Breaking News

Daily Archives: August 12, 2016

అంటువ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయండి

  – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హై రిస్క్‌ గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆదేశించారు. ఇద్దరు వైద్యాధికారులు ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఉప కేంద్రాల్లో ప్రతిరోజు సాయంత్రం పూట వైద్య శిబిరాలు నిర్వహించి వారం రోజుల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. డయేరియా, ...

Read More »

పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 15న ఉదయం 10 గంటలకు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగిస్తారన్నారు. అనంతరం శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ ...

Read More »

వరినారు బంగారమాయె…

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరువు తీరా వర్షాలు కురియడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తం అవుతుంది. పంటల సాగులో రైతాంగం నిమగ్నమైంది. అయితే వరినారుకు కొరత ఏర్పడింది. రెండేళ్ల వరుస నష్టాలతో రైతులు ఈసారి నారు పోసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. బోర్ల కింద సాగుచేసిన రైతులు వరినారు కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నారు. దీంతో ఎకరానికి సరిపడా నారు ధర రూ. 1500 నుంచి 2500 వరకు ...

Read More »

వైభవంగా వరలక్ష్మి వ్రతం

బాన్సువాడ, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని బాన్సువాడ ప్రాంతంలో వరలక్ష్మి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. బాన్సువాడలోని సరస్వతి శిశుమందిర్‌ పాఠశాల ఆవరణలో యాజమాన్యం సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం నిర్వహించారు. దీంతోపాటు స్థానికంగా ఉన్న సరస్వతి ఆలయంలో కుంకుమార్చన, వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ పట్టణంతోపాటు పరిసర గ్రామాల మహిళలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలోని వివిధ ఆలయాల్లో, గ్రామాల్లో వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ...

Read More »

మంజీరా జలాలపై సర్వే

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి మంజీర జలాల సరఫరాకు గ్రామాల వారిగా సర్వే నిర్వహిస్తున్నారు. మండలంలోని మహ్మద్‌నగర్‌ గ్రామ శివారులో సర్వేయర్లు శివప్రసాద్‌,, సురేశ్‌లు సర్వే చేశారు. మెదక్‌ జిల్లా సింగూరు ప్రాజెక్టు నుంచి ఇంటింటికి కుళాయిల ద్వారా నీటి సరఫరాకు పైప్‌లైన్ల కోసం సర్వే చేపట్టారు. వారి వెంట కారోబార్‌ అంబయ్య ఉన్నారు.

Read More »

నర్వా గ్రామంలో వైద్య శిబిరం

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్వా గ్రామంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలోని 80 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేసినట్టు వైద్యాధికారిణి డాక్టర్‌ స్పందన తెలిపారు. సీజనల్‌ వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా సీజనల్‌ వ్యాదులు, జ్వరాలు వస్తున్నాయని, ఇందుకోసం ప్రజలందరు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఆరోగ్య ...

Read More »

మొక్కలకు కంచెలు ఏర్పాటు చేయండి

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు హరితహారం పథకం కింద నాటిన మొక్కలకు ముళ్ల కంచెలు ఏర్పాటు చేయాలని మండల ప్రత్యేకాధికారి జగన్నాథరావు ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో రోడ్లకు ఇరుపక్కల 14 వేల మొక్కలు నాటడం జరిగిందని, శ్మశాన వాటికల్లో 18 వేల మొక్కలు నాటినట్టు వాటికి ముళ్ల కంచెలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి మొక్కకు కంచె ఉండేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ...

Read More »

తాగునీటి సమస్యపై ఎంపిపి, ఎంపిడివోకు వినతి

రెంజల్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మాసం రోజులుగా తాగునీటి సమస్య జఠిలమవుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని శుక్రవారం మండలంలోని కూనేపల్లి వాసులు ఎంపిపి, ఎంపిడివోలకు వినతి పత్రం సమర్పించారు. స్పందించిన ఎంపిపి మోబిన్‌ఖాన్‌ సమస్యపై ఆరా తీసి సంబంధిత కార్యదర్శితో వెంటనే సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపిడివోను కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో లింగం, సాయిలు, తదితరులున్నారు.

Read More »

సమయానికి రారు… ప్రజా సమస్యలు పరిష్కరించరు…

  రెంజల్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. అప్పుడే గ్రామాలు అభివృద్ది చెందుతాయి. రెంజల్‌ మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బంది మాత్రం అందుకు భిన్నంగా పనిచేస్తున్నారు. ఉదయం 10.30 గంటల్లోపు కార్యాలయానికి చేరుకోవాల్సిన సిబ్బంది శుక్రవారం ఉదయం 11.20 గంటలకు కూడా ఏ ఒక్క అధికారి సక్రమంగా విధులకు హాజరు కాలేదు. కార్యాలయం ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. కార్యాలయ పనితీరును పర్యవేక్షించే నాథుడే కరువయ్యాడు. పాలకవర్గం అటువైపు కన్నెత్తి చూసిన ...

Read More »

ఎత్తిపోతలు ఉత్తిపోతలే…

  తెరాస పాలనలో మోక్షం లభించేనా… మోర్తాడ్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పాలెం, తొర్తి గ్రామాల చెరువులు నింపేందుకు ఆయా గ్రామాల పెదవాగుల నుంచి కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ఎత్తిపోతల పథకాలను అప్పటి మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి నిదులు మంజూరు చేయించి పనులు పూర్తిచేయించి చేతుల మీదుగా ప్రారంభించారు. కాంట్రాక్టర్లు నాసిరకం మోటార్లు, పైప్‌లైన్లు ఏర్పాటు చేయడంతో ఎత్తిపోతలు ఉత్తిపోతలుగా మారాయి. గత నాలుగు సంవత్సరాల క్రితం ఎత్తిపోతల పథకాలను నిర్మింపజేసినప్పటికి ఆయా గ్రామాల చెరువులను ...

Read More »

చురుకుగా సాగుతున్న అమరవీరుల స్థూపం పనులు

మోర్తాడ్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎట్టకేలకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చొరవతో మోర్తాడ్‌లో అర్దంతరంగా నిలిచిపోయిన అమరవీరుల స్థూపం పనులు చురుకుగా సాగుతున్నాయి. ఉద్యమంలో జేఏసిగా ఏర్పడిన అప్పటి నాయకులు విరాళాలు సేకరించి మోర్తాడ్‌ బస్టాండ్‌ ప్రాంతంలో అమరవీరుల స్థూపం నిర్మాణ పనులు ప్రారంభింపజేశారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికి అమరవీరుల స్థూపం పనులు ముందుకు సాగకపోవడంతో పలువురు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. తెరాస నాయకులు సైతం తాము స్థూపం నిర్మాణ పనులు ...

Read More »

భక్తి శ్రద్దలతో వరలక్ష్మి వ్రతాలు, కుంకుమార్చనలు

మోర్తాడ్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లోని షిర్టీ సాయిబాబా ఆలయంలో భక్తులు కుంకుమార్చనలు, శివాలయంలో వరలక్ష్మి వ్రతాలు శ్రావణ మాసం మొదటి శుక్రవారం భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. శివాలయంలో వేద పండితురాలు గీతమ్మ మహిళా భక్తులతో వరలక్ష్మి పూజలు చేయించారు. సాయి భక్తులు బాబా ఆలయంలో కుంకుమార్చనలు జరిపించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదానం చేశారు.

Read More »

సీఎంకు రక్తంతో లేఖ రాసిన చిన్నారి

ఆ పాప పేరు లతికా బన్సాల్.. 14 ఏళ్ళు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో చదువుకొంటోంది. రెండు నెలల కిందట- జూన్ 14న ఆమె జీవితంలో మర్చిపోలేని ఘటన. జీవన పర్యంతం కళ్ళ ముందు కదలాడే ఘోరం జరిగింది. ఆమె తల్లి అనూ బన్సాల్ ను లతిక, ఆమె చెల్లెలు తాన్యా ల కళ్ళెదుటే సజీవదహనం చేశారు. మగపిల్లాణ్ణి కనలేకపోయావని అంటూ అనూను ఆమె అత్తమామలు, మరదలు దారుణంగా కిరోసిన్ పోసి నిప్పంటించేశారు. అమ్మ కోసం ఆ పాపలిద్దరూ ఏడ్చారు. లతిక వెంటనే ...

Read More »

వాటి కోసం వాట్సప్ వాడొద్దు!

ఉద్యోగం చేస్తున్నపుడు సెలవు పెట్టాలన్నా, రాజీనామా చేయాలన్నా, లేదా మీ కింద పనిచేసే ఉద్యోగులకు పని అప్పగించాలన్నా.. ఇలాంటి పనులకు వాట్సప్ వాడొద్దని పెద్ద కంపెనీల హెచ్ఆర్ అధికారులు చెబుతున్నారు. అసలు ఆఫీసు కమ్యూనికేషన్ కోసం వాట్సప్ వాడొద్దని సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ వినియోగదారులు దాదాపు వంద కోట్ల మంది ఉండగా, భారతదేశంలో సుమారు 10 కోట్ల మంది ఉన్నారు. ఇందులో పంపే సమాచారం పూర్తి ఎన్‌క్రిప్టెడ్ పద్ధతిలో ఉంటుంది. అయినా పెద్ద కంపెనీలు మాత్రం దీన్ని వద్దనే అంటున్నాయి. ఎవరైనా ఉద్యోగులు కంపెనీలు ...

Read More »

ఉపాధికి ఉపయోగపడే విద్య ఇంకెప్పుడు?

మారిన, మారుతున్న కాలానుగుణంగా విద్యావిధా నంలో ఆశించినమేరకు మార్పులు రాకపోవడంతో నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతున్నది. జ్ఞానార్జన ప్రజలందరికీ హక్కుగా తీర్మానిం చేందుకు దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతున్నా నేటికీ లక్ష్యానికి ఆమడదూరంలో ఉన్నాం. ప్రాథమిక విద్యలో కొంతలో కొంతమార్పు అభివృద్ధి కనిపించినా సమాజంలో వ్యక్తి వికాసానికి, జీవనోపాధికి ఉపయోగపడే నాణ్య మైన విద్యను అందించడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నాం. ఫలితంగా మూస చదువుల బారినపడి ఉపాధి అవకాశాలురాక నిరాశా, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతు న్న నిరుద్యోగ పట్టభద్రులు కోకొల్లలుగా తయారవుతున్నారు. భారతదేశ వ్యాప్తంగా దాదాపు 620కు పైగా ...

Read More »

అందుకే మనకు పతకాలు రావడం లేదట!

ప్రపంచంలో ఆరోవంతు జనాభా భారత్‌లోనే ఉన్నారు.. అయినా విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో ఇప్పటికీ బోణీ కొట్టలేదు. ఎన్నో చిన్నాచితకా దేశాలు పతకాలు సాధించి సగర్వంగా తమ క్రీడాస్ఫూర్తిని చాటుతుంటే.. సగటు భారతీయుడు మాత్రం మనకెప్పుడు పతకమని నిట్టూర్చాల్సిన పరిస్థితి. మరీ ఒలింపిక్స్‌లో మనకు పతకాలు రాకపోవడానికి కారణం ఏమిటంటే.. చైనీస్‌ మీడియా తనకు తెలుసనంటోంది. భారత్‌కు పతకాలు రాకపోవడానికి ఇవే కారణమై ఉంటుందని తాను భావిస్తున్నట్టు చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఆ కారణలేమిటంటే.. మౌలిక వసతులు లేకపోవడం ప్రజారోగ్యం బలహీనంగా ఉండటం పేదరికం క్రీడల్లో ...

Read More »

క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. విషాదసాగరంలో ఫ్యాన్స్

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ లెజెండ్, పాక్ లిటిల్ మాస్టర్‌గా పేరుగాంచిన హనిఫ్ మహ్మద్ చనిపోయారు. కరాచీలోని అగాఖాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తొలుత ఆయన మరణానికి సంబంధించి మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇంతలో ఆయన కుమారుడు తన తండ్రి ప్రాణాలతోనే ఉన్నారని హనిఫ్ మహ్మద్ షోయబ్ మహ్మద్ వెల్లడించారు. దీంతో ఆయన బతికే ఉన్నారని తిరిగి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హనీఫ్ మహ్మద్ చనిపోయారని వైద్యులు మళ్లీ కన్‌ఫమ్ చేశారు. 81 సంవత్సరాల హనిఫ్ మహ్మద్ కొంతకాలంగా ఊపిరితిత్తుల ...

Read More »

పతక జాడేది!

ఖాతా తెరువని భారత్   మన అథ్లెట్లకు అందని ద్రాక్షగా మెడల్‌ మహిళా ఆర్చర్లు అవుట్‌ బాక్సర్‌ శివ థాపాకు షాక్‌ ఆరో రోజూ నిరాశే ప్చ్‌.. రియోలో మన అథ్లెట్లకు అదృష్టం కలిసిరావడం లేదు..! మన పతక నిరీక్షణకు తెరపడడం లేదు..! వరుసగా ఆరో రోజూ భారత్‌కు నిరాశే..! బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్‌, పీవీ సింధు శుభారంభం.. బాక్సర్‌ మనోజ్‌ కుమార్‌ ప్రీక్వార్టర్స్‌కు చేరుకోవడం మినహా.. గురువారం టీమిండియాకు అన్నీ ప్రతికూల ఫలితాలే..! పతకంపై గురి పెట్టిన మహిళా ఆర్చర్లు దీపికా కుమారి, బొంబ్యాల ...

Read More »

రియో నుంచి భారత బాక్సర్ శివథాప ఔట్..

రియో డి జనిరో: రియో ఒలింపిక్స్‌ 6వ రోజు జరుగుతున్న ఆటల్లో భారత్‌కు మరో ఓటమి ఎదురైంది. పురుషుల 56 కేజీల బాక్సింగ్ విభాగంలో భారత ఆటగాడు శివథాప ఓడిపోయాడు. రౌండ్ 32లో క్యూబాకు చెందిన తన ప్రత్యర్ధి రోబిసి రమిరెజ్‌పై 3-0 తేడాతో ఓడిపోయాడు. దీంతో రియో ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు. ఈ గేమ్‌లో క్యూబా ఆటగాడు తన కుడి చేతిని ఎక్కువగా ఉపయోగించి పంచ్‌లు విసిరాడు. ఈ ఓటమితో ఇక రియోలో జరగనున్న బాక్సింగ్ పోటీల్లో భారత్ నుంచి మనోజ్ కుమార్, ...

Read More »

మిస్డ్ కాల్ లవ్.. శీలాన్ని కోల్పోయిన యువతి.. ఎక్కడ..?

టెక్స్‌టైల్ షాపులో పనిచేస్తూ వచ్చిన శ్రీలంకకు చెందిన యువతి మిస్ట్ కాల్ ప్రేమతో శీలం కోల్పోయింది. షాపులో ఉండగా ఆ యువతికి తరచూ మిస్డ్ కాల్స్ వచ్చేవి. ఆ నెంబరుకు సదరు యువతి ఫోన్ చేసింది. ఆ వైపు నుంచి ఓ యువకుడు మాట్లాడాడు. ఈ మిస్డ్ కాల్ పరిచయం స్నేహంగా మారింది. స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆ యువతి ఫోన్లో పూర్తి వివరాలు ఆ యువకుడిపై నమ్మకంతో చెప్పేసింది. కానీ ఆ యువకుడు మాత్రం తన వివరాలను ఆమెకు ...

Read More »