Breaking News

Daily Archives: August 13, 2016

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి దిష్టిబొమ్మ దగ్దం

రెంజల్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా వ్యవహరించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మను శనివారం రెంజల్‌ మండల మాలమహానాడు ఆద్వర్యంలో దగ్దం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులను విభజించి పాలించే దిశగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తుందని, దళితుల మధ్య చిచ్చుపెట్టి విభజించి పాలించడం సరికాదని వారన్నారు. గతంలో ప్రాంతీయ పార్టీ వర్గీకరణ పేరుతో దళితులను చీల్చే ప్రయత్నం చేయగా వారికి సరైన బుద్దిచెప్పడంతో వర్గీకరణ ప్రస్తావన తీసుకురాకుండా ఉన్నారని, మళ్లీ నేడు ...

Read More »

ఆదివారం జిల్లాకు సిఎం రాక

నిజామాబాద్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం జిల్లాకు విచ్చేయనున్నారు. గత 9 రోజుల క్రితం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డికి మాతృవియోగం కలగడంతో వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సిఎం కెసిఆర్‌ విచ్చేస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి 12 గంటల వరకు ఎర్రపహాడ్‌ చేరుకుంటారు. 12 గంటల నుంచి 1 గంట మద్య సమయంలో ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి, వారి కుటుంబీకులతో సిఎం మాట్లాడతారు. అనంతరం ...

Read More »

సరస్వతి శిశుమందిర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీసరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో శనివారం 70వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఇండిపెండెన్స్‌డే ఆకారంలో కూర్చొని కనువిందుచేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యుడు నాగభూసణం మాట్లాడుతూ భావి భారత పౌరుల్లో స్వాతంత్య్ర దినోత్సవం యొక్క ప్రామఖ్యతను తెలియజేసేలా, దేశభక్తిని జాగృతం చేసేలా శిశుమందిర్‌ ఆధ్వర్యంలో అనునిత్యం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు ...

Read More »

తెరాస ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి తెరాస పట్టణ మైనార్టీ అధ్యక్షుడు షౌకత్‌ అలీఖాన్‌ వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి పట్టణంలోని 9వ అదనపు కోర్టులో జిల్లా న్యాయమూర్తిని నియమించాలని కోరారు. ప్రత్యేక హౌకోర్టు కోసం కేంద్ర ప్రభుత్వం మనసు మారాలని న్యాయమూర్తుల నియామకాలు చేపట్టాలని పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకాలు లేకపోవడంతో కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి ...

Read More »

ముఖ్యమంత్రి దళిత కుటుంబాలను పరామర్శించాలి

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎల్లారెడ్డికి రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డితోపాటు భూములు కోల్పోయిన దళిత కుటుంబాలను పరామర్శించాలని సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి, సిపిఐ పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా నాయకులు ప్రభాకర్‌, కంజర భూమయ్యలు మాట్లాడారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో ల్యాండ్‌ అవుతున్న ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రం దళితుల భూములు ఆక్రమించి నిర్మించిందన్నారు. ఆ భూముల కోసం దళితులు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీలు అనేక ...

Read More »

దళితుల భూములు తిరిగి ఇవ్వాలి

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి స్వాధీనం చేసుకున్న దళితుల భూములను వారికి తిరిగి ఇవ్వాలని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి కె.చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం కామారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి దళిత, గిరిజన వ్యతిరేకి అని దళితుల భూములు గతంలో కబ్జాచేశారని ఆరోపించారు. ఫాం హౌజ్‌ల పేరిట భూములను దుర్వినియోగం చేశారని, స్వంత భూముల్లో 45 లక్షల ప్రభుత్వ వ్యయంతో చెక్‌డ్యాంలు నిర్మించుకున్నారని అన్నారు. రవిందర్‌రెడ్డికి మాతృవియోగం ...

Read More »

మొక్కలకు కంచెల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోటరీ క్లబ్‌ ఆప్‌ కామారెడ్డి ఆధ్వర్యంలో శనివారం మొక్కల కోసం కంచెలు పంపిణీ చేశారు. ఎన్జీవోస్‌ కాలనీలోని ప్రాథమిక పాఠశాల, ఎస్‌ఎస్‌ఆర్‌ ఎంప్లాయిస్‌ సొసైటీకి వీటిని అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమీషనర్‌ విజయలక్ష్మి ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరుపోశారు. కంచెలు పంపిణీ చేసిన రోటరీక్లబ్‌ వారిని అభినందించారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు కృష్ణమూర్తి, కార్యదర్శి లక్ష్మినర్సింలు, కోశాధికారి సత్యం, కౌన్సిలర్‌ లక్ష్మినారాయణ, తుమ్మ రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Read More »