Breaking News

Daily Archives: August 20, 2016

22న నిజామాబాద్‌లో జానపద జాతర ప్రదర్శనలు

నిజామాబాద్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 22న అంతర్జాతీయ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జానపద జాతర- 2016 కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. ఈమేరకు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఉత్తర్వులు అందినట్టు తెలిపారు. అంతర్జాతీయ జానపద దినోత్సవ వేడుకలను 22 నుంచి 31 వరకు జిల్లాకు ఒకరోజు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా ప్రారంభ వేడుకలను నిజామాబాద్‌లో జరుపుతున్నట్టు తెలిపారు. ...

Read More »

22న పౌర సరఫరాల శాఖ జిల్లా స్థాయి విజిలెన్సు కమిటీ సమావేశం

నిజామాబాద్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 22 సాయంత్రం 3 గంటలకు కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో పౌరసరఫరాల శాఖ జిల్లా స్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు జిల్లా పౌర సరఫరాల అధికారి కృష్ణప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా అధ్యక్షత వహించనున్నట్టు తెలిపారు. విజిలెన్స్‌ కమిటీ సమావేశానికి హాజరు కావాలని పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, కమిటీ సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Read More »

తహసీల్దార్లతో సంయుక్త కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్సు

నిజామాబాద్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను పరిష్కరించడంలో చొరవ తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ క్లియర్‌గా ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వ్యవసాయేతర భూముల దరఖాస్తులను తిరస్కరించాలని చెప్పారు. ప్రభుత్వ పరంగా వివిద కార్పొరేషన్ల ద్వారా అందజేసిన భూములను సంబంధిత లబ్దిదారుడు సాదాబైనామాలతో విక్రయిస్తే, ప్రభుత్వ నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి, ...

Read More »

పట్టణ సమస్యలపై కౌన్సిలర్లు దృష్టి సారించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలో నెలకొన్న సమస్యలపై కౌన్సిలర్లు దృష్టి సారించాలని ఆర్‌ఎస్‌పి డివిజన్‌ కార్యదర్శి కొత్త నర్సింలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలు మురికి కాలువలు, నీటి ఎద్దడి, రోడ్లు, తదితర సౌకర్యాలు లేక సమస్యలు ఎదుర్కొంటుంటే ప్రజలచేత ఎన్నుకోబడిన కౌన్సిలర్లు వారి సమస్యల పరిష్కారం పట్ల దృష్టి సారించడం లేదన్నారు. మునిసిపల్‌ సమావేశంలో సైతం ప్రజా సమస్యలపై చర్చించకపోవడం గర్హణీయమన్నారు. కాంట్రాక్టులు, బిల్లులు, టెండర్ల కోసం తెరాస, కాంగ్రెస్‌ ...

Read More »

ఘనంగా రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను కామరెడ్డి పట్టణంలో శనివారం కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో రాజీవ్‌ చిత్రపటానికి పూలమాలలువేసి కేక్‌ కట్‌చేశారు. అనంతరం నిజాంసాగర్‌ చౌరస్తాలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలువేసి నివాలులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. 18 సంవత్సరాలకే ఓటుహక్కు కల్పించి యువతకు పెద్ద పీట వేశారని, టెక్నాలజి రంగం అభివృద్దికి ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి ...

Read More »

ఫిజియోథెరఫి శిబిరం

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో విద్యాశాఖ ఆద్వర్యంలో శనివారం ఫిజియోథెరఫి శిబిరం నిర్వహించారు. వైద్యురాలు ప్రణీత మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 14 మంది వికలాంగ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ప్రతిరోజు ఇంటి వద్ద వారు ఎలాంటి వ్యాయామం చేయాలో చేసి చూపించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, సునీల్‌, సాయిలు, తదితరులు ఉన్నారు.

Read More »

నీటి ఎద్దడిపై మునిసిపల్‌ ఛైర్మన్‌ నిలదీత

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటి ఎద్దడి సమస్య పరిష్కరించాలంటూ కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీ వాసులు శనివారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మను నిలదీశారు. ఛైర్మన్‌తోపాటు మునిసిపల్‌ కమీషనర్‌ విజయలక్ష్మిని నీటి ఎద్దడిపై ప్రశ్నించారు. పట్టణంలోని 8వ వార్డుకు చెందిన రాజీవ్‌నగర్‌ కాలనీ వాసులు మునిసిపల్‌ కార్యాలయానికి తరలివచ్చి తమ ఆవేదన వ్యక్తంచేశారు. కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు సరైన నీటి వసతి లేదని పేర్కొన్నారు. మంచినీటి పైప్‌లైన్‌ సైతం లేదని, బోరున్నా అందులో ...

Read More »

మగ్దుంపూర్‌లో వైద్య శిబిరం

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మగ్దుంపూర్‌ గ్రామంలో నిజాంసాగర్‌ ఆరోగ్య కేంద్రం ఆద్వర్యంలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యురాలు స్పందన 186 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో ప్రజలు రోగాల బారినపడకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో శాంతశ్రీ, సుజాత ఉన్నారు.

Read More »

తెయులో ఉత్సాహభరితంగా ఫ్రీడం రన్‌

  డిచ్‌పల్లి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీడం రన్‌ క్యాంపస్‌ నుంచి డిచ్‌పల్లి 7వ స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌ వరకు ఉత్సాహభరితంగా సాగింది. ఉదయం 10.30 గంటలకు మొదలైన ఫ్రీడంరన్‌లో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు ముందుండి మొత్తం 2.5 కి.మీ.లు పరుగెత్తారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ రన్‌లో పాల్గొని దేశభక్తిని ఎలుగెత్తి చాటారు. బెటాలియన్‌ కమాండెంట్‌ వై.శ్రీనివాస్‌రావు, అసిస్టెంట్‌ కమాండెంట్‌ వెంకటరాములు, ఇతర సీనియర్‌ అధికారులు సిబ్బందితో కలిసి ...

Read More »

22న వృక్షశాస్త్ర విభాగంలో జాతీయ సెమినార్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో ఆగష్టు 22న జాతీయ సెమినార్‌ నిర్వహిస్తున్నట్టు సెమినార్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఎం.మమత తెలిపారు. మైక్రోబియల్‌ బయోడైవర్సిటీ అనే అంశంపై ఈ సెమినార్‌ ఉంటుందన్నారు. ప్రధాన వక్తగా సిసిఎంబి మాజీ డైరెక్టర్‌ సిహెచ్‌ మోహన్‌రావు పాల్గొంటారన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లోని బోటనీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కన్వీనర్‌ పేర్కొన్నారు. సెమినార్‌కు చీఫ్‌ ప్యాట్రన్‌గా వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య వ్యవహరిస్తారన్నారు. ...

Read More »