Breaking News

Daily Archives: August 23, 2016

సుంకిపల్లి చెరువులో చేపపిల్లల విడుదల

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సుంకిపల్లి చెరువులో చేపపిల్లలను గున్కుల్‌ సహకార సంఘం ఛైర్మన్‌ మోహినుద్దీన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ ప్రభావంతో రెండేళ్లుగా చెరువుల్లో చుక్కనీరు లేకపోవడంతో చేపల పెంపకం నిలిచిపోయిందన్నారు. ఈసారి కురిసిన వర్షాలకు చెరువుల్లోకి నీరు రావడంతో తెనాలి నుంచి 55 వేల చేప పిల్లలను మత్స్యశాఖ సొసైటీ నుంచి తెప్పించి విడుదలచే స్తున్నట్టు తెలిపారు. మత్స్యశాఖ అధికారులు పేదలకు ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సొసైటీ ...

Read More »

మహ్మద్‌నగర్‌లో వైద్య శిబిరం

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామంలో సీజనల్‌ వ్యాదులు ప్రబలడంతో ఆరోగ్య శాఖ సిబ్బంది మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రతి రోజు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. రోగులను పరిశీలిస్తున్నారు. మహ్మద్‌నగర్‌ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి నిజాంసాగర్‌ ఆరోగ్య కేంద్రం వైద్యురాలు స్పందన 165 మంది రోగులను పరిశీలించి వారికి అవసరమయ్యే మందులు అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది ప్రభావతి, అమృత, సుజాత, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

హరితహారం మొక్కల పరిశీలన

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని బూర్గుల్‌ గ్రామంలో రైతులు తమ పంట పొలాల్లో టేకు మొక్కలు నాటారు. వాటిని సర్పంచ్‌ అనిత, వ్యవసాయ విస్తీర్ణాధికారి రవిందర్‌ పరిశీలించారు. రైతులు తమ పంట పొలాల్లో టేకు మొక్కలు నాటేందుకు పోటీ పడగా, కొందరు రైతులకు చివర్లో మొక్కలు లభించకపోవడంతో పెంచిన మొక్కలను అధికారులు పరిశీలించారు.

Read More »

వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుల్తాన్‌నగర్‌ గ్రామంలో డిప్యూటి తహసీల్దార్‌ హైమద్‌ మస్రూల్‌, పంచాయతీ కార్యదర్శి బస్వరాజ్‌ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, లేదంటే ప్రభుత్వ పథకాలు అందకుండా పోతాయని స్పష్టంచేశారు. మరుగుదొడ్లు నిర్మించుకోవడం వల్ల కుటుంబానికి, గ్రామానికి కలిగే ప్రయోజనాలు వివరించారు. కార్యక్రమంలో కారోబార్‌ సాయిలు ఉన్నారు.

Read More »

‘మార్పు’ సాధించే శక్తి ప్రతి ఉద్యోగిలో ఉంది

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణీలు, బాలింతలు, శిశువుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసేందుకు అంకితభావంతో విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా పిలుపునిచ్చారు. మాతా శిశు మరణాలను, రక్తహీనతను నివారించి, సమాజంలో మార్పును సాధించే శక్తి ప్రతి ఉద్యోగిలో ఉందని పేర్కొన్నారు. అయితే నిర్దేశించిన సమయం రోజుకు 8 గంటల పాటు బాధ్యతతో పనిచేస్తే చాలని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆర్మూర్‌లో ...

Read More »

ఉపాధి హామీ పనులపై చర్చ

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ సామాజిక తనిఖీ బృందం సభ్యులు నిజాంసాగర్‌ మండలానికి చేరుకున్నారు. ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు బృందం సభ్యులు సమావేశం ఏర్పాటుచేసి 2015 మార్చి నుంచి 2016 మార్చి వరకు మండలంలో జరిగిన కూలీ డబ్బుల చెల్లింపులు, మెటీరియల్‌ చెల్లింపులపై చర్చించారు. మండలంలో రెండ్రోజుల పాటు ఆయా గ్రామాలకు చెందిన నివేదిలు సేకరించిన అనంతరం గ్రామాల్లో బృందం సభ్యులు పరిశీలించిన అనంతరం గ్రామసభల ద్వారా ప్రజల ముందు చర్చ ...

Read More »

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం

  కామరెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కామారెడ్డి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. కామారెడ్డి డివిజన్‌ అధ్యక్షుడుగా ధర్మసేన, ఉపాధ్యక్షునిగా శేఖర్‌, కార్యదర్శిగా శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా గరీబ్‌, కోశాధికారిగా చంద్రం, పట్టణ అధ్యక్షునిగా అనిల్‌కుమార్‌, ఉపాధ్యక్షునిగా కిరణ్‌, అనిల్‌బాబు, కార్యదర్శిగా శివ, ప్రధాన కార్యదర్శిగా ఖలీం, రాజ్‌కుమార్‌, కోశాధికారిగా రాజేశ్‌, మండలాధ్యక్షునిగా సాయిలు, కార్యదర్శిగా నరేశ్‌లు ఎన్నికయ్యారు.

Read More »

గిరిజన దళితుల సాగు భూములను తిరిగి ఇవ్వాలి

  కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డివిజన్‌లో గిరిజనులు, దళితులు తరాలుగా సాగుచేసుకుంటున్న పోడు భూములను వారికే తిరిగి ఇవ్వాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. కామారెడ్డి పట్టణంలో మంగళవారం గిరిజనులు, దళితుల భూములకు సంబంధించిన వ్యవసాయ కార్మిక సంఘం ఆద్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఫారెస్టు అధికారులను ఉసి గొలుపుతూ గిరిజనులు, దళితులు సాగుచేసుకుంటున్న భూములను లాక్కుంటుందన్నారు. 2006 చట్టం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాప్‌ ప్రకటించాలని, ...

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 5వ వార్డులో మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ కల్వర్టు, పైప్‌లైన్‌ నిర్మాణ పనులు ప్రారంభించారు. రూ. 4 లక్షలతో పైప్‌లైన్ల ఏర్పాటు, రూ.2 లక్షలతో కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టినట్టు తెలిపారు. మునిసిపల్‌ సాధారణ నిధులతో ప్రగతి పనులు నిర్వహిస్తున్నట్టు ఆమె అన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ పద్మ రాంకుమార్‌గౌడ్‌, ఎ.ఇ. గంగాధర్‌, నాయకులు రాంకుమార్‌గౌడ్‌, పిట్ల వేణుగోపాల్‌, అయూం తదితరులున్నారు.

Read More »

నేత్ర చికిత్స శిబిరానికి స్పందన

  కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం గర్గుల్‌ గ్రామంలోని జడ్పిహెచ్‌ఎస్‌లో మంగళవారం నిర్వహించిన ఉచిత నేత్ర చికిత్స శిబిరానికి మంచి స్పందన లభించింది. పాఠశాల విద్యార్థులతోపాటు ఇతర రోగులను నేత్ర వైద్య సహాయకులు లింబాద్రి పరిశీలించారు. మోతిబిందు శస్త్రచికిత్సలు అవసరమున్న వారికి కామారెడ్డి లయన్స్‌ కంటి ఆసుపత్రికి రిఫర్‌ చేసినట్టు తెలిపారు. కంటి జాగ్రత్తల గురించి వివరించారు.

Read More »

మోర్తాడ్‌ ట్రయల్‌రన్‌ సక్సెస్‌

  – కమ్మర్‌పల్లి, చౌట్‌పల్లి, తిమ్మాపూర్‌ ట్రయల్‌ రన్‌ మళ్ళీ విఫలం మోర్తాడ్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి మండలాల చెరువులను నింపేందుకు నిర్మించిన చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం ట్రయల్‌ రన్‌ మంగళవారం అధికారులు కమ్మర్‌పల్లి, తిమ్మాపూర్‌, చౌట్‌పల్లి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. వెంటనే పంప్‌హౌజ్‌లోగల మోటార్లు కాలిపోయాయి. దీంతో మరోసారి ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారిందని ఆయా గ్రామాల రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మోర్తాడ్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో మోర్తాడ్‌, ఒడ్యాట్‌ ...

Read More »

తెలంగాణ ప్రజల కల నెరవేర్చిన సిఎం కెసిఆర్‌

  మోర్తాడ్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రజలు కలలుగన్న కోటి ఎకరాల తెలంగాణ మాగాణ అనే మాటకు కట్టుబడి మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ సిఎం కెసిఆర్‌ పలు ప్రాజెక్టులపై ఒప్పందం కుదుర్చుకున్న ఘనత కెసిఆర్‌దేనని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం విజయవంతం కావడంతో తెలంగాణ నాయకులు మోర్తాడ్‌ జాతీయ రహదారిపై బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరిపై మేడిగడ్డ బ్యారేజ్‌, ప్రాణహితపై ...

Read More »

నాలుగిళ్లలో చోరీ

  రామాయంపేట, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా రామాయంపేటలో సోమవారం రాత్రి నాలుగైదు ఇళ్లల్లో చోరీ జరిగినట్లు ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో గమనించిన దుండగులు దొంగతనానికి పాల్పడినట్టు పేర్కొన్నారు. కాగా వీరందరు కృష్ణా పుష్కరాలకు వెళ్లారని, వారు వచ్చిన తర్వాత ఎంత సొమ్ము చోరీకి గురైందనే వివరాలు వెల్లడవుతాయని అన్నారు. క్లూస్‌ టీం సహాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. విచారణ చేపడతామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

Read More »

కీలిమంజారో పర్వతంపై భారత జాతీయపతాకం

  – తెలంగాణ ముద్దుబిడ్డల సాహసయాత్ర సక్సెస్‌ రామాయంపేట, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆఫ్రికా ఖండంలో ఎత్తైన కీలిమంజారో పర్వతాన్ని తెలంగాణ ముద్దుబిడ్డలు అధిరోహించి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఈనెల 14న చేరుకొని 70 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న జాతీయ జెండా ఆవిష్కరించారు. మెదక్‌ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 15 మంది విద్యార్థుల బృందం ఈ సాహసయాత్రలో పాల్గొన్నారు. కాగా రామాయంపేట కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న భూలికూడా బృందంలో పాల్గొంది. 19 ...

Read More »

దేశం గర్వించే పౌరులు కావాలి

  – తెవివి విసి సాంబయ్య డిచ్‌పల్లి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంచుకున్న రంగంలో కష్టపడి, అంకిత భావంతో ఉన్నత శిఖరాలకు చేరుకుని దేశం గర్వించే పౌరులుగా ఎదగాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య పిలుపునిచ్చారు. మంగళవారం తెయులో 70వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా దాదాపు 500 మంది విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సామూమిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. యుజిసి ఆదేశించిన విధంగా సరిగ్గా ఉదయం 11 ...

Read More »

597 గ్రామ పంచాయతీల్లో నూరు శాతం మొక్కలు నాటాం

  – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హరితహారం కింద జిల్లాలో ఇప్పటి వరకు 3.52 కోట్ల మొక్కలు నాటినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. 25 మండలాలు, 597 గ్రామ పంచాయతీల్లో నూరుశాతం లక్ష్యాలను సాధించినట్టు తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం అమలుపై పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్‌పి సింగ్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు పి.కె.ఝూ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన ...

Read More »

పెసర ఆలూ బోండా

కావల్సినవి :- పెసరపప్పు : ఒక కప్పు పచ్చిమిర్చి : 2 అల్లం : చిన్న ముక్క జీలకర్ర : అర టీస్పూన్   ఆలూ : 2 (ఉడకబెట్టినవి)కారం : పావు టీస్పూన్ ఆమ్‌చూర్ పొడి : ఒక టేబుల్‌స్పూన్ కార్న్ మీల్ ఫ్లోర్ : ఒక టేబుల్‌స్పూన్ నూనె, ఉప్పు : తగినంత తయారీ : – స్టెప్ 1 : ఓ గంటపాటు పెసరపప్పు నానబెట్టి.. ఆ తర్వాత కొద్దిగా కూడా నీళ్లు లేకుండా వడకట్టి పెట్టాలి. స్టెప్ 2 : ...

Read More »

ఒమ్రాన్‌: వీడని విషాదం

గత ఏడాది సెప్టెంబరులో టర్కీ తీరంలో బొక్కబొర్లాపడివున్న మూడేళ్ళ అయిలాన్‌ కుర్ది మృతదేహాన్ని చూసి యావత ప్రపంచం కన్నీరు పెట్టుకుంది. అంతర్యుద్ధంతో అతలాకుతలమైపోతున్న సిరియానుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పడవెక్కిన ఆ చిన్నారి కుటుంబం టర్కీప్రాదేశిక జలాల్లో మునిగిపోవడంతో ఆ పిల్లవాడి శవం ఒడ్డుకుకొట్టుకొచ్చింది. నాలుగు లక్షలమంది శరణార్థుల విషాదస్థితికి సంకేతంగా మారి అంతర్జాతీయంగా జనాగ్రహాన్ని రగల్చింది. అతని చిత్రం అంతవరకూ శరణార్థుల విషయంలో కర్కశంగా వ్యవహరిస్తూ వచ్చిన కొన్ని దేశాల హృదయాలను రవ్వంత కరిగించగలిగింది కానీ, సిరియా అంతర్యుద్ధాన్ని మాత్రం అంతం చేయలేకపోయింది. ఇప్పుడు, ...

Read More »

కోళ్ల పరిశ్రమకు శ్రావణం సెగ

తగ్గిన గుడ్లు, చికెన్‌ ధర  తెలుగు రాష్ట్రాల్లోని కోళ్ల రైతులు మళ్లీ కష్టాల్లో పడ్డారు. శ్రావణ మాసంకావడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం తగ్గింది. దీంతో ఆ ప్రాంతానికి ఎగుమతులు బాగా తగ్గాయి. రెండు రాష్ట్రాల్లో రోజూ సగటున 8 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా.. ఇందులో 35 శాతానికి మాత్రమే స్థానిక డిమాండ్‌. మిగతా 65 శాతాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సిందే. శ్రావణ మాసం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, ఒడి శా, హరియాణ వంటి రాష్ట్రాలకు ఎగుమతులు మందగించాయి. త్రిపుర, నాగాలాండ్‌ ...

Read More »

పవన్.. ‘ఆ’ ఫంక్షన్‌కు అందుకే వెళ్తున్నాడా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న హీరోలే కాక, ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న పలువురు హీరోలు పవన్ మ్యానియాను ఉపయోగించుకుంటూ పైకొస్తున్నాను. పవన్‌పై తమకున్న అభిమానం కొద్దీ తమ సినిమాల ఆడియో ఫంక్షన్లకు పవన్‌ను ఆహ్వానిస్తుంటారు. అయితే పవన్ మాత్రం కొన్నింటికి మాత్రమే హాజరవుతుంటాడు. అంతేకాదు, తన కుటుంబానికి చెందిన హీరోల ఫంక్షన్లకు సైతం పవన్ హాజరు కాడు. అటువంటి పవన్ కల్యాణ్ కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు సినిమా ‘జాగ్వర్’ ఆడియో ...

Read More »