Breaking News

Daily Archives: August 6, 2016

తల్లిపాలే బిడ్డకు అమృతం

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లిపాలు బిడ్డకు అమృతంలా ఉపయోగపడతాయని, బిడ్డకు తప్పకుండా పాలివ్వాలని అంగన్‌వాడి సూపర్‌వైజర్‌ మాధురి అన్నారు. శనివారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీ అంగన్‌వాడి కేంద్రంలో గర్భిణీలు, తల్లులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ తల్లులు తగిన సమయంలో పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పాలు ఎక్కువగా వస్తాయన్నారు. తల్లులు తప్పనిసరిగా పిల్లలకు తమ పాలు పట్టాలని, తద్వారా పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ అరుణ, ...

Read More »

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలి

బిసి విద్యార్థి సంఘం జాతీయ కో ఆర్డినేటర్‌ రిషి అరుణ్‌ కుమార్‌ కామారెడ్డి ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని బిసి విద్యార్థి సంఘం జాతీయ కో ఆర్డినేటర్‌ రుషి అరున్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి పట్టణంలో శనివారం నిర్వహించిన బిసి విద్యార్థి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బిసి, ఎస్సీ, ఎస్టీ స్కాలర్‌షిప్‌లను వెంటనే నెలకు రెండు వేలకు పెంచాలని ...

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

కామారెడ్డి ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 13వ వార్డులో సిసి రోడ్డు నిర్మాణ పనులను శనివారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు 4 లక్షల రూపాయలతో సిసి రోడ్డు పనులను చేపట్టినట్టు ఆమె తెలిపారు. ప్రగతి పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టరును ఆదేశించారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, నాయకులు రవిగౌడ్‌, లక్ష్మి, విజయ, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా ప్రొఫెసర్‌ జయంతి వేడుకలు

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం ఆచార్య జయశంకర్‌ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు కార్యాలయాల్లో, కులసంఘాల ఆధ్వర్యంలో జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాదనే ద్యేయంగా తన జీవితం మొత్తం తెలంగాణ కోసం అర్పించిన మహనీయుడు జయశంకర్‌ సార్‌ అని కొనియాడారు. తెలంగాణ సాదనలో జయశంకర్‌ సార్‌ పాత్ర ఎనలేనిదని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆర్డీవో ...

Read More »

ఘనంగా ఆచార్య జయశంకర్‌ జయంతి

  నందిపేట, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డొంకేశ్వర్‌ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్‌ జి.హరిదాస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్దాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో తెరాస గ్రామ అధ్యక్షుడు మల్లారెడ్డి, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు, ఉపసర్పంచ్‌ బషీర్‌, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్‌ సార్‌ త్యాగాలను కీర్తించారు. అలాగే మండల కేంద్రంలో తెలంగాణ చౌక్‌ వద్ద జేఏసి కన్వీనర్‌ ...

Read More »

గ్రామస్తుల సహకారంతో ఉర్దూ పాఠశాల అభివృద్ది

  నందిపేట, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామస్తుల సహకారంతో పాఠశాలను అభివృద్ది పథంలో నడిపిస్తానని నందిపేట ఉర్దూ పాఠశాల ఛైర్మన్‌ రఫీ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జడ్పిహెచ్‌ఎస్‌ (ఉర్దూమీడియం) ప్రధానోపాధ్యాయులు ఇలియాస్‌ ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్య కమిటీని ఎన్నుకున్నారు. ముందుగా 6,7,8 తరగతుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులను తరగతికి ముగ్గురు చొప్పున అందులో ఒక్కరు పురుషుడు, ఇద్దరు మహిళల చొప్పున మొత్తం 9 మందిని స్కూల్‌ డైరెక్టర్లుగా ఎన్నుకున్నారు. వారిలోంచి ఛైర్మన్‌గా మహ్మద్‌ రఫీని, వైస్‌ ఛైర్మన్‌గా ...

Read More »

ఆచార్య జయశంకర్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

– జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా వ్యవహరించిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని బంగారు తెలంగాణ ఏర్పాటుకు చిత్తశుద్దితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా పిలుపునిచ్చారు. మార్పును ఆస్వాదించే విధంగా ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. పౌర సేవలను పొందే హక్కు పేద ప్రజలకు కూడా ఉందని గుర్తించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పనితీరులో వేగం పెరగాలని, ...

Read More »

ప్రొఫెసర్‌ జయశంకర్‌ కీర్తి అజరామరం

– విసి ప్రొఫెసర్‌ సాంబయ్య డిచ్‌పల్లి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ 82వ జయంతి వేడుకలు తెలంగాణ యూనివర్సిటీలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య మాట్లాడుతూ జయశంకర్‌ సార్‌ కీర్తి అజరామరంగా నిలిచి ఉంటుందన్నారు. తెలంగాణ ఉన్నంత వరకు జయశంకర్‌ సార్‌ను ప్రజలు గుర్తు పెట్టుకుంటారని విసి తెలిపారు. జయశంకర్‌ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళి తెలంగాణను సమగ్రంగా అభివృద్ది చేయడం నిజమైన నివాళి అని ఆచార్య ...

Read More »

కువైట్లో ఐసిస్ సానుభూతిపరుడు అరెస్ట్

దేశంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) సానుభూతిపరులకు ఆర్థికసాయం చేస్తున్న వ్యక్తిని కువైట్ ప్రభుత్వ సాయంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు పట్టుకున్నారు. 2014లో తనతో పాటు మరో ముగ్గురు స్నేహితులను ఇరాక్ తీసుకెళ్లిన అరీబ్ మజీద్ ఇచ్చిన సమాచారంతో కువైట్ కు చెందిన అబ్దుల్లా హది అబ్దుల్ రెహమాన్ అల్ ఏనేజి అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేయించారు. 2014 మే నెలలో ఐసిస్ కు వెళ్లిన ఈ నలుగురు నవంబర్ లో తిరిగి భారత్ కు వచ్చారు. వీరిపై ...

Read More »

వంద లంచం ఇవ్వలేక… పోలీసులకు ప్రాణాలిచ్చారు

లక్నో: వారు సమాజ రక్షణ కోసం పనిచేయాల్సిన రక్షకభటులు. అందుకే వారికి అపరిమిత అధికారాలిచ్చింది రాజ్యాంగం. అయితే కొంతమంది ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సమాజభక్షణకు దిగుతున్నారు. వంద రూపాయల లంచం ఇవ్వడానికి నిరాకరించారన్న కక్ష్యతో ఇద్దరు యువకులను చచ్చిపోయే వరకు చితక్కొట్టారు పోలీసులు. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలోని ఓ చెక్‌పాయింట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. అక్కడితో వారి అరాచకం ఆగిపోలేదు. ఆ కేసు తమపై రాకుండా చేసేందుకు చక్కటి ప్లాన్‌ కూడా వేశారు. ఆ ఇద్దరు యువకులు తమ నుంచి పారిపోయే ...

Read More »

ఆమెకు 42 సంవత్సరాలు.. ఆఫీస్‌లో సహోద్యోగిని నమ్మితే…

కోయంబత్తూర్ (తమిళనాడు) : ఆమెకు 42 సంవత్సరాలు. ఆమె భర్త పేరు శశి. వారికి ఇద్దరు పిల్లలున్నారు. సొంతూరు కోయంబత్తూర్ అయినప్పటికీ కొద్ది సంవత్సరాల క్రితం కేరళలో స్థిరపడ్డారు. ఆమె త్రిసూర్‌లోని గార్మెంట్ షాప్‌లో పనిచేస్తోంది. త్రిసూర్‌‌కు చెందిన అదే షాప్‌లో పనిచేసే సిజో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. తనకు ఆర్థిక సమస్యలున్నాయని, ఇబ్బందుల్లో ఉన్నానని సిజో ఆమెను నమ్మించాడు. పళనిలో ఆమె చైన్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత చైన్ తిరిగిస్తానని… ఆమెను ...

Read More »

శతకోటి ఆశల ‘రియో’

యావత్ ప్రపంచాన్ని ఏకం చేసే విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌ ఆరంభమయ్యాయి. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ ఆటల పండుగకు బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరం వేదికైంది. దక్షిణ అమెరికా ఖండంలోని ఓ దేశం ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. 17 రోజులపాటు ఉత్కంఠగా సాగే ఈ పోటీలు క్రీడాభిమానులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తనున్నాయి. మొత్తం 206 దేశాలు పాల్గొంటున్న రియో ఒలింపిక్స్‌లో 10,500 మంది క్రీడాకారులు 42 క్రీడాంశాల్లో 306 స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. ఒలింపిక్స్‌ చరిత్రలో తొలిసారిగా శరణార్థుల జట్టు ...

Read More »

సుజనా చౌదరి చప్పట్లు కొట్టడం సరికాదు… మతిలేని పనులంటే ఇవే : చంద్రబాబు

రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై ఉపసభాపతి పీజే కురియన్ రూలింగ్‌ ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ సభ్యులతో పాటు.. కేంద్ర మంత్రి, తెదేపా ఎంపీ సుజనా చౌదరి బల్లలు చరిచడంపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి ఓ విలేఖరి తీసుకొచ్చారు. దీనిపై బాబు స్పందిస్తూ.. ‘కేంద్ర మంత్రిగా ఉండి ఆయనకు అర్థంకాకుండా చేశారో ఏమో తెలీదు గానీ.. అలా చప్పట్లు కొట్టడం సరికాదు. ఇలాంటివే మతిలేని చర్యలంటే’ అని ...

Read More »

ఒకే సినిమాలో అఖిల్, నాగచైతన్య

మనం సినిమా తరువాత మరోసారి అక్కినేని అందగాళ్లు ఒకే సినిమాలో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. మనం సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్లు కూడా ఒకేసారి తెర మీద కనిపించి అక్కినేని అభిమానులకు కనుల విందు చేశారు. ఇప్పుడు మరోసారి వెండితెర మీద ఒకేసారి కనిపించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సారి నాగ్ లేకుండా వారసులిద్దరూ కలిసి ఓ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచే వచ్చిన మరో యంగ్ హీరో సుశాంత్ సినిమాలో అఖిల్, నాగచైతన్యలు అతిథి ...

Read More »

జయశంకర్ కలలుగన్న రాష్ట్రాన్ని నిర్మిస్తాం : హరీష్

మెదక్: జయశంకర్ కలలుగన్న తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మిస్తామని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. మినీ స్టేడియంకు జయశంకర్ పేరు నామకరణం చేయనున్నట్లు హరీశ్‌రావు ప్రకటించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో నిర్వహించిన జయశంకర్ జయంతి వేడుకలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహాన్ని హరీష్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు.

Read More »

US: To stop abuse of family, 14-year-old Ohio girl kills dad as he slept

A 14-year-old Ohio girl fatally shot her father in the head as he slept to stop him from abusing her family, her attorney said on Friday. The girl denied a charge of aggravated murder on Wednesday in Trumbull County Juvenile Court. She has been held in juvenile detention since the early morning shooting on July 28 at her family’s home ...

Read More »

బియ్యం కడిగిన నీళ్లు వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుందట…

ఆ మహిళల జుట్టు పొడవు ఏడు అడుగులపైనే… జీవితంలో జుట్టు కత్తిరింపు ఒకసారి మాత్రమే.. జుట్టు కత్తిరింపు మహా అపచారం చైనా : మహిళల అందాన్ని రెట్టింపు చేసేది రింగురింగుల ఒతైన జుట్టు అని మనందరికీ తెలిసిందే. అందంగా కనిపించేందుకు అతివలు బ్యూటీపార్లర్ లకు వెళ్లి జుట్టును పలు రకాలుగా కత్తిరించుకోవడం సర్వసాధారణం. కాని చైనా దేశంలోని యావో తెగ మహిళలు మాత్రం జుట్టు కత్తిరింపును మహా అపచారంగా భావిస్తారట. ఆ తెగ మహిళలు జీవిత కాలంలో ఒకసారి మాత్రమే అదీ పెళ్లికి ముందు ...

Read More »

వయాగ్రా అక్కర్లేదు… వాటర్‌మెలన్‌ చాలు

లండన్‌: పురుషుల్లో అంగస్తంభన సమస్యకు ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్న పరిష్కారం వయాగ్రా! సిల్డినాఫిల్‌ సిట్రేట్‌ ప్రధానంగా కలిగిన వయాగ్రా, కయాలిస్‌ వంటి టాబ్లెట్లను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలువురు విరివిగా వాడుతున్నారు. అయితే వయాగ్రా టాబ్లెట్ల ఖరీదు చాలా ఎక్కువ. అంత ఖరీదు పెట్టి వయాగ్రా కొనక్కర్లేదని, మనకు మార్కెట్లో చౌకగా లభించే పుచ్చకాయ ఆ పని చేయగలదనీ శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్నారు. 40 ఏళ్లు దాటిన పురుషుల్లో అంగస్తంభన సమస్యకు ప్రధానమైన కారణం రక్తనాళాలు సన్నబడడం. మధుమేహం, అధిక కొవ్వు, అధిక రక్తపోటు వంటి ...

Read More »