు అంటున్నా ప్రధాన రహదారుల దుస్థితి చూస్తుంటే బంగారు తెలంగాణ ఇప్పట్లో సాద్యమేనా అని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రహదారిగా కామారెడ్డి డివిజన్‌లో గల హెచ్‌ఎంబి రోడ్ల దుస్థితి ఈ గ్రామాల్లో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, రహదారి చూస్తుంటే ఎవరికైనా ఆగ్రహం రాక తప్పదు. ప్రతీరోజు వేలాది వాహనాలు తిరిగే ఈ రోడ్డు త్వరలో ...

Read More »

ఆగష్టు 17 నుంచి లా పరీక్షలు

డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎల్‌ఎల్‌బి రెండవ, నాల్గవ, ఎల్‌ఎల్‌ఎం రెండవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు ఆగస్టు 17 నుంచి మొదలవుతాయని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్‌ ఐదుసంవత్సరాల కోర్సు ఎంఎ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌, ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు ఫార్మాసూటికల్‌ కెమిస్ట్రీ రెండవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు ఆగష్టు 17 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. టైంటేబుల్‌ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.

Read More »

హాస్టల్స్‌ పరిశీలించిన రిజిస్ట్రార్‌

  డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో పిజి తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌రావు, ప్రిన్సిపాల్‌ ఆచార్య కనకయ్యతో కలిసి హాస్టల్స్‌లో వసతులను పరిశీలించారు. హాస్టల్స్‌ మొత్తం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, వంటశాలలో కట్టెల బదులు గ్యాస్‌ పొయ్యిలు ఏర్పాటు చేయాలని వారు సూచించారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు, కారిడార్లు, వసతి గదులు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యుత్‌ దీపాలు, లీకేజీలు రిపేరు చేయించాలని తెలిపారు. మంచినీటి సౌకర్యంకల్పించాలని, అవసరమైన చోట సున్నం ...

Read More »