Breaking News

Daily Archives: August 11, 2016

పంట పొలాలకు నీరందించేలా కట్టడాలు చేపట్టాలి

బీర్కూర్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెక్‌ డ్యాం ఎత్తు పెంచాలని మండలంలోని మిర్జాపూర్‌ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. చెక్‌ డ్యాం చిన్నగా ఉండడం వల్ల నీరు వృధాగా పోతుందని వారు తెలిపారు. వీరాపూర్‌ చెరువు పరిసర ప్రాంతాల్లో కొందరు రైతులు చెరువు భూమిని కబ్జా చేశారని, అట్టి శిఖం భూములు స్వాధీనం చేసుకొని చెరువు విస్తీర్ణం పెంచి రైతులు లాభపడేలా చూడాలని అన్నారు. కార్యక్రమంలో ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.

Read More »

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి

  బీర్కూర్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినపుడే ప్రతిఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని బోధన్‌ ఆర్డీవో సుధాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని దుర్కి గ్రామంలో డయేరియా వ్యాధి విజృంభించడంతో బాధితులను పరామర్శించడానికి గురువారం విచ్చేశారు. ఎస్సీ కాలనీలో పర్యటించి బాధితులను పరామర్శించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని పేర్కొన్నారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అందరు అప్రమత్తంగా ఉండాలని, వైద్యులు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ...

Read More »

డయేరియాతో ఒకరి మృతి

బీర్కూర్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దుర్కి గ్రామంలో గత నాలుగురోజులుగా డయేరియా విజృంభించింది. డయేరియాతో గురువారం గ్రామానికి చెందిన మావురం గంగమ్మ (50) మృతి చెందిందని వైద్యులు తెలిపారు. గురువారం సాయంత్రం వరకు 40 మందికి సాధారణ జ్వరాలు ఉన్నట్టు, 10 మందికి వాంతులు, విరోచనాలతో ఉన్నారని ప్రాథమిక వైద్యులు దిలీప్‌ కుమార్‌ తెలిపారు. వాంతులు, విరేచనాలు గలవారికి గ్రామ చావిడిలో చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

Read More »

ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు అంగన్‌వాడిల ధర్నా

కామారెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు గురువారం అంగన్‌వాడిలు ధర్నా నిర్వహించారు. అంగన్‌వాడి కామారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని కార్యకర్తలు తమ వేతనాల కోసం ఆందోళన చేపట్టారు. గత రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే అందజేయాలని, ప్రతినెల వేతనంలోంచి విధించిన కోతలను తిరిగి చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం సిడిపివోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు మాట్లాడుతూ కార్మిక ప్రభుత్వమని చెబుతున్న ...

Read More »

రాంమందిర్‌లో 100 మొక్కలు నాటిన కాలనీ వాసులు

  మోర్తాడ్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లోని ఎస్సీ, బిసి కాలనీలో గల రాంమందిరం ఆవరణలో స్థానిక సర్పంచ్‌ దడివె నవీన్‌, ఎంపిటిసి లక్ష్మి సమక్షంలో కాలనీవాసులు 100 మొక్కలు గురువారం నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ నాటిన మొక్కలు కాలనీ వాసులు సంరక్షించుకోవాలని, అవసరమైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లి మొక్కలు కాపాడేందుకు కంచె ఏర్పాటుకు, బోరు ఏర్పాటుకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలి

మోర్తాడ్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హరితహారంతో పాటు స్వచ్చ భారత్‌ పథకం కింద మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని ఎంపిడివో శ్రీనివాస్‌ కోరారు. స్వచ్చభారత్‌ పథకం కింద ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగానే మరుగుదొడ్డి నిర్మించి ఇస్తుందని, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వివిధ శాఖల అధికారులు మరుగుదొడ్డి లేని ప్రతి ఇంటిని గుర్తించి, వివరాలు సేకరించి వారికి మరుగుదొడ్డి నిర్మించి అందించాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, వివిద శాఖల అధికారులు, గ్రామ కమిటీ సభ్యులు తదితరులు ...

Read More »

మునిసిపల్‌ సమావేశం రసాభాస…

  ఛైర్మన్‌ లేకుండానే 295 ఎజెండా అంశాలకు ఆమోదం – వైస్‌ఛైర్మన్‌తో సమావేశం కొనసాగింపుపై రగడ కామారెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అధ్యక్షతన గురువారం జరిగిన పాలకవర్గ సమావేశం రసాభాసగా సాగింది. సమావేశం ప్రారంభం కాగానే పాలకవర్గంలోని అధికారపక్షం, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఎజెండా అంశాలకు సంబంధించి వాగ్వాదం నెలకొంది. ఛైర్‌పర్సన్‌ సుష్మ ఎజెండా అంశాలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎజెండా అంశాల్లో స్పష్టత లోపించిందని, ఎం.ఇ లేకుండా సమావేశంలో టెండర్లకు సంబంధించిన ...

Read More »

విద్యార్థుల సంక్షేమానికి దాతలు ముందుకు రావాలి

మోర్తాడ్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల సంక్షేమానికి పాలెంకు చెందిన ఎల్‌ఐసి చీఫ్‌ అడ్వయిజర్‌ వెంకటేశ్‌గౌడ్‌ను ఆదర్శంగా తీసుకొని దాతలు ముందుకు రావాలని ఎంఇవో రాజేశ్వర్‌ కోరారు. గురువారం పాలెం గ్రామ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు 5200 విలువగల టై, బెల్టులను వెంకటేశ్‌గౌడ్‌, ఎంఇవో చేతుల మీదుగా అందజేశారని ఆయన తెలిపారు. ప్రతీ సంవత్సరం విద్యార్తుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఎంఇవో కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్‌టియు కీలకం

మోర్తాడ్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్‌టియు ఉపాధ్యాయ సంఘం కీలకపాత్ర పోషిస్తుందని మండల అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌, శంకర్‌లు అన్నారు. గురువారం మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పిఆర్‌టియు సభ్యత్వం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు పిఆర్‌టియు సభ్యత్వం చేయించుకోవాలని కోరారు. పిఆర్‌సి బకాయిలు, సర్వీస్‌ రూల్సు అమలు చేసేందుకు రాష్ట్ర నాయకులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తున్నారని వారన్నారు. గురువారం మొదటి రోజు 150 ...

Read More »

మండల ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడిగా ప్రశాంత్‌

నందిపేట, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షులుగా తొండాకూర్‌ గ్రామానికి చెందిన అల్లరి ప్రశాంత్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ప్రశాంత్‌ మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన ఎన్‌ఎస్‌యుఐ నియోజకవర్గ అధ్యక్షుడు అభిలాష్‌, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పటిష్టతకు కష్టపడి పనిచేస్తానని పేర్కొన్నాడు. కార్యక్రమంలో నవీన్‌, చందు, వంశీగౌడ్‌, గణేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఎంసెట్‌-2 కుంభకోణం గోడప్రతుల ఆవిష్కరణ

భీమ్‌గల్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో ఏబివిపి ఆధ్వర్యంలో గురువారం ఎంసెట్‌-2 కుంభకోణం, దోషులెవరు… శిక్షెవరికి అనే గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు, ఎంసెట్‌-2 విద్యార్థుల జీవితాల మనోభావాలు దెబ్బతీసిన నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సిబిఐ ద్వారా విచారణ జరిపించి వెంటనే అసలు సూత్రధారులను బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.

Read More »

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్‌, ఎస్పీ

కామారెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 14న జిల్లాకు వస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి తల్లి ఏనుగు రాజమ్మ మృతి చెందినందున, 14న తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో నిర్వహించే 9వ రోజు కర్మ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శిస్తారన్నారు. గురువారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా, జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్‌, సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి, ఇతర అధికారులు ఎర్రపహాడ్‌లోని ...

Read More »

ప్రభుత్వ ఆసుపత్రికి సింగిల్‌ డాక్టర్‌

నందిపేట, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం సింగిల్‌ డాక్టర్‌తో నెట్టుకొస్తుంది. డే అండ్‌ నైట్‌ షిప్టుల్లో ఇద్దరు డాక్టర్లతో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సి ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఒక్కరే సేవలందిస్తున్నారు. డాక్టరుతో పాటు సిబ్బంది కొరత దాంతోపాటు సమావేశాల పేరుతో ఉన్న ఒక్క డాక్టరు వెళితే రోగులను చూసే నాథుడే లేడు. రోజుకు 60 నుంచి 70 మంది రోగులు వచ్చి పరీక్షలు చేయించుకొని మందులు ...

Read More »

వంట చేతకాని అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవద్దు.. వారు..

కమ్మగా వండడం చేతకాని అమ్మాయిలను అస్సలు పెళ్లిచేసుకోవద్దని ఓ పాస్టర్ చేసిన సూచన ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. రిడీమిడ్ క్రిస్టియన్ చర్చ్ ఆఫ్ గాడ్(ఆర్సీసీజీ) పాస్టర్ ఎనోఖ్ అడేబోయ్ ఓ ముఖ్యమైన మీటింగ్‌లో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. చర్చి సభ్యులు, పాస్టర్లతో ఆయన మాట్లాడుతూ.. ఆమె బాగా పాడుతుందనో, ఇంకో కారణం వల్లో అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దంటూ పేర్కొన్నారు. అంతేకాదు ఎలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలో కూడా వివరించారు. ‘‘బద్దకస్తురాలైన అమ్మాయిని, వండడం చేతకాని అమ్మాయిని, కనీసం గంటపాటు ప్రార్థన చేయలేని యువతులను ఎట్టిపరిస్థితుల్లోనూ ...

Read More »

బంక్‌కెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటున్నారా… అయితే ఒక్క క్షణం !

ఇంధనంతో జర భద్రం.. వాహనాలలో వాడే ఇంధనంపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంపొందించుకోవల్సిన అవసరం ఉంది. పెట్రోల్‌, డీజిల్‌పై జాగ్రత్త వహించకుంటే వాహనాలకు మరమతులు తప్పవు. ప్రస్తుతకాలంలో వాహనాల వాడకం విరివిగా పెరిగిపోయింది. ధనిక, మధ్యతరగతి, పేద అనే భేదాలు లేకుండా ప్రతీ ఒక్కరు ఎదో ఒక వాహనం ఉపయోగిస్తున్నారు. అంతేకాక రవాణా కోసం అనేక రకాల వాహనాలు రోడ్లపై ప్రయాణిస్తున్నాయి. వాహనాలకు ఇంధనమే అతి ముఖ్యమైన అంశం. ఇంధనాలపై శ్రద్ధ వహించకుంటే ఇక అంతే సంగతులు. నేటి సమాజంలో ఎక్కడ చూసినా కల్తీమయంగా ...

Read More »

నాపై దాడులు హేయం

శ హితం కోసమే పని చేశా: రఘురాం రాజన్‌ న్యూఢిల్లీ: తనపై జరిగిన రాజకీయ దాడులు హేయమైనవని ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ పేర్కొన్నారు. మరికొన్ని పనులు పూర్తి చేసేందుకు ఇంకొంత కాలం పదవిలో కొనసాగాలని మొదట భావించినా, ఇప్పుడు సంతోషంగానే బయటకు వెళ్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వంతో చర్చల ప్రక్రియ మరో విడత పదవిలో కొనసాగేందుకు తాను ఒప్పుకునేవరకు వెళ్లలేదన్నారు. రాజన్‌ మూడేళ్ల పదవీకాలం వచ్చే నెల ముగుస్తోంది. తనపై ఇటీవల కాలంలో జరిగిన రాజకీయ దాడులు చాలా నీచమైనవనీ ఏ ఆధారాలు లేకుండానే ...

Read More »

కదులుతున్న విమానం కోసం.. రన్‌‌వే పై పరుగెత్తిన ప్రయాణికుడు..

లండన్: సాధారణంగా కదులుతున్న బస్సు లేదా రైలులో ఎక్కేందుకు కొందరు అతి కష్టం మీద ప్రయత్నిస్తుంటారు. అయితే ఓ ప్రయాణికుడు ఏకంగా కదులుతున్న విమానాన్ని అందుకునేందుకు తెగ ప్రయత్నించాడు. రన్ వే పరుగెత్తి దాన్ని వెంబడించాడు. ప్రయోజనం లేకపోగా సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు అరెస్ట్ అయ్యాడు. స్పెయిన్ రాజధాని‌లోని మాడ్రిడ్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.   ఓ వ్యక్తి గ్రాన్ కానరియాకు వెళ్ళేందుకు ఆలస్యంగా ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అయితే అతడు ఎక్కాల్సిన విమానం అప్పటికే టేకాఫ్‌కు సిద్ధమైంది. ఎలాగైనా అందుకోవాలన్న ఉద్దేశంతో ...

Read More »

అటల్‌ బాటలో!

కశ్మీర్‌ గురించి బహిరంగ సభల్లో తప్ప, చట్టసభల్లో ప్రధాని నోరువిప్పదల్చుకోలేదా? అన్నది ప్రతిపక్షపార్టీల ప్రశ్న. కశ్మీర్‌ లోయలో జులై 8న హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌వనీ ఎన్‌కౌంటర్‌తో రాజుకున్న నిప్పు నెలరోజులైనా చల్లారని నేపథ్యంలో కాంగ్రెస్‌ పట్టుబట్టి రాజ్యసభలో సాధించిన చర్చలో ప్రధాని పాల్గొనకపోవడం విపక్షాలకు ఆగ్రహం కలిగిస్తున్నది. ‘గోవధ’ సుదీర్ఘకాలం దేశాన్ని కుదిపేసిన తరువాత గోరక్షకుల గురించి శనివారం నాటి ‘టౌన్‌హాల్‌’ చర్చాకార్యక్రమంలో నోరువిప్పిన ప్రధాని, దళితులపై జరుగుతున్న దాడులను తొలిసారిగా ఖండించడానికి హైదరాబాద్‌ మహాసమ్మేళనాన్ని వినియోగించుకున్నారు. ఇదేదారిలో ఆయన మంగళవారం మధ్యప్రదేశ్‌ బహిరంగ ...

Read More »

ఉంగరాలకు బదులు బేడీలతో ముగిసిన పెళ్లి..

వియన్నా: రెండు జంటలు పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే వాళ్ల పెళ్లిలో ఉంగరాలకు బదులు బేడీలు వచ్చి పడ్డాయి. రిజిస్టర్ ఆఫీస్‌‌కు ఎంతో సంతోషంగా వచ్చి బేడీలతో తిరిగి వెళ్లారు. వియన్నా దక్షిణ ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన. వీళ్లలో ఒక జంట రొమేనియా అమ్మాయి, నేపాలీ అబ్బాయి అయితే మరో జోడి హంగేరీ అమ్మాయి, టునీషియా అబ్బాయి. ఈ రెండు జంటలు పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం రిజిస్టర్ ఆఫీస్‌కు వెళ్లారు. అయితే అక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. ఈ వివాహాల ...

Read More »

ఫ్రిజ్ వాడేవారు ఈ విషయం మర్చిపోతే అంతే సంగతులు !

ఫ్రిజ్‌లను తరచూ తెరువకూడదు. ఉదయం పూట వంటకు అవసరమైన వస్తువులన్ని ఒకేసారి తీసుకోవడం మంచిది. ఫ్రిజ్‌ను తరచూ తెరవడం వల్ల కూలింగ్‌ తగ్గి, కవర్‌ చేసుకునేందుకు ఫ్రిజ్‌ ఎక్కువ విద్యుత్‌ను తీసుకుంటుంది. ఫ్రిజ్‌లో పెట్టే ఆహార పదార్థాలపై మూతలు పెట్టడడం మరువకండి. 15ఏళ్లు దాటిన ఫ్రిజ్‌లను మార్చడం మంచిది.

Read More »