Breaking News

Daily Archives: August 5, 2016

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి తల్లి తన బిడ్డకు తల్లిపాలే అందించాలని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. కోమలంచ గ్రామంలో అంగన్‌వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ముందుగా గర్బిణీలకు బాలామృతం ప్యాకెట్లతోపాటు ఉడికించిన కోడిగుడ్లను అందజేశారు. గర్భిణీలు, బాలింతలు ప్రతిరోజు అంగన్‌వాడి కేంద్రంలో అందించే పౌష్టికాహారాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Read More »

మహిళా సంఘాలకు మొక్కల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని మహళా సంఘాలకు శుక్రవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ మామిడి మొక్కలను అందజేశారు. మెప్మా ఆధ్వర్యంలో 33 వార్డులో ఉన్న 915 మహిళా సంఘాలకు మెగా ప్లాంటేషన్‌ కార్యక్రమంలో భాగంగా మొక్కలు పంపిణీ చేసినట్టు తెలిపారు. మహిళా సంఘంలోని ఒక్కో సభ్యురాలికి నాలుగు మొక్కల చొప్పున అందజేశామన్నారు. వీటిని ఇంటి ఆవరణలో, ఖాళీ స్థలాల్లో తప్పకుండా నాటాలని సూచించారు. మహిళలు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని మెప్మా అధికారులు, మునిసిపల్‌ ...

Read More »

ఆదర్శపాఠశాలలో ఎస్‌ఎంసి కమిటీ ఎన్నిక

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఎస్‌ఎంసి యాజమాన్య కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బద్రినాథ్‌, ఉపాధ్యక్షులుగా సుజాత, కన్వీనర్‌గా చంద్రకళతో పాటు సభ్యులుగా ప్రవీణ్‌కుమార్‌, పాపయ్య, సాయవ్వ, అమీనా, దుర్గవ్వ, శ్రీదర్‌, సాయిలులను ఎన్నుకున్నారు. నూతన కమిటీని ఎంఇవో బలరాం రాథోడ్‌, ప్రిన్సిపాల్‌ చంద్రకళ ప్రమాణ స్వీకారం చేయించారు.

Read More »

మొక్కల పరిశీలనకు ప్రత్యేక బృందాలు

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం పథకం కింద నాటిన మొక్కలను పరిశీలించేందుకు నిజాంసాగర్‌ మండలానికి బృందాలు వచ్చాయని ఎంపిడివో రాములు నాయక్‌ అన్నారు. ఎంపిడివో కార్యాలయంలో శుక్రవారం బృందం సభ్యులు గంగాధర్‌, భూమేశ్వర్‌, బుచ్చిరాములు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో 7 లక్షలకు పైగా మొక్కలునాటడం జరిగిందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలు నాటడం పూర్తయిందన్నారు. అనంతరం బృందం సభ్యులు మాట్లాడుతూ బీర్కూర్‌, నిజామాబాద్‌, ...

Read More »

రాళ్లు, రప్పలున్న ప్రభుత్వ భూముల్లో బ్లాక్‌ ప్లాంటేషన్లు

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాళ్ళు, రప్పలున్న ప్రభుత్వ భూముల్లో కమ్యూనిటీ భాగస్వామ్యంతో బ్లాక్‌ ప్లాంటేషన్‌ ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. తెలంగాణకు హరితహరం క్రింది ప్రతి మండలంలో ఒక లక్ష మొక్కలు నాటేందుకు అనువైన వివాద రహిత, సాగు యోగ్యంకాని, నిరుపయోగ ప్రభుత్వ భూములను గుర్తించాలని తహసీల్దార్లకు సూచించారు. కనీసం పది ఎకరాలభూమిలో బ్లాక్‌ ప్లాంటేషన్‌ చేపట్టేందుకు సమగ్ర నివేదికలను అందజేసేందుకు ఈనెల ...

Read More »

7న ఉచిత వైద్య శిబిరం

బీర్కూర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 7వ తేదీ ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు సేవాసంఘ్‌ యూత్‌ సభ్యులు తెలిపారు. శశాంక్‌ ఆసుపత్రి వారి సహకారంతో వైద్యులు డాక్టర్‌ మోతిలాల్‌, డాక్టర్‌ చంద్రకళ, డాక్టర్‌ ప్రతాప్‌సింగ్‌, వివిధ రకాల రోగాలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Read More »

బురదలో పడి వ్యక్తి మృతి

  బీర్కూర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాలు సమృద్దిగా కురవడంతో పంట పండించుకోవడానికి పొలాన్ని సిద్దం చేయడానికి వెళ్లిన రైతు బురదలో పడి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ మజీద్‌ఖాన్‌ కథనం ప్రకారం … గ్రామానికి చెందిన గంగాధర్‌ పీరయ్య (45) గురువారం పొలానికి వెళ్లి వరినాట్ల కోసం పొలం సిద్దం చేస్తుండగా అనుకోకుండా గట్టుపై నుంచి కాలు జారి బురదలోపడ్డాడని, నోట్లోకి, ముక్కులోకి బురద వెళ్లడం వల్ల శ్వాసరాక అక్కడికక్కడే మృతి ...

Read More »

యువకుని ఆత్మహత్య

బీర్కూర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యసనాలకు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని నసురుల్లాబాద్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి కథనం ప్రకారం… నసురుల్లాబాద్‌కు చెందిన రాజు (38) చెడు వ్యసనాలకు బానిసై జీవితంపై విరక్తితో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఈయన భార్య, కుమారుడు ఉన్నారు. వీరు గత ఐదు సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు. శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశామన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించామన్నారు.

Read More »

బీర్కూర్‌ ఎస్‌ఎంసి ఛైర్మన్‌గా ప్రవీణ్‌కుమార్‌

బీర్కూర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్‌గా ప్రవీణ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రధానోపాధ్యాయులు శివరాజ్‌ తెలిపారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో శుక్రవారం యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించామని, ఇందులో ఏకగ్రీవంగా ఛైర్మన్‌గా ప్రవీణ్‌కుమార్‌, వైస్‌చైర్మన్‌గా ప్రతిభా కిరణ్‌ ఎన్నికయ్యారన్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పాఠశాల అభివృద్దికి పాటుపడతామని వారన్నారు.

Read More »

స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన

బాన్సువాడ, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలో నిర్మిస్తున్న స్టేడియం నిర్మాణానికి సంబంధించిన స్తలాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. తహసీల్‌ కార్యాలయానికి దగ్గర్లో ఉన్న క్లబ్‌కు సంబంధించిన స్థలాన్ని స్టేడియం నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని వెల్లడించారు. పట్టణంలో సరైన ఆట స్థలం లేక యువతకు పోటీల్లో పాల్గొనలేకపోతున్నారని, దీంతో ఇక్కడ స్టేడియం నిర్మిస్తే బాన్సువాడతోపాటు పరిసర గ్రామాల ప్రజలకు యువతకు అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. ఇందుకు నిధులు మంజూరైనట్టు పేర్కొన్నారు. దీంతోపాటు పట్టణంలో కూరగాయల మార్కెట్‌ ...

Read More »

ఉత్తర తెలంగాణ ఆర్యవైశ్య సదస్సును విజయవంతం చేయాలి

  కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోదావరిఖనిలో ఈనెల 11న నిర్వహిస్తున్న ఉత్తర తెలంగాణ ఐదు జిల్లాల ఆర్యవైశ్య ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన జిల్లా ఆర్యవైశ్య కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సదస్సుకు తమిళనాడు గవర్నర్‌ కొనిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఆర్యవైశ్య హక్కులు, ఐక్యతను చాటిచెప్పేందుక సదస్సు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలోని ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ...

Read More »

ఫిదా చలనచిత్రం ప్రారంభం

బాన్సువాడ, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరుణ్‌తేజ్‌, సాయి పల్లవి జంటగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్‌ సమర్పణలో నిర్మిస్తున్న ఫిదా చలనచిత్రం బాన్సువాడలో అట్టహాసంగా ప్రారంభమైంది. శుక్రవారం బాన్సువాడలో ప్రత్యేక వేసిన ఇల్లు నిర్మాణం సెట్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. దిల్‌రాజు సమర్పణలో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాన్సువాడకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త విఠల్‌రెడ్డి ఇంటి ఆవరణలో హీరోయిన్‌కు సంబంధించిన ఇంటి సెట్‌ను ప్రత్యేకంగా నిర్మించారు. దేవుని పటాలపై ...

Read More »

అభివృద్దిని రెట్టింపు చేస్తా

– విసి ప్రొఫెసర్‌ సాంబయ్య డిచ్‌పల్లి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో గత రెండు సంవత్సరాలుగా జరిగిన అభివృద్దిని తన హయాంలో రెట్టింపు చేసి చూపెడతానని తెవివి వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య అన్నారు. పట్టుదలతో పనిచేసి వర్సిటీని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళతానని విసి స్పష్టం చేశారు. శుక్రవారం తెయు కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల సెమినార్‌ హాల్‌లో జరిగిన అధ్యాపకుల ప్రత్యేక సమావేశంలో విసి ప్రసంగించారు. అకడమిక్‌ సంవత్సరం ప్రారంభమైనందున అధ్యాపకులు క్లాస్‌వర్క్‌ సజావుగా ...

Read More »

విద్యార్థులకు నోటు పుస్తకాల వితరణ

కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పివిపి ఓరియంటల్‌ పాఠశాలలో విద్యార్థులకు నోటుపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఓరియంటల్‌ పాఠశాల విద్యార్థులు అనేక సంవత్సరాలుగా కష్టపడి చదువుతూ 80 నుంచి 100 శాతం ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ఈ సంతవ్సరం సైతం అధిక శాతం విద్యార్థులు ఏ గ్రేడ్‌ సాధించాలని అన్నారు. పాఠశాలకు త్వరలో క్లబ్‌ ఆధ్వర్యంలో డిజిటల్‌ క్లాసుల కోసం ఆర్‌ఓపి పరికరాన్ని అందిస్తామని తెలిపారు. ...

Read More »

పూల మొక్కలు

గులాబి 100 కు పైగా జాతులు కలిగి అనేక రంగులలో లభించే గులాబి , రోసాసీ కుటుంబానికి చెందినది, అన్ని కాలాలలో లభించే ఈ పూపొద లేదా తీగ రోసా జాతికి చెందినది.కాండంపై పదునైన ముళ్ళను కలిగి ఉండే ఈ జాతి తిన్నని పొదలు, పైకి లేదా నేలపై పాకే మొక్కల సముదాయంగా ఉంటుంది.గులాబీలను ముళ్ళు కలిగినవిగా పేర్కొనడం తప్పు. సాధారణంగా రూపాంతరం చెందిన శాఖ లేదా కాండం ముళ్ళు కాగా, గులాబీలో రూపాంతరం చెందిన బాహ్య కణజాలం పదునైన ముందుకు పొడుచుకు వచ్చినట్లు ...

Read More »

ఎమిరేట్స్ క్రాష్ ల్యాండింగ్.. దూకండి.. దూకండి అంటూ సిబ్బంది అరుస్తుంటే ల్యాప్‌టాప్‌ల కోసం మనోళ్లు

త్రివేండ్రం నుంచి దుబాయ్‌కు వెళ్లిన ఎమిరేట్ విమానం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో క్రాష్ ల్యాండింగ్ చేయగా, ఈ ప్రమాదం నుంచి 300 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ముఖ్యంగా విమానం అగ్నికీలల నుంచి కేవలం 90 సెకన్లలో ప్రయాణికులంతా అత్యవసర ద్వారాలా ప్రయాణికులంతా కిందికి దూకేశారు. వీరిలో 226 మంది భారతీయులు, 74 మంది విదేశీయులు ఉన్నారు. ఇక్కడ విచిత్రమేమింటే.. విమానంలో సాంకేతికలోపం తలెత్తినపుడు ఏ ప్రయాణికుడైనా తన ప్రాణాలను కాపాడుకునేందుకు అధిక ప్రాధాన్యతనిస్తాడు. కానీ, ఈ విమానంలో ప్రయాణించిన చాలా మంది తమ ...

Read More »

ఎమిరేట్స్‌ విమానం ఎందుకు కూలింది?

క్రాష్‌ ల్యాండింగ్‌పై వివరాలు వెల్లడించని సంస్థ విమానాల రద్దుతో శంషాబాద్‌లో ఆందోళన  :ఎమిరేట్స్‌ విమానం క్రాష్‌ ల్యాండింగ్‌కి కారణమేంటి? బుధవారం ఉదయం తిరువనంతపురం నుంచి బయల్దేరిన విమానం దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో క్రాష్‌ ల్యాండింగ్‌ అయిన సంగతి తెలిసిందే. కిందికి దిగే సమయంలో ల్యాండింగ్‌ గేర్‌ బయటకు రాకుండానే.. విమానం పొట్టభాగంతో వేగంగా దేకుతూ రన్‌వేపై దూసుకెళ్లింది. కానీ, ఈ ప్రమాదానికి కారణంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ.. ఫ్లైట్‌ ...

Read More »

విందుకు పిలిచి అవమానించాలనుకున్న పాక్! చిత్తు చేసిన రాజ్‌నాథ్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ హోం మంత్రుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను పాక్ విందుకు పిలిచి అవమానించాలనుకుంది. ఈ విందును పాక్ హోం మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ ఏర్పాటు చేశారు. సార్క్ సదస్సులో ప్రధాన కార్యక్రమం ముగియగానే రాజ్‌నాథ్‌కు విందు ఇవ్వాలనేది ప్లాన్. అయితే సరిగ్గా సదస్సు ముగియగానే విందు సమావేశం నుంచి పాక్ హోం మంత్రి మాయమయ్యారు. ఈ విషయం రాజ్‌నాథ్‌కు తెలుసో లేదో కానీ ఆయన కూడా విందుకు స్కిప్ అయ్యారు. ...

Read More »

కేసీఆర్ తిన్న హైకోర్టు మొట్టికాయలు ఇవే..

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టుతో మొట్టికాయలు పెట్టించుకోవడం కొత్తేమి కాదు. ఎన్నో అంశాల్లో.. ఎన్నోసార్లు కోర్టు చేత మొట్టికాయలు పెట్టించుకుంది. రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోయింది. ఈ రెండు సంవత్సరాల్లో ఏ రాష్ట్రం నమోదు చేయని ఒక రికార్డును తెలంగాణ ప్రభుత్వం నమోదు చేసింది. ఆవేశంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం.. దీని నుండి తీవ్ర వ్యతిరేకత ఏర్పడటం.. ఆఖరికి వ్యవహారం కాస్త కోర్టుకు వెళ్లడం..అక్కడ చివాట్లు తినడం ఇదే సరిపోయింది.   * రాష్ట్ర విభజన జరిగి అధికారంలోకి వచ్చిన ...

Read More »

జీఎస్టీకి గ్రీన సిగ్నల్‌

తంత్రభారత చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణల బిల్లును రాజ్యసభ బుధవారం ఆమోదించింది. పెద్దల సభలో వస్తుసేవల బిల్లు(జీఎస్టీ)ను గట్టెక్కించడానికి ఏడాదికాలంగా మోదీ ప్రభుత్వం చేసిన కసరత్తు ఎట్టకేలకు ఫలించింది. ఇప్పుడు రాజ్యసభలో సంతరించుకున్న కొత్త సవరణలను లోక్‌సభ ఆమోదించవలసి ఉన్నా అది నామమాత్రమే. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ కల్లా జీఎస్టీని అమలు చేయాలని బలంగా అనుకుంటున్న కేంద్రప్రభుత్వం ముందు రాష్ట్రాలన్నింటితోనూ దీనిని ఆమోదింపచేయాల్సిన ప్రధాన లక్ష్యం ఉన్నది. సగానికిపైగా రాష్ట్రాలు రాజ్యాంగ సవరణకు సమ్మతి తెలిపి శాసనసభల్లో చట్టాన్ని ఆమోదించి అన్వయించుకొన్నాక, ...

Read More »