Breaking News

22న నిజామాబాద్‌లో జానపద జాతర ప్రదర్శనలు

నిజామాబాద్‌, ఆగష్టు 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 22న అంతర్జాతీయ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జానపద జాతర- 2016 కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. ఈమేరకు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఉత్తర్వులు అందినట్టు తెలిపారు. అంతర్జాతీయ జానపద దినోత్సవ వేడుకలను 22 నుంచి 31 వరకు జిల్లాకు ఒకరోజు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా ప్రారంభ వేడుకలను నిజామాబాద్‌లో జరుపుతున్నట్టు తెలిపారు. జిల్లాలోని 25 కళారూపాలకు చెందిన 300 మంది కళాకారులు జానపద జాతరలో పాల్గొననున్నట్టు తెలిపారు. నెహ్రు పార్కు నుంచి రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు కళాకారులు ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఈ జానపద జాతరను విజయవంతం చేయాలని నగర ప్రజలకు కలెక్టర్‌ పిలుపునిచ్చారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article