Breaking News

Daily Archives: August 19, 2016

సింధు విజయం సాధించాలని విద్యార్థుల ర్యాలీ

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రియోలో జరుగుతున్న ఒలంపిక్స్‌లో సింధు విజయకేతనం ఎగురవేయాలని ఆకాంక్షిస్తూ టిజివిపి ఆద్వర్యంలో శుక్రవారం కామారెడ్డిలో విద్యార్థులతో కలిసిర్యాలీ నిర్వహించారు. ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ సెమిఫైనల్‌లో విజయం సాధించి భారతదేశ కీర్తిని సింధు చాటిందన్నారు. సింధు బంగారు పతకం సాధించి దేశ కీర్తిని మరింత ఉన్నత స్థాయికి చేర్చాలని ఆకాంక్షించారు. సింధును స్ఫూర్తిగా తీసుకొని మహిళలు క్రీడా రంగంలో ఎదగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిజివిపి నాయకులు కుంభాల లక్ష్మణ్‌, రజనీకాంత్‌, శ్రీకాంత్‌, సాయి, సౌమ్య, రాజు, ...

Read More »

సార్వత్రిక సమ్మె గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబరు 2న నిర్వహించనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించిన గోడప్రతులను సిఐటియు నాయకులు శుక్రవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్‌ జిల్లా నాయకులు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. సమ్మెను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాజలింగం, నర్సింగ్‌రావు, నవీన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

మహిళ మెడనుంచి గొలుసు చోరీ

  కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం మల్లన్నగుట్ట వద్ద ద్విచక్ర వాహనంపై నుంచి వెళుతున్న ఓ మహిళ మెడనుంచి దొంగలు బంగారు గొలుసు లాక్కెళ్ళిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… కళావతి అనే మహిళ తన భర్తతో కలిసి టివిఎస్‌ చాంప్‌పై నిజామాబాద్‌వైపు వెళుతుండగా పల్సర్‌ వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు కళావతి మెడనుంచి నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. దీంతో ఖంగుతిన్న భార్యభర్తలు తేరుకొని అరిచే లోగానే దుండగులు పారిపోయారు. ...

Read More »

రైలుకింద పడి ఇద్దరు మృతి

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం రంగంపేట రైల్వేగేటు సమీపంలో రైలుకింద పడి తల్లి, కూతుళ్ళు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. సదాశివనగర్‌ మండలం రంగంపేటకు చెందిన హైమద్‌బీ (35), తన కూతురు సమ్రిన్‌ (5) తో కలిసి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. హైమద్‌బి భర్త గఫూర్‌ గత మూడునెలల క్రితం దుబాయ్‌ వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్టు రైల్వే ఎస్‌ఐ సాయినాథ్‌ తెలిపారు. మృతదేహాలను ...

Read More »

మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని డిప్యూటి తహసీల్దార్‌ హైమద్‌ మస్రూల్‌ అన్నారు. మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో ఐహెచ్‌ఎల్‌ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణాలపై జరిగిన సదస్సులో మాట్లాడారు. గ్రామంలో మరుగుదొడ్లను నిర్మించేందుకు 106 మంది లబ్దిదారులు ఎంపిక చేశామన్నారు. ఈ సమావేశంలో ఎపివో రాంనారాయణగౌడ్‌, విఆర్వో అంజయ్య, స్థానిక తెరాస నాయకులు సంగమేశ్వర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Read More »

ఈ- పంచాయతీల లక్ష్యం నెరవేరేనా…

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి పంచాయతీలో కంప్యూటర్‌ ద్వారా పాలన సాగించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పంచాయతీలను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రతి పంచాయతీకి ఆన్‌లైన్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు గుంతలు తవ్వి కేబుల్‌పనులు పూర్తిచేసింది. వాటితోపాటు ప్రతి పంచాయతీకి కంప్యూటర్‌ కూడా అందజేశారు. కొన్ని పంచాయతీల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లను ఏర్పాటు చేశారు. ఇఓపిఆర్‌డి మండల పరిషత్‌ కార్యాలయం ద్వారానే అన్ని పంచాయతీలకు చెందిన వివరాలను పరిశీలించవచ్చు. రెండేళ్ల నుంచి కొనసాగుతున్న పనులు నేటికి పూర్తి ...

Read More »

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలి

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలో నేడు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి శాస్త్ర, సాంకేతిక రంగాలతోపాటు విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ టి.మృణాళిని, ప్రొఫెసర్‌ వాణి, లాతూర్‌కర్‌ – నాందేడ్‌ అన్నారు. ‘నాణ్యమైన విద్య – 21వ శతాబ్దంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు’ అనే అంశంపై తెవివిలో జరిగిన రెండ్రోజుల జాతీయ సెమినార్‌ శుక్రవారం వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత విద్యలో పెను మార్పులు ...

Read More »

బీర్కూర్‌ ఎస్‌ఐగా హరిప్రసాద్‌

బీర్కూర్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఇటీవల జరిగిన ఎస్‌ఐల బదిలీల్లో భాగంగా బీర్కూర్‌ ఎస్‌ఐ రాజ్‌భరత్‌ను భిక్కనూరు మండలం విఆర్‌ ఎస్‌ఐగా బదిలీ చేసినట్టు బీర్కూర్‌ ఎస్‌ఐగా ఇటీవలే శిక్షణ పూర్తయిన ఎస్‌ఐ హరిప్రసాద్‌ను కేటాయించినట్టు పోలీసులు తెలిపారు. గత ఎస్‌ఐ రాజ్‌బరత్‌ అనతి కాలంలోనే మండలంలో రాజకీయనాయకుల, ప్రజల మన్ననలు పొందారు. జిల్లాలో మొట్టమొదటిగా చేపట్టిన మిషన్‌ భగీరథ కార్యక్రమంలో బీర్కూర్‌ చెరువును పునరుద్దరించిన ఘనత ఆయనకే దక్కింది. సౌమ్యుడుగా గ్రామాల్లో సమస్యలు పరిస్కరిస్తూ ప్రజల ...

Read More »

తెలంగాణ తిరుమల ఆలయంలో మహాఅన్నదానం

బీర్కూర్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో దాతల విరాళాలతో మహాఅన్నదానం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రావణ శనివారం పురస్కరించుకొని భక్తుల రాక అధికంగా ఉంటుందని, ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్టు అన్నారు. బొమ్మన్‌దేవుపల్లి ఎక్స్‌రోడ్డు నుంచి తిరుమల ఆలయం వరకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read More »

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి

బీర్కూర్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మండల అభివృద్ది అధికారి భరత్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని బైరాపూర్‌, బరంగెడ్గి గ్రామాల్లో శుక్రవారం తహసీల్దార్‌ కృష్ణానాయక్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా సీజనల్‌ ప్రబలే అవకాశముందని, గుంతల్లో, ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూడాలని ఆయన అన్నారు. దోమ తెరలు వాడాలని, దోమలు రాకుండా ఆలవుట్‌, కాయిల్స్‌ వాడాలని సూచించారు. ఎప్పటికప్పుడు గ్రామాన్ని శుబ్రంగా ఉంచాలని, మురికి కాలువల్లో, ...

Read More »

నీలాలో పారిశుద్య వారోత్సవాలు

రెంజల్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామంలో పారిశుద్య వారోత్సవాలను శుక్రవారం అధికారులు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్ల, రోడ్లుపై వున్న చెత్త చెదారాన్ని తొలగించారు. ముళ్ల పొదలు సమూలంగా కాల్చివేశారు. మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించారు. కార్యక్రమంలో ఇఓపిఆర్‌డి మల్లేశ్‌, కార్యదర్శి చరణ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

కందకుర్తి వద్ద గోదావరిలో భక్తుల రద్దీ

రెంజల్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద శుక్రవారం భక్తులు అధికంగా తరలివచ్చారు. శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు దూర ప్రాంతాల నుంచి వందలాదిగా తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, పరిసర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు రకాల పిండి వంటలు తయారుచేసి తెప్పల్లో నదిలో వదిలి మొక్కులు తీర్చుకున్నారు. హరిద్ర, మంజీర, గోదావరి నదుల కలయికతో ప్రవహించే పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు తొలగుతాయనేది ...

Read More »

తెవివిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించడం జరుగుతుంది, ఇందులో భాగంగానే శుక్రవారం మధ్యాహ్నం వ్యాసరచన, వక్తృత్వ విభాగాల్లోపోటీలు నిర్వహించినట్టు తెలుగు అధ్యయన విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బాలశ్రీనివాసమూర్తి తెలిపారు. బంగారు భారతదేశం అనే శీర్షికతో వ్యాసరచన పోటీకి, నా కలల్లో భారతదేశం అనే శీర్సికతో వక్తృత్వ పోటీ నిర్వహించామని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. నిర్వాహకులుగా డాక్టర్‌ లక్ష్మణచక్రవర్తి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ...

Read More »

రాఖీ కట్టిన ఆంధ్రా కుర్రాళ్లకు ఎంపీ కవిత ఏం చెప్పారు ?

నందిగామ: కేసీఆర్ కుమార్తె, నిజమాబాద్ ఎంపీ కవిత తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తొలిసారిగా కృష్ణా జిల్లాకు వెళ్లారు. కేసీఆర్ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన కార్యదర్శిగా పనిచేసిన కృష్ణమూర్తి కుమార్తె వినుతతో కవిత స్నేహంగా ఉండేవారు. ప్రాంతాలుగా విడిపోయినా మనుషులుగా ఒకటేనని వారి స్నేహం నిరూపించింది. రాష్ట్రం రెండుగా విడిపోయినా వారి మధ్య ఎప్పుడూ ఆ విషయమే చర్చకు రాలేదు. ఆ అనుబంధమే ఈరోజు వినుత అన్నయ్య కూతురి ఓణీల ఫంక్షన్‌కు కవిత హాజరయ్యేందుకు కారణమయింది. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ ...

Read More »

ఆ సెక్స్‌ వీడియో విడుదలకు కారణాలేంటి?

ఇంటర్నెట్‌లో విడుదలైన ‘పర్చేద్‌’ సెక్స్‌ వీడియో సంచలనం సృష్టిస్తోంది. దక్షిణాదిన రజనీకాంత్‌, బాలకృష్ణ వంటి స్టార్‌ హీరోల సరసన నటించిన రాధికా ఆప్టే ఇలా నగ్నంగా శృంగార దృశ్యాల్లో నటించడం పట్ల అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో లీకేజీ వెనుక ఎవరున్నారన్నది పక్కన పెడితే.. అందరూ ‘పర్చేద్‌’ గురించీ, రాధిక గురించే మాట్లాడుకుంటున్నారు. వారి లక్ష్యం కూడా అదే. నిజానికి ఈ సినిమా పూర్తయి ఏడాది గడుస్తోంది. కేవలం ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ కోసమే ఈ సినిమాను రూపొందించారు. భారత్‌లోని థియేటర్లలో విడుదల ...

Read More »

మగాళ్లతో శారీరక సంబంధం.. జుట్టు కత్తిరించారు.. చెట్టుకు కట్టేసి చితకబాదారు.. ఎక్కడ?

మగాళ్లతో శారీరక సంబంధం పెట్టుకున్న ఓ మహిళను చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు ఆమెను చితకబాదారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇంత దారుణంగా ఓ మహిళను కొట్టడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే, రాజస్థాన్, అజ్మీర్ నగరంలోని అంబేద్కర్ కాన్సీ అనే గ్రామంలోని ఓ మహిళకు ఇద్దరు సంతానం. ఆ మహిళ గ్రామంలోని పలువురు మగాళ్లతో శారీరక సంబంధం పెట్టుకుంది. దీనిని ఆ మహిళ భర్త తీవ్రంగా ఖండించాడు. ఎంత చెప్పినా ఆమెలో ...

Read More »

‘మీ అమ్మ దుబాయ్‌లో ఉంది… నా కోరిక ఎవరు తీరుస్తారు’

తండ్రి స్థానంలో ఉన్నా.. చిన్నారిపై అత్యాచారం మత్తు బిళ్లలు వేసి మరీ అఘాయిత్యం టీచర్ల అనుమానంతో వెలుగు చూసిన దారుణం తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన మలికిపురం : తండ్రి స్థానంలో ఉన్నవాడు.. ఆ బాలిక జీవితంతో ఆటాడుకున్నాడు. రాత్రి అయ్యేసరికి రెండు మత్తు బిళ్లలు ఇచ్చేవాడు. తరువాత అత్యాచారం చేసేవాడు. తెల్లారిలేచేసరికి ఆ బాలికపై వలువలు కూడా ఉండేవికాదు. ఏం జరిగిందని అడిగితే మీ అమ్మ ఎక్కడో దుబాయిలో ఉంది.. నా పరిస్థితేమిటని ఆ చిన్నారిని ఎదురు ప్రశ్నించేవాడు. అత్యంత పైశాచికంగా సాగిన ...

Read More »