Breaking News

Daily Archives: August 18, 2016

ఒమాన్ నుండి 14 మంది తెలంగాణ ప్రవాసీయుల తిరుగు పయనం

ఒమాన్‌‌లో భవన నిర్మాణ కార్మికులుగా పని చేయడానికి వచ్చి మోసపోయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన 14 మంది ప్రవాసీ కార్మికులు ఎట్టకేలకు స్వదేశానికి తిరిగి వెళ్ళారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మరియు మహెబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వీరు ఒమాన్ లోని జబల్ అల్ అఖ్దర్ అనే ప్రాంతం సమీపంలోని కొండలు, నదుల మధ్య రెండు రోజులు నడుచుకొంటూ అతర్వాత ట్రక్కులో 150 కిలో మీటర్ల దూరంలోని రాజధాని మస్కట్ లోని భారతీయ ఎంబసీ కార్యాలయానికి చేరుకోని తమను ఆదుకోవాలంటూ కోరగా అందుకు భారతీయ ...

Read More »

యువకుడి గదిలో రాత్రంతా ఉంది… ఆపై డబ్బివ్వాలని కాలేజీ యువతి బ్లాక్ మెయిలింగ్ చేసింది…

జైపూర్ : ఓ యువకుడిని బ్లాక్ మెయిలింగ్ చేసి అతని నుంచి రూ.27 లక్షలు గుంజిన కళాశాల యువతి ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో జరిగింది. గుర్గామ్ కు చెందిన బాధిత యువకుడు ఈ నెల 8వ తేదీన పర్యటనకు వచ్చి జైపూర్ లోని ఓ గదిలో ఉన్నారు. రాజస్థాన్ లోని జుంజును జిల్లాకు చెందిన  19 ఏళ్ల పీజీ కళాశాల విద్యార్థిని లాల్ కోఠిలోని హాస్టల్ లో నివాసముంటుంది. గుర్గామ్ కు చెందిన యువకుడితో మాట కలిపి రాత్రంతా అతని గదిలోనే ...

Read More »

రోజూ ఒకే సమయంలో చేస్తేనే మంచిదట!

లండన్‌: మీరు ఏదైనా సంస్థలో ఉద్యోగం చేస్తున్నారా? అది కూడా షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వర్తిస్తారా? అయితే ఈ వార్త మీకోసమే. ఇది మీకు మింగుడు పడని వార్తే అయినా తప్పదు చదవండి. కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ఒక బృందం చేసిన అధ్యయనంలో తేలిన విషయ ఏమిటంటే… ఏదైనా సంస్థలో ఉద్యోగం చేసే వ్యక్తులు ప్రతిరోజు ఒకే సమయంలో కాకుండా షిఫ్ట్‌లవారీగా విధులు నిర్వర్తిస్తే ఇన్‌ఫెక్షన్లకు గురవుతారట! అంతేకాదు వారికి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు అధికంగా ఉంటుదట! కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన తెలుగు సంతతి ...

Read More »

డ్రగ్స్.. గోవా టు హైదరాబాద్!

అంతర్రాష్ట్ర డ్రగ్స్ గ్యాంగ్ గుట్టురట్టు నైజీరియన్ల దందా ఏడుగురి అరెస్టు..  కొకైన్, బ్రౌన్‌షుగర్ స్వాధీనం హైదరాబాద్: గోవా కేంద్రంగా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో మాదకద్రవ్యాల దందా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టుచేశారు. మొత్తం ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశామని, వీరి నుంచి 73 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల బ్రౌన్‌షుగర్, కొంత నగదు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ బి.లింబారెడ్డి బుధవారం మీడియాకు తెలిపారు. నైజీరియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రఫెల్, అనోరా, సొలోమెన్, పీటర్, సామ్సన్, చుకు, ప్రామిస్ 2012-2015 ...

Read More »

కేటీఆర్కు రాఖీ కట్టిన కవిత

హైదరాబాద్ : శ్రావణ పౌర్ణమి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండగ వేడుకలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండగ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కె.కవిత తన సోదరుడు ఐటీ మంత్రి కేటీఆర్కు రాఖీ కట్టారు. ఈ రోజు ఉదయమే సీఎం క్యాంప్ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. అనంతరం సోదరుడు కేటీఆర్ చేతికి రాఖీ కట్టి.. స్వీట్  అందించారు. ఈ వేడుకల్లో కేటీఆర్ కుటుంబ సభ్యులతోపాటు కవిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఈ పండగను పురస్కరించుకుని రాజ్భవన్లో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ...

Read More »

కాజల్‌కు క్లాస్ పీకిన దర్శకుడు

ఒక్కోసారి అలవాటులో పొరపాటుగా చేసిన సంఘటనలు బెడిసికొడతాయి. ఇటీవల నటి కాజల్ అగర్వాల్ అలాంటి పొరపాటునే చేసి చిత్ర దర్శకుడి ఆగ్రహానికి గురైందని తెలిసింది. విషయం ఏమిటంటే అజిత్ నటిస్తున్న 57వ చిత్రంలో హీరోయిన్ ఎవరన్న విషయంపై చాలా చర్చ జరిగింది. చాలా మంది ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనకు వచ్చాయి. అందులో నటి అనుష్క పేరు కూడా ఉంది. తనే నాయకి అనే ప్రచారం జరిగింది కూడా. అలాంటిది చివరి నిమిషంలో నటి కాజల్ అగర్వాల్‌ను అదృష్టం వరించింది. ఆ తరువాత మరో ...

Read More »

హృదయాలు ద్రవించే దృశ్యం.. తీవ్ర గాయాలతో కూలబడిపోయిన భారత రెజ్లర్..

రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేష్ పోగట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తాను ఇక ఏమాత్రం పోటీని కొనసాగించలేకపోయింది. చైనాకు చెందిన సన్ యనన్‌తో క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అప్పటికే ఆమె కాలికైన గాయంతోనే కోర్టులోకి అడుగు పెట్టింది. అయితే మ్యాచ్ కొనసాగుతుండగా అది కాస్తా తీవ్రంగా మారింది. మొదట్లో పోటీపడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, తన వల్ల కాక పోటీని కొనసాగించలేకపోయింది. 5 రౌండ్లు కొనసాగించి అక్కడికక్కడే కుప్పకూలిపోయంది. దీంతో చైనా క్రీడాకారిణి సన్ యవన్ 5-0 తేడాతో వినేష్ ...

Read More »

అప్పులు ఎగవేస్తే ఇక చెడుగుడే

బ్యాంకుల చేతికి కొత్త ఆయుధం  న్యూఢిల్లీ : బ్యాంకులు, ఆర్థిక సంస్థల అప్పులతో మజా చేసి టోపీ పెట్టే కేటుగాళ్ల మోసాలకు తెరపడనుంది. ఇలాంటి ఘరానా పెద్ద మనుషుల ఆటలు కట్టించే చట్టానికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా రుణాల చెల్లింపులో విఫలమైతే, బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఆ రుణాల కోసం వారు హామీగా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయించి తమ రుణాలు ...

Read More »

స్కూల్ డ్రెస్‌లో పాము, మరణించిన చిన్నారి

గాంధీ నగర్: తన స్కూలు యూనిఫాంలో ఉన్న పాము కరవడంతో అర్మితా బింఝ్వర్ అనే ఎనిమిదేళ్ల బాలిక మరణించింది. గుజరాత్‌లోని పంచమల్ జిల్లా రింగానియా గ్రామంలో జరిగిందీ సంఘటన. ఎప్పుడూ తన తల్లిదండ్రులే ఆ పాపకి స్కూలు యూనిఫాం వేస్తారు. కాని ఆ రోజు స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో, స్కూలుకు త్వరగా చేరుకోవాలనే తొందరలో తానే బట్టలు వేసుకుంది. కాసేపటికి నురగలు కక్కుతూ కింద పడిపోయింది. ఆ బాలిక శరీరంపై పాము కాటును గమనించిన తల్లిదండ్రులు అర్మితాను ఆసుపత్రికి తరలించారు. పాము కాటుకు విరుగుడు ...

Read More »

సార్ ఇంట్లో లేరా అని… మంచినీళ్లడిగి చివరికిలా చేశారు !

కాశీబుగ్గలో దోపిడీకి విఫలయత్నం  పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస- కాశీబుగ్గ మున్సిపాల్టీ పరిధిలో గల గాయత్రీనగర్‌లో ఓ ఇంట్లో బంగారం దోపిడీకి విఫలయత్నం జరిగింది.బాధితురాలు, స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి ఓ నిందితుడ్ని పట్టుకున్నారు. అనంతరం ఆయన్ను పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు…వజ్రపుకొత్తూరులో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కింతల రామకృష్ణ భార్య పిల్లలతో కలిసి కాశీబుగ్గ గాయత్రీనగర్‌లో నివాసం ఉంటున్నారు. భార్య కింతలి ధనలక్ష్మి ఇంట్లో ఒక్కరే ఉండడం గమనించి పలాస మండలంలోని గురుదాసుపురం గ్రామానికి చెందిన పరజాన్ కుమారస్వామి మరోవ్యక్తి ద్విచక్రవాహనం మధ్యాహ్నం ఒంటిగంట ...

Read More »

ప్రపంచాన్ని చుట్టేయండి ఫ్రీగా!

ప్రపంచం చుట్టేయాలని ఎవరు కోరుకోరు. లాంగ్ డ్రైవ్ అంటే చాలా మందికి ఇష్టమే. కాని దానికి డబ్బులు లేక తమ ఆశల్ని ఆదిలోనే తుంచేస్తుంటారు. గూగుల్ మ్యాప్‌లో అనేక దారుల్ని చూస్తుంటాం. కాని మనం నిజంగా ఒక వాహనంపై ప్రయాణం చేస్తున్నంత అనుభూతి కలుగదు. అయితే నిజంగా మనం చూడాలనుకున్న పరిసరాల్ని చూస్తున్న అనుభూతి చెందుతూ ఇంకాస్త క్రేజీగా గూగుల్‌లో ప్రయాణించాలనుకే వారికి ఇదొక మంచి అవకాశం. ఆరన్ పూజీ అనే బ్రిటన్ వ్యక్తి వీడియోగేమ్ డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అతనికి ప్రతిరోజు వ్యాయామం ...

Read More »

పుష్కరాల్లో ఓ అరుదైన దృశ్యం

హైదరాబాద్‌ : తెలంగాణ పుష్కరాల్లో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మహబూబ్‌నగర్‌లోని ఓ ఘాట్‌ దగ్గర కోతి తాజాగా కూల్‌ డ్రింక్‌ తాగుతున్న ఈ ఘటనను పుష్కరాలకు వచ్చిన యాత్రికులు తిలకించారు.

Read More »

లవర్‌తో ఒంటరిగా.. భర్త చూడడంతో నగ్నంగా వీధుల్లో పరుగే పరుగు..

బారిలోచ్: ఓ స్కై రిసార్ట్‌తో ప్రేమికురాలితో గడుపుతున్న సమయంలో ఆమె భర్త రావడంతో ప్రియుడి పరిస్థితి అయోమయంగా మారింది. వెంటనే మంచం కిందికి దూరాడు. గదిలోకి వచ్చిన ఆమె భర్త మంచం కింద ఉన్న అతడిని గమనించాడు. దీంతో అతడు దుస్తులు కూడా తీసుకోకుండానే ఒంటిపై నూలుపోగు లేకుండా పరుగు లంకించుకున్నాడు. నగ్నంగా ఉన్నానన్న ధ్యాసే లేకుండా వీధుల వెంట పరుగులు తీశాడు. వెనక కత్తిపట్టుకుని తనను వెంబడిస్తున్న లవర్ భర్త నుంచి తప్పించుకునేందుకు రోడ్డుపై వచ్చే బైకులు, టాక్సీలను లిఫ్ట్ అడిగాడు. కానీ ...

Read More »