Breaking News

Daily Archives: August 15, 2016

విద్యతోనే సర్వతోముఖాభివృద్ది

– తెవివి వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య డిచ్‌పల్లి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య పరిపాలనా భవనంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు గమ్యాన్ని చేరుకోవడానికి విద్యపై సత్తా, సామర్థ్యాన్ని పెంపొందించుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ప్రపంచంలో చిన్నదేశమైన సింగపూర్‌ విద్యారంగాన్ని అభివృద్ది చేయడంతో ఆర్థికంగా, సామాజికంగా ముందుందన్నారు. సింగపూర్‌లో తాగునీటిని శుద్దిచేసుకొని తాగుతారు కానీ మన ...

Read More »

విశ్వబ్రాహ్మణ జేఏసి ఏర్పాటుకు తీర్మానం

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో జేఏసిని ఏర్పాటు చేస్తూ తీర్మానించారు. సోమవారం కామారెడ్డిలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. జిల్లాలో విశ్వబ్రాహ్మణ సంఘం ఒకే సంఘంగా ఉండాలని తీర్మానించారు. తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికలకు జేఏసిగా ఏర్పాటు చేసిన కమిటీతో వెళ్లాలని ప్రతిపాదించారు. కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అద్యక్షులు బెజ్జంకి సుదర్శన్‌చారి, ప్రతినిధులు వెంకటేశం, వెంకటస్వామి, రాజమౌలి, సంగమేశ్వర్‌, ...

Read More »

ఏఎన్‌ఎంల సమ్మెకు మద్దతు

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఎన్‌ఎంలు నిర్వహిస్తున్న సమ్మెకు తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు టిఎంఎస్‌ఆర్‌యు ప్రతినిదులు తెలిపారు. సోమవారం ఏఎన్‌ఎంల దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలోని రెండవ ఏఎన్‌ఎంలను క్రమబద్దీకరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రాజగోపాల్‌రెడ్డి, సతీష్‌, రవీంద్రచారి, సంతోష్‌, రాజేందర్‌, వీరాచారి, ప్రవీణ్‌, బాల్‌రాజ్‌, శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

బిజెపి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ ప్రధాని నరేంద్రమోడి పిలుపుమేరకు కామారెడ్డి పట్టణంలో సోమవారం బిజెపి నాయకులు తిరంగా యాత్ర నిర్వహించారు. అంతకుముందు పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం ద్విచక్ర వాహనాలపై త్రివర్ణ పతాకాలు చేబూని పట్టణంలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ నినాదాలు చేశారు. సెప్టెంబరు 17 వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మురళీధర్‌గౌడ్‌, ...

Read More »

వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో శ్రీగణేశ, రాజరాజేశ్వరి మహాదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడురోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం దేవతా మూర్తులను పట్టణంలో ఊరేగించారు. మంగళవాయిద్యాలు, హారతులు, కళశాలతో మండప ప్రవేశం, మహా సంకల్పం, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ట, గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్రహోమం నిర్వహించారు. మహిళలు కళశాలు నెత్తినబెట్టుకొని ఆలయం ...

Read More »

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సోమవారం 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాల ఆద్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు నిర్వహించారు. ఆయా కార్యాలయాల ముందు జాతీయ జెండా ఆవిష్కరించారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం వద్ద ఆర్డీవో నగేశ్‌ జెండా ఆవిష్కరించారు. మునిసిపల్‌ కార్యాలయం వద్ద మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి మంగమ్మ, ...

Read More »

రూ. 2080 కోట్లతో సుద్దపల్లిలో 765/400 కెవి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌

– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా పోలీసు పరేడ్‌ మైదానంలో సోమవారం నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. రెండు సంవత్సరాలుగా వర్షాబావ ...

Read More »

ఆర్మూర్‌ పిఎస్‌లో త్రివర్ణ పతాకావిష్కరణ

ఆర్మూర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ సోమవారం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా కర్తన్‌ భూషన్‌ అనే వ్యక్తిని సన్మానించారు. భూషన్‌ గత కొన్ని సంవత్సరాలుగా గుర్తు తెలియని, కుళ్ళిపోయిన శవాలను బయటకు తీయడంలో పోలీసు వారికి సహకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని ఆయన్ను పోలీసు శాఖ ఆద్వర్యంలో సన్మానించారు. అలాగే ఆర్మూర్‌ డిఎస్పీ కార్యాలయంలో భీమ్‌గల్‌ సిఐ రమణరెడ్డి పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో ...

Read More »

ఉత్తమ ఎంపిడివోగా భరత్‌కుమార్‌

బీర్కూర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బీర్కూర్‌ ఎంపిడివో భరత్‌కుమార్‌ను ఉత్తమ ఎంపిడివోగా ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అలాగే ఇసి, ఏపివో హలీం అక్మల్‌కు కూడా ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. ఉత్తమ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, దీంతో బాద్యత కూడా పెరిగిందని ...

Read More »

ఎగిరిన మువ్వన్నెల జెండా

బీర్కూర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, యువజన సంఘాలు, కుల సంఘాల్లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. 70 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల పాఠశాల విద్యార్థులచే ప్రధాన కూడళ్లలో జాతీయ సమైక్యతా నినాదాలు చేశారు. అనంతరం పాఠశాలల్లో పతాకావిష్కరణ గావించారు. పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐ మజీద్‌ఖాన్‌, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ కృష్ణనాయక్‌, ఎంపిడివో కార్యాలయంలో ఎంపిపి మల్లెల మీణ హన్మంతు, ఐకెపి కార్యాలయంలో ఏపిఎం ...

Read More »

శివుని అర్ధనారీశ్వర రూపం వెనుక అసలు రహస్యం..!!

ఇన్ యాంగ్ అంటే స్థూలంగా చీకటి వెలుగుల సమతుల్య సంగమం అని చెప్పవచ్చు. చీకటి వెలుగూ స్త్రీ పురుషులిద్దరిలో ఉంటాయి. ఒకరి వెలుగులో ఒకరు నిండిపోవడం ఒకరి చీకటిలో ఒకరు సేద తీరడం జీవన సూత్రం. అదే హిందూ జీవన విధానంలో అర్ధనారీశ్వర తత్వంగా చెప్పబడినది. ఇవన్నీ పరస్పర ప్రేమను దంపతు మధ్య బాంధవ్యం ఉండవలసిన తీరునూ అంతర్లీనంగా బోధిస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రపంచం పుట్టినప్పుటి నుండీ ఉన్నవే . తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత.. ఆది దంపతులు – జగత్పితరులు ‘జగతఃపితరౌ వందే పార్వతీ ...

Read More »