Breaking News

ఉత్తర తెలంగాణ ఆర్యవైశ్య సదస్సును విజయవంతం చేయాలి

 

కామారెడ్డి, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోదావరిఖనిలో ఈనెల 11న నిర్వహిస్తున్న ఉత్తర తెలంగాణ ఐదు జిల్లాల ఆర్యవైశ్య ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన జిల్లా ఆర్యవైశ్య కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సదస్సుకు తమిళనాడు గవర్నర్‌ కొనిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఆర్యవైశ్య హక్కులు, ఐక్యతను చాటిచెప్పేందుక సదస్సు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలోని ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌రావు, ప్రతినిధులు జగన్‌, శివకృష్ణమూర్తి, బాలచంద్రం, నాగేశ్వర్‌రావు, మహేశ్‌ గుప్త, ఏంఎసి ఉపాధ్యక్షుడు గౌరీశంకర్‌, రమేశ్‌ గుప్త, రత్నకుమార్‌, కౌన్సిలర్‌ ముప్పారపు ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article