Breaking News

నీటి ఎద్దడిపై మునిసిపల్‌ ఛైర్మన్‌ నిలదీత

కామారెడ్డి, ఆగష్టు 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటి ఎద్దడి సమస్య పరిష్కరించాలంటూ కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీ వాసులు శనివారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మను నిలదీశారు. ఛైర్మన్‌తోపాటు మునిసిపల్‌ కమీషనర్‌ విజయలక్ష్మిని నీటి ఎద్దడిపై ప్రశ్నించారు. పట్టణంలోని 8వ వార్డుకు చెందిన రాజీవ్‌నగర్‌ కాలనీ వాసులు మునిసిపల్‌ కార్యాలయానికి తరలివచ్చి తమ ఆవేదన వ్యక్తంచేశారు. కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు సరైన నీటి వసతి లేదని పేర్కొన్నారు. మంచినీటి పైప్‌లైన్‌ సైతం లేదని, బోరున్నా అందులో మోటరు బిగించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏళ్ల తరబడిగా అధికారుల చుట్టూ, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. కాలనికి పైప్‌లైన్‌ వేయాలని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఛైర్‌పర్సన్‌ స్పందిస్తూ నీటి సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీవాసులు ఖలీల్‌, గంగామణి, శాంత, పోచవ్వ, జరీనా, షమీమ్‌, ఫైసల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article