Breaking News

Daily Archives: August 7, 2016

సంగంలో ఉచిత వైద్య శిబిరం

బీర్కూర్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సంగం గ్రామంలో ఆదివారం సత్‌ సేవా సంఘ్‌ ఆద్వర్యంలో శశాంక్‌ హాస్పిటల్‌ అండ్‌ ఫౌండేషన్‌ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 800 మంది రోగులు పాల్గొన్నట్టు సంఘం అధ్యక్షుడు మదన్‌సింగ్‌ తెలిపారు. 50 మంది గర్భిణీలు, 100 మంది దంత సమస్యలున్నవారు, కీళ్ళ నొప్పులు, జ్వరం, ఇతర వ్యాధులు గలవారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్టు ఆయన అన్నారు. గ్రామంలో ఉచిత వైద్య ...

Read More »

బాగు చేయరూ…

నందిపేట, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ ప్రాంతంలోని సుధ ఫోటో స్టూడియో ఎదురుగా మెయిన్‌ రోడ్డు మధ్యలో మోకాలంత లోతు గుంత ఏర్పడడంతో వర్షాకాలంలో ద్విచక్ర వాహనదారులు పడి గాయాలపాలవుతున్నారు. ఆర్‌అండ్‌బి అధికారులు గానీ, గ్రామ పంచాయతీ అధికారులు గానీ పట్టించుకొని మరమ్మతులు చేయించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read More »

కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు

నందిపేట, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి నిరసన కార్యక్రమం చేపడతారన్న ముందస్తు సమాచారంతో ముందు జాగ్రత్త చర్యగా 20 మంది కాంగ్రెస్‌ నాయకులను మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద అరెస్టుచేసి పోలీసు స్టేషన్‌కు తరలించామని ఎస్‌ఐ జాన్‌రెడ్డి 08తెలిపారు.

Read More »

ప్రభుత్వం నూతన కల్లు విధానాన్ని రూపొందించాలి

  జైత్రయాత్ర రాష్ట్ర కన్వీనర్‌ రమణ కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నూతన కల్లు విధానం రూపొందించాలని సర్దార్‌ సర్వాయి పాపన్న యాదిలో జైత్రయాత్ర రాష్ట్ర కన్వీనర్‌ రమణ అన్నారు. జైత్రయాత్ర ఆదివారం కామారెడ్డికి చేరుకుంది. జైత్రయాత్ర బృందానికి కామారెడ్దిలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ సర్వాయి పాపన్నజయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని, ట్యాంకు బండ్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో పాపన్న విగ్రహాలు నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 1వ తేదీ ...

Read More »

ఘనంగా నాగుల చవితి

బీర్కూర్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రజలు నాగుల చవితి పండగను ఘనంగా నిర్వహించుకున్నారు. తమ తమ సోదరులు పంట పొలాలకు వెళ్లినపుడు ఎటువంటి విష పురుగులు తాకకుండా ఉండేందుకు, అపాయం జరగకుండా ఉండేందుకు ప్రతి సంవత్సరం నాగుల పంచమి జరుపుతారని ఆయా గ్రామ పెద్దలు తెలిపారు. మహిళలు నాగుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి తమ సోదరులకు పాలతో, నీళ్ళతో కండ్లు కడిగి కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. పంచమి సందర్భంగా రైతులు ఎవరు కూడా పొలాలకు వెళ్లలేదు. పండగ ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 28వ వార్డులో సిసి రోడ్డుపనులను ఆదివారం మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. వార్డులో ఏళ్ళ తరబడిగా రోడ్డు వేయకపోవడంతో వార్డు వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమస్యలు దృష్టికి తీసుకురాగా రోడ్డు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ ప్రభాకర్‌ యాదవ్‌, ఎ.ఇ. గంగాధర్‌, నాయకులు దాత్రిక సత్యం, కృష్ణమూర్తి, చిన్న, రాజేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

శ్రావణమాస రుద్రాభిషేకం

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఆర్‌బి నగర్‌ కాలనీలోగల ఇష్ట కార్యసిద్ది హనుమత్‌ ఆలయంలో శ్రీ దక్షిణామూర్తి శివలింగానికి ఆదివారం రుద్రాభిషేకం చేశారు. శ్రావణమాసం పురస్కరించుకొని ఈనెల 3వ తేదీ నుంచి నెలరోజుల పాటు రుద్రాభిషేకాలు జరుపుతున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. రెండు త్రయోదశిలు, ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తామన్నారు. భక్తులు రుద్రాభిషేక పూజల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Read More »

తెరాస కార్యకర్తకు చెక్‌ పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యుత్తు ప్రమాదానికి గురై మరణించిన తెరాస కార్యకర్త కుటుంబానికి ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ బీమా చెక్కు పంపిణీ చేశారు. గత ఏడాది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా విద్యుత్తు దీపాలు అలంకరిస్తుండగా కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన షేక్‌ అహ్మద్‌ విద్యుత్‌ ఘాతానికి గురై మృతి చెందాడు. తెరాస సభ్యత్వ బీమా కింద విడుదలైన రెండు లక్షల చెక్కును ఎమ్మెల్యే మృతుని కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ ...

Read More »

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఆదివారం నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయంనుంచే నాగుల పుట్టలు, ఆలయాల వద్దకెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించి పాలుపోశారు. ఆడపడుచులు ఆనవాయితీ ప్రకారం సోదరుల కళ్ళు కడిగి కట్నకానుకలు స్వీకరించారు. పండగను పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు.

Read More »

కాళేశ్వరం నీటిని జలాశయంలోకి తెస్తా

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాళేశ్వరం నీటిని సింగూరు, నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయంలోకి తీసుకొచ్చి తీరుతామని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు 20 వరద గేట్ల ముందు భాగంలో ఈనెల 9వ తేదీన నిర్వహించనున్న మల్లన్నసాగర్‌ సాధన సదస్సును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం నీటిని సింగూరు ప్రాజెక్టుకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 83 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. మల్లన్నసాగర్‌ నీటిని సింగూరు, నిజాంసాగర్‌ జలాశయంలోకి ...

Read More »

ఎమ్మెల్యేను సన్మానించిన సిడిసి ఛైర్మన్‌

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మాంత్‌ షిండేను నిజాంసాగర్‌ ప్రాజెక్టు అతిథి గృహంలో మాగి సిడిసి ఛైర్మన్‌ దుర్గారెడ్డి ఆదివారం ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్దితోపాటు సెగ్మెంట్‌ అభివృద్దికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే అసెంబ్లీ సంక్షేమ సంఘం అద్యక్షునిగా ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. తనకు మెదక్‌, నిజామాబాద్‌ జిల్లా మాగి జిఎస్‌ఆర్‌ సిడిసి ఛైర్మన్‌ ...

Read More »

నవోదయ పాఠశాలలో పూర్వ విద్యార్థుల వైద్య శిబిరం

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ నవోదయ విద్యాలయంలో చదువుకున్న పూర్వవిద్యార్థులు ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో వైద్యులుగా స్థిరపడ్డారు. వారందరి ఆద్వర్యంలో పాఠశాల ఆవరణలో అక్కడి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు పూర్వ విద్యార్థుల సంఘం అద్యక్షుడు శ్రీనివాస్‌ తెలిపారు. 530 మంది విద్యార్థుల రక్త నమూనాలు సేకరించడంతోపాటు వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో అవసరమున్న వారికి మందులు అందించడం జరిగింది.

Read More »

ఎస్సీ వర్గీకరణ సాధనకై ఛలో ఢిల్లీ

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ఆమోదించేందుకు మందకృష్ణమాదిగ నేతృత్వంలో ఈనెల 19న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎంఆర్‌పిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మారావు తెలిపారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మండల మహిళా అద్యక్షురాలు లక్ష్మి, నాయకులు సాయిలు, బేగరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read More »

బైకు, ల్యాండ్‌ ఫోను ఉంటే.. పక్కా ఇల్లు కట్‌!

పేదల ఇళ్లకు కేంద్రం ని‘బంధనా’లు   ఇప్పటికే 1.24 లక్షల లబ్ధిదారుల ఎంపిక   కేంద్రం మార్గదర్శకాలు అమలు చేస్తే..   అనర్హుల జాబితాలో 70శాతం లబ్ధిదారులు   తలలు పట్టుకున్న గృహనిర్మాణ శాఖ  అమరావతి: గ్రామీణ పేదల పక్కా ఇళ్ల పథకానికి కేంద్రం మార్గదర్శకాలు ప్రతిబంధకంగా మారనున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకం కింద లబ్ధిదారుల ఎంపిక, తమ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు 2011 సామాజిక, ఆర్థిక, కుల జనాభా లెక్కల ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు 13 మార్గదర్శకాలను విడుదల ...

Read More »

చంద్రబాబు గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన గిరిధర్

తిరుపతి: గిరిధర్ రెడ్డి 55 సంవత్సరాలనుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మిత్రుడు. చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పటినుంచి వీరు స్నేహం కొనసాగుతూ వస్తోంది. ఇంటర్, డిగ్రీలోనూ వీరు కలిసి చదువుకున్నారు. ఇద్దరు కలిసి, మెలిసి తిరిగారు. చంద్రబాబులో ఎన్నో ప్రత్యేకలక్షణాలు ఉన్నట్టుగానే గిరిధర్ రెడ్డిలో కూడా ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. తన మిత్రుడు రాష్ట్రానికి సీఎం అయినా ఏనాడూ సాయం కోరలేదు. చంద్రబాబులాగా తన సమస్యలను తానే పరిష్కరించుకోగలిగే మనస్థత్వం. అందుకే అంతలా అల్లుకుపోయింది వీరి స్నేహ బంధం. ఇలాంటి లక్షణాలు ఉన్నందుకేనేమో వీరి ...

Read More »

పటాన్‌చెరులో జగ్గారెడ్డి అరెస్టు

మెదక్ : మాజీ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూర్పు జయప్రకాష్‌రెడ్డి(జగ్గారెడ్డి)ని మెదక్ జిల్లా పటాన్‌చెరులో ఆదివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కుమారుడి వివాహానికి హాజరైన జగ్గారెడ్డి… అనంతరం బయటకు వస్తుండగా పోలీసులు అరెస్టు చేసి సంగారెడ్డికి తరలించారు. ఆదివారం గజ్వేల్‌లో జరుగుతున్న ప్రధాని నరేంద్రమోదీ సభలో అలజడి సృష్టిస్తారనే సమాచారంతో అయన్ను ముందస్తుగా అరెస్టు చేశారని తెలుస్తోంది. కాగా.. జిల్లా వ్యాప్తంగా విపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read More »

కూలిపని చేసుకునే వారికి కోట్లు వచ్చి పడ్డాయి..

కత్ని(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లోని కత్ని జిల్లాలో ఆశ్చర్యకర సంఘటన ఒకటి వెలుగు చూసింది. కూలి పని చేసుకునే ఇద్దరు వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలో కోట్ల డబ్బులు వచ్చి పడ్డాయి. పోలీసుల సమాచారం మేరకు కత్ని జిల్లాలో ఉండే రంజ్నిష్ తివారి, ఉమా దత్‌లు కూలి పని చేసుకుంటారు. దారిద్య రేఖకు దిగువన ఉన్నవారిగా ప్రభుత్వంచే గుర్తింపబడ్డారు కూడా. అయితే అకస్మాత్తుగా వీరికి షాకింగ్ న్యూస్ ఒకటి తెలిసింది. కోట్ల డబ్బుల లావాదేవీలు వీళ్ల అకౌంట్లలో జరుగుతున్నాయని తెలుసుకున్నారు. కంపెనీలకు అధిపతులుగా బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్టు గుర్తించారు. ...

Read More »

Cellphone Footage Gives A Glimpse Of Terrorist Who Triggered Assam Blast

NEW DELHI:  HIGHLIGHTS 13 people were killed during a brazen terror attack in Assam’ Kokrajhar Manjay Islari, self-styled commander, is said to have triggered blast Strict vigil is being maintained along Assam-Bengal border after attack Minutes before they gunned down 13 people and injured nearly 20 at the village market in Assam’s Kokrajhar on Friday, at least one suspected NDFB ...

Read More »

బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో అద్భుతాలు చేసే.. టీ ఫ్లేవర్స్..!!

ఫ్యాట్ అనేది చాలా కామన్ విషయం. ఎందుకంటే.. ప్రతి ఒక్కరూ దీన్ని ఫేస్ చేస్తున్నారు. ఫ్యాట్ వల్ల ఒక వ్యక్తి ఆకర్షణపై ప్రభావం చూపుతుంది. మీరు అందంగా కనిపించాలంటే.. ఫ్యాట్ లేకుండా.. ఫ్లాట్టమ్మీ క లిగి ఉండాలి. చాలా కొద్దిగా తిన్నా, కొంచెమే తాగినా కూడా.. పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకుంటుంది. అన్నింటిలోకెల్లా బెల్లీ ఫ్యాట్ కరిగించడం చాలా కష్టం. మీకు తెలుసా.. ? కొన్ని డ్రింక్స్ వేగంగా బరువు తగ్గించడానికి సహాయపడతాయి. వ్యాయామం కంటే.. రెండు రెట్టు వేగంగా బరువు తగ్గించడంలో సహాయపడతాయి.. ...

Read More »

కొడితే వాతలేల?

ప్రశ్న: ఎవరినైనా చెంపపై ‘ఛెళ్లు’మని కొడితే, వాతలు తేలుతాయి. ఎందుకు? జవాబు: మన శరీరంలో చెంపపై ఉండే చర్మం మిగతాభాగాలపై ఉండే చర్మంకన్నా మెత్తగా, సున్నితంగా ఉంటుంది. ఎవరినైనా చెంపపై కొడితే చర్మం కింద ఉండే జీవకణాలు తమ నిరోధక శక్తిని కోల్పోయి చిట్లి చెల్లాచెదురవుతాయి. ఆ ప్రభావాన్ని తగ్గించడానికి అక్కడ మామూలుకన్నా అధికంగా తెల్లరక్తకణాలు అవసరమవుతాయి. వాటిని సరఫరా చేసే క్రమంలో ఆ ప్రాంతానికి రక్తప్రసరణ అధికంగా జరుగుతుంది. దీనికి తోడు అక్కడ పగిలిపోయిన కణాలలోని ద్రవం కూడా ఆ రక్తంలో కలవకుండా ...

Read More »