Breaking News

ఘనంగా రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు

కామారెడ్డి, ఆగష్టు 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను కామరెడ్డి పట్టణంలో శనివారం కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో రాజీవ్‌ చిత్రపటానికి పూలమాలలువేసి కేక్‌ కట్‌చేశారు. అనంతరం నిజాంసాగర్‌ చౌరస్తాలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలువేసి నివాలులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. 18 సంవత్సరాలకే ఓటుహక్కు కల్పించి యువతకు పెద్ద పీట వేశారని, టెక్నాలజి రంగం అభివృద్దికి ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, నాయకులు జొన్నల నర్సింలు, రాంకుమార్‌గౌడ్‌, జమీల్‌, నిమ్మ దామోదర్‌రెడ్డి, కన్నయ్య, చింతల శ్రీనివాస్‌, గంగాధర్‌, ప్రసాద్‌, బట్టు మోహన్‌, అశోక్‌రెడ్డి, పి.రాజు, హరికిషన్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article