Breaking News

Monthly Archives: September 2016

ఘనంగా శ్రీనవదుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు

  బీర్కూర్‌, సెప్టెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో నవదుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దుర్గామాత విగ్రహాలను శనివారం ప్రతిష్టించనున్నారు. బీర్కూర్‌గ్రామంలో హనుమాన్‌ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు దేవి ప్రతిష్టాపన జరుగుతుందని అధ్యక్షుడు గంగాదాస్‌ తెలిపారు. ఉదయం 6 గంటలకు స్వాములకు మాలధారణ, అమ్మవారికి అభిషేకం దీక్షా స్వాముల చేత నిర్వహించడం జరుగుతుందన్నారు. 11 సంవత్సరాల నుండి ఉత్సవాలు సందర్బంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.

Read More »

భారీ వర్షం… జనం అతలా కుతలం….

  బాన్సువాడ, సెప్టెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అల్ప పీడనం వల్ల కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్థంభించింది. బాన్సువాడ డివిజన్‌లో భారీ వర్షాలకు జలసిరులు ఆవిష్కృత మవుతున్నాయి. నిన్నటి వరకు నోళ్లు తెరిచిన బీళ్ళు నీటితో కళకళలాడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చిన్ననీటి వనరులు నిండిపోయి రబీకి భరోసా కల్పిస్తున్నాయి. మంజీర, లెండి వాగులు వరదలతో ఉప్పొంగుతున్నాయి. దీంతో బిచ్కుంద, మద్నూర్‌, జుక్కల్‌ మండలాల్లో పరివాహక గ్రామాలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కౌలాస్‌ ప్రాజెక్టు నీటిని ...

Read More »

నిజాంసాగర్‌ ప్రాజెక్టు రెండుగేట్లు ఎత్తివేత

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా రైతుల వరప్రదాయిని అయిన నిజాంసాగర్‌ ప్రాజెక్టులో రెండు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం వరకు ఇన్‌ఫ్లో తగ్గడంతో ప్రాజెక్టు ద్వారా రెండుగేట్ల ద్వారా మాత్రమే నీటి విడుదల కొనసాగుతుంది. నిజాంసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుపై పర్యాటకుల సందడి ఆరురోజుల నుండి నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి కొనసాగుతూనే ...

Read More »

పంట రుణాలు మాఫీ చేయాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గడిచిన మూడు సంవత్సరాల నుంచి వర్సాల జాడ లేకపోవడం వల్ల రైతులు కరువు ఎదుర్కొన్నారని, అందుకే సహకార సంఘంలో తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని రైతుల కోరిక మేరకు తీర్మానం చేశారు. సింగూరు సహకార సంఘం ఆధ్వర్యంలో గున్కుల్‌లో మోహిదుద్దీన్‌ అధ్యక్షతన శుక్రవారం మహాజనసభ నిర్వహించారు. ముందుగా సిఇవో విఠల్‌రెడ్డి మాట్లాడుతూ ఆరునెలల జమ, ఖర్చులు నివేదిక చదివి వినిపించారు. రైతులకు సంఘం ద్వారా స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు ...

Read More »

వరద తాకిడికి కొట్టుకు పోయిన రహదారి

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టు 16,12 గేట్లు నీటిప్రవాహం వల్ల అచ్చంపేట రహదారి కొట్టుకుపోయిపెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. దాదాపు 60 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన చిన్నదిగా ఉండడంతో 16 వరద గేట్లు నీటి ప్రవాహం ఈ రోడ్డు గుండా వస్తుంది. ఈ రోడ్డుకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణీకులకు ప్రమాదకరంగా మారింది. అచ్చంపేట, ఆరేపల్లి వెళ్లాలంటే ఈ రహదారి ...

Read More »

శనివారం నుంచి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు

  కామారెడ్డి, సెప్టెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని తూర్పు హౌజింగ్‌బోర్డు కాలనీలోగల శ్రీ శారదా మందిరంలో అక్టోబరు 1వ తేదీ నుంచి 11 వరకు దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు శనివారం ప్రముఖ పండితులు అయాచితం నటేశ్వరశర్మ రచించిన శ్రీశారదా అష్టోత్తర శతనామా స్తోత్రం అనే గ్రంథాన్ని ప్రముఖ వేదపండితులు గంగవరం ఆంజనేయశర్మ ఆవిష్కరిస్తారన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం 6.30 గంటల నుంచి సుప్రభాతం, ...

Read More »

ఆర్యక్షత్రియ శంఖారావాన్ని విజయవంతం చేయాలి

కామారెడ్డి, సెప్టెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో అక్టోబరు 5న నిర్వహించనున్న రాష్ట్ర ఆర్యక్షత్రియ శంఖారావం బహిరంగ సభ విజయవంతం చేయాలని ఆర్యక్షత్రియ ప్రతినిదులు కోరారు. కామారెడ్డిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని క్షత్రియ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆర్యక్షత్రియులపై ఉందన్నారు. బహిరంగసభకు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తోపాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డి, చీప్‌ విప్‌ సుధాకర్‌రెడ్డి, ఇతర నాయకులు హాజరు కానున్నట్టు తెలిపారు. ఆర్యక్షత్రియులు సభ విజయవంతం ...

Read More »

ఛలో హైదరాబాద్‌ విజయవంతం చేయండి

  కామారెడ్డి, సెప్టెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అక్టోబరు 3న తలపెట్టిన ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జేఏసి నాయకులు కోరారు. శుక్రవారం కామారెడ్డిలో వారికి సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10వ పిఆర్‌సి ప్రకారం కనీస వేతనం, ఐచ్చిక సెలవుల పెంపు, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరించాలని ...

Read More »

బీర్కూర్‌లో భారీ వర్షం

  బీర్కూర్‌, సెప్టెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో గురువారం రాత్రి నుండి భారీ వర్షం కురిసినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు గాను మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రధాన వీధుల గుండా రోడ్లన్ని జలమయమయ్యాయి. మురికి కాలువలు వర్షపునీటితో నిండి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కురియడంతో మండలంలో ఆయా గ్రామాల్లోగల పురాతన ఇళ్ళు నేలకూలాయి. మరికొన్ని చోట్ల వరిపైర్లు నేలకొరిగాయి. గత రెండు సంవత్సరాలుగా వర్షాలు లేకపోవడంతో ఈయేడు వర్షాలు కురుస్తాయనే ఆశతో ...

Read More »

తెలంగాణ తిరుమల తిరుపతి ఆలయంలో శనివారం అన్నదానం

  బీర్కూర్‌, సెప్టెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. శనివారం వెంకటేశ్వరునికి ప్రీతికరమైన రోజుకావడంతో ఆలయంలో ఉదయంనుంచే ప్రత్యేకపూజా కార్యక్రమాలు చేపడుతున్నట్టు, మద్యాహ్నం దాతల విరాళాలతో మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. స్వామి వారిని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృప కటాక్షాలు పొందాలని తెలిపారు.

Read More »

ఆలూ కోఫ్తా కర్రీ

  కావల్సినవి: కోఫ్తాల కోసం: ఉడికించి, మెత్తగా చేసిన ఆలూ ముద్ద – అరకప్పు, పనీర్‌ – అరకప్పు, మొక్కజొన్ నపిండి – టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి ముక్కలు – టేబుల్‌స్పూను, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా. మసాలా కోసం: ఉల్లిపాయలు – కప్పు, అల్లం, వెల్లుల్లి ముక్కలు – రెండు చెంచాల చొప్పున, జీడిపప్పు పలుకులు – రెండు టేబుల్‌స్పూన్లు. ఇతర పదార్థాలు: కారం – చెంచా, టొమాటో గుజ్జు – రెండు కప్పులు, జీలకర్రపొడి – చెంచా, గరంమసాలా ...

Read More »

కనీసం వారానికి ఒకసారి ఖచ్చితంగా శనగలు తినాలి..!! ఎందుకు ?

శనగల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్షకాలికంగా.. ఎంతో ప్రయోజనాలు చేకూరుస్తాయి. వెజిటేరియన్స్.. ప్రొటీన్ పొందడం కాస్త కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు.. ఏడాది మొత్తం అందుబాటులో ఉండే.. శనగలు తీసుకోవడం చాలా మంచిది. శనగల ద్వారా శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ ని తేలికగా పొందవచ్చు. శనగలను.. పేదవాడి బాదాం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. బాదాంలో లభించే ప్రొటీన్ శాతం.. శనగల ద్వారా కూడా పొందవచ్చు. అందుకే.. అత్యంత ఖరీదైన బాదాం కంటే.. తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే.. శనగలు తీసుకోవడం మంచిదని ...

Read More »

హిందూ వివాహాలు ‘‘అగ్ని సాక్షి’’ గా చేయడం వెనుక రహస్యం ఏంటి?

హిందు సాంప్రదాయంలో వైవాహిక శుభకార్యాల్లో ”అగ్ని”ని సాక్షిగా ఎందుకు పెడతారు అన్న విషయం చాలా మంది దంపతులకు తెలియదు. మన సంస్క్రతి, సాంప్రదాయాలలో అగ్నిని పవిత్రంగా చూడటం ఆచారం. పూజలు, యజ్ఝ యాగాదలు అగ్ని లేకుండా జరగవు. అగ్ని సాక్షిగా లేకపోతే ఆ వివాహం ధర్మ సమ్మతం కాదంటారు. ఐతే వివాహానికి, అగ్నికి ఉన్న సంబంధం ప్రాచీన వేదాల్లోనూ, పురాణాల్లోనూ ఉంది. అగ్ని సాక్షిగా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాం అన్న విషయం బుగ్వేదంలో వివరించారు. ...

Read More »

కూరగాయలతో కిచిడీ

  కావల్సినవి: బియ్యంరవ్వ – రెండు కప్పులు, సెనగపప్పు – కప్పు, పెసరపప్పు – అరకప్పు, పాలకూర – కట్ట, క్యారెట్‌ – రెండు, బీన్స్‌ – ఆరు, టమాటాలు – రెండు, బంగాళాదుంప – ఒకటి, క్యాప్సికం – ఒకటి, కారం, ధనియాలపొడి – రెండు చెంచాలచొప్పున, పసుపు – అరచెంచా, జీలకర్ర, ఆవాలు – చెంచా చొప్పున, కరివేపాకు – రెండు రెబ్బలు, నెయ్యి – అరకప్పు, ఉప్పు – తగినంత. తయారీ: సెనగపప్పు, పెసరపప్పును కడిగి ఒక కూత వచ్చేదాకా ...

Read More »

మిషన్‌ కాకతీయ చెరువులకు జలకళ

  బీర్కూర్‌, సెప్టెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకంలో మొదట, రెండవ విడతల్లో మండలంలో చేపట్టిన చెరువు పనులు గత ఐదురోజులుగా కురిసిన వర్షాలకు నీటితో నిండి జలకళను సంతరించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతుల కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గత 50 సంవత్సరాలుగా చెరువుల్లో తీయని పూడికను తొలగించి, గతంలో కంటే ఎక్కువ సామర్థ్యం గల నీటిని మిషన్‌ కాకతీయ పథకం వల్ల చేకూరిందని రైతులు ఆనందం ...

Read More »

డివిజనల్‌ కార్యాలయాలకు కొత్త లాగిన్‌ సంఖ్య

  నిజామాబాద్‌, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా డివిజనల్‌ కార్యాలయాలపై కొత్త లాగిన్‌ సంఖ్య కేటాయిస్తున్నట్టు నిజామాబాద్‌ ఆర్డీవో యాదిరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో పలు జిల్లా అధికారులతో డివిజనల్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఫర్నిచర్‌, ఇతర వివరాలు వేరుగా నమోదు చేయాలని, ఇందుకు డివిజనల్‌వారిగా ఆయా శాఖలకు కొత్త లాగిన్‌ సంఖ్యను కేటాయించడం జరిగిందని తెలిపారు. అధికారులు డివిజనల్‌ వారిగా సిబ్బంది, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆయన ...

Read More »

తెయు ప్రజాసంబంధాల అధికారిగా డాక్టర్‌ రాజారాం

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రజా సంబంధాల అధికారిగా మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగాధిపతి డాక్టర్‌ కె.రాజారాం నియమితులయ్యారు. తెయు వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ వై.జయప్రకాశ్‌రావు ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఈ పదవిలో డాక్టర్‌ రాజారాం సంవత్సరం పాటు ఉంటారన్నారు. గతంలో కూడా పిఆర్‌వోగా పనిచేశారన్నారు. తనపై నమ్మకంతో తన పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చిన విసి, రిజిస్ట్రార్‌లకు రాజారాం కృతజ్ఞతలు తెలిపారు. పలువురు అధ్యాపకులు, సిబ్బంది ఆయనను అభినందించారు.

Read More »

తెయులో ముగ్గురు కొత్త డీన్లు

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మూడు ఫాకల్టీలకు కొత్త డీన్లు నియామకమయ్యారు. ఈ మేరకు వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ జయప్రకాశ్‌రావు ఉత్తర్వులు అందజేశారు. పాకల్టీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ డీన్‌గా ప్రొఫెసర్‌ ఎస్‌.మహేందర్‌రెడ్డి, సోషల్‌ సైన్సెస్‌ ఫాకల్టీ డీన్‌గా ప్రొఫెసర్‌ టి.యాదగిరిరావు, లా ఫాకల్టీ డీన్‌గా ప్రొఫెసర్‌ ఎం.వి.రంగారావులు నియమితులయ్యారు. వీరంతా కాకతీయ యూనివర్సిటీలో వివిధ ఉన్నత పదవులు నిర్వహించి అపార అనుభవం ఉన్నవారే. ఈ నియామకాలతో వివిధ ఫాకల్టీలు బలోపేతమవుతాయని, ...

Read More »

భవిష్యత్‌లో తెలుగుకు మంచిరోజులు

  – ఆచార్య ఎల్లూరి శివారెడ్డి డిచ్‌పల్లి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగుకు ప్రాచీన భాష హోదా దక్కడంతో తెలుగుకు భవిష్యత్‌లో మంచిరోజులు వస్తాయని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. తెలుగు జాతీయస్థాయిలో ప్రాచీన భాష హోదా దక్కడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషియే ప్రధానకారణమని, తెలంగాణ సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ అభినందనీయుడన్నారు. ప్రొఫెసర్‌ శివారెడ్డి శనివారం తెయు తెలుగు అధ్యయనశాఖ ఆధ్వర్యంలో జరిగిన అధ్యాపకుల సమావేశంలో ముఖ్య అతిథిగా ...

Read More »

మాదిగ చైతన్య పాదయాత్ర గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నల్గొండ జిల్లానుంచి ఈనెల 18న నిర్వహించనున్న మాదిగ చైతన్య పాదయాత్రకు సంబంధించిన గోడప్రతులను శనివారం కామారెడ్డి ఎంఆర్‌పిఎస్‌ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వేముల బలరాం మాదిగ ఆవిష్కరించారు. చెప్పులు కుట్టే ప్రతిమాదిగకు రూ.2 వేల పింఛన్‌, డప్పు కొట్టే ప్రతి మాదిగకు రూ. 2 వేలు పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గతంలో మంత్రులు కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్‌లు పించన్ల విషయంలో హామీలిచ్చి ఇంతవరకు దాన్ని అమలుచేయలేదని పేర్కొన్నారు. ...

Read More »