Breaking News

Daily Archives: August 25, 2016

ధర్నా విజయవంతం చేయండి

  కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 26,27 రెండ్రోజుల పాటు రెవెన్యూ, డివిజన్‌, ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రభుత్వాలు వారిని నట్టేట ముంచుతున్నాయని పేర్కొన్నారు. కౌలు రైతులందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వడ్డిలేని రుణాలు వ్యక్తిగత పూచికత్తుపై కౌలు ...

Read More »

భక్తి, శ్రద్దలతో కృష్ణాష్టమి వేడుకలు

  కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో వైభవోపేతంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో జన్మాష్టమి వేడుకలు జరిపారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రంగు రంగుల వైవిధ్యమైన పువ్వులతో కృష్ణుని అందంగా అలంకరించి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. ప్రత్యేక అతిథిగా కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌ పాల్గొన్నారు.

Read More »

పాఠశాలల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

  కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వివిద పాఠశాలల్లో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైబవంగా నిర్వహించారు. సరస్వతి శిశుమందిర్‌, భవిత, లిటిల్‌ స్కాలర్స్‌, ఆర్కిడ్‌ తదితర పాఠశాలల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో, ఆటపాటలతో అలరించారు.ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ఆకట్టుకున్నారు. పండగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకు వేడుకలు నిర్వహించినట్టు పాఠశాల అధ్యాపకులు తెలిపారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రతినిధులు డాక్టర్‌ శ్యాంసుందర్‌, అశోక్‌రావు, ఎస్‌.ఎన్‌.చారి, నారాగౌడ్‌, ...

Read More »

మేర కులస్తుల అభివృద్దికి సహకరిస్తా

  – ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దర్జీ కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మేరు కులస్తుల అభివృద్దికి తన సహాయ, సహకారాలు అందిస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డిలో శనివారం మేరు సంఘం ఆద్వర్యంలో ఎమ్మెల్యేకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల వృత్తులపై ఆధారపడ్డ వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయపడుతుందన్నారు. వారికి ఉపాధి కోసం రుణాలు, తదితర సౌకర్యాలు ...

Read More »

మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తనను నమ్మించి మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని తాడ్వాయి మండలం చిట్యాల్‌ గ్రామానికి చెందిన గైని లక్ష్మి కామారెడ్డి డిఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దోమకొండ మండలం ఇస్సానగర్‌కు చెందిన షాదుల్లాతో రెండేళ్ల క్రితం తనకు వివాహం జరిగిందన్నారు. మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన రాము తన దూరపు బంధువని, ఇంటికి రాకపోకలు కొనసాగిస్తూ నీ భర్తతో నీవు సుఖంగా ఉండలేవు, ...

Read More »

గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

  బాసర, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర గోదావరి నదిలో గురువారం ఓ వ్యక్తి శవాన్ని గుర్తించారు. బాసర గ్రామానికి చెందిన ఉద్గెర సాయిలు (24) గా గుర్తించారు. అప్పుడప్పుడు కుటుంబ కలహాలు జరిగేవని ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్‌ఐ మనోహర్‌ తెలిపారు.

Read More »

భుజంపై భార్య శవంతో 10కి.మీ.లు నడిచాడు..

కట్టుకున్న భార్య…కళ్ల ముందే కళ్లుమూసింది. గుండె నిండా దుఖం. తోడుగా పన్నెండేళ్ల కూతురు. అమ్మకు ఏమైందో తెలియని పరిస్థితి ఆ చిన్నారిది. ఏం చెప్పాలో తెలియక కుమిలిపోతున్న సిచ్యువేషన్ నాన్నది.భార్య చనిపోయిందన్న దుఖంలో ఉన్న ఆ అభాగ్యున్ని పేదరికం వెక్కిరించింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. సాయం చేసే చేతుల్లేవు. హాస్పిటల్ నుంచి భార్య మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లాలి. ఎలా…. దానా మాఝీ. కటికపేద గిరిజనుడు. మాజీది ఒడిషాలోని అత్యంత వెనకబడిన గ్రామం మేల్ఘారా. భార్య అమంగ్ దేవికి క్షయ. భవానీపట్న జిల్లా హాస్పిటల్ లో ...

Read More »

* కృష్ణం వందే జ‌గ‌ద్గురుం!

ఒక మ‌నిషి త‌న జీవితంలోని ప్రతీ ద‌శ‌లోనూ విజ‌యాన్ని సాధించ‌డం అంత తేలికైన ప‌ని కాదు. కానీ నిర్వహించిన ప్రతి బాధ్యత‌లోనూ త‌నదైన ముద్ర వేసుకున్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని లీల‌లు ఒక ఎత్తైతే, వాటికి ఏమాత్రం తీసిపోని ఆయ‌న ప‌రిణ‌తి మ‌రో ఎత్తు. అందుకే ప‌రంలో మోక్షాన్ని అందించే భ‌గ‌వంతునిగానే కాదు. ఇహంలో విజ‌యాల‌ను సాధించేందుకు మార్గం చూపే గురువుగా కూడా భావిస్తారు. క‌ష్టాల‌తో జీవితం మొద‌లు: కృష్ణుడు అంతఃపురంలోని ప‌ట్టుప‌రుపుల మీద జ‌న్మించ‌లేదు. చెర‌సాల‌లోని రాతి నేల మీద ప‌డ్డాడు. వార‌స‌త్వంగా రాజ్యాన్ని ...

Read More »

సింధూకి వచ్చిన నజరానా ఎంతో తెలుసా..?

  రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పివి సింధూ ఇప్పుడు విజయలక్ష్మే కాదు.. ధనలక్ష్మీ కూడా అయింది. విజయం సాధించి భారత కీర్తి ప్రతిష్టలు పెంచిన సింధూకి మన తెలుగు రాష్ట్రాలే కాదు.. పక్క రాష్టాలు కూడా నజరానాలు ప్రకటించేస్తున్నాయి. మరి ఎవరెవరూ ఎంత ఇచ్చారో ఓ లుక్కేద్దాం.. * ఏపీ సర్కార్ …3 కోట్లు, వెయ్యి గజాల స్థలం, ప్రభుత్వ ఉద్యోగం *తెలంగాణ సర్కార్..5 కోట్లు, వెయ్యి గజాల స్థలం * ఢిల్లీ సర్కార్…..2 కోట్లు * మధ్యప్రదేశ్ సర్కార్..50 ...

Read More »

సీతమ్మ పుస్తెలు హుండీలోనూ లేవు!

ఆభరణాల మాయంపై ఇక పోలీసు విచారణ ఆలయ ఈవో ఫిర్యాదుతో విచారణ చేపట్టిన సీఐ 59 ఆభరణాలను బ్యాంకు లాకర్లలోకి చేర్చిన అధికారులు భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మాయమైన ఆభరణాలకు సంబంధించి ఉన్న ఒక్క ఆశ కూడా ఆవిరైంది. సీతమ్మ పుస్తెలు హుండీలోనూ లభించలేదు. ఎవరైనా అర్చకులు ఆభరణాలను తీసి ఉంటే వాటిని రామాలయంలోని ఏదో ఒక హుండీలో వేసి ఉంటారనే అనుమానంతో బుధవారం ఆలయంలోని అన్ని హుండీలనూ తెరిచి చూశారు. భారీ ఇనుప జల్లెడ కింద బకెట్లు ...

Read More »

పప్పుదినుసుల రేట్లు తగ్గాయి

రిటైల్‌మార్కెట్‌లో పాత ధరలకే విక్రయం అఫ్జల్‌గంజ్‌/హైదరాబాద్‌: బ్లాక్‌ చేసి అధిక ధరలకు అమ్మే వ్యాపారులను చూశాం. ధర లు పెరగగానే పాత స రుకులనూ ఎక్కువ ధర కు అమ్ముకునే వ్యాపారులనూ చూశాం. కానీ ధరలు తగ్గించామని హైదరాబాద్‌లో టోకు వ్యాపారులు ప్రకటిం చారు. పప్పు దినుసుల రేట్లు భారీగా తగ్గాయ ని, రిటైల్‌ మార్కెట్‌లో మాత్రం పాతధరలనే కొనసాగిస్తూ వినియోగదారులను మోసం చే స్తున్నారని హైదరాబాద్‌ దాల్‌మిల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షు డు రాజేంద్రకీమ్తీ తెలిపారు. బుధవారం ఆ యన విలేకరులతో మా ...

Read More »

ఏది నరకం?

‘రాజద్రోహం’ మళ్ళీ రంగంమీదకు వచ్చింది. ఇటీవలే అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ మీద ఆ నింద పడిన తరువాత, ఇప్పుడు కన్నడ నటి రమ్య మీద అదే ఆరోపణతో న్యాయస్థానంలో ఓ ఫిర్యాదు దాఖలైంది. స్వాతంత్య్రదినోత్సవానికి రెండురోజుల ముందు బెంగుళూరులో కశ్మీరీ కుటుంబాలతో ఆమ్నెస్టీ నిర్వహించిన ఒక సదస్సులో పాకిస్థాన్‌ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు హోరెత్తాయన్న ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ సంస్థపై రాజద్రోహం కేసు పెట్టారు. పాకిస్థాన్‌ నరకం కాదని అన్నందుకు ప్రజారంగ అనే సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న న్యాయవాది ...

Read More »

ఆ రోజు రాత్రి 13సార్లు ఫోన్ చేశాడు

న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు అన్మోల్ రతన్ (29) అత్యాచారం చేసిన తర్వాత తనను బెదిరించాడని బాధితురాలైన పీహెచ్డీ విద్యార్థిని (28) చెప్పింది. బుధవారం ఆమె మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది.  ఈ ఘటన జరిగిన రోజు రాత్రి రతన్ 13 సార్లు తనకు ఫోన్ చేసి విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించినట్టు బాధితురాలు చెప్పింది. ‘నాకు ఓ సినిమా సీడీ కావాలని ఫేస్బుక్లో పోస్ట్ చేయగా, తన దగ్గర ఉందని రతన్ కాంటాక్ట్ అయ్యాడు. శనివారం సాయంత్రం జేఎన్యూ క్యాంపస్లోని ...

Read More »

హైదరాబాద్‌ వెలుపలకు కాలుష్య యూనిట్లు

ఖాయిలా సంస్థల కోసం ప్రత్యేక నిధి  పరిశ్రమల మంత్రి కెటిఆర్‌  కాలుష్యం వెదజల్లే పారిశ్రామిక యూనిట్లను హైదరాబాద్‌ వెలుపలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ‘తెలంగాణలో తయారీ-వినూత్నమైన భవిష్యత సాంకేతిక పరిజ్ఞానాలతో సుస్థిర అభివృద్ధి’ అన్న అంశంపై భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ‘మానెక్స్‌-2016’ పేరుతో బుధవారం నిర్వహించిన సదస్సులో ప్రారంభోపన్యాసం చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌ ఈ విషయం చెప్పారు. ‘హైదరాబాద్‌ను పారిశ్రామిక కాలుష్య రహిత నగరంగా మార్చాలనుకుంటున్నాం. ఇందుకోసం నగరం లోపల ఉన్న కాలుష్య పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌ ...

Read More »

మంత్రి ఆఫర్‌కు సింధు ‘నో’

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో రజిత పతకం సాధించి భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేసిన పీపీ సింధూకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తడంతో పాటు హామీల మీద హామీలు కూడా లభించాయి. సింధూ వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం తేవాలని, ఇందుకోసం విదేశీ కోచ్‌తో తగినంత శిక్షణ ఇస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ…సింధూ స్వాగత కార్యక్రమంలో ప్రకటించారు. దీంతో సింధుకు కోచ్‌గా ఎవరు వచ్చే అవకాశాలున్నాయన్న దానిపై కూడా ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఈ ఊహాగానాలకు సింధూ ...

Read More »

బృందావనంలో అశ్లీల చిత్రాల కలకలం

ప్రముఖ ఆథ్యాత్మిక పట్టణం, ఉత్తరప్రదేశ్ లోని  బృందావనంలో కాలేజీ విద్యార్థినుల అశ్లీల చిత్రాలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్న 50 మందికి పైగా అమ్మాయిల ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తులు మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో ఉంచారు. వారిని కాల్ గర్ల్స్ గా పేర్కొంటూ వాట్సాప్ ద్వారా మార్ఫ్డ్ ఫొటోలు, అమ్మాయిల పేర్లు, చిరునామా తదితర వివరాలు పొందుపర్చారు. దీంతో బాధిత యువతుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, గత ఏడాది నవంబర్ లోనూ బృందావనంలో ఇదే తరహాలో పదుల ...

Read More »

అక్కడ.. ‘జనతా’ వచ్చేసింది.. ఎన్టీఆర్ ఈజ్ బ్యాక్!

దక్షిణ భారతదేశ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం జనతా గ్యారేజ్. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, ఈ సినిమాను యూకే, యూఏఈల్లోని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ప్రదర్శించారని, సినిమా చూసిన ఆనందానికి హద్దుల్లేకుండా పోయానని లండన్‌లోని ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్ ఉమైర్ సంధు పేర్కొన్నారు. సినిమా అద్భుతంగా ఉందని, ఎన్టీఆర్ చరిత్రలో అత్యంత గొప్ప చిత్రంగా నిలవనుందని ఆయన తెలిపారు. ‘జనతా గ్యారేజ్ ఫస్ట కాపీ వచ్చేసింది. సినిమా చూసిన ...

Read More »

హీరోయిన్ ‘రహస్య’ వీడియోలను లీక్ చేసిన లవర్!

బాలీవుడ్ హీరోయిన్ అలీసా ఖాన్.. ఆత్మహత్య చేసుకుంటానని కొద్దిరోజులుగా హెచ్చరిస్తోంది. దీనంతటికీ కారణం తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న తోటి నటుడు లవ్ కుమార్ తనను నడిరోడ్డుపై వదిలేసి వెళ్లడమే. అంతేకాదు, ఈమెను మెట్టినింటి వాళ్లు పట్టించుకోకపోగా, పుట్టింటి వాళ్లు సైతం వేలేశారు. అంతేనా, ప్రేమపెళ్లికి ఎలాగోలా ఒప్పుకున్న అలీసా తల్లిదండ్రులు.. ఇప్పుడు అలీసా అంటేనే మండిపడుతున్నారు. దీనికి కారణం కూడా లవ్ కుమారే. పెళ్లికి ముందు అలీసాతో ప్రత్యేకంగా కలిసి ఉన్న వీడియోలను భర్త లవ్ కుమార్ ఇప్పడు నెట్‌లో రిలీజ్ చేసేశాడు. ...

Read More »

శునకాలతో లైంగిక సంబంధం.. ఆపై నగ్నంగా నిలబెట్టి వీడియో.. సోషల్ మీడియాలో వైరల్

లైంగిక దాడులు మహిళలపైనే కాకుండా మూగజీవులపై కూడా పెచ్చరిల్లిపోతున్నాయి. చైనీలోని సిచువాన్ ప్రావిన్స్‌లో తన ఇంట శునకాలను బంధించి వాటిపై లైంగిక దాడికి పాల్పడ్డాడో మానవ మృగం. ఇంకా శునకాలతో లైంగిక సంబంధం నెరపిన వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. అంతే అడ్డంగా బుక్కయ్యాడు. శునకాలపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన ఆ దుండగుడిని అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాకుండా స్థానిక జంతు సంరక్షణాధికారులు అతనింటికి వెళ్లి శునకాలను కాపాడారు. స్థానికులు దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా అతడిని ఇంటి నుంచి బయటకు ...

Read More »