Breaking News

Daily Archives: August 24, 2016

సెప్టెంబరు 25, 26, 27 తేదీల్లో ఇందూరు ఉత్సావాలు

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబరు 27వ తేదీ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పర్యాటక శాఖచే జిల్లాలో మూడు రోజల పాటు ఇందూరు ఉత్సావాలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. బుధవారం సాయంత్రం తన చాంబరులో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఇందూరు ఉత్సవాల ఏర్పాట్లను చర్చించారు. ట్రెకింగ్‌, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలతలో పాటు జిల్లాలోని చారిత్రక పర్యాటక ప్రాంతాలను సందర్శింపజేసేందుకు టూరిజం సర్క్యుట్‌ పర్యటన ...

Read More »

వైస్‌ఛాన్స్‌లర్‌ సాంబయ్యను అభినందించిన కమాండెంట్‌ శ్రీనివాస్‌రావు

  డిచ్‌పల్లి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్యను డిచ్‌పల్లి తెలంగాణ స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌ కమాండెంట్‌ వై.శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. బుధవారం విసి చాంబరుకు విచ్చేసిన కమాండెంట్‌ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి అభినందించారు. కొద్దిసేపు విద్యాసంబంధ విషయాలు, తెలంగాణ అభివృద్దికై చేయాల్సిన కృషిని వారు చర్చించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వ సంస్థలు కలిసి చేయాల్సిన కృషి ఆవశ్యకతను, అవకాశాలను కూలంకషంగా చర్చించారు. ఇదే సందర్భంలో కమాండెంట్‌ శ్రీనివాసరావుకి ప్రతిష్టాత్మక ...

Read More »

బల్దియా కార్యాలయం ఎదుట కాలనీ వాసుల ధర్నా

  కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డుకు చెందిన ప్రజలు బుధవారం కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయానికి తరలివచ్చి ధర్నా నిర్వహించారు. ఛైర్మన్‌ కారును అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. అధికారులను కలిసి సమస్యలు విన్నవించారు. గతంలో సైతం పలుమార్లు బల్దియా కార్యాలయానికి వచ్చి ఛైర్మన్‌కు, అధికారులకు సమస్యల గురించి విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. వార్డులో ఇప్పటివరకు అధికారులు పర్యటించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి వసతి, మురికి కాలువల సౌకర్యాలు వెంటనే ...

Read More »

సంకల్పబలంతో లక్ష్యాన్ని సాధించాలి

  – ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంకల్ప బలముంటే అనుకున్న లక్ష్యాలను సలభంగా సాధించవచ్చని, సంకల్ప బలంతో ముందుకు సాగిననాడే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో బుధవారం 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సు కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గొప్ప గొప్ప వారందరు పుట్టగానే గొప్పవారు కాలేదని, జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దాన్ని ...

Read More »

కామారెడ్డిలో ఘనంగా కృస్ణాష్టమి వేడుకలు

  కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వివిధ పాఠశాలల్లో బుధవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వాణీ విద్యాలయం, ఆర్కిడ్‌, బ్రిలియంట్‌, అప్సర టెక్నో పాఠశాలలతో పాటు పలు పాఠశాలల్లో విద్యార్థులు కృష్ణాష్టమి సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులు ముద్దులొలికే చిన్నికృష్ణుడు, వయ్యారి బామల వేషధారణలతో విశేషంగా ఆకట్టుకున్నారు. కృష్ణుడు, గోపికలతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం ఆనందంగా నిర్వహించారు. జన్మాష్టమిప్రాధాన్యత, కృష్ణుని జననం, పండగ ప్రత్యేకత గురించి ప్రదర్శనల ద్వారా ...

Read More »

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

  కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం కరట్‌పల్లి గ్రామానికి చెందిన మధులిక (27) అనే మహిళ బుదవారం తన రెండేళ్ల కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతో మానసిక వేదనకు గురైన మధులిక తన రెండేళ్ల కూతురు రిత్వికతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి, కూతుళ్లు మృతి చెందడంతో గ్రామంలో విసాదచాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు తాడ్వాయి పోలీసులు తెలిపారు.

Read More »

అందరు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలి

  – ఎంపిపి మోబిన్‌ఖాన్‌ రెంజల్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టి ప్రగతికి సహకరించాలని మండల పరిషత్‌ అధ్యక్షుడు మోబిన్‌ఖాన్‌ అన్నారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో సాకి వాటర్‌ సంస్థ ఆధ్వర్యంలో తాగునీటి, పారిశుద్యం కమిటీలకు అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఇహెచ్‌ఎల్‌ నిర్మాణాలు చేపట్టాలని, అప్పుడే గ్రామాలు సస్యశ్యామలంగా కన్పిస్తాయన్నారు. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండి, స్వచ్చమైన నీటిని తాగినపుడే ఆరోగ్యవంతులవుతామని ...

Read More »

తెరాస ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ ఏర్గట్ల గ్రామస్తుల ధర్నా

  – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మప్ప రెంజల్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇన్‌చార్జి అడ్డాకుల తిమ్మప్ప మాదిగ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మోడల్‌ కళాశాలలో ఎమ్‌ఎస్‌ఎఫ్‌ పునర్నిర్మాణంలో భాగంగా బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ దళితుల అభ్యున్నత కోసం ఎంతో శ్రమించి హక్కులు కల్పించారని గుర్తుచేశారు. ఆయన కల్పించిన రిజర్వేషన్‌ ఫలాల ద్వారానే ...

Read More »

స్వచ్చభారత్‌, హరితహారం పట్ల నిర్లక్ష్యం వద్దు

  మోర్తాడ్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం స్వచ్చభారత్‌ పథకం పట్ల నోడల్‌, క్లస్టర్‌ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు చేపడతామని మండల ప్రత్యేకాధికారి శంకరయ్య, ఎంపిడిఓ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ వెంకట్రావులు అన్నారు. బుధవారం మోర్తాడ్‌ మండల పరిసత్‌ కార్యాలయంలో స్వచ్చభారత్‌, హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. హరితహారం పథకం మాదిరిగానే స్వచ్చభారత్‌ పథకం కింద అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మాణ పనులు సకాలంలో పూర్తయ్యేలా విధులు నిర్వర్తించాలని వారు ఆదేశించారు. కార్యక్రమంలో ...

Read More »

జీరో వడ్డి వర్తించేలా బ్యాంకు అధికారులు సహకరించాలి

  మోర్తాడ్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం రైతులకు అమలు చేసిన రుణమాఫీ మూడో విడతలో భాగంగా జీరో వడ్డి వర్తించేలా ఎస్‌బిహెచ్‌ బ్యాంక అధికారులు సహకరించి రైతులను ఆదుకోవాలని జిల్లా వ్యవసాయదారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రెంజర్ల గంగారాం, బిజి గంగారాం, తీగల రమేశ్‌రెడ్డి, సత్యనారాయణ, సంతోష్‌లు కోరారు. బుధవారం మోర్తాడ్‌లోని ఎస్‌బిహెచ్‌ అధికారులతో రుణమాఫీపై చర్చించారు. ప్రభుత్వం 12 శాతమే రుణమాఫీ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో బ్యాంకు అధికారులు రైతుల వద్ద డబ్బు తీసుకోకుండా ...

Read More »

ఏపీ, తెలంగాణాల్లో 1,245 బ్యాంక్ క్లర్క్ పోస్టులు

రిక్రూటర్ : ఐబిపిఎస్ పోస్టులు : బ్యాంక్ క్లర్క్స్ మొత్తం పోస్టులు : 19,243 ఆంధ్రప్రదేశ్ : 699 తెలంగాణ : 546 అర్హతలు : ఎనీ డిగ్రీ వయోపరిమితి : 20 – 28 సం.లు రిజర్వేషన్ల ప్రకారం మినహాయింపు ఎంపిక : ఆన్ లైన్ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష దరఖాస్తు : ఆన్ లైన్ తుది గడువు : 12-09-2016 ప్రిలిమినరీ ఎగ్జామ్ : 26 & 27-11-2016 మెయిన్ ఎగ్జామ్ : 31 -12-2016 & 01-01-2017 పూర్తి ...

Read More »

రూ. 810 కోట్లను ఖర్చుచేస్తే వచ్చింది 2 పతకాలు

లండన్: రియో ఒలింపిక్స్‌లో రాణించి 67 పతకాలను గెలుచుకొని ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచిన బ్రిటన్‌లో ఇప్పుడు పతకాల సాధన కోసం క్రీడాకారులపై ఖర్చు పెట్టిన సొమ్మెంత? అది పన్ను చెల్లింపుదారులపై ఎంత భారం పడిందన్న అంశంపై చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి ఆ చర్చలను పక్కన పెడితే 67 పతకాలను సాధించడం కోసం బ్రిటన్ ఎంత ఖర్చు పెట్టింది, కేవలం రెండు పతకాలతోనే సంతృప్తి పడాల్సి వచ్చిన భారత్ ఎంత ఖర్చు పెట్టిందో బేరీజు వేసి చూద్దాం. ఒక్కో మెడల్ కోసం సగటున 41 ...

Read More »

‘జనసంపద’లో భారత్ మేటి

వ్యక్తుల సమష్టి సంపద విలువ జిడిపి కంటే మూడు రెట్లు ఎక్కువ వ్యక్తుల ఉమ్మడి సంపదపరంగా అత్యంత సంపన్న దేశాల జాబితాలో భారత ఏడో స్థానంలో ఉంది. ఈ సంపద మొత్తం 5,60,000 కోట్ల డాలర్లు (369 లక్షల కోట్ల రూపాయలు -మన దేశ జిడిపి 132 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ) ఈ జాబితాలో భారత అభివృద్ధిలో మనకన్నా అనేక యోజనాల ఎగువన ఉన్న కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీని కూడా అధిగమించింది. 125 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 50 శాతం ...

Read More »

చిన్నారి ప్రాణం తీసిన చాక్లెట్‌

ఆదిలాబాద్‌: పిల్లలు ఎంతో ఇష్టపడి తినే చాక్లెట్‌ చిన్నారి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో జరిగింది. శ్రీమంగలే హన్మంతు, అనితల ఏకైక కుమార్తె సమీక్ష (18 నెలలు)కు మంగళవారం సాయంత్రం పక్కింటివారు చాక్లెట్‌ ఇచ్చారు. సమీక్ష చాక్లెట్‌ తింటుండగా గొంతులోకి జారి ఇరుక్కుపోయి తీవ్రమైన అస్వస్థతకు గురైంది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.

Read More »

నెహ్రూ, స‌ర్దార్ ప‌టేల్‌ల‌నూ ఉరి తీశార‌ు‌.. కేంద్ర మంత్రి జావదేకర్

కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రిగా ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రకాష్ జావదేకర్ చరిత్రను విక్రీకరించేలా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని చింద్‌వారాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా 1857లో మొద‌లైన మన స్వాతంత్ర్యోద్య‌మం 90 ఏళ్ల త‌ర్వాత ముగిసింది. మ‌నం బ్రిటిష్ వారిని వెళ్ల‌గొట్ట‌గ‌లిగాం. స్వాతంత్ర్యోద్య‌మ నాయ‌కుల‌కు సెల్యూట్‌.. ఈ ఉద్య‌మ స‌మ‌యంలో నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌, స‌ర్దార్ ప‌టేల్‌, పండిత్ (నెహ్రూ), భ‌గ‌త్‌సింగ్‌, రాజ్‌గురుల‌ను ఉరితీశారు.. అని జ‌వ‌దేక‌ర్ ...

Read More »

బోల్ట్‌ బూట్ల ధర రూ. 12 లక్షలు..!

వేలంలో దక్కించుకున్న అభిమాని లండన్‌: జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ ఆటోగ్రాఫ్‌ చేసిన షూలు బిడ్డింగ్‌లో భారీ ధర పలికాయి. 2015 బీజింగ్‌లో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో 100మీ. స్ర్పింట్‌లో బోల్ట్‌ ధరించిన ఈ షూ ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేలంలో రూ. 12.17 లక్షలకు అమ్ముడైంది. ఆరంభ ధరను సుమారు రూ. 6 లక్షలుగా నిర్ణయిస్తే రెట్టింపు ధరకు బోల్ట్‌ అభిమాని ఒకరు ఈ షూను సొంతం చేసుకున్నాడు. 30 బిడ్లు దాఖలైనట్టు ఆక్షన్‌ హౌస్‌ కటావికి తెలిపింది.

Read More »

చిరు బర్త్‌డే ఫంక్షన్‌కు పవన్‌ భార్య!

 మెగాస్టార్‌ చిరంజీవి 61వ పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్‌లో సోమవారంనాడు ఘనంగా జరిగాయి. అభిమానులకు శిల్పకళావేదికలోనూ, సెలబ్రిటీలకు పార్క్‌హయత్‌ హోటల్‌లోనూ ఘనంగా పార్టీ ఇచ్చింది మెగా ఫ్యామిలీ. పార్క్‌ హయత్‌లో జరిగిన పార్టీకి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మెగా హీరోలతోపాటు మహేష్‌, రవితేజ వంటి ఇతర హీరోలు కూడా హాజరైన చిరు బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ మాత్రం దూరంగా ఉండిపోయారు. అయితే పవన్‌ లేని కొరత తీర్చడానికా అన్నట్టు ఆయన భార్య అన్నా లెజినివా మెగాస్టార్‌ బర్త్‌డే పార్టీకి హాజరై ...

Read More »