Breaking News

వంద శాతం మొక్కలు పూర్తిచేసిన గ్రామాల ప్రజా ప్రతినిదులను అభినందించిన అధికారులు

మోర్తాడ్‌, ఆగష్టు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తడపాకల్‌, తాళ్ల రాంపూర్‌, తిమ్మాపూర్‌, దోన్‌పాల్‌ గ్రామాల్లో వందశాతం మొక్కలు పూర్తిచేసిన ఆయా గ్రామాల సరంచ్‌ లోలం లావణ్య, చిన్నారెడ్డి, తుమ్మల మారుత, ఉగ్గెర భూమేశ్వర్‌, లింగన్న, జడ్పిటిసి ఎనుగందుల అనిత, ఎంపిటిసిలు దిబ్బ సరస్వతి, సుదర్శన్‌లు, డాక్టర్‌ జయవీర్‌లను మండల ప్రత్యేకాధికారి శంకరయ్య, ఎంపిడివో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ వెంకట్రావులు అభినందించారు. సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో పర్యటించి కలెక్టర్‌ నిర్దేశించిన 40 వేల మొక్కలను లక్ష్యాన్ని పూర్తిచేయించారు. అంతేగాకుండా ఆయా గ్రామాలతో పాటు పాలెం గ్రామంలో సైతం నాటిన మొక్కలకు కంచెలు ఏర్పాటు చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తోగేటి అనిత శ్రీనివాస్‌, ఎంపిటిసి ఎనుగందుల అశోక్‌, కార్యదర్శులు స్వప్న, స్వామి, నాగరాజ్‌, గంగాదాసు, విఆర్వోలు, వివో, సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article