Breaking News

Monthly Archives: October 2016

దేశప్రజల సంక్షేమం కోసం పరితపించిన వ్యక్తి పటేల్‌

  నిజామాబాద్‌, అక్టోబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర సమరయోధుడుగానే కాకుండా, స్వాతంత్య్రం అనంతరం 554 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి కృషి చేసిన ప్రముఖుడు సర్దార్‌ వల్లభాయి పటేల్‌అని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. సోమవారం ప్రగతిభవన్‌లో సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ జన్మదిన ఉత్సవాలల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ఐక్యతా దినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం విశేష కృషి చేసిన సర్దార్‌ పటేల్‌ ...

Read More »

ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు

  నందిపేట, అక్టోబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆదేశాల మేరకు నందిపేట తహసీల్దార్‌ ఉమాకాంత్‌ మండలంలోని నందిపేట, డొంకేశ్వర్‌, ఆంధ్రానగర్‌ పిహెచ్‌సిలలో సోమవారం ఆకస్మిక తనికీలు చేపట్టారు. ఆసుపత్రిలో హాజరు రిజిష్టర్‌, పేషెంట్ల వివరాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులందరు సకాలంలో హాజరవుతున్నట్టు తహసీల్దార్‌ తెలిపారు. ఇకముందు ఇలాంటి తనిఖీలు ఉంటాయి కావున ఆసుపత్రి సిబ్బంది గైర్హాజరు కాకుండా విదులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. గైర్హాజరైన వైద్యులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Read More »

ప్రజావాణిలో 4 దరఖాస్తులు

  నందిపేట, అక్టోబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి నాలుగు ఫిర్యాదులు అందినట్టు తహసీల్దార్‌ ఉమాకాంత్‌ తెలిపారు. గత వారం కూడా నాలుగు దరఖాస్తులు వచ్చాయన్నారు. మండల స్తాయి అధికారులందరు అందుబాటులో ఉంటూ తక్షణమే సమస్య పరిష్కరించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎండివో నాగవర్ధన్‌, ఇవో పిఆర్‌డి రవిశ్వర్‌గౌడ్‌, ఎంఇవో, ఎఇ, తదితర అధికారులున్నారు.

Read More »

పేకాటరాయుళ్ల అరెస్టు

  నందిపేట, అక్టోబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండురోజులుగా దీపావళి సందర్బంగా పేకాట ఆడుతున్న వారిని ఎస్‌ఐ జాన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం… దీపావళి పండగ సందర్భంగా పేకాట ఆడుతున్న 11 బృందాలను వివిధ గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లో దాడిచేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి మొత్తం 51 వేల 500 నగదు స్వాదీనం చేసుకున్నామన్నారు.

Read More »

బహరైన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ నిజామాబాద్ జిల్లా కి చెందిన చాకలి పెద్ద బోజన్న

గతవారం బహరైన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్ గ్రామానికి చెందిన చాకలి పెద్ద బోజన్న మృతదేహం ఎంపీ కవిత చొరవతో స్వగ్రామం చేరింది. బ్రతుకుదెరువు కోసం బహరైన్‌కు వలస వెళ్లిన సాకలి పెద్ద భూమన్న మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన‌ తెలంగాణ జాగృతి బహరైన్ శాఖ బాద్యులు, బీఎంసి కిరణ్ లు అవసరమైన చర్యలు తీస్కొని మృతదేహాన్ని స్వదేశం పంపడానికి ఏర్పాట్లు చేసారు. నేటి ఉదయం మృతదేహం శంషాబాద్ విమానాశ్రయం చేరుకొగా ఎంపీ కార్యాలయ సిబ్బంది స్వగ్రామానికి ...

Read More »

లిటిల్‌ స్కాలర్స్‌లో బతుకమ్మ సంబరాలు

  కామారెడ్డి, సెప్టెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని లిటిల్‌ స్కాలర్స్‌ పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి రంగు రంగుల పూవులతో బతుకమ్మలు పేర్చి, లయబద్దంగా బతుకమ్మ లాడి నిమజ్జనం చేశారు. అనంతరం దసరా సంబరాలు సైతం జరిపారు. రావణ దహనం, దాండియా ఆటలతో సందడి చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు రాజేశ్‌, అరుణ, పావని, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

దీపావళి పండుగ శుభాకాంక్షలు

ఈ దీపావళి సందర్భంగా లక్ష్మి దేవి మీ ఇంట్లో చేరి మీ జీవితం లో వెలుగులు నింపాలని … మీ మదిలో దాగి ఉన్న అఙాన తిమిరం తొలగించి కాంతి రూపం లొ ఉన్న ఙానాన్ని మీ జీవితం లో నిలుపుకోండి నిజామాబాద్ న్యూస్ తరపున మీకు మరియు మీ సకుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు

Read More »

మీ ఇంట లక్ష్మీదేవి గృహప్రవేశం చేయాలంటే కంపల్సరీ దీపాలు వెలిగించాలి..!!

హిందు  పండగలన్నింటిలోకి, ఘనంగా సెలబ్రేట్ చేసుకునే అతి పెద్ద పండుగ దీపావళి, అన్ని పండుగలకి తలంటు పోసుకోవడం, కొత్త బట్టలు ధరించడం, పిండి వంటలు చేసుకోవడం, బందుమిత్రులతో సరదాగా సమయాన్ని గడపటం ఉంటుంది. కానీ, ఈ పండుగకి వీటన్నింటితో పాటు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదే ”దీపాలు వెలిగించడం, టపాకాయలు కాల్చడం ‘ దీనికి సంబంధించిన విష్ణు పురాణంలో ఒక కథ కనబడుతుంది. దీపావళి నాడు మహాలక్ష్మీ విష్ణువుతో కలిసి విహారం చేయాలని కోరింది. అలా విహారం చేయడానికి బయలు దేరిన లక్ష్మీ ...

Read More »

షాదీఖానానా… తహసీల్‌ కార్యాలయమా…

  నందిపేట, అక్టోబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట గ్రామంలో ముస్లింల సమావేశాలు, శుభకార్యాలు నిర్వహించుకునేందుకు వీలుగా 2007లో అప్పటి ఎమ్మెల్యే కేశ్‌పల్లి గంగారెడ్డి చొరవతో మండల కేంద్రంలోని తహసీల్‌కార్యాలయం పక్కన ముస్లింల కొరకు షాదీఖానా నిర్మించారు. దాన్ని రూ. 10 లక్షలతో నిర్మించారు కానీ అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా అరకొర నిదులతో నిర్మించిన షాదీఖానా పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. కేవలం రేకుల గోడౌన్‌లాగా నిర్మించివదిలేశారు. ప్రహరీగోడ, మూత్రశాలలు లాంటి కనీస వసతులు లేకపోవడం వల్ల ...

Read More »

విద్యావిధానంలో మార్పు వచ్చేంత వరకు పోరాటం

  కామారెడ్డి, అక్టోబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యావిధానంలో మార్పు వచ్చేంత వరకు పోరాటాలు చేయాలని బార్‌ అసోసియేషన్‌అద్యక్షుడు క్యాతం సిద్దిరాములు అన్నారు. ఏఐపిఎస్‌యు జిల్లా ప్లీనరీ సమావేశం శనివారం కామారెడ్డిజిల్లా కేంద్రంలోని కర్షక్‌ బిఇడి కళాశాలలో జరిగింది. దీనికి హాజరైన సిద్దిరాములు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడం తగదన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. చదువుతోపాటు ఉపాధి కల్పనవైపు ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వవిద్యారంగాన్ని ...

Read More »

మొక్కలు కాపాడుతాం

  నిజాంసాగర్‌, అక్టోబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం పథకం కింద నాటిన మొక్కలు రక్షిస్తామని డిప్యూటి తహసీల్దార్‌ హైమద్‌ మస్రూద్‌ అన్నారు. మండలంలోని ఎండివో కార్యాలయంలో నాటిన మొక్కలను పరిశీలిస్తూ కొంత కంచెను మొక్కల పెరుగుదలకు ఏర్పాటుచేయడం జరుగుతుందని అన్నారు. కార్యాలయ ఆవరణలో 135 మొక్కలను నాటడం జరిగిందన్నారు. హరితహారం మొక్కలన్నింటిని రక్షించి నీటి సరఫరా చేస్తామని చెప్పారు.

Read More »

పొలాలల్లో బంతి వనాలు

  నిజాంసాగర్‌, అక్టోబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజన తాండాలలో బంతి వనాలు సాగుచేస్తున్నారు. పండించిన పువ్వులను పట్టణాలకు తీసుకెళ్లి గిరిజనులు విక్రయిస్తుంటారు. నిజాంసాగర్‌, పిట్లం, ఎల్లారెడ్డి, బాన్సువాడ మండలాల్లో పొలాల గట్లపై బంతిపూల సాగుచేస్తూ అధిక ఆదాయం పొందుతుంటారు. మండలంలోని పంట పొలాలన్ని విరబూసిన బంతిపూలతో కనువిందు చేస్తున్నాయి. దాదాపు కిలోకు రూ. 250 నుంచి 300 వరకు విక్రయించడం జరుగుతుంది. మండలంలోని నల్లగుట్ట తాండా, మల్లూరు తాండా, సుంకిపల్లి తాండా, దూప్‌సింగ్‌ తాండా ల్లో వందల ఎకరాల్లో ...

Read More »

మాదిగ శక్తిప్రదర్శన గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, అక్టోబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో నవంబరు 13న నిర్వహించనున్న మాదిగల శక్తి ప్రదర్శన బహిరంగ సభకు సంబంధించిన గోడప్రతులను శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రాజు, జాతీయ అద్యక్షురాలు పెద్దె జీవలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎ,బి,సి,డి, వర్గీకరణ కోసం శీతాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లు చట్టబద్దత కల్పించాలనే డిమాండ్‌తో బహిరంగ సభ చేపట్టనున్నామన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు మద్దతివ్వాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

గుర్తుతెలియని యువకుని మృతి

  కామారెడ్డి, అక్టోబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి గంజ్‌ గేటు వెనకభాగంలో శనివారం గుర్తుతెలియని యువకుడు (35) మృతదేహం లభించినట్టు కామారెడ్డి ఎస్‌ఐ శోభన్‌ తెలిపారు. యువకుని ఆచూకి తెలియలేదనిగుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. మృతదేహాన్ని గుర్తిస్తే పట్టణ పోలీసు స్టేషన్లో సంప్రదించాలని కోరారు.

Read More »

హరితహారం లక్ష్యాన్ని వందశాతం పూర్తిచేయాలి

  – కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, అక్టోబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిచ్చి వందశాతం లక్ష్యం సాధించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశమందిరంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంపై వివిధ శాఖల వారిగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. శాఖల వారిగా అవసరమైన మొక్కలను అందించేందుకు నర్సరీల్లో ...

Read More »

కామారెడ్డికి రంగాచారి జిల్లాగా నామకరణం చేయాలి

  కామారెడ్డి, అక్టోబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఫణిహారం రంగాచారి పేరును కామారెడ్డి జిల్లాకు చేర్చాలని సిపిఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఫణిహారం రంగాచారి 67వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయం ముందుగల రంగాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రంగాచారి తెలంగాణ సాయుధ పోరాటంలో తన ప్రాణాలు విడిచారని గుర్తుచేశారు. అలాంటి సమరయోధులను ప్రభుత్వం గుర్తించకపోవడం సిగ్గుచేటన్నారు. భద్రాద్రి, రాజన్న, కొమురం భీం ...

Read More »

ప్రభుత్వం పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలి

  కామారెడ్డి, అక్టోబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా పంటలు నీటమునిగి నష్టంవాటిల్లిందని, ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని బిఎస్‌పి ఎల్లారెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు తలారి బాల్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో బిఎస్‌పి సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై బాల్‌రాజు మాట్లాడారు. రైతులకు సంబంధించిన రుణమాఫీని వెంటనే విడుదల చేయాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి వారిని ఆదుకోవాలని కోరారు. తెరాస అధికారంలోకి వచ్చిన నాటినుంచి బడుగు, బలహీన వర్గాల ...

Read More »

ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు

  కామారెడ్డి, అక్టోబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం భగవాన్‌ ధన్వంతరి జయంతి వేడుకలను పిఎంపిటి అసోసియేషన్‌ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టనంలోని మెహెరబాబా కళ్యాణ మండపంలో ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలువేసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచానికి వైద్యాన్ని పరిచయంచేసిన మహనీయుడు ధన్వంతరి అనిఅన్నారు. ఆయుర్వేదానికి మూలపురుషుడు ధన్వంతరి అని, ఆయుర్వేద వైద్య ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి పరిచయంచేసిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో పిఎంపిటి ప్రతినిధులు బాల్‌కిసన్‌గౌడ్‌, విఠల్‌, శ్రీనివాస్‌, చారి, భూషణ్‌, చంద్రకాంత్‌రావు, రాజమౌళి, ఓంప్రకాశ్‌, రాజారెడ్డి, ...

Read More »

సొగత్తూరు చేరిన అయ్యప్పల పాదయాత్ర

  కామారెడ్డి, అక్టోబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అయ్యప్పస్వాములు కామారెడ్డి నుంచి శబరిమలకు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం నాటికి సొగత్తూరు పల్కోజికి చేరుకుంది. స్వాములు అక్కడ భిక్ష నిర్వహించి స్వామివారికి పూజలు నిర్వహించి, అక్కడే బస చేయనున్నారు. శనివారం జోడాకుల ఆలయానికి చేరుకోనున్నట్టు స్వాములు తెలిపారు. 1260 కి.మీ.లు మొత్తం పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో స్వాములు పాల్గొన్నారు.

Read More »

మాదిగ వృత్తిపనికి పెన్షన్‌ ఇచ్చేవరకు ఉద్యమం

  – ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ కామారెడ్డి, అక్టోబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాదిగ వృత్తి పనివారికి పెన్షన్‌ ఇచ్చే వరకు ఉద్యమం చేస్తామని ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మాదిగ చైతన్య పాదయాత్రలో భాగంగా శుక్రవారం కామారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు బోనాలతో, డప్పు చప్పుల్లతో పాదయాత్రకు స్వాగతం పలికారు. ఈ యాత్రను ఉద్దేశించి వంగపల్లి మాట్లాడుతూ 40 రోజులుగా సాగుతున్న యాత్ర మాదిగల అభివృద్ది, మాదిగ వృత్తివారికిపెన్షన్‌, ...

Read More »