Breaking News

Daily Archives: August 4, 2016

2వ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించాలి

మోర్తాడ్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెచేస్తున్న 2వ ఏఎన్‌ఎంలను వెంటనే రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించి అమలు చేయాలని ఏఐకెఎంఎస్‌ జిల్లా కార్యదర్శి సారాసురేశ్‌, మండల కార్యదర్శి కిషన్‌, తెలంగాణ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు సత్తెక్కలు అన్నారు. గురువారం మోర్తాడ్‌లో సమ్మె చేస్తున్న ఏఎన్‌ఎంల శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిఎం కెసిఆర్‌ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించి జీవో జారీచేయాలని, లేనియెడల ...

Read More »

కాకతీయ వరద కాలువ ద్వారా నీటి విడుదల

  మోర్తాడ్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాకతీయ, వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు చెందిన నీటిని విడుదల చేయడం పట్ల ఆయా గ్రామాల రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా వర్సాలు లేక కాలువలు ఎండిపోయి, బోసిపోయాయి. ఇటీవల వర్షాలు కురియడం, ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి నీరు రావడంతో కాకతీయ వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో ఆయా ప్రాంత చెరువులను నీటితో నింపుకోవచ్చని, భూగర్భజలాలు సైతం పెరుగుతాయని రైతులు ...

Read More »

ప్రజలకు మరింత సేవలందించేందుకే బిఎల్‌ఇ కేంద్రాల ఏర్పాటు

మోర్తాడ్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల్లోనే ప్రజలకు అన్ని విధాలుగా మరింత సేవలందించేందుకే బిఎల్‌ఇ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జడ్పిటిసి ఎనుగందుల అనిత, సర్పంచ్‌ తుమ్మల మారుతలు అన్నారు. గురువారం మండలంలోని తాళ్ల రాంపూర్‌ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో బిఎల్‌ఇ కేంద్రాన్ని ప్రారంభించి వారు మాట్లాడారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, కార్యదర్శి స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

తెరిచి ఉన్న చెరువు తూము గేటు

– వృధాగా పోతున్న నీరు మోర్తాడ్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తడపాకల్‌ గ్రామంలోగల ఊరచెరువు తూము గేటు తెరిచి ఉండడంతో వృదాగా వర్షపు నీరు బయటకు పోతుంది. ఇటీవలే గత రెండు నెలల క్రితం మిషన్‌ కాకతీయ పథకం కింద మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిలు ప్రారంభించారు. తూము పనులు, కాలువ పనులు సక్రమంగా చేపట్టకపోవడం వల్ల చెరువులకు వచ్చిన వర్సపు నీరు వృధాగా పోతుండడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్‌ ...

Read More »

ఇళ్ళ స్థలాల కబ్జాకు పాల్పడిన భూ ఆసామి

భూ ఆసామిపై చర్యలు చేపట్టి తిరిగి ఇళ్ళ స్థలాలు అందించాలి మోర్తాడ్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తడపాకల్‌ గ్రామానికి చెందిన ఇందిరమ్మ లబ్దిదారులు గురువారం మోర్తాడ్‌ తహసీల్‌ కార్యాలయానికి తరలివచ్చి బైఠాయించి ధర్నా నిర్వహించారు. గతప్రభుత్వం 2013లో తమ గ్రామానికి చెందిన 98 మందికి ఇళ్ళ స్థలాల పట్టాలను అందించిందని, అంతేగాకుండా రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి సరిహద్దులు నిర్ణయించి రాళ్ళు పాతి తమకు ఇళ్ళ స్థలాలు చూపించారని లబ్దిదారులు తహసీల్దార్‌కు విన్నవించారు. భూమిని విక్రయించిన రైతు ...

Read More »

సమృద్ధిగా వర్షాలు – నీట మునిగిన పంటలు

బీర్కూర్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారంరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గాను మండలంలో వాగులు, వంకలు పొర్లుతూ చెరువులు నిండుతున్నాయి. గత మూడు సంవత్సరాలుగా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్న రైతన్న సమృద్ధిగా వర్షాలు కురియడంతో విరిసిన సంతోషం కొన్ని రోజుల్లోనే వాడిపోయింది. వేసిన పంటలు నీటిలో మునిగిపోతున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా వర్షాలు లేకపోవడంతో అప్పుల పాలయ్యామని, వర్షాలు పడడంతో అప్పుల తీసుకొచ్చి పంటలు వేస్తే పంటలు మునిగిపోయాయని ఆవేదన ...

Read More »

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి

– ప్రధానికి విన్నవించిన ఎంపి కవిత నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో పచ్చబంగారు లోకం గా ప్రసిద్ది చెందిన జిల్లా నిజామాబాద్‌. తెలంగాణ ప్రాంతంలో 35 శాతం పసుపు సాగుచేసి దేశంలోనే అత్యధికంగా పసుపు పండించే జాబితాలో చోటుంది. కాగా ఆర్మూర్‌ ప్రాంతంలోనే 70 శాతం పసుపు పండిస్తూ పేరెన్నికగన్న ప్రాంతం. కానీ ఇంతటి ఘన చరిత్ర గల ఈ ప్రాంత రైతులనుగానీ, పసుపు పంటపై గానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవనే ...

Read More »

కలుషిత నీటిని తాగేదెలా…

– మాజీ సర్పంచ్‌ గంగారాం బీర్కూర్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని పలు వార్డుల్లో మంచినీటి ట్యాంకు ద్వారా కలుషిత మైన నీరు వస్తున్నాయని వాటిని తాగేదెలా అంటూ మాజీ సర్పంచ్‌ గంగారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాదులు ప్రబలుతున్న దృష్ట్యా పైపులైన్ల లీకేజీ వల్ల నీటి కుళాయిలో మురికినీరుచేరి పలువురు తీవ్ర అనారోగ్యం పాలయ్యారని ఆయన అన్నారు. సేకరించిన నీటిని మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌కు చూపించి తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. గత ...

Read More »

నసురుల్లాబాద్‌ ఎస్‌ఎంసి ఛైర్మన్‌గా నారాయణ

బీర్కూర్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నసురుల్లాబాద్‌ ఉన్నత పాఠశాలలో గురువారం ఎస్‌ఎంసి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ప్రధానోపాద్యాయులు రమేశ్‌ తెలిపారు. ఛైర్మన్‌గా నారాయణ, వైస్‌ఛైర్మన్‌గా లక్ష్మిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆయన అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాఠశాలను అబివృద్ది పథంలోకి తీసుకొస్తానని నూతన ఛైర్మన్‌నారాయణ అన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

పోలీసుల ఆకస్మిక తనిఖీలు

– 59 వాహనాల సీజ్‌ కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం కార్టన్‌ సర్చ్‌ నిర్వహించినట్టు రూరల్‌ సిఐ కోటేశ్వర్‌రావు తెలిపారు. ముగ్గురు ఎస్‌ఐలు, 45 మంది సిబ్బందితో కలిసి వివిధ గ్రామాల్లో సోదాలు జరిపామన్నారు. సదాశివనగర్‌ మండలం కుప్రియాల్‌ గ్రామంలో నిర్వహించిన సోదాల్లో 59 వాహనాలను సీజ్‌ చేసినట్టు తెలిపారు. నెంబర్లు, దృవపత్రాలు సరిగా లేని వాహనలను సీజ్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించామన్నారు. వాహన యజమానులపై ...

Read More »

యువకుని ఆత్మహత్య

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామ శివారులోని కల్కినగర్‌ కాలనీలో బుధవారం రాత్రి యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు రూరల్‌ పోలీసులు తెలిపారు. కల్కి నగర్‌లో అద్దెకు నివాసముంటున్న ఇశ్వాక్‌రెడ్డి (29) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ సంతోష్‌ అన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Read More »

మహిళ అదృశ్యం

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణం పెద్దమ్మగల్లికి చెందిన దశమ్‌గారి పోచమ్మ కనిపించడం లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపారు. పోచమ్మ వయసు 60 సంతవ్సరాలు ఉంటుందని, మతి స్థిమితం సరిగా లేదని, ఈనెల 1వ తేదీ నుంచి కనిపించకుండా పోయిందని చెప్పారు. బంధువుల ఇంట్లో వెతికినా ఫలితం లేదన్నారు. ఎవరైనా గుర్తిస్తే పట్టణ పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ అన్నారు.

Read More »

పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వండి

  – తెవివి వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య డిచ్‌పల్లి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధ్యాపకులు పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, టీచింగ్‌తో పాటు యూనివర్సిటీలో విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరముందని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య అన్నారు. గురువారం ప్రధాన క్యాంపస్‌లో తర్వాత సౌత్‌ క్యాంపస్‌ భిక్కనూరులో ఆయన మాట్లాడారు. అధ్యాపకులు, ఇతర సిబ్బంది కలిసి మెలిసి టీం వర్క్‌గా పనిచేసి వర్సిటీలో మంచి అకడమిక్‌ వాతావరణం నెలకొల్పాలన్నారు. అధ్యాపకులు, అకడమిక్‌ కన్సల్టెంట్‌లు పరిశోధనల మీద దృష్టి పెట్టి, ...

Read More »

మొక్కలు సంరక్షించాలి

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు హరితహారం పథకం కింద గ్రామాల్లో నాటిన మొక్కలను సంరక్షణ చేసే బాధ్యత తీసుకోవాలని పిఆర్‌డి ఎస్‌సి దుర్గాప్రసాద్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు సరఫరా చేసిన మొక్కల వివరాలను రిజిష్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో రోడ్లు, శ్మశాన వాటికలు, పాఠశాలలు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నాటిన మొక్కలకు కంచెలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

Read More »

ట్రాన్స్‌ఫార్మర్‌ సరే… మరి కనెక్షన్‌ ఏది..

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సమీకృత హాస్టల్‌ భవనానికి ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసినా కనెక్షన్‌ ఇవ్వడం మరిచిపోయారు. ప్రభుత్వం లక్షలు వెచ్చించి హాస్టల్‌ అవసరాలు విద్యుత్‌ ఏర్పాటు చేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్‌కు డబ్బులు చెల్లించారు. ఇటీవల ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసినప్పటికి కనెక్షన్‌ ఇవ్వడం మరిచిపోవడంతో అలంకారప్రాయంగా మిగిలింది. ట్రాన్స్‌కో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌కు కనెక్షన్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య

  – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలోని ఉపాధ్యాయులు వారి ప్రతిభను గుర్తెరిగి ఎంపిక చేసుకున్న వారని ఎవరో ఎన్నిక చేసుకున్నవారు కారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ప్రధానోపాధ్యాయుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సమాజంలో విద్యావంతులకు, మేధావులను, జ్ఞానవంతులను వేదికపై సత్కరిస్తారని, డబ్బున్న వారిని కాదని, అలాంటి విద్యావంతులు, జ్ఞానవంతులు, మేధావులుగా ఏర్పడటానికి కేవలం గురువుల ...

Read More »

6న ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి

– జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ జయంతి ఆగష్టు 6న రాష్ట్ర స్థాయి ఉత్సవంగా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. తదనుగుణంగా ఈనెల 6న జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఈనెల 6న ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌లో జయశంకర్‌ జయంతి ఉత్సవాలను ...

Read More »

On Plane To Delhi, Sonia Gandhi’s Health Worsened, Say Sources

NEW DELHI:  HIGHLIGHTS Sonia Gandhi had to cut short roadshow in Varanasi Hospitalized in Delhi, remains under observation Dehydrated but stable, say doctors attending to her After Sonia Gandhi was unable to complete her roadshow in Varanasi, she was flown home to Delhi on a chartered plane from Prime Minister Narendra Modi’s constituency. During the flight, the Congress president’s health ...

Read More »

నీ భార్య, కుమార్తె‌పై గ్యాంగ్ రేప్ జరిగితే ఆ బాధ తెలుస్తుంది…

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్ వాదీ పార్టీ నేత అజం ఖాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బులంద్‌షహర్‌లో తల్లీ, కుమార్తెపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని రాజకీయ కుట్రగా ఆయన వ్యాఖ్యానించడంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. నీ భార్య, కుమార్తెపై గ్యాంగ్ రేప్ జరిగితే ఆ బాధ ఏంటో తెలుస్తుందంటూ యూపీకి చెందిన బీజేపీ సీనియర్ నేత ఐపీ సింగ్ బుధవారం ట్వీట్ చేశారు. దీనిపై విమర్శలు వస్తున్నా ఆ ట్వీట్ తొలగించేందుకు ఆయన నిరాకరించారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు సింగ్ తెలిపారు.

Read More »

ప్రచండకు పట్టం

నేపాల్‌ కొత్త ప్రధానమంత్రిగా మావోయిస్ట్‌ సెంటర్‌ అధినేత పుష్పకమల్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ ఎన్నికయ్యారు. ఇంతవరకూ ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలిని వారం క్రితం మద్దతు ఉపసంహరించడం ద్వారా ప్రచండ గద్దెదించేసిన విషయం తెలిసిందే. ప్రధాని కావాలన్న నీ కోరిక నెరవేరుగాక! అని ప్రచండను ఆశీర్వదిస్తూనే, భారతకుట్ర బలంగా పనిచేసిందని పరోక్ష విమర్శలు చేశారు ఓలి. అతిపెద్ద రాజకీయపక్షం నేపాలీ కాంగ్రె్‌సతో పొత్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన ప్రచండకు 595 మంది సభలో 363 ఓట్లుపడ్డాయి. మధేశీ పార్టీలు ఆయనకు అండగా నిలబడ్డాయి. ఓలి ...

Read More »