Breaking News

Daily Archives: August 14, 2016

ఫుడ్‌ ఇన్‌ మెషిన్‌

వెండింగ్‌ మెషిన్‌ ముందు నిలబడి ఇలా టచ్‌ చేయగానే అలా నిమిషాల్లో కోరుకున్న ఫుడ్‌ మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. బడ్డికొట్టు నుంచి బడా హోటల్‌ వరకు సాగిన ఆహారపదార్థాల వ్యాపారం మరోసారి సరికొత్త వేదికగా రాబోతుంది. ఇదో న్యూ ఫుడ్‌ అవుట్‌లెట్‌. ప్రపంచంలోనే తొలిసారి ఈ తరహా హోటల్‌ సింగపూర్‌లో ప్రారంభమైంది. ఎనీ టైమ్‌ మనీ డ్రా చేసుకునేందుకు ఏటీఎమ్‌లు ఉన్నాయి. టికెట్లు అందించే టికెట్‌ వెండింగ్‌ మెషిన్లు, బటన్‌ నొక్కగానే వచ్చేసే కూల్‌డ్రింక్స్‌ మెషిన్లు, పుస్తకాలు ముద్రించేవి, మందులు, పిజ్జా, బర్గర్లు అందించేవి ...

Read More »

రోజు ఇవి తింటే సంతోషంగా ఉంటారట

పళ్ళు తినడం వలన ఆరోగ్యంతో పాటు సంతోషం కూడా కలుగుతుంది అంటున్నారు లండన్‌ యూనివర్సిటీ పరిశోధకులు. రోజువారీ ఆహారంలో మనం ఎంత మేర పళ్ళను చేర్చుకుంటామో మన ఆనందం అంత మేర పెరుగుతుందని వీరి పరిశోధనలో వెల్లడైంది. సుమారు రెండువేలమంది మీద వీరు సుదీర్ఘ పరిశోధనలు నిర్వహించారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి ప్రతిరోజూ ఆహారంతో పాటు ఐదురకాల పళ్ళు అందించారు. రెండవ గ్రూపు వారికి కేవలం ఆహారం మాత్రమే అందించారు. కొన్ని నెలల అనంతర వీరి శారీ రక, ...

Read More »

పచ్చిమిర్చి పవర్‌ ఎంతంటే..

వంటల్లో కేవలం కారం కోసమే పచ్చిమిర్చి వాడతారు అనుకుంటారు చాలామంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మిర్చిలోని పోషకాలు అన్నీఇన్నీ కావు. అవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. వీలైనంత వరకు ఎండుమిరప పొడిని తగ్గించి.. మిర్చిని వాడేందుకు ప్రయత్నించండి. మీరు నమ్ముతారో లేదో పచ్చిమిర్చి ‘విటమిన్‌ సి’ కి పెట్టింది పేరు. అరకప్పు తరిగిన పచ్చిమిర్చితో కనీసం 181 మిల్లీగ్రాముల ‘సి’ విటమిన్‌ లభిస్తుంది. మన శరీరానికి ఒక రోజుకు సరిపడేంత అన్న మాట. మన ఆరోగ్యం ఎంత బాగుంది అని చెప్పడానికి ...

Read More »

పుష్కరాల కోసం అమరావతికి రజనీకాంత్

అచ్చంపేట: సూపర్‌స్టార్‌ రజనీకాంత్ గుంటూరు జిల్లా, అచ్చంపేట మండలం చింతపల్లిలోని విష్ణుపంచాయతన దివ్య మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. పుష్కరాల సందర్భంగా రజనీకాంత్ ఇక్కడికి రానున్నట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు.

Read More »

పసివాడి ప్రాణం తీసిన మతి మరుపు

హెలోటెస్‌, ఆగస్టు 13: ఎండలో పార్క్‌ చేసిన కారులో అభం శుభం తెలియని ఓ ఏడు నెలల పసివాడు తండ్రి మతిమరుపు కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని హెలోటెస్‌ పట్టణం శివారులోని ఒక స్టోరులో పనిచేసే ఓ వ్యక్తి తన ఏడు నెలల పసికందును కారు వెనుక సీట్లో పడుకోబెట్టుకొని శుక్రవారం ఉదయం 6.15కు స్టోరుకు బయలుదేరాడు. దారిలో ఆ పసికందును బేబి కేర్‌ సెంటర్‌లో వదిలి పెట్టడం మర్చిపోయాడు. కారులో పసివాడు ఉన్నాడన్న విషయాన్నీ మర్చిపోయి.. నేరుగా స్టోరుకు వెళ్లి కారు పార్క్‌ ...

Read More »

పాక్ స్వాతంత్ర్య దినోత్సం: కశ్మీర్లో కలకలం

జమ్ము: పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఆదివారం కశ్మీర్ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో కలకలం చెలరేగింది. పూంఛ్ జిల్లాలో  పాక్ బలగాల కాల్పులు, బుద్ధ అమర్ నాథ్ యాత్రికులపై గ్రెనేడ్ దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్.. ఢిల్లీలోని జరిగిన స్వాతంత్ర్యవేడుకల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూంఛ్ జిల్లా సరిహద్దులో ఆదివారం ఉదయం పాక్  కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. భారత జవాన్లే లక్ష్యంగా మిషిన్ గన్స్, మోర్టార్ రాకెట్లతో దాడి చేసిందింది. దీనిని తిప్పి కొట్టే క్రమంలో భారత ...

Read More »

పీటీ ఉషా తర్వాత మళ్లీ రికార్డ్ క్రియేట్ చేసిన లలిత..

రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ అదరగొట్టింది. ఈ రోజు జరిగిన క్వాలిఫెయింగ్ మ్యాచ్‌లో అర్హత సాధించి ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది లలిత బాబర్. మహిళల 3000 మీటర్ల స్టీపుల్ ఛేస్‌, హీట్ 2లో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 9 నిమిషాల 19.76 సెకండ్లలోనే టార్గెట్ చేరుకుది. ఓవరాల్‌గా 826 పాయింట్లతో టాప్ 7లో ఉంది. ఈ పోటీలో 451 పాయింట్లతో బె హ్రెయిన్ క్రీడాకారిణి రూత్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. భారత్ తరుపున పీటీ ఉష తర్వాత ...

Read More »

అమ్మాయిలు ఇంటికి

రియోలో భారత మహిళల హాకీ జట్టు కథ ముగిసింది. 32 ఏళ్ల తర్వాత విశ్వక్రీడలకు అర్హత సాధించిన అమ్మాయిలు పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశపర్చారు. గ్రూప్‌ దశలో వరుసగా నాలుగో ఓటమితో ఇంటిదారి పట్టారు. తమ చివరి గ్రూప్‌-బి మ్యాచ్‌లో టీమిండియా 0-5తో అర్జెంటీనా చేతిలో చిత్తయింది. కాగా, రోయింగ్‌లో దత్తు బాబన్‌ భోకనల్‌ పురుషుల సింగిల్స్‌ స్కల్స్‌లో ఓవరాల్‌గా 15వ ర్యాంక్‌ సాధించాడు.

Read More »

రోడ్డు ప్రమాదంలో నటికి తీవ్రగాయాలు

విజయవాడ: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెలివిజన్ నటి రోహిణి రెడ్డికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు పుష్కరాల్లో పాల్గొనడానికి వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న బెలీనో కారు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రోహిణిరెడ్డితో పాటు కారు డ్రైవర్ ఉషప్పగౌడ్, అసిస్టెంట్ చంటిలకు కూడా తీవ్రగాయాలయ్యాయి. విజయవాడ గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస కళ్యాణం తదితర సీరియల్స్లో రోహిణిరెడ్డి నటించారు.

Read More »

కర్పూరం గొప్పేంటి?

కర్పూరపు బిళ్ళలను నీళ్ళలో ఉంచి వెలిగించినా వెలుగుతాయి. ఎందువల్ల? అందులో ఏముంటాయి. మనం తెలుసుకుందామా! కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు. లేదా వెలుగుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా ఆరిపోతుంది. కర్పూరాన్ని జాగ్రత్తగా నీటి మీద ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. కర్పూరం నీటిలో కరగదు. ఇది ఒకటర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం. ఇందులో కర్బనం, ఆక్సిజన్, హైడ్రోజన్ మాత్రమే ప్రత్యేక పద్దతిలో సంధానించుకుని ఉంటాయి. కర్పూరం మంచి ఇంధనం అంటే అది త్వరగా మండుతుంది. కర్పూరం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ ...

Read More »