Breaking News

Daily Archives: August 30, 2016

పశువుల కోసం దాణా పంపిణీ

  నందిపేట, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సునందిని పథకంలో ఇంతకు ముందు సభ్యత్వం తీసుకున్న పాడి రైతులకు దూడల దాణా పంపిణీ చేసినట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్‌ ప్రభాకర్‌ తెలిపారు. సర్పంచ్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఒక్కొక్కరికి 90 కిలోల ధాన్యం ఇచ్చినట్టు తెలిపారు. మొదటి దఫాలో మొత్తం 86 మంది పాడి రైతులకు 7790 కిలోల దాణా పంపినీ చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా నట్టల నివారణ మందులను మంగళవారం కూడా పంపిణీ చేశారు. డొంకేశ్వర్‌, నికాల్‌పూర్‌, ...

Read More »

తెవివిలో తీజ్‌ వేడుకలు  

డిచ్‌పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంజారా సంస్కృతికి ప్రతిరూపమైన తీజ్‌ వేడుకలు తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత వారంరోజుల క్రితం ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ సాంబయ్య, రిజిస్ట్రార్‌ జయప్రకాశ్‌రావు, ఇన్‌కమ్‌టాక్స్‌ ఆఫీసర్‌ ప్రకాశ్‌ రాథోడ్‌, డాక్టర్‌ మోతిలాల్‌ రాథోడ్‌, కార్పొరేటర్‌ చాంగుబాయి, తారాచంద్‌, బీంరావు పాల్గొన్నారు. సభాధ్యక్షత వహించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శాంతాబాయి మాట్లాడుతూ బంజారాల పవిత్ర తీజ్‌ పండగ ప్రాముఖ్యతను వివరించారు. విసి ప్రొఫెసర్‌ ...

Read More »

సాహిత్య బాటసారి కాశీపతి

  కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోరాట స్ఫూర్తిని, అమరుల త్యాగాలను కీర్తిస్తూ విలువైన పాటలను, రచనలు అందించిన సాహిత్య బాటసారి కామ్రేడ్‌ కాశీపతి అని వక్తలు కొనియాడారు. విప్లవ మేధావి, వక్త, ప్రతిఘటన పోరాటాల వాణి కాశీపతి సంతాపసభ కామారెడ్డిలో మంగళవారం సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాజయ్య, ఖాజామోహినుద్దీన్‌లు మాట్లాడుతూ చరసాలలో ఉండి ఉయ్యాలో… జంపాలో… ఈ దోపిడి కూలదొయ్యాలో… అంటూ గొంతెత్తి చీకటి రోజుల్లోగానం చేసిన స్వరం ...

Read More »

నాటిన ప్రతి మొక్కకు నీరందేలా కృషి చేయాలి

  నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా మొక్కలను నాటిన విధంగా జలహారంలో గ్రామంలోని ప్రతి వ్యక్తి నాటిన మొక్కలకు నీరు అందించేలా కృషి చేసి నిజామాబాద్‌ జిల్లాను హరితజిల్లాగా మార్చినపుడే బంగారు నిజామాబాద్‌ను తీర్చిదిద్దినవారమవుతామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఉపాధి హామీ సిబ్బందితో, అటవీ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం సందర్భంగా గ్రామ పంచాయతీల ...

Read More »

సిఐటియు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

  కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబరు 2న 9 కేంద్ర కార్మిక సంఘాల ఆద్వర్యంలో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కామరెడ్డిలో మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌ నుంచి నిజాంసాగర్‌ చౌరస్తా, మునిసిపల్‌, కొత్త బస్టాండ్‌ మీదుగా రైల్వే గేటు వద్దనుంచి ఇందిరాచౌక్‌, సుభాష్‌రోడ్డు మీదుగా తిరిగి రైల్వే కమాన్‌ నుంచి నిజాంసాగర్‌ చౌరస్తాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ...

Read More »

ఇప్పటివరకు 7.85 కోట్ల మొక్కలు వెబ్‌సైట్‌లో

  నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు హరితహారం కింద నాటిన ప్రతి మొక్కను కాపాడినపుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో రాజీవ్‌శర్మ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 7.85 కోట్ల మొక్కలను జిపిఎస్‌ ద్వారా వెబ్‌సైట్‌లో వుంచినట్టు తెలిపారు. నూరుశాతం కమ్యూనిటీ ప్లాంటేషన్లు, ఎవెన్యూ ప్లాంటేషన్‌లను జిమో ట్యాగింగ్‌ చేయాలని సూచించారు. మృతి చెందిన మొక్కల స్థానంలో ప్రత్యామ్నాయ మొక్కలను నాటాలన్నారు. జాతీయ రహదారులు, ...

Read More »

వెజ్జీ మసాలా 65

కావల్సివని కాలిఫ్లవర్ : 1 (చిన్నది) అరటికాయ : 1 కార్న్‌స్టార్చ్ : ఒక టీస్పూన్ మైదా : అర టీస్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్ వెల్లుల్లిపాయలు : 2 రెబ్బలు జీలకర్ర పొడి : అర టీస్పూన్ కొత్తిమీర : అర కట్ట కరివేపాకు : 2 రెమ్మలు పసుపు : ఒక టీస్పూన్ ధనియాలపొడి : 1/4 టీస్పూన్ వెనిగర్ : ఒక టీస్పూన్ కారం : ఒక టీస్పూన్ నిమ్మరసం : ఒక టీస్పూన్ ఉప్పు, ...

Read More »

జన్మదిన వేడుకల్లో పేద చిన్నారులకు బంగారు ఉంగరాలు ఇచ్చిన సినీ నటుడు

ఘనంగా విశాల్‌ జన్మదిన వేడుకలు పసికందులకు బంగారు ఉంగరాలు చెన్నై: పురట్చి దళపతిగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే తెలుగు నటుడు విశాల్‌ సోమవారం 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన ఆయన జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. పేదలకు సహాయాలు, అనాథలకు అన్నదానం చేశారు. విశాల్‌ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని మెర్సీ హోంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు వస్ర్తాలు, బిరియాని తదితరాలను అందజేశారు. అనంతరం ట్రిప్లికేన్‌లోని కస్తూరిబా ప్రభుత్వ ప్రసూతి కేంద్రానికి వెళ్లి సోమవారం జన్మించిన ...

Read More »

వాట్సప్‌ యూజర్సందరికి ఎదురయ్యే సమస్యకు పరిష్కారం వచ్చేసింది

 హైదరాబాద్‌ సిటీ:మన ఫోన్‌బుక్‌లో లేని నంబర్లకు వాట్సప్‌చేయమని ఎవరైనా అడిగారంటే అదో పెద్దఇబ్బందిలా భావిస్తారు.. కాంటాక్ట్‌సేవ్‌ చేస్తేనే వాట్సప్‌ జాబితాలో చూపుతుంది.. అదీ త్వరగా కనిపించదు.. 10నిమిషాల నుంచి అరగంట వరకు సమయం తీసుకుంటుంది.. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభించింది. క్షణాల్లో వాట్సప్‌ జాబితాలో చేరేలా కొత్త బీటా వర్షన్‌ను విడుదలచేసింది. 2.16.248వర్షన్‌తో ఇలా ఫోన్‌బుక్‌లో సేవ్‌చేసిన వెంటనేవాట్సప్‌లో అప్‌డేట్‌ అవడం దీని ప్రత్యేకత.. ఎన్నాళ్లగానే ఎదురు చూసే ఈ ఆప్షన్‌ రావడం వాట్సప్‌ ప్రియులకు పెద్దఉపశమనమే. కానీఈ సౌకర్యం ప్రస్తుతం బీటావర్షన్‌ ...

Read More »

ఆగండాగండి… సెప్టెంబరు 9న పవన్ మీ సంగతి చెప్తారు… పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్…

పవన్ కళ్యాణ్ పైన విమర్శలకు దిగుతున్న వివిధ పార్టీల నాయకులు ఫేమస్ అవ్వడానికేనని పవన్ అభిమానులు అంటున్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన సభలో పవన్ ప్రసంగంపై ఆయా పార్టీల రాజకీయ నాయకులు ఒక్కొక్కరిగా ధ్వజమెత్తడం మొదలుపెట్టారు. వీరిలో కొందరు పవన్ ప్రసంగంలో చురకలు వేసిన కొందరైతే, మరికొందరు తమతమ పార్టీల తరుపున పవన్ పైన విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే పవన్ ప్రసంగంపైన జె.సి. దివాకర్ రెడ్డి, విజయ్ సాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ తదితరులు తమదైన పంథాలో స్పందించిన తీరు విదితమే. తాజాగా టి.జి. ...

Read More »

మ‌ళ్ళీ బుస‌కొట్టిన ఓటుకు నోటు కేసు… చంద్రబాబుకు పెద్ద షాక్…

హైద‌రాబాద్: స‌ద్దుమ‌ణిగింద‌ని అనుకున్న ఓటుకు నోటు కేసు… మ‌ళ్ళీ బుస‌కొట్టింది. వచ్చే నెల 29 లోపు ఓటుకు నోటు కేసు విచారణ పూర్తి చేయాలని ఏసీబీ ఆదేశించింది. ఏపీ సీఎం చంద్రబాబు స్వరంపై ఫోరెనిక్స్ రిపోర్టులో ఆ గొంతు చంద్రబాబుదేనని రిపోర్టు రావడంతో ఆ రిపోర్టును పిటిషనర్ ఏసీబీ కోర్టుకు ఫోరెనిక్స్ రిపోర్టును అందించారు. మంగళగిరి వైసీపి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి తరపు న్యాయవాది ఈ కేసుపై పిటిషన్ వేశారు. చంద్రబాబు సాధారణ సమావేశాల్లో మాట్లాడిన వాయిస్ టేపులు, ఓటుకు కోటు కేసులో దొరికిన ...

Read More »

డిసెంబర్‌లో పెట్రోల్ ధర ఎంతో తెలుసా?

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు బాగా తగ్గుతున్నాయి. దేశంలో మాత్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎంతకూ దిగిరావడం లేదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యారెల్‌ ముడిచమురు ధర 46.90 డాలర్లుగా ఉంది. ఇటీవల బ్యారెల్‌ ముడిచమురు ధర 1.2శాతం తగ్గింది  కూడా. దేశంలో మాత్రం రూ. 60కి తగ్గకపోగా, అప్పుడప్పుడు సర్దుబాట్ల పేరుతో పెట్రోల్‌ వాత వినియోగదారులపై పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ముడిచమురు ధర అంచనా విషయంలో మీరు నిపుణులు అయితే.. డిసెంబర్‌ నెలలో ముడిచమురు ధర ఎంత ఉంటుందో గేస్‌ చేయగలరా? అంటూ బీజేపీ ...

Read More »

మరో 350 ఔషధాల ధరలపై నియంత్రణ

ఎన్‌పిపిఎకు మరిన్ని అధికారాలు కట్టబెట్టనున్న సర్కారు న్యూఢిల్లీ : మరో 350 ఔషధాల ధరలను కట్టడి చేసేందుకు వీలుగా నేషనల్‌ ఫార్మాసూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పిపిఎ)కి ప్రభుత్వం అధికారాలను కట్టబెట్టనుంది. ఇందుకు గాను ఔషధాల ధరల నియంత్రణ ఆదేశంలో సవరణలు చేయనుంది. మరో 15 రోజుల్లో ఈ ప్రక్రియ ముగియనున్నట్టు కేంద్ర మంత్రి అనంత కుమార్‌ తెలిపారు. ఇప్పటి వరకు ఔషధాల ధరల నియంత్రణ ఆదేశం కింద ఎన్‌పిపిఎ 900 వరకు ఔషధాల ధరలను కట్టడి చేసినట్టు ఆయన చెప్పారు. దీని ఫలితంగా వినియోగదారులు ...

Read More »

ఇస్రో విజయం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో దూసుకుపోతున్నది. భవిష్యత్ తరం ‘స్ర్కామ్‌జెట్‌’ రాకెట్‌ ఇంజన్‌ పరీక్షలో ఆదివారం అది సాధించిన విజయం అద్భుతమైనది. స్వదేశీ పరిజ్ఞానంతో పలు రోదసి ప్రయోగాల్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న ఈ సంస్థ, ప్రథమ ప్రయోగంలోనే ఈ పరీక్ష గట్టెక్కడం అసామాన్యమైనది. ఇంతవరకూ అమెరికా, రష్యా, యూరప్‌ అంతరిక్ష సంస్థలకు మాత్రమే దక్కిన ఈ విజయాన్ని, వాటికంటే తక్కువ వ్యయంతో భారత్ సాధించగలగడం గర్వించదగ్గది. పునర్వినియోగ రాకెట్ల రూపకల్పనతో అంతరిక్ష రవాణాను కారుచవుకగా మార్చి, అంతర్జాతీయ మార్కెట్‌లో బలంగా ...

Read More »

డక్‌వర్త్ లూయిస్ ప్రకారం భారత్ నెగ్గాల్సింది. కానీ ఏం జరిగిందంటే

లాడర్‌హిల్(యూఎస్): అమెరికాలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో 1-0 తేడాతో విండీస్ జట్టు సిరీస్ నెగ్గి కప్ అందుకుంది. అయితే నిజానికి రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఖచ్చితంగా గెలిచేది. విరామం లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. విండీస్ జట్టును 144 పరుగులకే కట్టడి చేసింది టీం ఇండియా. మొదటి మ్యాచ్‌తో పోల్చితే సెకండ్ టీ20లో ఇంత తక్కువ ...

Read More »

రిలయన్స్ జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్‌టెల్.. కస్టమర్లకు భారీ ఆఫర్

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో దెబ్బకు మొబైల్ నెట్‌వర్క్ సంస్థల వెన్నులో వణుకు మొదలైంది. దీంతో తమ వినియోగదారులను నిలుపుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. ప్రముఖ నెట్‌వర్క్ దిగ్గజమైన భారతీ ఎయిర్‌టెల్ కూడా దిగొచ్చింది. 4జీ, 3జీ రేట్లను 80 శాతం వరకు తగ్గించింది. తక్కువలో తక్కువగా రూ.51కే 1గిగాబైట్‌ను అందించాలని నిర్ణయించింది. అయితే ఈ ఆఫర్‌ను పొందాలంటే ప్రీపెయిడ్ వినియోగదారులు మొదట రూ. 1,498తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా 1జీబీ 4జీ, 3జీ మొబైల్ ఇంటర్నెట్‌ను 28 రోజుల వరకు పొందుతారు. ఆ తర్వాత ...

Read More »