Breaking News

Daily Archives: August 26, 2016

మొక్కలు కాపాడే బాద్యత సంబంధిత శాఖల ఉద్యోగులదే

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు హరితహారం కింద నాటిన ప్రతి మొక్కను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత శాఖల ఉద్యోగులదేనని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా స్పష్టం చేశారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో చేంజ్‌ ఏజెంట్లు, ఎంపిడివోలు, మునిసిపల్‌ కమీషనర్లు, విద్యా, వైద్య, ఐసిడిఎస్‌, ఎక్సైజ్‌, ఇరిగేషన్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మొక్కల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యల గురించి కలెక్టర్‌ వివరించారు. రెండు నెలల ...

Read More »

పట్టపగలే చోరీ…

  బాన్సువాడ, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో ఓ వ్యాపారి ఇంట్లో దొంగలు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని సిండికేటు బ్యాంకు వెనక ప్రాంతంలోగల బెజుగం రాఘవేందర్‌ అనే వ్యాపారి ఇంట్లో శుక్రవారం దొంగతనం జరిగింది. ఇంటివారు పట్టణంలో జరుగుతున్న పెళ్లికి కుటుంబీకులతో కలిసి తాళం వేసి వెళ్లగా దీన్ని గమనించిన దొంగలు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన ఆయన తలుపులు, బీరువా తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్టు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ...

Read More »

తెవివి లా కళాశాల ప్రిన్సిపాల్‌ మాతృమూర్తికి శ్రద్దాంజలి

  డిచ్‌పల్లి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ లా కళాశాల ప్రిన్సిపాల్‌ మాతృమూర్తి అనంత ఇటీవల స్వర్గస్తులు కావడంతో శుక్రవారం వర్సిటీ లా కళాశాలలో శ్రద్దాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్లు, విద్యార్థులు అనంత చిత్రపటానికి పూలమాలలువేసి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ శివకుమార్‌, బిసి యూత్‌ జేఏసి రాష్ట్ర సలహాదారు రాజారాం, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, ప్రసన్నరాణి, సత్యనారాయణ చారి, విద్యార్థులు నవీన్‌, రాజు, శేఖర్‌రెడ్డి, మధు, నాగార్జున తదితరులు ...

Read More »

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

  కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబరు 2వ తేదీన ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకుడు ఖాజామోహినోద్దీన్‌ కోరారు. సమ్మెకు సంబంధించిన గోడప్రతులను శుక్రవారం కామారెడ్డి ఐఎఫ్‌టియు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్రమోడి ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పిగొట్టాలని, కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని సెప్టెంబరు 2న దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్టు పేర్కొన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, పిఎఫ్‌, ...

Read More »

తెలంగాణ జాగృతి కామారెడ్డి కన్వీనర్‌గా శ్యాంసన్‌

  కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి కామారెడ్డి నియోజకవర్గ కన్వీనర్‌గా శ్యాంసన్‌ నియమిస్తూ జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రెహాన్‌ అహ్మద్‌ ఉత్తర్వులు జారీచేశారు. కామారెడ్డిలో శుక్రవారం నియామక పత్రం అందజేశారు. కో కన్వీనర్‌గా జొన్నల వినోద్‌, పట్టణ కన్వీనర్‌గా హరీష్‌, కో కన్వీనర్‌గా నాగరాజు, భిక్కనూరు కన్వీనర్‌గా రామకృష్ణ, తాడ్వాయి భాస్కర్‌, లింగంపేట్‌ కన్వీనర్‌గా రామకృష్ణలను నియమిస్తు నియమక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణలో యువత పాత్ర ...

Read More »

విద్యార్థులు ధ్యానం, యోగా అలవరుచుకోవాలి

  కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ధ్యానం, యోగ అలవరుచుకొని తద్వారా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని మునిసిపల్‌ కౌన్సిలర్‌ పద్మరాంకుమార్‌ అన్నారు. మహిళా సాధికారత దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ధ్యానం యోగా వల్ల ప్రతి మనిషిలో ప్రేమ, దయాగుణం పెంపొంది బాద్యతగల ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు. విద్యార్థులు మారుతున్న సమాజానికి అనుగుణంగా తమ ఆలోచన సరళిలో మార్పుచెంది మానసికంగా, శారీరకంగా దృఢత్వాన్ని అలవరుచుకోవాలని సూచించారు. కళాశాల ...

Read More »

దళితులకు ప్రభుత్వం భూములివ్వాలి

  – ఎంఆర్‌పిఎస్‌టి రాష్ట్ర కార్యదర్శి వేముల బలరాం కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన మాదిగలకు ప్రభుత్వం మూడెకరాల భూమిని కేటాయించాలని ఎంఆర్‌పిఎస్‌టి రాష్ట్ర కార్యదర్శి వేముల బలరాం డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాదిగలు ఆర్థిక పరిస్థితి బాగులేక దుర్బర జీవితాలను గడుపుతున్నారన్నారు. ఇటీవల బిచ్కుందమండలం గుండేకల్లు గ్రామంలో పర్యటించామన్నారు. గ్రామ మాదిగల స్థితిగతులను పరిశీలించామని చెప్పారు. 50 మంది మాదిగల కుటుంబాలు నివసిస్తుంటే కనీసం వారిని పట్టించుకునే నాథుడే లేడని ...

Read More »

కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గ్రామాల్లో కౌలురైతులకు రుణ అర్హత కార్డులు అందించాలని తహసీల్దార్‌ అబ్దుల్‌గనిఖాన్‌ అన్నారు. తహసీల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విఆర్వోల సమావేశంలో మాట్లాడారు. ఖరీఫ్‌ పంటలు సాగుచేసిన కౌలురైతులను గ్రామాల వారిగా గుర్తించాలన్నారు. కౌలురైతులకు రుణ అర్హత కార్డులు అందించి ప్రభుత్వం సహాయం అందించేలా చూడాలన్నారు. గ్రామాల వారిగా ఉన్న రైతులను గుర్తించి కౌలు దారులను ఎంపికచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సయ్యద్‌ మస్రూద్‌, విఆర్వోలు పండరి, విఠల్‌రెడ్డి, సాయిలు ...

Read More »

శిఖం భూముల సర్వే చేపట్టాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరువు పరిస్థితుల్లో పంటల సాగుకు అనుగుణంగా ఉన్న నిజాంసాగర్‌ ప్రాజెక్టు శిఖం భూముల కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఐదురోజుల క్రితం మండలంలోని ఆరేపల్లి గ్రామస్తులపై మెదక్‌జిల్లా మాదాపల్లి గ్రామస్తులు దాడిచేసిన సంగతి తెలిసిందే. అలాగే హసన్‌పల్లి, బూర్గుల్‌ గ్రామాల రైతులు తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు, ఇళ్లు వదులుకొని ముంపు బాధితులుగా మిగిలామన్నారు. ప్రాజెక్టు శిఖంభూముల్లో హసన్‌పల్లి గ్రామస్తులు దున్నేందుకు వెళ్లడంతో సోమవార్‌పేట్‌ రైతులు భూములు తమ ...

Read More »

పాఠశాలకు పూర్వ విద్యార్థిని వంటపాత్రల వితరణ

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్తిని రెడ్డిశెట్టి సునిత 15 వేల విలువగల వంటపాత్రలను కొనుగోలు చేసి శుక్రవారం పాఠశాలకు అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ సునిత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి ప్రస్తుతం ఆర్థికంగా మంచి స్థితిలో ఉండడంతో తాను చదివిన పాఠశాలకు తనవంతు సహాయం అందజేసిందని, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగ దేవేందర్‌, ఛైర్మన్‌ భిక్ష్యా, పంచాయతీ కార్యదర్శి ...

Read More »

అధ్వాన్న రహదారిలో అవస్థలు

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ నుంచి ప్రాజెక్టుకు ప్రయాణించేందుకు ప్రధాన రహదారులు మూడున్నాయి. వాటిల్లో నిజాంసాగర్‌ మండల కేంద్రం నుంచి పాతబస్టాండ్‌ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు కిలోమీటరు దూరంలోనే చేరుకోవచ్చు. ఈ రహదారికి బిటి రోడ్డు లేకపోవడంతో ప్రస్తుతం కంకరతేలి పూర్తిగా అధ్వాన్నంగా మారింది. ద్విచక్ర వాహనదారులు ఈరహదారి గుండానే ప్రయాణిస్తారు. అయితే రెండు సంవత్సరాల కిందట వర్షాకాలంలో రహదారిపై నుంచి మొరం కొట్టుకుపోవడంతో కంకరతేలి అధ్వాన్నంగా మారింది. దీంతో ప్రతినిత్యం ద్విచక్ర వాహనదారులు ...

Read More »