Breaking News

ప్రజా సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం

– మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి

రెంజల్‌, ఆగష్టు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల అమలులో పూర్తి స్థాయిలో విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం నీలా గ్రామ శివారులో నిలిచిపోయిన కందకుర్తి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద వర్గాల సంక్షేమానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, గృహ నిర్మాణాలు రైతుల రుణ మాఫీ తదితర అంశాలను ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. తమ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో కృషి చేశామన్నారు. జిల్లా ఎంపి స్వయాన సిఎం కుమార్తె అయినందుకు అందరు సంతోషం వ్యక్తం చేసినా రైతుల సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తాను మంత్రిగా ఉన్నపుడు కందకుర్తి ఎత్తిపోతల నిర్మాణానికి రూ. 14 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. 70 శాతం పనులు కూడా పూర్తవడం జరిగిందన్నారు. కందకుర్తి ఎత్తిపోతల రెండవ స్టేజీ పనులను మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కొలిక్కి తెచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాములు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి జావిదోద్దీన్‌, గ్రంథాలయ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, నాయకులు సాయిరెడ్డి, లతీఫ్‌, సాయాగౌడ్‌, శంకర్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article