Breaking News

Daily Archives: August 17, 2016

డిజిటల్‌ తరగతి గది ప్రారంభం

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీసరస్వతి విద్యామందిర్‌ పాఠశాలలో బుధవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ డిజిటల్‌ తరగతి గదిని ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన గదులను కూడా ప్రారంభించారు. విద్యార్థులకు డిజిటల్‌ పద్దతిలో బోధన చేసి, వారికిసాంకేతిక విద్యనందించడం అభినందనీయమన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నందుకు పాఠశాల అధ్యాపకుల బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో భిక్కనూరు జడ్పిటిసి రాజమణి, ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, కౌన్సిలర్‌ కుంభాల రవి, నాయకులు నిట్టు ...

Read More »

బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో రక్షాబంధన్‌

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం బిజెపి మహిళా మోర్చా ఆద్వర్యంలో రక్షాబంధన్‌ ఉత్సవాలు నిర్వహించారు. ఈసందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుడు బాలయ్య, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిలను వారి వారి స్వగృహాల్లో కలిసి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలుపుతూ రాఖీలు కట్టారు. స్వాతంత్య్ర సమరంలో వారి పాత్ర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృధ్ధాశ్రమానికి వెళ్ళి అక్కడి వృద్దులకు రాఖీలు కట్టి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కల్పన, ప్రతినిదులు గీతా ...

Read More »

ఘనంగా సరస్వతి హోమం

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఎస్‌పిఆర్‌ పాఠశాల ఆవరణలో బుధవారం సరస్వతి హోమం నిర్వహించారు. కార్యక్రమంలో అమ్మవారి ఉపాసకులు శ్రీలక్ష్మినారాయణ, రమణ చక్రవర్తిల ఆధ్వర్యంలో పిల్లలచేత హోమం, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పిల్లలకు హోమం, దాని ప్రాముఖ్యతను వివరించారు.

Read More »

సాయిసుధ విద్యాలయంలో రక్షాబంధన్‌ వేడుకలు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలోని శ్రీసాయిసుధ విద్యాలయంలో బుధవారం విద్యార్థులచే రక్షాబంధన్‌ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్తిని, విద్యార్థులు ఆంగ్ల అక్షరాల్లోని రాఖీ ఆకారంలో కూర్చొని విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాద్యాయుడు నరేశ్‌ మాట్లాడుతూ విద్యార్థులకు సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేస్తూ నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష మనమందరం దేశానికి రక్షా అంటూ విద్యార్థులకు ఒకరినొకరు రాఖీలు కట్టుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవీన్‌, చంద్రకాంత్‌, గోపి, మెహరాజ్‌, ...

Read More »

ఘనంగా రక్షాబంధన్‌ ఉత్సవాలు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అక్షర టెక్నో పాఠశాలలో బుధవారం రక్షా బందన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులచేత ఒకరినొకరికి రాఖీలు కట్టించారు. విద్యార్థులు సోదర భావంతో మెలగాలని చెప్పారు. సోదరభావానికి, దేశ ఐక్యతకు రాఖీ పండగ ప్రతీక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్‌ అశోక్‌రెడ్డి ప్రధానోపాధ్యాయురాలు హేమలత, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

– హాజరైన డిఎస్‌, గంప కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వీక్లి మార్కెట్‌లో శ్రీగణేష, రాజరాజేశ్వరి మహాదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌తోపాటు కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం నుంచి ప్రారంభమైన ప్రతిష్టాపన ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. బుధవారం మంటప పూజ, బలిప్రదానం, శ్రీగణేష రాజరాజేశ్వరి దేవి, ...

Read More »

ఉన్నత విద్యపై జాతీయ సెమినార్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్నల్‌ క్వాలిటి అసెస్‌మెంట్‌ విభాగం, నాక్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో క్వాలిటి ఎడ్యుకేషన్‌, ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌, ఛాలెంజెస్‌ ఫర్‌ 21 సెంచరీ అనే అంశంపై జరిగే జాతీయ సెమినార్‌ ఆగష్టు 18న ప్రారంభమవుతుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ముఖ్య అతిథిగా వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య హాజరవుతారని, కీ నోట్‌ స్పీకర్‌గా కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌గా రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు, ...

Read More »

చురుకుగా మిషన్‌ భగీరథ పనులు

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు జిల్లాలో వేగంగా కొనసాగుతున్నాయి. రెండేళ్ల తర్వాత ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని సింగూరు రిజర్వాయర్‌ నుంచి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించేందుకు నాలుగు నెలల క్రితం ప్రారంభించిన పనులు ఊపందుకున్నాయి. ఉన్నతాధికారులు పనులను పరిశీలిస్తూ దిగువ స్థాయి సిబ్బందికి, కాంట్రాక్టర్లకు సూచనలు, సలహాలు ...

Read More »

మూలన పడ్డ చెత్త రిక్షాలు

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చభారత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీకి మూడు చొప్పున చెత్త సేకరించేందుకు రిక్షాలు అందజేశారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు విడతల వారిగా రిక్షాలు అందించారు. ఇందులో భాగంగా ఇప్పటికి 10 పంచాయతీలకు రిక్షాలు చేరుకున్నాయి. సఫాయి కార్మికులు లేకపోవడంతో రిక్షాలు మూలన పడ్డాయి. మండలంలో 17 గ్రామ పంచాయతీలుండగా మూడు, నాలుగు మినహా ఇతర చోట్ల కార్మికులు లేకపోవడంతో రిక్షాల వినియోగం లేకుండా పోయింది.

Read More »

నిబంధనలు బేఖాతర్‌…

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 1వ తేదీ నుంచి ఆగష్టు 31 వరకు చేపల సంతానాన్ని ఉత్పత్తి చేసే సమయం. ప్రస్తుతం చేపలు వేటాడడం వల్ల అతిచిన్న చేప పిల్లలు ఉండడంతో అవి మృతి చెందుతున్నాయి. అందుకే ఈ రెండు నెలల కాలంలో చేప పిల్లలను పట్టడం నిషేదించారు. చేపల వేటను రెండు నెలలపాటు నిషేదించినట్టు మత్స్యశాఖ అభివృద్ది శాఖ అధికారిణి శైలజ ఆదేశాలు జారీచేశారు. అయినా నిజాంసాగర్‌ ప్రాజెక్టులో కొద్దిపాటి నీటిలో ఉన్న చేపలను ...

Read More »

ఉపాధి నిధులతో అంగన్‌వాడి భవన నిర్మాణ పనులు

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాది హామీ నిధులు రూ. 8 లక్షలతో మండలంలోని కోమలంచ గ్రామంలో చేపట్టిన అంగన్‌వాడి భవన నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. గ్రామంలో రెండు అంగన్‌వాడి కేంద్రాలు ఉండగా, ఒకదానికి మాత్రమే సొంత భవనం ఉంది. రెండో కేంద్రానికి భవనం లేకపోవడంతో అద్దె భవనంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ కొనసాగించారు. ఎట్టకేలకు ఉపాధి కింద నిధులు మంజూరు కావడంతో పనులు చేపట్టారు. అంగన్‌వాడి కేంద్రం పనులు చురుకుగా సాగుతున్నాయి.

Read More »

మొక్కలు నాటడం పూర్తయ్యింది… సంరక్షించడం మిగిలింది…

రెంజల్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరం సమష్టిగా హరితహారంలో పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. పెట్టిన మొక్కలు సంరక్షించడం మిగిలిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా అన్నారు. బుధవారం మండల తహసీల్‌ కార్యాలయంలో ఉపాధి హామీ, ఐకెపి, రెవెన్యూ, ఎంపిడివో కార్యాలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అందరి సహకారంతో హరితహారం కార్యక్రమంలో 3.35 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం జరిగిందన్నారు. దీని ...

Read More »

రైతుల నుంచి పంట ఇన్సురెన్సు బలవంతంగా వసూలు చేయొద్దు

మోర్తాడ్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంటల ఇన్సురెన్సు పేరుతో బ్యాంకు అధికారులు రైతుల వద్ద బలవంతంగా ప్రీమియం వసూలు చేయొద్దని జిల్లా వ్యవసాయదారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రెంజర్ల గంగారాం, డిజి గంగారాంలు బుధవారం ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌తో చర్చించారు. గతంలో పంట ఇన్సురెన్సు పేరుతో డబ్బు వసూలు చేశారని, రెండు సంవత్సరాలుగా పంటలు నష్టపోయినప్పటికి ఏ ఒక్క రైతుకు ఇన్సురెన్సు అందించలేదని, పంటల ఇన్సురెన్సుపై రైతులకు నమ్మకం లేకుండాపోయిందన్నారు. ఇష్టమున్న రైతు ప్రీమియం చెల్లిస్తున్నాడని, ఇష్టం లేని రైతులను ...

Read More »

ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ అధికారుల సర్వే

మోర్తాడ్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దోన్‌పాల్‌ గ్రామంలో 222 సర్వేనెంబరులోగల ప్రభుత్వ భూమిలో లబ్దిదారులకు ఇళ్ళ స్థలాలు అందించేందుకు బుధవారం మండల సర్వేయర్‌ శ్రీనివాస్‌, విఆర్వో జ్యోతిలు సర్వే చేస్తు సరిహద్దులు నిర్ణయించారు. 2013లో లబ్దిదారులకు దోన్‌పాల్‌లో ప్రభుత్వం ఇల్ల స్థలాలు అందించిందని, అట్టి భూమిలో అదే గ్రామానికి కొందరు అక్రమార్కులు కబ్జాకు పాల్పడడంతో ఈ విషయమై లబ్దిదారులు తహసీల్దార్‌కు విన్నవించారు. దీంతో తహసీల్దార్‌ స్పందించి తిరిగి లబ్దిదారులకు ఇళ్ళ స్థలాలు అందించేందుకు సర్వే చేయిస్తున్నారు. కార్యక్రమంలో ...

Read More »

హరితహారంను పకడ్బందీగా అమలు చేయాలి

మోర్తాడ్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం గ్రామాల్లో మరుగుదొడ్లు లేని ప్రతి ఇంటి లబ్దిదారుని గుర్తించి మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలని, అంతేగాకుండా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు సంరక్షించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌, వెంకటేశ్వర్లు వీడియో కాన్ఫరెన్సు ద్వారా మండల అధికారులను ఆదేశించారు. బుధవారం మోర్తాడ్‌ తహసీల్‌ కార్యాలయంలో ఓడిఎస్‌, హరితహారంపై మండలాధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపిడిఓ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

పరీక్షా కేంద్రం తనిఖీ

డిచ్‌పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ప్రారంభమౌన అప్లయిడ్‌ ఎకనామిక్స్‌, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రి ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల పరీక్షలు, అలాగే ఎల్‌ఎల్‌ఎం రెండవ సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్న కేంద్రాన్ని వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య తనిఖీ చేశారు. పరీక్షల వివరాలను విసికి కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ పాతనాగరాజు వివరించారు. ప్రిన్సిపాల్‌ ఆచార్య కనకయ్య పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను వివరించారు. వివిద పరీక్షా హాళ్లను సందర్శించి, పరీక్షలు జరుగుతున్న విధానం పట్ల విసి సంతృప్తి వ్యక్తంచేశారు. ఆగష్టు 31 వరకు పరీక్షలు ...

Read More »

బాధిత కుటుంబానికి పరామర్శ

మోర్తాడ్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పాలెం గ్రామంలో విద్యుత్‌షాక్‌తో సాయన్న అనే దళిత రైతు మృతి చెందాడు. బుధవారం తెరాస రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్‌కుమార్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలాల ప్రకాశ్‌, పలువురు పాల్గొన్నారు.

Read More »

రెండవ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించాలి

మోర్తాడ్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న రెండవ ఏఎన్‌ఎంలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్‌ రీజినల్‌ ఛైర్మన్‌ ఎస్‌ఇవో చిట్టిబాబు అన్నారు. బుధవారం మోర్తాడ్‌ ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమ్మె చేస్తున్న ఏఎన్‌ఎంల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలందించిన ఏఎన్‌ంలు 30 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికి ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని ప్రభుత్వ ...

Read More »

మరుగుదొడ్ల నిర్మాణాలపై దృష్టి పెట్టాలి

రెంజల్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం జరిగేవిధంగా చర్యలు చేపట్టాలని ఎంపిడివో చంద్రశేఖర్‌ సూచించారు. బుధవారం తన చాంబరులో ఫీల్డ్‌ అసిస్టెంట్లతో సమీక్షించారు. హరితహారంలో మండలానికి నిర్దేశించిన లక్ష్యం 4.4 లక్షల మొక్కలు నాటి లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. కాని వాటిని సంరక్షించే బాద్యత కూడా తీసుకోవాలన్నారు. అదేతరహా మరుగుదొడ్లు నిర్మాణాలు కూడా చేపట్టాలని ఎంపిడివో అన్నారు. వాటిని నిర్మించుకోకపోతే ఏర్పడే అనర్దాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ...

Read More »

ఆశాజనకంగా సోయాపంట

  రెంజల్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు గ్రామాల్లో రైతాంగం సోయాపంటపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు సకాలంలో పడకపోవడంతో రైతులు ఆరుతడి పంటలవైపు దృష్టి మల్లించారు. మండలంలోని కందకుర్తి, బోర్గాం, నీలా, తాడ్‌బిలోలి, సాటాపూర్‌, రెంజల్‌ శివార్లలో ఆరుతడి పంటలకు అనువుగా ఉన్న భూముల్లో సోయా, మినుము, పెసర, జొన్న తదితర పంటలను వేశారు. ఇటీవలే కురిసిన వర్షాలకు సోయాపంట ఆశాజనకంగా మారింది. ప్రస్తుతం వర్షాలు లేకున్నా భూగర్భజలాలు రావడం వల్ల పంటలకు ...

Read More »