Breaking News

Daily Archives: August 8, 2016

యంచ వద్ద రోడ్డు ప్రమాదం

– పలువురికి గాయాలు బాసర, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట మండల పరిధిలోని యంచ సమీపంలోని మహేశ్వర రైస్‌ ఇండస్ట్రీస్‌ వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం… నిజామాబాద్‌ నుంచి మహారాష్ట్ర వైపు మక్కల లోడ్‌తో వెళ్తున్న టాటా మాక్స్‌ ఎంహెచ్‌ 26 ఎడి 8791 వాహనం ఎదురుగా భైంసా నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా లారీ డ్రైవర్‌ ...

Read More »

ప్రజా సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం

– మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి రెంజల్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల అమలులో పూర్తి స్థాయిలో విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం నీలా గ్రామ శివారులో నిలిచిపోయిన కందకుర్తి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద వర్గాల సంక్షేమానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, గృహ నిర్మాణాలు రైతుల రుణ మాఫీ తదితర అంశాలను ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. తమ కాంగ్రెస్‌ ...

Read More »

9న ఆరోగ్యశ్రీ మెగా వైద్య శిబిరం

నిజాంసాగర్‌ me రూరల్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట గ్రామంలో ఈనెల 9న ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్‌ టెస్టు ఆద్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు డాక్టర్‌ సంతోష్‌ తెలిపారు. శిబిరంలో జిల్లా కేంద్రానికి చెందిన శశాంక్‌ ఆసుపత్రి, అమృత లక్ష్మి వైద్యులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. శిబిరంలో సాధారణ, స్త్రీ సంబంధిత, చిన్న పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Read More »

కాళేశ్వరం నీటితో నిజాంసాగర్‌ను నింపుతాం

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోదావరి మిగులు జలాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయాన్ని నింపుతామని తెరాస జిల్లా కార్యదర్శి వినయ్‌ కుమార్‌ అన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిపారుదల శాఖ అతిథి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన తెరాస కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సిఎం కెసిఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో కాలేశ్వరం నీటిని సింగూరు, నిజాంసాగర్‌ప్రాజెక్టుల్లోకి తీసుకొచ్చేందుకు సిఎం ...

Read More »

ప్రో కబడ్డి విజేత అడ్లూర్‌ ఎల్లారెడ్డి

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ప్రో కబడ్డి ఇంటర్‌ స్కూల్‌ పోటీల్లో అడ్లూర్‌ ఎల్లారెడ్డి పాఠశాల విద్యార్థులు విజయం సాధించారు. ద్వితీయ స్థానాన్ని దోమకొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు గెలుచుకున్నారు. టోర్నమెంట్‌లో 8 జట్లు పాల్గొనగా అడ్లూర్‌ ఎల్లారెడ్డి పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభతో టోర్నమెంట్‌లో విజేతగా నిలిచారు. విజేతలకు మాజీ కబడ్డి క్రీడాకారుడు లింబారెడ్డి, పిఆర్‌టియు రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డిలు సోమవారం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ...

Read More »

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం

మోర్తాడ్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుట్టిన బిడ్డకు తల్లిపాలు శ్రేయస్కరమని ఐసిడిస్‌ సూపర్‌వైజర్‌ జ్ఞానేశ్వరి, అంగరి జ్యోతిలు అన్నారు. సోమవారం మోర్తాడ్‌లోని 8 అంగన్‌వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణీలకు, బాలింతలకు వివరించారు. అంగన్‌వాడి కార్యకర్తలు బాలింతలకు, గర్భినీలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

నూతన ఎస్‌ఎంసి కమిటీ ఎన్నిక

మోర్తాడ్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తడపాకల్‌ గ్రామప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం నూతన ఎస్‌ఎంసి కమిటీ కార్యవర్గాలను ఎన్నుకున్నట్టు ఆయా గ్రామాల సర్పంచ్‌లు లోలం లావణ్య, చిన్నారెడ్డి, ఎంపిటిసి దిబ్బ సరస్వతి, సుదర్శన్‌గౌడ్‌లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీలను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త కమిటీలు పాఠశాలల, విద్యార్థుల అభివృద్దికి పాటుపడాలన్నారు.

Read More »

వంద శాతం మొక్కలు పూర్తిచేసిన గ్రామాల ప్రజా ప్రతినిదులను అభినందించిన అధికారులు

మోర్తాడ్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తడపాకల్‌, తాళ్ల రాంపూర్‌, తిమ్మాపూర్‌, దోన్‌పాల్‌ గ్రామాల్లో వందశాతం మొక్కలు పూర్తిచేసిన ఆయా గ్రామాల సరంచ్‌ లోలం లావణ్య, చిన్నారెడ్డి, తుమ్మల మారుత, ఉగ్గెర భూమేశ్వర్‌, లింగన్న, జడ్పిటిసి ఎనుగందుల అనిత, ఎంపిటిసిలు దిబ్బ సరస్వతి, సుదర్శన్‌లు, డాక్టర్‌ జయవీర్‌లను మండల ప్రత్యేకాధికారి శంకరయ్య, ఎంపిడివో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ వెంకట్రావులు అభినందించారు. సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో పర్యటించి కలెక్టర్‌ నిర్దేశించిన 40 వేల మొక్కలను లక్ష్యాన్ని పూర్తిచేయించారు. అంతేగాకుండా ఆయా ...

Read More »

జోగినిలకు 1500 పింఛన్లు అందించాలి

రెంజల్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జోగిని మహిళలందరికి ప్రభుత్వం ఆదుకుని రూ. 1500 పింఛన్లు అందించాలని సోమవారం తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్‌ వెంకటయ్యకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జస్టిస్‌ రఘునాథ్‌రావు కమీషన్‌ సిఫారసులు వెంటనే అమలుచేయాలని, ప్రతి ఒక్కరికి అంత్యోదయ కార్డు లేదా 35 కిలోల బియ్యం అందించాలని, కార్పొరేషన్‌ ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. కార్యక్రమంలో రాజయ్య, రాజు, తదితరులు ...

Read More »

ప్రజల భాగస్వామ్యంతోనే వ్యాధుల నివారణ

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు అరికట్టేందుకు గ్రామస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. ఆరోగ్య సంరక్షణ చర్యల పట్ల ప్రజలను చైతన్యపర్చేందుకు సాంస్కృతిక సారధి కళాకారులచే నిర్వహించే కళాజాత కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లో జెండా ఊపి ప్రారంభించారు. హై రిస్క్‌ గ్రామాల ప్రజలను చైతన్య పరిచేందుకు రెండు బృందాలచే రోజుకు 4 గ్రామాల్లో కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ...

Read More »

10న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10న జిల్లా వ్యాప్తంగా జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈనెల 9 న ఉదయం 9 గంటలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీచౌక్‌ వరకు, తిరిగి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నులి పురుగులు కలిగి ...

Read More »

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు చర్చించిన జిల్లా కలెక్టర్‌

  నిజామాబాద్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆదేశించారు. పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలపారు. సోమవారం ప్రగతిభవన్‌లో అధికారులతో సమావేశమై మాట్లాడారు. జిల్లా అభివృద్ది, సంక్షేమ, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయనున్నట్టు ...

Read More »

‘జనతా’ ఆడియో పోస్టర్ మళ్లీ వచ్చింది!

హ్యాట్రిక్ హిట్‌పై కన్నేసిన యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. టాలీవుడ్‌లో యువహీరోలంతా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరిపోతుంటే తాను కూడా ఎలాగైనా ఆ క్లబ్‌లో చేరేందుకు ఎన్టీఆర్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. కొంతకాల క్రితం విడుదల చేసిన ‘జనతా గ్యారేజ్’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే.. ఎన్టీఆర్ కష్టం తీరేట్లుగానే ఉంది. మొదట ఆగస్టులో విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను సెప్టెంబర్‌కు వాయిదా వేయడంతో నిరాశపడిన అభిమానులను ఇంకేమాత్రం నిరాశపరచకూడదనుకున్న ఎన్టీఆర్ ఈ సారి అనుకున్న టైంలోనే సినిమాను విడుదల ...

Read More »

సెప్టెంబర్ 12న పవన్ అభిమానులకు డబుల్ ధమాకా!

హైదరాబాద్‌: పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. పవన్‌కళ్యాణ్ తన పుట్టిన రోజున అభిమానులకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని భావించారు. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా కిషోర్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సెప్టెంబర్ 12న విడుదల చేయనున్నారని సమాచారం.  సినిమాలో పవన్‌ ఫ్యాక్షన్‌ లీడర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా ‘కడప కింగ్’గా  ప్రక్షకుల ముందుకు రాబోతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరగిన విషయం తెలిసిందే. దీంతో ఫస్ట్‌లుక్ ఎలా ఉందబోతోందని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. శ్రుతిహాసన్‌ ...

Read More »

షూటింగ్‌కు తొలిసారి విదేశాలకు వెళుతున్న స్టార్ హీరో !

షూటింగ్‌ కోసం తొలిసారి విదేశాలకు…!  తొలి చిత్రంలోనే ఫారిన్ లొకేషన్లలో ఎంజాయ్‌ చేస్తున్న నేటి హీరోల మధ్య…దాదాపు 30సినిమాల్లో నటించిన ఒక స్టార్‌ హీరో ఇప్పటివరకు విదేశాల్లోనే అడుగుపెట్టలేదంటే నమ్మగలమా? కానీ, ఇది నిజం. కోలీవుడ్‌లో విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు విజయ్‌ సేతుపతి ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘రెక్క’ చిత్రం కోసం తొలిసారి విదేశాలకు వెళ్తున్నారు. ‘పిజ్జా’, ‘నడువుల కొంజం పక్కత్త కానోమ్‌’, ‘సూదుకవ్వుం’, ‘ఇదర్కుదానె ఆసైపట్ట బాలకుమార్’, ‘నానుమ్‌ రౌడీదాన్’, ‘సేతుపతి’ ‘ఇరైవి’ వంటి చిత్రాల్లో విజయ్‌ ...

Read More »

మెగాస్టార్ అమ్మానాన్న.. ఎవరో తెలిస్తే షాకవుతారు!

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న తన 150వ చిత్రంకోసం తీవ్ర కసరత్తులే చేస్తున్నాడు. ఈ చిత్రానికి కథ, హీరోయిన్, విలన్ నుంచి ఇతర ప్రధాన పాత్రల ఎంపిక వరకూ తీవ్రం గందరగోళం నెలకొంది. ఎట్టకేలకు కథ, హీరోయిన్, విలన్‌ ఎంపిక పూర్తి చేసి షూటింగ్‌ను శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి రెండు పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వాటిల్లో యువకుడి పాత్ర ఒకటి. ఈ పాత్రకు తల్లిదండ్రుల ఎంపిక కోసం చిత్రం బృందం నానా తంటాలు పడి చివరకు అలనాటి ‘అమ్మ’ ...

Read More »

శ్రావణ మాసంలో సకల సౌభాగ్యాలనంధించే మంగళగౌరీ వ్రతం..నియమాలు!!

భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ‘శ్రావణ మాసం’ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది.ఈ మాసంలో అందరి ఇళ్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కళ కళలాడుతూ ఉంటాయి. ఈ మాసంలోముఖ్యమయినవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళ గౌరీ వ్రతం. శ్రవణ మాసం లో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవి కి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా ...

Read More »